Ap special status

08:37 - September 1, 2018

అమరావతి : రాష్ట్ర విభజన అనంతరం తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటు రాష్ట్రం అంతా గగ్గోలు పెడుతున్నా..కేంద్రం ఏమాత్రం ఖాతరు చేయటంలేదు. ఏపీకి న్యాయం చేసేందుకు ముందుకు రావటంలేదు. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పలు ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏపీ ప్రత్యేక హోదా కోరుతూ విశాఖపట్నం జిల్లా కాగిత గ్రామానికి చెందిన యువకుడు దొడ్డి త్రినాథ్ ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. త్రినాథ్ బలవన్మరణం సంఘటన గురించి తెలియగానే మనసు వికలమైందని, హృదయాన్ని కలచి వేసిందని అన్నారు. అతన్ని కన్నవారికి ఎంతటి శోకాన్ని మిగులుస్తుందో అర్థం చేసుకోగలనని..ప్రాణత్యాగం చేసిన త్రినాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని,. కడుపు కోతను దిగమింగుకొనే ధైర్యాన్ని కన్నవారికి భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నానని పవన్ పేర్కొన్నారు.

కాగా ప్రత్యేక హోదా సాధనలో పాలకులు అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణి ప్రజల్లో... ముఖ్యంగా యువతలో అసహనాన్ని తీసుకువస్తుందని ముందు నుంచీ చెబుతూనే ఉన్నాను. స్వీయ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చి హోదా, విభజన హామీల అమలును పట్టించుకోకపోవడం వల్లే ఇంతకు ముందు తిరుపతిలో ముని కోటి, ఇప్పుడు విశాఖ జిల్లాలో త్రినాథ్, ఒక చేనేత కార్మికుడు ప్రాణ త్యాగాలు చేసిన విషయం తెలిసిందే. ఇకనైనా పాలకులు ప్రత్యేక హోదా సాధించటంలో చిత్తశుద్దితో వ్యవహరించాల్సిన అవుసరం వుంది. ఈ నేపథ్యంలో యువకుల ప్రాణ త్యాగాలతోనైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ప్రత్యేక హోదా విషయంలో ఎవరు ఎన్ని మాటలు మార్చినా, సాధనలో విఫలమైనా మనందరం బలంగా ప్రజల ఆకాంక్షను వినిపిద్దాం. దయచేసి ఎవరూ బలి దానాలకు పాల్పడవద్దు. ఆంధ్రప్రదేశ్ కు హోదా దక్కే వరకూ పోరాడదాం’ అని ఆ ప్రకటనలో పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.

18:32 - August 31, 2018

విశాఖపట్నం : నక్కపల్లిలో ఓ విద్యార్థి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు దొడ్డి త్రినాథ్ అనే రాజమండ్రికి చెందిన యువకుడు ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. సెల్ టవర్ కు ఉరి వేసుకున్న త్రినాథ్ ను చూసిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు త్రినాథ్ మృతదేహాన్ని కిందకు దింపి పరిశీలించారు. అతని పాకెట్ లో ఆత్మహత్య లేఖ లభించింది. కాగా తన తల్లిదండ్రుల ఆశల్ని వమ్ము చేస్తు ఆత్మహత్య చేసుకుంటున్నాననీ ..ఇందుకు వారు క్షమించాలని లేఖలో త్రినాథ్ పేర్కొన్నాడు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం యువత పోరాటం చేయాలని త్రినాథ్ తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. 

13:48 - August 11, 2018

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అనంతపురంలో సెల్‌ టవర్‌ ఎక్కి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భాస్కర్‌ను కిందికి దింపేందుకు అనంతపురం ఎమ్మెల్యేలు సెల్‌ టవర్‌ వద్దకు చేరుకున్నారు. భాస్కర్‌తో ఫోన్‌ మాట్లాడిన ఎమ్మెల్యేలు యువకుడిని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయం కేంద్రం పరిధిలో ఉందని.... కావాలంటే భాస్కర్‌ను సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

11:17 - August 11, 2018

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతపురం జిల్లా ధర్మవరంలో  పెనుబోలు విజయ్‌ భాస్కర్‌ సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యాయత్నం చేశాడు. ధర్మవరం రూరల్‌ పీఎస్‌ వద్ద సెల్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఏపీకి ప్రత్యేక హోదాకోసం చనిపోతున్నానని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:57 - August 10, 2018

ఢిల్లీ : కేంద్రానికి వ్యతిరేకంగా పార్లమెంటులో గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన చట్టం అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. చిత్తూరు ఎంపీ డాక్టర్‌ శివప్రసాద్‌.. హిజ్రా వేషధారణలో శివప్రసాద్‌ నిరసన వ్యక్తం చేశారు. మోదీబాబా ప్రత్యేక హోదా ఇవ్వకుంటే నీ అంతం ఆరంభం అంటూ.. హాస్య గీతం ఆలపించారు. మాటలెన్నో చెప్పావో.. చేతల్లో ఏమీ చూపలేదంటూ ఛలోక్తులు విసిరారు. 
 

