AP Assembly

11:35 - September 11, 2018

విజయవాడ : ఏపీలో కూడా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు తెరలేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ రాజకీయ పార్టీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. తాజాగా వైసీపీ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూకుమ్మడిగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయనున్నట్లు తెలుస్తోంది. మంగళశారం విశాఖలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు హాజరుకానున్నారు.

ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సమావేశాలకు కూడా వైసీపీ గైర్హాజర్ అయ్యింది. దీనిపై టిడిపి తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. వేతనాలు తీసుకుంటూ అసెంబ్లీకి రాకుండా...ప్రజా సమస్యలపై చర్చించకుండా వైసీపీ నాటకాలు ఆడుతోందని ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. దీనితో సంచలన నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ అధినేత జగన్ భావిస్తున్నారు. మూకుమ్మడిగా ఎమ్మెల్యెలు రాజీనామాలు చేస్తే ఎలా ఉంటుందని సమావేశంలో చర్చించనున్నారు. కానీ దీనిపై కొంతమంది ఎమ్మెల్యేలు విబేధిస్తున్నట్లు సమాచారం. మరి వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. 

07:04 - September 11, 2018

విజయవాడ : ఆపరేషన్‌ గరుడ.  ఏపీలో అధికారంలోకి రావడానికి బీజేపీ పెట్టుకున్న పేరు. టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చి.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ లబ్ది పొందేందుకు తీసుకొచ్చిన ఆపరేషనే గరుడ. బీజేపీ ఆపరేషన్‌ గరుడను ఏపీ ప్రయోగిస్తోందని బయటపెట్టింది హీరో శివాజీ. ఆపరేషన్‌ గరుడ ప్రయోగించి ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోందని ఆయన పలుమార్లు ఆరోపించారు. గరుడ ఎలా ఉండబోతోందో వీడియో చేసి చూపించారు.  మొన్నటికి మొన్న  ఆపరేషన్‌ గరుడ మరో రూపం దాల్చిందని చెప్పారు.  అతి త్వరలో చంద్రబాబుకు నోటీసులు వస్తాయని.... ముఖ్యమంత్రిని టార్గెట్‌ చేసుకుని రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురిచేయడం కోసం బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆయన ప్రధాన ఆరోపణ. 

ఆపరేషన్‌ గరుడపై ఏకంగా ఏపీ అసెంబ్లీలోనూ చర్చకొచ్చింది. సీఎం చంద్రబాబు బీజేపీ ఆపరేషనైన గరుడపై నోరు విప్పారు.  కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఉద్దేశంతో ఆపరేషన్‌ గరుడను చంద్రబాబే సృష్టించారని బీజేపీ నేతలు సభలో అన్నారు. దీంతో కోపోద్రిక్తుడైన చంద్రబాబు... తనను దెబ్బతీసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ గరుడ ప్రయోగిస్తోందని మండిపడ్డారు. అధికారం ఉంది కదా అని కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకుని విపక్షాలను భయపెట్టాలని బీజేపీ నేతలు చూస్తోన్నారని చెప్పారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని బీజేపీ నేతలు  గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం సరైందికాదన్నారు. ఆపరేషన్‌ గరుడకు సంబంధించిన  సాక్ష్యాధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. మోదీ ముసుగు వేసుకుని కొందరు డ్రామాలాడుతున్నారని... ముసుగువీరుల ఆటలు ఏపీలో సాగబోవని ఆయన హెచ్చరించారు. మొత్తానికి ఏపీ అసెంబ్లీలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య ఆపరేషన్‌ గరుడపై మాటలయుద్ధం సాగింది. దీంతో మరోసారి ఆపరేషన్‌ గరుడ తెరపైకి వచ్చింది.

15:44 - September 10, 2018

విజయవాడ : పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల అన్ని వర్గాలకు భారంగా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ఆయన ఓ ప్రకటన చేశారు. పెట్రోల్ ధరలపై రూ. 2 వ్యాట్ ను తగ్గించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దాదాపు రూ. 1200 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుందని తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ప్రస్తుతం రూ. 4లను ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఇంధన ధరలు తగ్గించేందుకు నాలుగేళ్లుగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కేంద్రం బాధ్యతగా వహించి ఎక్సైజ్ పన్నును తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగానే ఉన్నాయని, రూ. 20 లక్షల కోట్లకు పైగా ప్రజలపై కేంద్రం అదనంగా భారం వేస్తోందన్నారు. 

