allegations

19:12 - September 12, 2018

మంచిర్యాల : తనపై నల్లాల ఓదేలు వర్గం హత్యాయత్నానికి పాల్పడిందని ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చిన తనపై హత్యాయత్నం చేశారని పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గ టిక్కెట్ ను కేసీఆర్ తనకు కేటాయించారని ఎవరూ అడ్డుపడినా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని తెలిపారు. ఓదేలు వర్గం ఎన్నికుట్రలు పన్నినా తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదని స్పష్టం చేశారు. చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థిగా బాల్క సుమన్ టీఆర్ ఎస్ ఇటీవలే ప్రకటించిన విషయం విధితమే. దీన్నితాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తీవ్రంగా ఖండించారు. తనకు చెన్నూరు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిన్న ఓదేలు స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. దీంతో ఓదేలు వర్గ బాల్క సుమన్ పై ఆగ్రహంతో ఉన్నారు.

ఇవాళ నియోజకవర్గంలోని ఇందారం గ్రామంలో పర్యటించేందుకు వెళ్లిన బాల్క సుమన్‌ను ఓదేలు వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఓదేలు అనుచరుడు రేగుంట గట్టయ్య కిరోసిన్‌ పోసుకుని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనను బాల్క సుమన్‌ తీవ్రంగా ఖండించారు. 

 

14:43 - January 11, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలోని ఉండి మండలం చిలుకూరు గ్రామ పంచాయతీలో కొందరు అనుమతి లేకుండానే 600 ఎకరాల భూముల్లో తవ్వకాలు జరిపేస్తున్నారు. నెల రోజుల నుండి చిలుకూరు గ్రామ పంచాయతీ అక్రమ చేపల చెరువుల తవ్వకాలను యదేచ్చగా జరుపుతున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా జిల్లా కలెక్టర్, తహశీల్దార్, గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారుల వ్యవహారంతోనే అక్రమ దారులు పెట్రేగిపోతున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:19 - January 11, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో అక్రమంగా చేపల చెరువులను తవుతున్నారు. అధికారులు లంచలు తీసుకుని అటు వైపే చూడడంలేదు. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:06 - November 9, 2017

హైదరాబాద్ : మియాపూర్ భూ కుంభకోణంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ పై ఆరోపణలు వస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఐటీ సోదాలు నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:04 - October 21, 2017

పశ్చిమగోదావరి : ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లక్ష్యానికి అనుగుణంగా కొనసాగడంలేదు. నిధుల కొరత ప్రభుత్వాన్ని వేధిస్తోంది. కాంట్రాక్టర్లు లక్ష్యాల మేరకు పనులు చేయకపోవడంతో నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు పూర్తయ్యే అకాశం కనిపించడంలేదు. పోలవరం ప్రాజెక్టు ద్వారా 2018 నుంచి సాగునీరు అందించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా పనులు సాగడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం పనులను సమీక్షిస్తున్నా.. సవాలక్ష కారణాలతో కాంట్రాక్టు సంస్థలు జాప్యం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి సమీక్షించే సోమవారం మినహా మిగిలిన రోజుల్లో ప్రాజెక్టు పనులు చేయడంలేదున్న ఆరోపణలు ఉన్నాయి. పనుల జాప్యంపై చంద్రబాబు అసంతృప్తి వెళ్లగక్కడం, కాంట్రాక్టర్లను మారుస్తామని చెప్పడం మినహా ఏమీ చేయలేకపోతున్నారు. కాంట్రాక్టు సంస్థలను మార్పుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడంలేదు. దీనివలన ప్రాజెక్టు వ్యయం 30 శాతం పెరుగుతుందని, దీనిని భరించే స్థితిలో కేంద్రం లేదని జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అయినా ఏపీ ప్రభుత్వం మాత్రం నిర్దేశిత గడవులోగా పూర్తి చేస్తామని చెబుతూవస్తోంది.

