AP Civil Supplies Corporation

20:17 - December 14, 2017

ఆల్రెడీ రేషన్ షాపులు అంతంత మాత్రంగా మారాయి? వాటిని గాలికొదిలి మాల్స్ పేరుతో కొత్త దోపిడీకి తెరలేపుతున్నారా? ప్రజాపంపిణీ వ్యవస్థ నుంచి ప్రభుత్వం సైడవ్వాలని చూస్తోందా? తక్కువ ధరలకే ఇస్తామంటూ మొదటికే మోసం తీసుకురానుందా? రిలయన్స్ లాంటి బడా సంస్థలు సామాన్యులకు తక్కువ ధరలకు ఎందుకిస్తాయి? రూపాయి పెట్టుబడి లేకుండా.. కోట్లు దండుకునే ఎత్తుగడా ఇది? చంద్రన్న మాల్స్ గుట్టేంటి? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. చంద్రన్నా ఎవరికోసమన్నా?రేషన్ షాపులను మరింత బలోపేతం చేసి సామాన్యుడి కడుపు నింపాల్సింది వదిలేసి.... మాల్స్ ఎందుకన్నా? గృహోపకరణాలు, సౌందర్య సాధనాలు కాదన్నా..బియ్యం,కందిపప్పు, నూనె, కావాలన్నా..!! రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ లను..కాదు..మా బాగోగులు పట్టించుకో అన్నా..చంద్రన్నా .. అంటున్నాడు సామాన్యుడు..

మాల్స్ భాగస్వాములుగా రిలయన్స్, ఫ్యూచర్ గ్రూపునెలా ఎంపిక చేస్తారు?ప్రజలకవసరమైన సరుకులు సరఫరా చేయలేనంత చేతకానిదా ఏపీ సర్కారు?ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి... దాని ద్వారా కార్పొరేట్లకు ఆదాయాన్ని పంచుతున్నారా? ఎవరికోసం ఈ మాల్స్? ఎవరికి లాభం? చంద్రన్నమాల్స్ పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దేశమంతా జీఎస్టీ ఉంటే ఏపీలో సీఎస్టీ ఉందని, హెరిటేజ్ రిలయన్స్ లకు మేలు చేసేందుకే ఈ నిర్ణయమని వైసీపీమండిపడుతోంది. ప్రజాపంపిణీ వ్యవస్థ నడ్డి విరిచి సామాన్యుడిని దోపిడీ చేసి కార్పొరేట్లకు దోడిపెట్టే ప్రయత్నం ఇదని సీపీఎం విమర్శిస్తోంది..

చంద్రన్న మాల్స్‌ ద్వారా నిత్యావసర వస్తువులతో పాటు, గృహోపకరణాలు, సౌందర్య సాధనాలు తక్కువ ధరలకు వస్తాయా? అలా వస్తాయంటూ చెప్తున్న సీఎం మాటల్లో నిజమెంత? చంద్రన్న మాల్స్‌తో ప్రజలకు జరిగే మేలు కన్నా, కార్పొరేట్లకు చేకూరే లబ్ధి ఎక్కువా? రిలయన్స్ లాంటి సంస్థలు ఒక్క రూపాయి పెట్టుబడి కూడా పెట్టకుండా గ్రామీణ ప్రాంతాల్లో దందాకు దిగుతున్నాయా? దానికి ఏపీ సర్కారు వత్తాసు పలుకుతోందా? ప్రజలకోసం చేస్తున్నామని చెప్పే పనుల అసలు గుట్టు తేల్చాలి.. కాకులను కొట్టి గద్దలకు వేసే కుట్రలను వ్యతిరేకించాలి..సామాన్యుడిని వినిమయ సంస్కృతికి తరలించి సొమ్ము చేసుకునే కుట్రలను తిప్పి కొట్టాలి.. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తూ, చౌక దుకాణాలను నాశనం చేసే మాల్స్ ను వ్యతిరేకించాలనే వాదనలు పెరుగుతున్నాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.