12:03 - September 10, 2018

విజయవాడ : మాజీ మంత్రి, వైసీపీ నేత వసంత నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శికి వసంత ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై సోమవారం అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో సీఎం బాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిపై బాబు సీరియస్ గా స్పందించారు. బెదిరింపులు..హత్యలతో ఏమీ సాధించలేరని...ఇలాంటి చర్యలను సహించేది లేదని..ఎంతటి వారైనా తీవ్రస్థాయిలో చర్యలుంటాయని హెచ్చరించారు. మంత్రిని హత్య చేస్తామనే ధోరణిలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని వ్యూహ కమిటీకి సూచించారు. ఇప్పటికే కేసు నమోదైందని వ్యూహ కమిటీ సభ్యులు బాబు దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలోనూ ఈ ప్రస్తావన తీసుకరావాలని బాబు సూచించారు. 

09:18 - September 10, 2018

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. మూడో రోజైన సోమవారం శాసనసభలో 344 నిబంధన కింద పట్టణ, గ్రామీణ గృహ నిర్మాణంపై చర్చ జరుగనుంది. విభజన హామీల అమలుపై స్వల్ప కాలిక చర్చ జరుగనుంది. శాసనమండలిలో అమరావతి నిర్మాణంపై చర్చ కొనసాగనుంది. ఈ సమావేశాలకు గైర్హాజర్ కావాలని వైసీపీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీపై అధికార పక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. 

09:29 - September 5, 2018

గుంటూరు : రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాబోతున్నాయి. ఈ నేపథ్యంలో సభలో అనుసరించే వ్యూహాలపై టీడీపీ కసరత్తు ప్రారంభించింది. ఇవాళ టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు సమావేశం అవుతున్నారు. సభలో తమ వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నారు..
నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం
ఇవాళ ఉదయం 11 గంటలకు  టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. ఉండవల్లి గ్రీవెన్స్‌ హాల్‌లో ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి టీడీపీ శాసనసభాపక్షంతోపాటు  పార్టీ నేతలు హాజరుకానున్నారు.  రేపటి నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలపైనే ఇందులో ప్రధానంగా చర్చించే అవకాశముంది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. గ్రామదర్శిని, గ్రామ వికాసంపైనా చంద్రబాబు సమీక్షించనున్నారు. వర్తమాన రాజకీయ అంశాలు, ఎన్నికల ముంగిట పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై ఈ సందర్భంగా చర్చ జరుగనుంది.
కేబినెట్‌లోకి ఒకరా.. ఇద్దరా?
టీడీపీ విస్తృ స్థాయి సమావేశంలో చంద్రబాబు కేబినెట్‌ విస్తరణపై నేతలకు స్పష్టత నిచ్చే అవకాశముంది. దీంతో తెలుగుదేశం పార్టీలో జోరుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రుల రాజీనామాతో మంత్రివర్గంలో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఇందులో ఒక ఖాళీని ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వారితో భర్తీ చేస్తానని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఎస్టీలు లేనందున.. ఆ వర్గానికి కూడా చోటిస్తే బావుంటుందని సీనియర్లు సూచించారు. దీంతో కేబినెట్‌లోకి ఇద్దరిని తీసుకునే చాన్స్‌ ఉంది.

 

10:47 - April 4, 2018
17:37 - April 3, 2018

గుంటూరు : పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక ప్రగతి కుంటుపడిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన విమర్శలను బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తోసిపుచ్చారు. పెద్దనోట్ల రద్దుతో ఇబ్బంది పడింది నల్లధనం ఉన్నవారేనని అసెంబ్లీలో చెప్పారు. 

17:30 - April 3, 2018

గుంటూరు : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అస్తవ్యస్త ఆర్థిక విధానాలు దేశ ప్రగతికి అవరోధంగా మారాయని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. పెద్ద రోడ్లు రద్దు తర్వాత జీడీపీ 2 శాతం పడిపోయిందని, ఇది మరో 2 శాతం దిగజారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన రియల్‌ ఎస్టేట్‌ చట్టం కూడా ప్రగతికి అవరోధంగా ఉందని అసెంబ్లీలో చెప్పారు. 
 

20:46 - March 30, 2018

తెలంగాణల పరిపాలన తెర్లు తెర్లు...లెక్కలతోని బైటవెట్టిన కాగ్ రిపోర్టు, జిల్లాల పొంట సుర్వైన రైతు ఉద్యమాలు..అప్పుల బాధకు మరో అన్నదాత ఉరి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ దీక్షలు విరమణ...మాటతప్పిన ప్రభుత్వం మీద మరో పోరు, ఏశిన అద్దగంటకే శిలాఫల్కం గూల్చిన జనం.. మెదక్ నియోజక వర్గంల తిర్గవడ్డ దళితులు, తాగునీళ్ల కోసం ప్రకాశం జిల్లాల తన్లాట...కోపంతోని రాత్రిపూట రోడ్డెక్కిన మహిళలు, ఉత్సవ విగ్రహాలే అయ్యిన ఎంపీటీసీలు...నిధిలియ్యలేదని సీఎం బొమ్మకు ఉరి...ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

Pages

Don't Miss

Subscribe to RSS - AP Assembly