AICC President

06:38 - August 31, 2018

ఢిల్లీ : 500, 1000 నోట్ల రద్దు నిర్ణయంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్రమోదిపై ధ్వజమెత్తారు. పెద్దనోట్ల రద్దు ఓ పెద్ద కుంభకోణమని ఆరోపించారు. దేశంలోని 15-20 మంది క్రోని కాపిటలిస్టుల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకే మోది కావాలనే నోట్లరద్దు నిర్ణయం తీసుకున్నారని రాహుల్‌ ధ్వజమెత్తారు. చిన్న, మధ్యతరగతి వ్యాపారులను దెబ్బతీసి... అమెజాన్‌ లాంటి పెద్ద కార్పోరేట్‌ సంస్థలకు ఊతమిచ్చేందుకే పెద్దనోట్లను రద్దు చేశారని ఆయన మండిపడ్డారు. మోదిని టీవీల్లో మార్కెటింగ్‌ చేసేందుకు కార్పోరేట్లు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని....ఆ డబ్బును ప్రజల నుంచి తీసుకుని వారి జేబుల్లో వేస్తున్నారని రాహుల్‌ విమర్శించారు. 

22:02 - August 25, 2018

ఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ 9 మంది సభ్యులతో కూడిన కోర్‌ కమిటీని నియమించారు. కాంగ్రెస్‌ కోర్‌ కమిటీలో సీనియర్‌ నేతలు ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్‌, పి. చిదంబరం, అశోక్‌ గెహ్లాట్‌, మల్లికార్జున్‌ ఖర్గే, అహ్మద్‌ పటేల్‌, జైరాం రమేష్‌, రణ్‌దీప్‌ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌ ఉన్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కోర్‌ కమిటీతో పాటు మరో రెండు కమిటీలను రాహుల్‌ ఏర్పాటు చేశారు. పార్టీ మ్యానిఫెస్టోను ఆకర్షణీయంగా రూపొందించేందుకు 19 మంది సభ్యులతో ఓ కమిటి వేశారు. ప్రచార కార్యక్రమాల పర్యవేక్షణ కోసం 13 మంది సభ్యులతో కూడిన మరో పబ్లిసిటీ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. 

 

13:28 - August 18, 2018

ఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో రూ. 41వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఏపీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆరోపించారు. రాహుల్ అధ్యక్షతన వార్ రూంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...రెండు సమావేశాలు జరుగుతున్నాయని, మొదటి సమావేశంలో రాఫెల్ విమానాల కొనుగోలు..కేరళ విపత్తుపై చర్చించడం జరిగిందన్నారు. గతంలో రూ. 526 కోట్లకు ఒప్పందం జరిగిందని, మోడీ పీఎం అయిన తరువాత ఫ్రాన్స్ కు వెళ్లి అదే విమానాన్ని రూ. 1600 కోట్లకు కొన్నారని, 36 విమానాలను కొనుగోలు చేసిందన్నారు. దీని వెనుక భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. రూ. 30వేల కోట్ల కాంట్రాక్టు అనీల్ అంబానీకి ఇవ్వడం సిగ్గు చేటన్నారు. కేరళలో జరిగిన విపత్తుపై కూడా చర్చించడం జరిగిందని, పార్టీకి చెందని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒక నెల జీతం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వాలని నిర్ణయం జరిగిందన్నారు. తెలంగాణ పీసీసీ తరపున కేరళ రాష్ట్రానికి సాయం అందించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. జాతీయ విపత్తు ప్రకటించాలని సమావేశం నిర్ణయం తీసుకుందన్నారు. రెండో సమావేశంలో అన్ని రాష్ట్రాల్లో 'శక్తి' ప్రాజెక్టుపై రాహుల్ సమీక్ష జరుపుతారని తెలిపారు.

13:23 - August 18, 2018

ఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల ద్వారా బీజేపీ ప్రభుత్వం కోట్ల రూపాయల దోచుకొంటోందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా ఆరోపించారు. రాహుల్ అధ్యక్షతన వార్ రూంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఈ సమావేశంలో రాఫెల్ యుద్ధ విమానాల అవినీతిపై...కేరళలో జరిగిన విపత్తుపై చర్చిండం జరిగిందన్నారు. కాంగ్రెస్ హాయాంలో ఒక రాఫెల్ యుద్ధ విమానాన్ని రూ. 500 కోట్లకు కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ విమానాన్ని రూ. 1600 కోట్లకు కొనుగోలు చేసిందన్నారు. ఒక్కో యుద్ధ విమానంపై రూ. 1100 కోట్లు దోచుకొంటోందని ఆరోపించారు. కేరళను విపత్తు నుండి ఆదుకోవడంలో కేంద్రం విఫలం చెందిందన్నారు. 