9,086.02 కోట్ల రూపాయల నిధులు విడుదల
పోలవరంకు ప్రధాన సమస్యల నిధులు. దీర్ఘకాల నీటిపారుదల నిధి కింది 2016-17లో నాబార్డు దేశంలోని సాగునీటి ప్రాజెక్టులకు 9,086.02 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తే, పోలవరంకు మంజూరు చేసిన నిధులు మాత్రం 2,414.16 కోట్లు మాత్రమే. నాబార్డు ఈ ఏడాది దేశంలోని ప్రాజెక్టులకు 9వేల 20 కోట్ల రూపాయలు విదుడల చేయాలని నిర్ణయిస్తే, దీనిలో 979.36 కోట్లు మాత్రమే కేటాయించింది. జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం తక్కువ నిధులు కేటాయించడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. పోలవరం నిర్మాణంలో ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీకుని, కేంద్రంతో చర్చించాలని ప్రతిపక్షాలు సూచిస్తున్నాయి. 

18:06 - July 31, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్‌ నేతలు.. ఎస్సీలు, బీసీలు గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్. ఎస్సీలపై ప్రేమ ఉన్నట్టు కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతున్నారని... కానీ వారి 125 ఏళ్ల చరిత్రలో వారికి చేసిందేమి లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో.. ఈ మూడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో దళితులకు చేసిన మేలుపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్‌ విసిరారు. 

15:58 - July 31, 2017

యాదాద్రి : యాదాద్రి జిల్లాలో రాజకీయమంతా మాజీ రియల్‌ వ్యాపారుల చుట్టే తిరుగుతోంది. భువనగిరిలో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిందా అనే అనుమానం కలిగేలా రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ అధికార పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న పైళ్ల రాజేశేఖర్ రెడ్డితో పాటు.. కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌ కుంభం అనిల్ కుమార్‌ రెడ్డి, యువ తెలంగాణ పేరుతో స్వతంత్ర్యంగా గుర్తింపు తెచ్చుకున్న జిట్టా బాలకృష్ణారెడ్డి.. అందరూ వ్యాపారాల నుంచి రాజకీయాల వైపు వచ్చినవారే. పైళ్ల రాజశేఖర్‌ రెడ్డి సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువై.. టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక జిట్టా బాలకృష్ణారెడ్డి టీఆర్‌ఎస్‌లో కీలకంగా వ్యవహరించినా.. అలాగే కొనసాగకుండా యువ తెలంగాణ పేరుతో స్వతంత్ర్యంగా ముందుకెళ్లారు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో గెలుపు తీరాన్ని చేరుకోలేకపోయారు.

 మాటల యుద్ధం
భువనగిరి నియోజకవర్గంపై కన్నేసిన మరో నేత కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్నాడు. ఇటీవల బీబీనగర్‌ నిమ్స్‌ పూర్తవడం కోసం చేసిన దీక్ష, పాదయాత్ర అనిల్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. ముందస్తు వ్యూహం లేకపోవడంతో ప్రచారంలో కాస్త వెనకవడ్డారనే అభిప్రాయం ఉంది.జిట్టా బాలకృష్ణారెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే పైళ్ల రాజశేఖర్‌ రెడ్డికి మధ్య మాటల యుద్ధం జరిగింది. విమర్శలు, ప్రతి విమర్శలతో నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం హాట్‌ హాట్‌గా సాగుతోంది. సొంత నిధులతో పనులు చేశానని ఎమ్మెల్యే పైళ్ల రాజశేఖర్‌ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని.. జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోపించడంతో గొడవ మొదలైంది. ఏదేమైనా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడా లేనంతగా భువనగిరిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు.. స్థానిక ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చనీయాంశంగా మారిందని తెలుస్తోంది. భువనగిరి నియోజకవర్గంలో ఆర్థికాంశం చుట్టే భవిష్యత్‌ రాజకీయం నడుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

15:56 - July 31, 2017

కామారెడ్డి : సింగూర్‌ జలాలను నిజాంసాగర్‌ లోకి వదలాలంటూ కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ రాస్తారోకో, ధర్నా చేపట్టారు. నస్రుల్లాబాద్‌ మండలం బోమ్మన్‌దేవ్‌ పల్లి చౌరస్తాలో చేపట్టిన ధర్నాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సింగూరు జలాన్ని నిజాం సాగర్‌లోకి వదలి... రైతుల పంటలు ఎండి పోకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. రైతుల పంటలు ఎండిపోతుంటే వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోవట్లేదని విచారం వ్యక్తం చేశారు. ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌ కి తరలించారు.

