arun jaitly

19:48 - September 12, 2018

న్యూఢిల్లీ: దాదాపు రూ 9 వేల కోట్ల పై చిలుకు బ్యాంకులకు టోకరావేసి విదేశాలలో తలదాచుకుంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఈ సారి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీను ఇరుకున పెట్టేవిధంగా వ్యాఖ్యలు చేశాడు. లండన్ కోర్టులో కేసు విచారణకు హాజరైన సందర్భంగా మాల్యా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి.

తాను జెనీవాకు తరలి వెళ్లేముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి బ్యాంకులతో ఆర్థిక వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా కోరినట్టు మాల్యా వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఈ కుంభకోణంలో బీజేపీ నేతల హస్తం ఉందని రుజువైందని విమర్సలకు దిగారు. దీనిపై స్పందించిన అరుణ్ జైట్లీ తన ఫేస్ బుక్ పోస్టింగ్ లో మాల్యా ఆరోపణలను ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవం.. సత్యదూరమని పేర్కొన్నారు.

20:35 - December 17, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గడువులోగా తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఓవర్‌టైం పనిచేస్తోందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ప్రధాని 50 రోజుల గడువు కోరారాని, ఆ గడువులోగా సాధారణ స్థితి తెచ్చేందుకు కేంద్రం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని జైట్లీ పేర్కొన్నారు. ఫిక్కీ 89వ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు సాహసోపేతమైన నిర్ణయమన్నారు. దీన్ని అమలుచేయడానికి ఎంతో శక్తి సామర్థ్యాలు కావాలన్నారు. సమీప కాలంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నా, భవిష్యత్తులో నోట్ల రద్దు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. ప్రస్తుతం భారత ఆర్థికవ్యవస్థ తీరు ఎంతో బాగుందని, భవిష్యత్తులో పరిస్థితి మరింత మెరుగవుతుందని జైట్లీ భరోసా ఇచ్చారు. 

10:26 - June 28, 2016

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఇవాళ పారిశ్రామిక పెద్దలతో భేటీ కానున్నారు. చార్టర్డ్‌ అకౌంటెంట్లు, వృత్తి నిపుణులు కూడా హాజరయ్యే ఈ భేటీలో కొత్తగా ప్రవేశ పెట్టిన 'ఆదాయ వెల్లడి పథకం, 2016' పైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ నెల 1న ప్రారంభమైన ఈ పథకం సెప్టెంబర్‌ నెలాఖరు వరకు అమలులో ఉంటుంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు వెలుగులోకి రాని నల్లధనం, ఆస్తులు వెలికి తీయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎవరైనా స్వచ్ఛందంగా ఈ పథకం కింద ఆస్తుల వివరాలు వెల్లడిస్తే 45 శాతం పన్నుతో వదిలి పెడతారు. ఆ నగదు, ఆస్తులు ఎలా సంపాదించారనే విషయం కూడా అడగరు. ఈ పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేసి.. విజయవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

 

Don't Miss

Subscribe to RSS - arun jaitly