13:19 - August 18, 2018

ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ వార్ రూంలో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం నిర్వహించిన ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జీలు హాజరయ్యారు. సుమారు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. రాఫెల్ కుంభకోణం విషయంలో వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని..కేరళపై కేంద్రం చిన్న చూపు చూడడంపై చర్చించారు. కేరళ రాష్ట్రాన్ని ఆదుకొనేందుకు ముందుకు రావాలని రాహుల్ సూచించారు.

కేరళ రాష్ట్రానికి పార్టీ తోచిన విధంగా సహాయం చేయాలని నిర్ణయించగా దేశ వ్యాప్తంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతం ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. లక్షలాది కేరళ ప్రజల భవిష్యత్ ప్రమాదంలో ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అందుకుని కేరళ విళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ట్విట్టర్ ద్వారా ప్రధాన మంత్రిని ఆయన కోరారు. బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒక విధంగా...కేరళ రాష్ట్రాన్ని మరొక విధంగా చూస్తోందని కాంగ్రెస్ పేర్కొంటోంది. 

19:48 - August 2, 2018

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టకు జాతీయ హోదా సాధించడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి విమర్శించారు. జాతీయ హోదా దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. జాతీయ హోదాకు బదులు కాళేశ్వరంకు కేంద్రం నుంచి నిధులు అడగటం ఏంటని మర్రి శశిధర్‌రెడ్డి ప్రశ్నించారు. 

18:13 - August 2, 2018

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటన ఖరారరైంది. ఈనెల 13, 14 లేదీల్లో రాష్ట్రంలో రాహుల్‌ పర్యటించనున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో జరిగే తెలంగాణ కాంగ్రెస్‌ బస్సు యాత్రలో రాహుల్‌ పాల్గొంటారు. ఆ రెండు రోజుల్లో రాహుల్‌ సమక్షంలో  పెద్ద ఎత్తున్నఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరతారు. 

 

15:24 - August 2, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పర్యటన ఖరారు అయింది. ఈనెల 13, 14 తేదీల్లో రాష్ట్రంలో రాహుల్ పర్యటించనున్నారు. రెండు రోజులపాటు పర్యటించనున్నారు. రంగారెడ్డి జిల్లాలో బస్సుయాత్రలో రాహుల్ పాల్గొననున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

09:19 - July 5, 2018

ఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్‌లో నేత‌ల కుమ్ములాట‌ల‌పై హైక‌మాండ్ అల‌ర్ట్ అయ్యింది. నాయకులను గాడిలో పెట్టక పోతే .. వచ్చే ఎన్నికల్లో పార్టీ పుట్టి మునుగుతుంద‌ని భావిస్తున్న డిల్లీ పెద్దలు నేరుగా రంగంలోకి దిగారు. అసంతృప్తి నేత‌ల‌తో విడివిడిగా మంత‌నాలు జ‌రుపుతున్నారు. కస్సుబుస్సు నేతలకు స‌మ‌న్వయ మంత్రాన్ని ఉప‌దేశిస్తూ రాహుల్‌దూతలు బిజీగా ఉన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల మధ్య కస్సుబుస్సుల పంచాయతీలు హైకమాండ్‌ను కలవరపెడుతున్నాయి.  ఓ వైపు ముంద‌స్తు ఎన్నికల  ఘంటిక‌లు మ్రోగుతుండ‌టంతో అసంతృప్త సెగలను చల్లబరిచేందుకు ఢిల్లీనాయకత్వం రంగంలోకి దిగింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో  అధికారం సాధించాలని పట్టుదలగా ఉన్న హస్తం పెద్దలు దూకుడు నేతలకు కళ్లెంవేసే వ్యూహాన్ని  అమల్లో పెట్టారు. 

ఇటివ‌ల టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు వ్వతిరేకంగా కొంద‌రు నేత‌ల సీక్రెట్ గా మీటింగ్‌ పెట్టడంపై డిల్లీ పెద్దలు సిరియ‌స్ అవుతున్నారు. వ‌రుస‌గా జ‌రుగుతున్న ఈ భేటిల‌పై ఆరా తీసిన రాహుల్ కార్యాల‌యం.. నేత‌ల అభిప్రాయాల‌ను వినాల‌ని నిర్ణయించింది. ఇప్పటికే ర‌హ‌స్య భేటిలు పెట్టుకున్న నేత‌లు రాహుల్ అపాయింట్ మెంట్ కోరిన నేప‌థ్యంలో .. ఆ భేటికంటే ముందే అసంతృప్త నేత‌ల మూడ్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయ‌త్నం చేస్తున్నారు ఢిల్లీ దూతలు.  

