anna lezhneva

  • Sharebar

పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి..

December 28, 2013 - 16:53

హైదరాబాద్: పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కొత్త అత్తారిల్లు వెతుక్కున్నాడు. బస్తీ దొరసానంటూ తీన్‌మార్‌లో పవన్‌ సరసన జతకట్టిన సిడ్నీ దొరసానిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని అభిమానులకు సర్‌ప్రైజ్‌ షాకిచ్చాడు. తీన్ మార్ సినిమాలో బస్తీ దొరసాని సాంగులో స్టెప్పులేసిన లెజ్‌నేవాతో ఏడడుగులు వేయించాడు.తీన్ మార్ సినిమా షూటింగ్‌ సమయంలో వీరిరువురి మధ్య మొదలైన ప్రేమాయణం పెళ్లి వరకు వచ్చింది. వీరిద్దరికి పెళ్లి జరిగినట్టు ఎర్రగడ్డ మ్యారేజ్‌ రిజిస్ర్టేషన్‌ ఆఫీసులో నమోదైంది. 2013 సెప్టెంబర్‌లో పెళ్లి జరినట్టు వీరు సర్టిఫికెట్‌ తీసుకున్నారు. దీంతో రెండో భార్య రేణుదేశాయ్‌తో పవన్‌ కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నాడన్న వార్తలు నిజమయ్యాయి. హీరోగా పాపులర్‌ కాకముందు పవన్‌ కల్యాణ్‌ వివాహం విశాఖకు చెందిన నందినితో జరిగింది. ఆ తరువాత వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. బద్రీ సినిమాలో రేణుదేశాయ్‌తో రొమాన్స్ చేసిన పవన్‌ ఆ తరువాత ఆమెతో సహజీవనం చేశారు. ఇది వివాదాలకు దారి తీయడంతో నందినికి విడాకులిచ్చి రేణును సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇంతవరకు పవన్ ఒంటరిగానే సినిమాల ఆడియో ఫంక్షన్‌, చిరంజీవి ఇంట్లోని శుభాకార్యాలలో కనిపించాడు. రేణు ఎక్కడా కనిపించలేదు. దీంతో పవన్‌, రేణుల జోడి విడిపోయిందని వార్తలొచ్చాయి. ఇప్పుడు పవన్‌ మూడో పెళ్లివార్త బయటకు రావడం ఫ్యాన్స్ ను కొంత అయోమయంలో పడేసింది.
సబ్ రిజిస్ట్రార్ ధృవీకరణ..
    
పవన్ కళ్యాణ్ ముచ్చటగా మూడవ పెళ్లి చేసుకున్నట్లు సబ్ రిజిష్ట్రార్ ధృవీకరించారు. 2013 సెప్టెంబరు 30న పవన్ కళ్యాణ్ ఆస్ట్రేలియా మోడల్ అన్నా లెజ్నెవా వివాహం జరిగినట్లు ఎర్రగడ్డ సబ్ రిజిష్ట్రార్ బాసిత్ సిద్ధిఖీ తెలిపారు.

 

 

టాప్ స్టోరీస్

Subscribe to RSS - anna lezhneva