ap politics

19:23 - August 31, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై పీసీసీ చీఫ్‌ రఘువీరా రెడ్డి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌.... టీడీపీ, బీజేపీ, వైసీపీలతో పొత్తు పెట్టుకోదన్నారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని టీడీపీ, వైసీపీలకు భయం పట్టుకుందన్నారు. సెప్టెంబర్‌ 18న కర్నూలులో రాహుల్‌ పర్యటిస్తారని... ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్‌ ఒక్కటే అని రఘువీరా అన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ సభ నిర్వహించబోయే ఎస్టీబీసీ గ్రౌండును రఘువీరా రెడ్డి ఇతర కాంగ్రెస్‌ నేతలు పరిశీలించారు.

19:24 - August 30, 2018

శ్రీకాకుళం : జిల్లాలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో వామపక్షనేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వామపక్షనేతలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం తప్ప ప్రజా సమస్యలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు స్పందించడం లేదని వామపక్ష నేతలు ఆరోపించారు. ప్రభుత్వ, ప్రతిపక్ష నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రాష్ట్రాభివృద్ధి ప్రత్యామ్నాయ విధానాలపై కలిసి వచ్చే పార్టీలతో విధివిధానాలు రూపొందిస్తామన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బస్సు యాత్ర, పాదయాత్ర చేపడుతామన్నారు. సెప్టెంబర్ 15వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి ఆదేరోజు మహాగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ యాత్రకు, బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు తమ మద్ధతు ప్రకటించాలని,యాత్రని విజయవంతం చేయాలని వామపక్ష నేతలు కోరారు.

18:18 - August 26, 2018

శ్రీకాకుళం : మరో నేత జంప్ కానున్నారు. కాంగ్రెస్ నేత కొండ్రు మురళి టిడిపి పార్టీలో చేరనున్నారు. ఆయన కార్యకర్తలతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మార్పుపై కార్యకర్తలతో సంప్రదింపులు జరపగా, కార్యకర్తల అభీష్టం మేరకే టిడిపిలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈనెల 31 న పార్టీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర పార్టీ అధినేత కళావెంకట్రావు ఆధ్వ‌ర్యంలో అమరావతి చంద్రబాబు నివాసంలో పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ప్రజల కోసం సీఎం చంద్రబాబు పడుతున్న తపన..అభివృద్ధి చూసి తాను టిడిపిలో చేరుతున్నట్లు వెల్లడించారు.

 

08:22 - August 26, 2018

ఏపీ రాజకీయాలపై వక్తలు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత నాగుల్ మీరా, వైసీపీ నేత మల్లాది విష్ణు, బీజేపీ నేత బాజీ, కాంగ్రెస్ నేత మీసాల రాజేశ్వర్ రావు పాల్గొని, మాట్లాడారు. టీడీపీ ధర్మపోరాట దీక్షపై చర్చించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలుపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

18:43 - August 24, 2018

విజయవాడ : అరకు ఎంపీ కొత్తపల్లి గీత కొత్త పార్టీని స్థాపించారు. జనజాగృతిగా పార్టీకి నామకరణం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయాల్లో మహిళలకు 3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. అన్ని కులాల వారికి సమానంగా టికెట్లు ఇస్తామని, ప్రతి ఎమ్మెల్యే మీదా ఆరు నెలలకు ఒక సారి సోషల్‌ ఆడిట్‌ చేయిస్తామని తెలిపారు. పార్టీ స్థాపించిన సందర్భంగా ఎంపీ కొత్తపల్లి గీత సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌లపై విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విరుచుకుపడటం తప్పితే రాష్ట్రానికి ఎలాంటి మేలు చేసింది లేదని ఆరోపించారు. 

15:31 - August 24, 2018

విజయవాడ : ఏపీలో వారసత్వ రాజకీయాలకు చెక్‌ పెట్టేందుకే సమసమాజ్‌ పార్టీని ఏపీలో స్థాపించామన్నారు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామయ్యయాదవ్‌. ఆర్థికంగా బలంగా ఉన్న పార్టీలను మేధావి వర్గంతో ఢీ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మెజార్టీ ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు సీఎం అభ్యర్ధిని ప్రకటిస్తామంటామని సమసమాజ్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామయ్యయాదవ్‌ తెలిపారు. ఐఎఎస్‌లు, ఐపీఎస్‌లు, రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌తో పార్టీ క్యాడర్ బలంగా వుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామనీ..ఎన్నికల్లో గెలిచిన తర్వాత మెజార్టీ పార్టీ ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం-రామయ్య తెలిపారు. ప్రజలకు నిజమైన సేవ చేసేందుకు మా సమ సమాజ్ పార్టీ ఉద్భవించింది-సమసమాజ్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామయ్యయాదవ్‌ తెలిపారు. 