అసంతృప్తి నేత‌ల‌తో వ‌రుస‌గా మూడు రోజులుగా సంప్రదింపులు సాగిస్తున్న అధిష్టానం దూతలు స‌లిం అహ్మద్, బోస్ రాజు,శ్రినివాస‌న్ లు.  అసంతృప్త నేతల అభిప్రాయాల‌ను క్రోడీక‌రించి ఓ నివేదిక‌ను రాహుల్ గాంధీ కి అందించనున్నారు. అయితే ఎన్నిక‌ల సీజ‌న్ మొద‌లైయ్యిన వేళ... పీసీసీ మార్పు అంశం స‌రికాద‌ని చెబుతున్న హైక‌మాండ్ దూత‌లు .. నేత‌ల ప‌ద‌వుల పంప‌కాల్లో అంద‌రినీ సంతృప్తిప‌రిచేలా నిర్ణయాలు ఉంటాయంటున్నారు.  టికెట్ల కేటాయింపులో ఎవ‌రి డిమాండ్స్ ఏంటీ ..? ఎవ‌రికి ఏ ప్రాంతంలో బ‌ల‌ముంది .. ?ఎవ‌రికి ఎక్కడ ప్రాధాన్యత క‌ల్పించాల‌నే అంశంలో డిల్లీ దూత‌లు క్లీన్ గా అబ్జ‌ర్వు చేస్తున్నట్లు స‌మాచారం.

నాయ‌కుల మ‌ద్య స‌మ‌న్వయం కుద‌ర్చడ‌మే ప్రధాన ఎజెండాగా సాగుతున్న ఏఐసీసీ కార్యద‌ర్శుల మంత్రాంగం .. రాహుల్ సందేశాన్ని నేత‌ల‌కు ఇంజెస్ట్ చేసే ప్రయ‌త్నం చేస్తున్నారు . ఏఐసీసీ దూత‌ల‌తో భేటి అయ్యిన వారిలో రేవంత్ రెడ్డి .. డీకే అరుణ .. కోమ‌టి రెడ్డి .. శ్రీ‌ధ‌ర్ బాబు .. భ‌ట్టి విక్రమార్కల‌తో పాటు మ‌రికొంద‌రు ఇత‌ర నేత‌లు ఉన్నారు . అయితే .. రాష్ట్ర స్థాయిలో అసంతృప్తి నేత‌ల అభిప్రాయాల‌ను తెల‌సుకుంటూనే .. క్షేత్రస్థాయిలో ద్వితీయ‌శ్రేణి నేత‌ల అభిప్రాయాల‌ను కూడా తెలుసుకునేందుకు రెడీ అవుతోంది  రాహుల్ టీమ్‌. 

మొత్తానికి నేత‌ల అసంతృప్తి జ్వాల‌లు భ‌విష్యత్తు కు ప్రమాధ ఘ‌టిక‌లు మోగిస్తుండ‌టంతో అల‌ర్టయిన హైక‌మాండ్ ఆప‌రేష‌న్ షురూ చేసింది. అయితే  ఈ డిల్లీ ఆప‌రేష‌న్ మంత్రాంగానికి అసంతృప్త నేత‌లు ఏమేర‌కు మొత్తబ‌డ‌తారో అనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది. 

21:04 - July 1, 2018

విజయవాడ : 2019 ఎన్నికల కోసం ఏపీలో పార్టీని పటిష్టపరచాలని కాంగ్రెస్‌ అధినాయకత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఉమెన్‌చాందీ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఈనెల 9 నుంచి 31 వరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి వెళ్లిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు పార్టీ నాయకత్వం సిద్ధమైంది. వచ్చే ఎన్నికలకు ఏపీలో కాంగ్రెస్‌ను సమాయత్తం చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం నడుంబిగించింది. దీనిలో భాగంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఊమెన్‌చాందీ హైదరాబాద్‌లో ఏపీ కాంగ్రెస్‌ నాయకులతో భేటీ అయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ఏఐసీసీ కార్యదర్శులు హోదాలో ఏపీకి ఇన్‌చార్జ్‌లుగా నియమితులైన కిస్టోఫర్‌, అయ్యప్పన్‌ కూడా సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈనెల 9 నుంచి 31 వ తేదీలోగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పర్యటించాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఊమెన్‌చాందీ నిర్ణయించారు. ఈనెల 9న కృష్ణా, 10న గుంటూరు, 11న ప్రకాశం, 12న నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. ఆ తర్వాత మిగిలిన జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ సమావేశాలకు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులను ఆహ్వానించారు. జిల్లా స్థాయిలో జరిగే సమావేశాల్లో పార్టీ బలాబలాలను అంచనా వేసి, లోపాలు సరిదిద్దుకునే విధంగా దిశానిర్దేశం చేస్తారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఫైలుపై తొలి సంతకం చేస్తామని రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ అంశంపై యూపీఏ ఇచ్చిన హామీ ఎన్డీయే అమలు చేయకపోవడాన్ని ఊమెన్‌చాందీ తప్పుపట్టారు. పార్టీ పటిష్టత కోసం కొత్తగా అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ నాయకత్వం నిర్ణయించింది. వివిధ కారణాలతో 2014 ఎన్నికల ముందు పార్టీని వీడివెళ్లిన వారంతా తిరిగి వస్తే చేర్చుకునే విధంగా పార్టీ నాయకులను ఊమెన్‌చాందీ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - AICC President