11:24 - August 10, 2018

హైదరాబాద్ : రాహుల్‌ పర్యటనకు.. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రాహుల్‌ను ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకొచ్చి.. తెలంగాణ సెంటిమెంట్‌ను మరోసారి రగిలించే సన్నాహాలు చేస్తోంది. రాహుల్‌ రెండు రోజుల టూర్‌.. నిరుద్యోగ, మహిళ, ముస్లిం, సెటిలర్స్‌ ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా రాహుల్‌ టూర్‌ సాగనుంది.
ఈనెల 13, 14 తేదీల్లో రాహుల్‌ టూర్‌
ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక.. రాహుల్‌గాంధీ తొలిసారిగా తెలంగాణకు రానున్నారు. ఈనెల 13, 14 తేదీల్లో రెండు రోజులూ.. రాహుల్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే పర్యటించనున్నారు. శంషాబాద్‌లో దిగింది మొదలు.. హస్తిన తిరుగుపయనమయ్యే వరకూ.. ఊపిరి సలపని రీతిలో రాహుల్‌ కార్యక్రమాల షెడ్యూల్‌ను టీపీసీసీ రూపొందించింది.     
హైదరాబాద్‌లో రెండురోజులూ రాహుల్‌ పర్యటన       
కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఓ స్ట్రాటజీ మేరకే ... రాహుల్‌ను రెండురోజులూ గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే పర్యటింప చేస్తోందని పార్టీ వర్గాల విశ్లేషణ. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్‌లో.. కాంగ్రెస్‌ పార్టీకి అంత బలం లేదు. పైగా గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటమి లగాయితు.. కాంగ్రెస్‌ కేడర్‌ నైరాశ్యంలో కూరుకుపోయింది. ఈ మధ్యనే అంజన్‌కుమార్‌ను సిటీ అధ్యక్షుడిగా నియమించాక.. పార్టీ కార్యక్రమాల్లో కాస్తంత దూకుడు కనిపిస్తోంది. ఇప్పుడు రాహుల్‌ను గ్రేటర్‌లో తిప్పితే.. పార్టీ శ్రేణుల్లో మరింత జోష్‌ వస్తుందని కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తోంది. 
ఓట్ల వేటగానే రాహుల్‌ పర్యటన
రాహుల్‌ పర్యటనను.. టీపీసీసీ అచ్చంగా ఓట్లవేటగానే మలుస్తోంది. గ్రేటర్‌ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో అధికారం పక్కా అని హస్తంపార్టీ భావిస్తోంది. అందుకే.. ఇక్కడి మహిళలు, ముస్లింలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, పారిశ్రామిక వేత్తలతో రాహుల్‌ భేటీకి సన్నాహాలు చేస్తోంది. వివిధ వర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ గతంలో చేసిన మేళ్లు.. ప్రస్తుత కేసీఆర్‌ సర్కారు నిర్లక్ష్యాలను రాహుల్‌ ద్వారా ఎత్తి చూపాలని టీపీసీసీ నిర్ణయించింది.
హైదరాబాద్‌ సెటిలర్స్‌పై కాంగ్రెస్‌ కన్ను
హైదరాబాద్‌లో సెటిలర్స్‌ సంఖ్య కూడా బాగా ఎక్కువే. వీరి మద్దతును కూడగడితే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీగా లాభం చేకూరుతుందని హస్తం నేతలు నమ్ముతున్నారు. అందుకే శేరిలింగంపల్లి వేదికగా.. సెటిలర్స్‌కు రాహుల్‌ద్వారా భరోసా ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, తెలంగాణలో వారి రక్షణకు తీసుకోనున్న చర్యలపై రాహుల్‌తో ప్రకటన చేయించాలని టీపీసీసీ నాయకత్వం భావిస్తోంది. అదేవిధంగా.. ముస్లింల రిజర్వేషన్‌ల అంశంపైనా.. కేసీఆర్‌, మోదీల వైఖరిని ఎండగడుతూ.. తమ మద్దతును స్పష్టం చేయాలని చూస్తున్నారు.
వ్యూహాత్మకంగానే రాహుల్‌ ఓయూ పర్యటన
రాహుల్‌ పర్యటనలో తెలంగాణ సెంటిమెంట్‌నూ రగిలించే ప్రయత్నాన్ని కాంగ్రెస్‌ నాయకత్వం చేస్తోంది. ఉద్యమానికి ఊపిరులు పోసిన ఉస్మానియా వర్సిటీలో రాహుల్‌ ప్లాన్‌ వెనుక ఉద్దేశం ఇదేనని చెబుతున్నారు. అంతేకాకుండా తెలంగాణలో ప్రస్తుత పరిణామాలపై.. కేసీఆర్‌ సర్కార్‌ను టార్గెట్‌ చేస్తూ.. విద్యార్థులు, యువతకు దగ్గర కావాలన్నది కాంగ్రెస్‌ వ్యూహంగా తెలుస్తోంది.  ఎవరైనా రాహుల్‌ టూర్‌ను అడ్డుకున్నా.. దాన్నీ రాజకీయంగా వినియోగించుకునేలా టీపీసీసీ నాయకత్వం ప్రణాళికతో ఉన్నట్లు చెబుతున్నారు. 
150 మంది పారిశ్రామిక వేత్తలతో రాహుల్‌ భేటీ 
రాహుల్‌ తొలిసారిగా 150 మంది స్థానిక పారిశ్రామిక వేత్తలతో ప్రత్యేకంగా భేటీ కానుండడం కూడా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. తమ ఓటుబ్యాంకును సుస్థిరం చేసుకోవడం.. ఇతరుల ఓటు బ్యాంకును కొల్లగొట్టడం.. తద్వారా అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యంగా రాహుల్‌ టూర్‌ను ప్లాన్‌ చేసిన కాంగ్రెస్‌ నాయకుల ఆశయం ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాలి. 