20:32 - August 19, 2018

హైదరాబాద్ : మరోసారి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెలుగుదేశం పార్టీ తెర‌దీస్తోందా...? పార్టీ అవ‌స‌రాల మేర‌కు చేరిక‌ల‌కు అధినేత గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారా...? టీడీపీ తీర్ధం పుచ్చుక‌నేందుకు ఆస‌క్తి చూపుతొన్న నేత‌లెవ‌రు...? ఎవ‌రి రాక‌కై తెగుగుదేశం ఎదురుచూస్తొంది..? మ‌రి ప్ర‌స్తుతం పార్టీలొఉన్ నేత‌ల ప‌రిస్తితేంటి..? ఎన్నిక‌లు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేలా బాబు మార్కు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ 2 మాస్ట‌ర్ ప్లాన్ పై స్పెషల్ ఫొక‌స్ ఇప్పుడు చూద్దాం....!!!
ఆపరేషన్‌ ఆకర్ష్‌ 2 జాబితాలో ప‌లువురు సీనియ‌ర్లు
సార్వత్రిక ఎన్నిక‌లు సమీపిస్తుండడంతో..  చేరికలతో తనదైన వ్యూహాలకు పదునుపెడుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ చేపట్టనున్న ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్-2 జాబితాలో ప‌లువురు సీనియ‌ర్లు ఉన్నట్లు స‌మాచారం. శ్రీకాకుళం జిల్లానుంచి కొండ్రుముర‌ళీని  చేర్చుకోవాలని భావిస్తుండగా.. విశాఖ‌ నుంచి స‌బ్బం హ‌రితోపాటు.. కొణ‌తాల రామకృష్ణ టార్గెట్‌గా ఉన్నట్లు సమాచారం. స‌బ్బం హ‌రికి విశాఖ నార్త్ ఎమ్మెల్యే సీటు, కొణ‌తాలకు అన‌కాప‌ల్లి పార్లమెంట్ సీటు ఇచ్చే అవ‌కాశం కనిపిస్తోంది. ఇక తూర్పు గోదావ‌రి జిల్లా నుంచి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌ కుమార్‌ను సైకిలెక్కించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఆయనకు రాజ‌మండ్రి ఎంపీ, లేదా  ఎమ్మెల్యే సీటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈమ‌ధ్య ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చంద్రబాబుతో బేటీ కావ‌డం ఈ వాద‌న‌కు బ‌లాన్నిస్తోంది. 
క‌డ‌ప జిల్లాలో పాగా వేసేయోచనలో టీడీపీ
వైసీపీకి కంచుకోట వంటి క‌డ‌ప జిల్లాలో పాగా వేయాల‌నీ చూస్తోంది. ఇప్పటికే ఆదినారాయణ రెడ్డిని పార్టీలొ చేర్చుకొని మంత్రి పదవి కూడా బట్టబెట్టింది.  అలాగే ప్రజాద‌ర‌ణగల మాజీ మంత్రి డిఎల్ ర‌వీంద్రారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాల‌ని బావిస్తున్నట్లు తెలుస్తోంది. సుదీర్గ రాజ‌కీయ‌ అనుభ‌వంతోపాటు.. వైఎస్ వ్యతిరేఖిగా  గుర్తింపు ఉన్న  డీఎల్‌తో పార్టీకి కలిస కలిసొస్తుందని టీడీపీ భావిస్తోంది. సైకిలెక్కేందుకు డీఎల్‌ సైతం సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం.   మైనారిటీ వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లా కూడా టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికోసం టీడీపీ ఎదురుచూపులు
ఇక మాజీ సీఎం కోట్ల విజ‌య‌భాస్కర్‌ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికోసం  టీడీపీ ఎప్పట్నుంచో ఎదురుచూస్తోంది. కాగా డిప్యూటీ సీఎం కేఈ వ్యతిరేకించడంతో వెన‌క్కి త‌గ్గిన‌ట్లు సమాచారం. అనంత జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఉన్న  యామిని బాల‌పై ప్రజల్లో వ్యతిరేకత దృష్ట్యా.. మాజీ మంత్రి శైలజా నాథ్‌ను  చేర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆయనకు సింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే సీటు కేటాయించే అవ‌కాశం ఉన్నట్లు సమాచారం.  ప్రకాశం జిల్లా లో క‌నిగిరి ఎమ్మెల్యే క‌దిరి బాబూరావుప‌ట్ల ప్రజ‌ల్లో తీవ్ర అసంతృప్తి ఉన్న నేరథ్యంలో... ఉగ్రన‌ర‌సింహారెడ్డిని చేర్చుకునేందుకు సిద్దమౌవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీనుంచి వెళ్లిన దాడి వీర‌భ‌ద్రరావు లాంటి నేత‌ల‌ను కూడా తిరిగి చేర్చుకునేందుకు టీడీపీ సిద్దంగా ఉంది.  ఈ మేరకు దాడి వీరభద్రరావు టీడీపీలోని తన స‌న్నిహితుల‌తో సంప్రదింపులు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. 
ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ 2 ఏ మేర‌కు స‌క్సెస్ అవుతుందో?  
పరిమితంగానే ఉండబోయే చేరికలతో.. సొంత‌పార్టీ నేత‌ల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని టీడీపీ సీనియ‌ర్లు బావిస్తున్నారు. బలమైన నేతలను చేర్చుకుని.. ప్రతిపక్షాలకు చెక్‌ పెట్టాలని చూస్తున్నారు టీడీపీ అధినేత. చంద్రబాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ 2 ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. 