07:55 - July 31, 2017

హైదరాబాద్ : ప్రభుత్వంపై విమర్శలు చేసే వారిపై చర్యలకు గులాబీ బాస్‌ సిద్ధమవుతున్నారా? నిరాధార ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తప్పవా? ఇందుకోసం ఓ బిల్లును తీసుకురావాలని సర్కార్‌ యోచిస్తోందా? ప్రభుత్వాన్ని విమర్శించాలంటే  ప్రతిపక్షాలు వెనుకాముందు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయా? కాంగ్రెస్‌ నేతల విమర్శలపై టీఆర్‌ఎస్‌ నేతలు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారా? 
పాలిటిక్స్‌లో ఆరోపణలు, ప్రత్యారోపణలు 
రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు  సహజం. అధికారపార్టీపై ప్రతిపక్ష పార్టీల నేతలు ఎప్పుడూ ఆరోపణలు చేస్తూనే ఉంటారు. అధికారపార్టీ వాటిని తిప్పికొడుతుంది. ఇవన్నీ పాలిటిక్స్‌లో సాధారణమైన అంశాలు. అయితే  టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం తమపై ఆరోపణలు చేస్తే వారికి ఆధారాలు చూపించాలన్న డిమాండ్‌ను తెరపైకి తీసుకొస్తోంది. తమపై ఆరోపణలు చేస్తే వాటిని నిరూపించాలని టీఆర్‌ఎస్‌ నేతలు ప్రతిపక్షాలకు సవాల్‌ విసురుతున్నారు. ఆరోపణలు చేయాలంటే ప్రతిపక్షాలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిరాధార ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకునేలా శాసన సభలో ఓ బిల్లును కూడా తీసుకొస్తామని కేసీఆర్‌ ఇంతకుముందే ప్రకటించారు.
తలసానిపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు 
మియాపూర్‌ ల్యాండ్‌ స్కామ్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు సంబంధాలున్నాయంటూ కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ ఆరోపణలు గుప్పించారు.  దీంతో తలసాని తనకు ఎలాంటి సంబంధంలేదంటూ వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ విమర్శలను అంతటితో వదిలేయకుండా... విమర్శలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆయన మొగ్గుచూపుతున్నారు.  ఇప్పటికే దిగ్విజయ్‌సింగ్‌తోపాటు... కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యాలయానికి నోటీసులు పంపారు. అయితే కాంగ్రెస్‌ నుంచిగానీ.. దిగ్విజయ్‌సింగ్‌ నుంచి కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కోర్టు మెట్లెక్కేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసిన విపక్షాలు
ప్రతిపక్షపార్టీలన్నీ మియాపూర్‌ భూకుంభకోణంపై ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమయ్యాయి. నిరసనలు హోరందుకుంటుండగా.... డ్రగ్స్‌ వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో ప్రతిపక్షాలన్నీ డ్రగ్స్‌ కేసుపై దృష్టిసారించాయి. టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు ఊపిరి పీల్చుకున్నంత పనైంది. ఈ పరిస్థితుల్లో మంత్రి తలసాని దిగ్విజయ్‌సింగ్‌పై కోర్టుకు వెళ్లేందుకు కేసీఆర్‌ అనుమతిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మొత్తానికి ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న హెచ్చరికలు సర్కార్‌ పంపుతోంది. మరి ప్రతిపక్ష పార్టీలు దీనిపై ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

 

15:37 - June 9, 2017

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేశారు. లాంగ్ స్టాండింగ్, పలు అరోపణలతో పలువురు డిప్యూటీ కమిషనర్లను కమిషనర్ జనార్ధన్ రెడ్డి బదిలీ చేశారు. కొంతమందిని అదే జోన్ లోకి మార్చారు. మరికొంతమందిని వేరే జోన్లకు మార్చారు. జనార్ధన్ తీసుకున్న చర్యను పలువురు హర్షిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Pages

Don't Miss

Subscribe to RSS - allegations