10:35 - August 9, 2018

గుంటూరు : వంచనపై వైసీపీ గర్జన దీక్ష చేపట్టనుంది. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని వీఏఆర్ గార్డెన్స్ లో దీక్ష చేపట్టనున్నారు. కాసేపట్లో దీక్ష ప్రారంభం కానుంది. ఈ దీక్షలో వైసీపీ మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నేతలు పాల్గొనున్నారు. 

13:19 - August 7, 2018

ఢిల్లీ : టీడీపీ ఎంపీలు, శాసన సభ, మండలిసభ్యులు, మంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలని కేంద్రమంత్రులను కలిసి విన్నవిస్తామన్నారు మంత్రి సుజయ కృష్ణ రంగారావు. విశాఖ రైల్వే ఏపీ ప్రజలకు జరిగిన అన్యాయంపై కేంద్ర మంత్రికి వివరిస్తామంటున్న మంత్రి సుజయ కృష్ణ రంగారావుతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన రూ.350 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరుతామని చెప్పారు. కర్నూలు క్వారీ ఘటన దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో జరగకుండా చూసుకుంటామని తెలిపారు.

13:06 - August 7, 2018

ఢిల్లీ : విశాఖ రైల్వే జోన్‌ సాధించేవరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు టీడీపీ ఎంపీ తోట నరసింహం. ఈ మేరకు టీడీపీ ఎంపీలు, శాసన సభ, మండలిసభ్యులు, మంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్‌ కోరుతూ ఇవాళ కేంద్ర రైల్వే మంత్రి పియూశ్‌ గోయల్‌ను కలవనున్నారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన 350 కోట్లు త్వరగా విడుదల చేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శిని కోరనున్నారు. 

 

11:53 - August 7, 2018

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అస్తవ్యస్థ పాలన కొనసాగిస్తుందని టీడీపీ ఉత్తరాంధ్ర ఎంపీలు విమర్శించారు. ఈమేరకు ఢిల్లీలో ఎంపీలు మీడియాతో మాట్లాడారు. కేంద్రం రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ సాధించేవరకు పోరాడుతూనే ఉంటామన్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేస్తామన్నారు. మధ్యాహ్నం కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ ను కలిసి ఏపీకి న్యాయం చేయాలని కోరతామని చెప్పారు. వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్  పోరాటం 30 సంవత్సరాలుగా జరుగుతోందన్నారు. ఇది విశాఖ ప్రజల పోరాటంమన్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - Ap special status