ACB raids

12:50 - September 1, 2018

చిత్తూరు : రేణిగుంట ఆర్టీవో చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మోటార్‌ వెహికిల్‌ ఇన్స్‌పెక్టర్‌ విజయ్‌ భాస్కర్‌పై వచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు చేపట్టారు. విజయ్‌ భాస్కర్‌ ఇంటితో పాటు అతని బంధువులు, స్నేహితులు ఇళ్లపై అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు. అనంతపురం, బెంగళూరు, తిరుపతి సహా 14 ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. చెక్‌పోస్ట్‌లో లభించిన 14 వేల రూపాయల అక్రమ నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

13:51 - July 24, 2018

అనంతపురం : ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగళం చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగం మేరకు అనంతపురం జిల్లా గుంతకల్లు రవాణాశాఖ కానిస్టేబుల్‌ రవీంధ్రనాథ్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా రవీంద్రనాథ్‌కు చెందిన ఐదు చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 20 కోట్ల ఆస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. 

13:24 - July 24, 2018

అనంతపురం : ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం పడింది. జిల్లాలో గుంతకల్లు రవాణాశాఖ కానిస్టేబుల్ రవీంద్రనాథ్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో తనిఖీలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఐదు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. 14 ఇళ్ల స్థలాలు, కిలో బంగారం, 2 కిలోల వెండి, భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు రూ.20 కోట్ల అక్రమ ఆస్తులు గుర్తించారు. 

 

16:40 - July 13, 2018

చిత్తురు : జిల్లా కేంద్రంలో మరో అవినీతి తిమింగలం పట్టుబడింది. వేలాది రూపాయలు జీతం తీసుకుంటూ, ప్రభుత్వం వాహనాలు వినియోగిస్తూ... లంచానికి కక్కుర్తిపడి జైలుపాలైయాడు సమాచార శాఖ డిప్యూటీ ఇంజనీర్‌ డి.నాగేశ్వరావు. కమ్మగుట్ట పల్లె గ్రామానికి చెందిన జి.ప్రవీణ్‌ వద్ద నుంచి 8 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. అధికారులు నాగేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

16:36 - July 13, 2018

హైదరాబాద్ : స్పోర్ట్స్‌ కోటాలో మెడికల్‌ సీట్ల కేటాయింపులో జరిగిన కుంభకోణంపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడ్డ తెలంగాణ జూడో అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కైలాసం యాదవ్‌కు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు కొనసాగిస్తున్నారు అధికారులు. అక్రమాలకు పాల్పడ్డ ఎవ్వరినీ వదిలేది లేదంటున్నారు ఏసీబీ అధికారులు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్‌ అందిస్తారు. 

15:27 - July 13, 2018
14:34 - July 13, 2018

హైదరాబాద్ : స్పోర్ట్స్ కోటా అక్రమాలు ఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి. స్పోర్ట్స్ కోటా..తప్పుడు ధృవపత్రాలతో మెడికల్ సీట్లు...అధికారులు చేతివాటానికి పాల్పడడంతో అర్హులైన విద్యార్థులకు నష్టం కలుగుతుందని టెన్ టివి ప్రసారం చేసిన కథనానికి ప్రభుత్వం కూడా స్పందించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏసీబీ విచారణ సాగిస్తోంది. తాజాగా మరొకటి వెలుగు చూసింది. మెడికల్ సీట్లు కుంభకోణం వెలుగులోకి రావడంతో వరంగల్ కు చెందిన తోట సునీల్ కుమార్ ఏసీబీని ఆశ్రయించాడు. తన కుమారుడికి సీటు ఇప్పించడం కోసం తెలంగాణ జూడో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కైలాసం యాదవ్ తో డీల్ కుదుర్చుకున్నానని..మొత్తం రూ. 4లక్షలు డిమాండ్ చేశాడని..తొలుత రూ. 2లక్షలు చెల్లించానని చెప్పడంతో ఏసీబీ రంగంలోకి దిగింది.

శుక్రవారం కైలాసం యాదవ్ ఇళ్లు..జూడో అసోసియేషన్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఏసీబీ అధికారితో టెన్ టివి ముచ్చటించింది. స్పోర్ట్స్ కోటా కింద సీటు ఇప్పిస్తానని, నాలుగు లక్షలు డిమాండ్ చేశాడని..అందులో రెండు లక్షలు ఇచ్చారని ఏసీబీ అధికారి పేర్కొన్నారు. కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, జూడో అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నారని..చాలా మందికి సర్టిఫికేట్లు ఇచ్చారని అనుకుంటున్నామని..కేసులో అతని హస్తం ఉన్నట్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 

13:30 - June 7, 2018

హైదరాబాద్ : శాట్స్ మెడికల్ సీట్ల కుంభకోణంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. శాట్స్ లో అక్రమాలు జరగదేఇన ఎండీ దినకర్ బాబు పేర్కొన్నారు. శాట్స్ అసోసియేషన్ లోకి వచ్చి సర్టిఫికేట్ల కోసం తనపై ఒత్తిడి తెస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అసోసియేషన్ లో ఉన్న లోపాల వలన క్రీడా విద్యార్థులకు సరైన న్యాయం జరగడం లేదని, శాట్స్ ద్వారా ఒక్క క్రీడాకారుడికి అన్యాయం జరగలేదన్నారు. ఏసీబీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగిందని, ఫెన్సింగ్ మిషన్ కారణంగా ఫెన్సింగ్ సర్టిఫికేట్లను పరిగణలోకి తీసుకోలేదని, ఎలాంటి ప్రాక్టిస్ లేని వారిని అసోసియేషన్ ఎంపిక చేస్తున్నారని తెలిపారు. 

10:05 - June 7, 2018
21:55 - June 6, 2018

హైదరాబాద్‌ : మెడికల్‌ సీట్ల స్కామ్‌లో శాట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వెంకటరమణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. స్పోర్ట్‌ కోటాలో 12 సీట్లను అమ్ముకున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. లక్షలాది రూపాయలు లంచం తీసుకున్నట్లు విచారణలో తేలింది. వెంకటరమణ ఇంటితోపాటు ఆయన బంధువుల ఇళ్ళలో సోదాలు నిర్వహించిన ఏసీబీ పలు కీలకమైన ఫైళ్ళు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.  సాట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వెంకటరణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - ACB raids