 

19:38 - August 19, 2018

హైదరాబాద్‌ : అమరావతి బాండ్ల కోసం ప్రభుత్వం విధించిన షరతులను బహిర్గతం చేయాలని వైసీపీ డిమాండ్‌ చేసింది. పదిన్నర శాతం వడ్డీ హామీతో జారీ చేసిన ఈ బాండ్ల రాష్ట్ర ప్రభుత్వానికి గుడిబండగా మారే అవకాశం ఉందని వైసీపీ ఎమ్మెల్యే, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం బాండ్లు తీసుకున్న తొమ్మిదిమంది మదుపర్లు ఎవరో వెల్లడించాలి డిమాండ్‌ చేశారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా పదిన్నర శాతం వడ్డీకి బాండ్లు జారీచేయలేదని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. 

15:28 - August 13, 2018

విజయవాడ : వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడిపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని వైసీపీ నేత భూమన వెల్లడించారు. నిష్ఫక్షపాత విచారణ అనంతరం బాబు జైలుకు వెళ్లక తప్పదని జోస్యం చెప్పారు.

వైసీపీ నేత జగన్ టిడిపిపై దుష్ర్పాచారం చేస్తున్నారని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహార్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్..బిజెపితో టిడిపికి సంబంధాలు అంటకట్టడం సరికాదన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ టిడిపి అని వాస్తవాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి జవహార్ వ్యంగ్యాస్రాలు విసిరారు. పవన్ అంటే గాలి..అని గాలి వార్తలు పొగేసుకుని వస్తారని..ఆయన చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పి తన స్థాయిని తగ్గించుకోవాలని అనుకోవడం లేదన్నారు. తన కమ్యూనిటీకి పవన్ కంటే గొప్ప నేతను తాను అని తెలిపారు. 

15:09 - August 12, 2018

ప్రకాశం : ఈడీ ఛార్జీషీట్ లో వైఎస్ భారతి పేరు చేర్చడం...దానిపై తీవ్రస్థాయిలో స్పందించిన వైసీసీ అధ్యక్షుడు జగన్ బహిరంగంగా ప్రజలకు లేఖ రాయడం..దీనిపై ఏపీ టిడిపి మంత్రులు విమర్శలు చేయడం..ప్రతిగా వైసీపీ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. తాజాగా రోజా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై దుమ్మెత్తిపోశారు. టిడిపి మంత్రులు దిగజారి వైఎస్ భారతిపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ఏడేళ్లుగా సీబీఐ విచారణలో లేని భారతి పేరు ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు. జగన్ సతీమణి భారతిని రాజకీయ వివాదాల్లోకి లాగడం సరికాదని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా కుటుంబసభ్యులున్నారని పేర్కొన్నారు. కుటుంబసభ్యులను వివాదలోకి లాగడం నీచమని, తప్పు చేయని కుటుంబాన్ని రాజకీయంగా కుంగదీయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. ఒక రోజు వస్తుందని రోజా పేర్కొన్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - ap politics