army chief

15:31 - September 7, 2018

పాకిస్థాన్ : పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీని స్థాపించి పాక్ లో అధికారంలోకి వచ్చారు. కాగా పాకిస్థాన్ లో అధ్యక్షుడు ఎవరైనా..ముఖ్యమంత్రి ఎవరైనా అధికారం మాత్రం సైన్యానిదే. సైన్యం కనుసన్నల్లోని అన్నీ జరుగుతుంటారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ అధికారంలోకి వచ్చాక పాక్ విధి విధానాలు మారతాయనే అందరు ఊహించారు. కానీ సదా మామూలుగానే పాత పద్ధతిలోనే పాక్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఆ దేశ సైన్యం తీరు మాత్రం మారలేదు. ఇండియాను రెచ్చగొట్టేలా పాక్ ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వా వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో తమ సైనికులను చంపితే... అంతకంత ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న కశ్మీర్ ప్రజలకు శాల్యూట్ చేస్తున్నానని చెప్పారు. పాకిస్థాన్ లో జరిగిన డిఫెన్స్ డే ఫంక్షన్ లో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ప్రజలకు తాము మద్దతుగా ఉంటామని చెప్పారు. కశ్మీర్ సోదరులు, సోదరీమణులు చేస్తున్న త్యాగాలు చాలా గొప్పవని అన్నారు. 

21:27 - September 4, 2018

జమ్ము కశ్మీర్ : దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే జవానుల ధైర్యసాహసాలతో దేశ ప్రజలకు భరోసా నిచ్చే జవానుల త్యాగాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ జవాన్లకు దిశానిర్దేశం చేస్తు అనుక్షణం అప్రమత్తంగా వుండి..దేశ భద్రత బాధ్యతను కడు సమర్థవంతంగా నిర్వహించే ఆర్మీ అధికారుల సమయోచిత శక్తి యుక్తులతో భారత భద్రత ఆధారపడి వుంది. ఈ నేపథ్యంలో ఉన్నతస్థాయిలోవుండే ఆర్మీ అధికారులకు నైతికత కూడా అంతే ముఖ్యం. కానీ కొందరు అత్యంత ఉన్నత హోదాలో వున్నప్పటికీ..వారి సహజ నైజంతో తమ నైతికతను దిగజార్చుకుంటుంటారు. ఇది వారి అనైతకతకే కాదు దేశ భవిత్రకు, భద్రతకు కూడా ముప్పువాటిల్లే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఇటువంటి అధికారులకు సైనిక దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ హెచ్చరికలు జారీ చేశారు.

సైన్యంలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెచ్చరించారు. మేజర్ లీటుల్ గొగోయ్ ఓ స్థానిక యువతిని శ్రీనగర్‌లోని ఓ హోటల్‌కు రప్పించుకున్న వ్యవహారంపై సైనిక న్యాయస్థానం లీటుల్ ను దోషిగా తేల్చింది. ఇది ప్రజల దృష్టిలో సైన్యం ప్రతిష్ఠను దిగజార్చే చర్యగా భావిస్తున్నారు.

నేరాన్ని బట్టి మేజర్ గొగోయ్‌పై చర్య తీసుకుంటామని జనరల్ రావత్ స్పష్టంచేశారు. అనైతిక చర్యలను, అవినీతిని ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేస్తున్నాను. సైనిక న్యాయస్థానం మేజర్ గొగోయ్‌ని దోషిగా తేల్చింది. ఆయనను కోర్ట్‌మార్షల్ చేయాలని సిఫారసు చేసింది. అమ్మాయిని హోటల్‌కు పిలిపించుకున్న సమయంలో మేజర్ గొగోయ్ తన డ్యూటీ ప్రదేశానికి దూరంగా ఉన్నారని కూడా సైనిక న్యాయస్థానం తేల్చింది. ఇది మరింత తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుంది. కాగా గతంలో కూడా మేజర్ గొగోయ్ ఓ కశ్మీరీ యువకుని తన జీపు బానెట్‌కు కట్టేసి అల్లర్లు జరిగే ప్రాంతాల్లో తిరగడం తీవ్ర విమర్శలకు గురైన విషయం తెలిసిందే. రాళ్లురువ్వే వారిని అదుపు చేసేందుకు అలా తిప్పినట్టు ఆయన తర్వాత ప్రకటించినా ప్రజల్లో మాత్రం అది పలు విమర్శలకు దారి తీసింది. అప్పట్లో తీవ్రవాద వ్యతిరేక చర్యలు నిరంతరంగా చేపట్టినందుకు జనరల్ రావత్ ఆయనకు ఆర్మీచీఫ్ కమెండేషన్ కార్డు బహూకరించారు. ఏడాది తిరిగేలోపు మేజర్ గొగోయ్ అనైతిక ప్రవర్తన కారణంగా తలదించుకోవాల్సి వచ్చింది.