 

12:38 - December 13, 2017

హైదరారాద్ : ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు కుటుంబానికి ధన దాహం తీరలేదా అని అన్నారు. ఆస్తులు పెరిగినా చంద్రబాబుకు ధన దాహం తీరలేదన్నారు. ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రన్నమాల్స్ పేరుతో రేషన్ షాపులను నిర్వీర్యం చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని 28 వేల రేషన్ షాపులను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని తెలిపారు. మళ్లీ సీఎం అయితానో లేదోనన్న భయం పట్టుకుందన్నారు. అందుకే ఇప్పుడే దోచుకుని... దాచుకుంటున్నారని విమర్శించారు. గతంలో ప్రజలకు మజ్జిగ పంపిణీ పథకంలో హెరిటేజ్ పెరుగునే వాడాలని హుకుం జారీ చేశారని తెలిపారు. తన లాభం కోసం సంక్షేమ కార్యక్రమాలను మార్చుకుంటున్నారని ఆరోపించారు. కార్పొరేట్ దోపిడీకి పంచపెట్టే ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. రాజధాని నిర్మాణం పేరుతో పేదల భూములను లాక్కున్నారని విమర్శించారు. ఇసుక దందాలో వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. పిల్లను ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఎన్ టీఆర్ మరణానికి చంద్రబాబు కారణమని ఆరోపించారు. రాజకీయ అవహగాన లేని, ప్రజల మీద ప్రేమ లేని లోకేష్ ను మంత్రిని చేశారని చెప్పారు. నిత్యవసర ధరలను తగ్గించాలన్నారు. రేషన్ షాప్ లో పది సరుకులు ఇవ్వాలని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలతో కలిసి తరిమికొడతామన్నారు.

 

08:20 - December 13, 2017

చంద్రన్న మాల్స్ కావు అవి రిలయన్స్ మాల్స్, అంబానీ మాల్స్ అని అని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబురావు, టీడీపీ ప్రధాన కార్యదర్శి లాల్ వజీర్ పాల్గొని, మాట్లాడారు. రేషన్ షాపులను కార్పొరేట్ రిటైల్ సేల్స్ షాపులుగా మార్చారని విమర్శించారు. రేషన్ వ్యవస్థకు ప్రభుత్వం సమాధి కడుతుందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

19:04 - December 12, 2017

గుంటూరు : రేషన్ షాపు డీలర్లకు అధిక ఆదాయం, వినియోగదారులకు సరసమైన ధరలకే వస్తువులు లభించేలా 'చంద్రన్న విలేజ్ మాల్'కు శ్రీకారం చుట్టినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రేషన్ షాపు డీలర్లు, వినియోగదారులకు వీటిని నూతన సంవత్సర కానుకగా అందిస్తున్నామని అన్నారు. విజయవాడ, గుంటూరులో పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన 'చంద్రన్న విలేజ్ మాల్'ను ఆయన సచివాలయం నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. పేదవారికి నాణ్యమైన వస్తువులను, చౌక ధరలకు అందించాలనే లక్ష్యంతో 'చంద్రన్న విలేజ్ మాల్స్‌ రాష్ట్రమంతటా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 28 వేలకు పైగా వున్న చౌకధరల దుకాణాలను 'చంద్రన్న విలేజ్ మాల్'గా నవీకరిస్తున్నామని, మొదటిదశలో 6 వేల 500 రేషన్ షాపులు అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. 

06:48 - November 10, 2017

రాబోయే రోజుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థకి మంగళమేనా? ఇప్పుడు ఇదే చర్చ ఏపీ అంత నడుస్తోంది, చంద్రబాబు సర్కార్ రేషన్‌ షాపులను మూసివేస్తూ..ఒకవైపు E-Pass విధానాన్ని అమల్లోకి తీసుకొస్తూ... మరోవైపు విలేజ్‌ మాల్స్‌ పేరిట షాపింగ్‌ మాల్స్‌ను గ్రామాల్లో ఏర్పాటు చేయించే పనికి పూనుకోవడం ఈ చర్చకు కారణం అవుతుంది. ఇది ఒకవైపు ప్రజా పంపణీ వ్యవస్థని దెబ్బతీసే చర్యయేనని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబారావు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss

Subscribe to RSS - AP Civil Supplies Corporation