కాగా ఆర్మీలో ఎంతటి కఠినతరమైన నిబంధనలుంటాయో అంతటి బాధ్యత కూడా ఆయా అధికారులపై వుందనే విషయాన్ని వారు నిద్రలో కూడా మరిచిపోయే వీలులేదు. ఈ నిబంధనలు అతిక్రమించినా..నిర్లక్ష్యం వహించినా ఒక్కో సమయంలో, సందర్భంలో చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సివస్తుంది. అసలే భారత్ పై పలు దేశాల కన్ను వున్న క్రమంలో దేశ భద్రతకు కడు ముప్పు ఏర్పడే అవకాశం లేకపోలేదు. ఆర్మీ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని, గౌరవాన్ని అధికారులు గుర్తెరికి వ్యవహరించాల్సిన అవసరముంది. అలాగే భారత ఆర్మీ పట్ల ఇటువంటి సందర్భలతో మాయని మచ్చ పడే ప్రమాదముంది. ఏది ఏమైనా సహజసిద్ధంగా సాధారణ మనుషులకు వుండే బలహీనతలను అధిగమించి దేశం ఆర్మీపై పెట్టుకున్న నమ్మకాన్ని, ధైరాన్ని, గౌరవాన్ని కాపాడాల్సిన అధికారులు తమ బాధ్యత పట్ల నిత్యం అప్రమత్తంగా వుంటారని ఆశిద్దాం..

 

21:41 - December 18, 2016

ఢిల్లీ : కొత్త ఆర్మీ చీఫ్‌ నియామకంపై రగడ మొదలైంది. సీనియారిటిని విస్మరించి... లెఫ్టినెంట్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ను సైనికదళాల ప్రధాన అధికారిగా కేంద్ర ప్రభుత్వం నియమించడాన్ని కాంగ్రెస్‌, వామపక్షాలు తప్పుబట్టాయి. సీనియర్లను కాదని మూడో కేడర్‌లో ఉన్న రావత్‌ను చీఫ్‌గా నియమించడం సైనిక దళాలకు తప్పుడు సంకేతం ఇచ్చినట్టవుతుందని విపక్షనేతలు విమర్శించారు.

లెఫ్టినెంట్‌ జనరల్‌ బిపిన్‌రావత్‌ను నియమించడంపై దుమారం
ఆర్మీ దళాల ప్రధాన అధికారిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ బిపిన్‌రావత్‌ను నియమించడంపై దుమారం రేగుతోంది. రావత్‌ నియామకంలో కేంద్ర ప్రభుత్వం సంప్రదాయానికి విఘాతం కలిగించిందని.. విపక్షనేతలు విమర్శలు ఎక్కుపెట్టారు.

కేంద్రప్రభుత్వానిది తొందరపాటు నిర్ణయం- కాంగ్రెస్‌
అనుభవమున్న సీనియర్‌ అధికారులను కాదని.. మూడో ర్యాంకులో ఉన్న బిపిన్‌రావత్‌ను ఆర్మీచీఫ్‌గా నియమించడం సైనికపరంగా వ్యూహాత్మక తప్పిదమన్నారు కాంగ్రెస్‌ నేత మనీష్‌ తివారి. ఓవైపు పాకిస్తాన్‌ సరిహద్దుల్లో నిత‌్యం ఘర్షణలు చెలరేగుతున్న సమయంలో కేంద్రం ప్రభుత్వ నిర్ణయం అనాలోచితమన్నారు.

భద్రతాపరంగా మోదీప్రభుత్వ తప్పిదం : లెఫ్ట్‌పార్టీలు
అటు వామపక్షాలు కూడా కొత్త ఆర్మీచీఫ్‌ నియామకంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి దురదృష్టకరమన్నాయి. ఇద్దరు సుపీరియర్‌ ఆఫీసర్లను కాదని. బిపిన్‌ రావత్‌ను ఎలా ఎంపిక చేస్తారని సీపీఐ లీడర్‌ డి.రాజా ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ నిర్ణయం ఆర్మీదళాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. మోదీ ప్రభుత్వం దేశప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

మోదీ ప్రభుత్వ నిర్ణయం దేశానికి ప్రమాదం: రాజకీయ వర్గాలు
దేశభద్రతకు కీలకమైన ఆర్మీ చీఫ్‌తోపాటు .. ఇంటలిజెన్స్‌బ్యూరో, రా సంస్థల అధిపతుల నియామకంలో కేంద్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకుందని కాంగ్రెస్‌ , వామపక్షాలు విమర్శించాయి. మోదీ ప్రభుత్వ నిర్ణయం దేశానికి ప్రమాదం కొనితెస్తుందని.. రాజకీయవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

Don't Miss

Subscribe to RSS - army chief