హోదా

10:51 - October 29, 2018

విజయవాడ : ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా ధర్మపోరాట సభలతో నిరసన తెలుపుతోన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. దీనిని దేశమంతటికీ విస్తరించాలని నిర్ణయించారు. తెలుగువారి ప్రాబల్య ప్రాంతాల్లో, భావసారూప్య పక్షాలున్న రాష్ట్రాల్లో ఈ పోరాట సభలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్వహించారు.  చెన్నైలో ఒక ధర్మపోరాట బహిరంగ సభ పెట్టాలని అనుకుంటున్నారు. బెంగాల్లో కూడా కేంద్ర కక్షపూరిత వ్యవహారాలకు వ్యతిరేకంగా బహిరంగ సభ నిర్వహించాలని చంద్రబాబు యోచిస్తున్నారు.  

 

12:25 - July 26, 2018
12:09 - July 26, 2018
16:57 - July 25, 2018

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీఆర్‌ఎస్‌ నేతలు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని కాంగ్రెస్‌ విమర్శించింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోతాయన్న విషయం టీఆర్‌ఎస్‌ నేతలకు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా.. అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో డిమాండ్‌ చేసిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు... ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. 

13:09 - July 25, 2018

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలూ బుధవారం కొనసాగాయి. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద టిడిపి ఎంపీలు ఆందోళన చేశారు. హోదా ఇవ్వాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. రోజుకో వేషధారణలో వస్తూ ఆకట్టుకుంటున్న చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్ ఉయ్యాల వాడ నరసింహారెడ్డి వేషధారణలో వచ్చి ఆయన నిరసన తెలియచేశారు. అనంతరం లోక్ సభ లో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

09:02 - July 25, 2018

విజయనగరం : ఆయన ఒక అజాత శత్రువు. విలువలకు మారు పేరు. నీతి, నిజాయితీలకు నిలువుటద్దం. నిరాడంబరతకు నిలువెత్తు సాక్ష్యం. కానీ ఇటీవల కొంతకాలంగా ఆయన ప్రతిష్ట మసకబారుతోంది. జిల్లాలో గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో.. ఆయన వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీలో తిరుగులేని నాయకుడిగా చెలమణి అవుతున్న ఆయన... ఎందుకలా వ్యవహరిస్తున్నారన్న సందేహం ప్రతి ఒక్కరినీ తొలిచేస్తోంది. విజయనగరం సంస్థాన వారసుడు, ఎంపీ పూసపాటి అశోక్‌గజపతిరాజు వ్యవహారశైలిపై కథనం..

పార్లమెంట్‌లో ఇటీవల టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో కేంద్ర మాజీమంత్రి అశోక్‌గజపతిరాజు గళం విప్పకపోవడం.. సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎంతో సీనియర్‌ నాయకుడై ఉండి... ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే సత్తా ఉన్నా.. పార్లమెంట్‌లో పెదవి విప్పకపోవడంపై జిల్లా ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తనకన్నా ఎంతో జూనియరైన రామ్మోహన్‌నాయుడు, గల్లా జయదేవ్‌ ప్రసంగాలకు ప్రశంసలు వస్తుంటే...అశోక్‌గజపతిరాజు కనీసం పెదవి విప్పకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అశోక్‌ కావాలనే మాట్లాడలేదా.. లేక అధిష్టానమే ఆయనను కానది.... జూనియర్లతో ఆలోచించిందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

టీడీపీ.. కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత... ఎందుకనో ఆయన హోదా పోరాటంలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకహోదా కోసం టీడీపీ నేతలు చేస్తున్న ధర్మా పోరాట దీక్షల్లో అశోక్‌ కనిపించ లేదు. ఆ మధ్య తిరుపతిలో చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ధర్మపోరాట దీక్షకు కూడా ఆయన డుమ్మా కొట్టారు. ఇక జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అభివృద్ధి విషయంలోనూ అశోక్‌ ప్రతిష్ట రోజురోజుకు తగ్గిపోతోంది. ఆ మధ్య జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడి ఎంపికలోనూ అశోక్‌ విమర్శల పాలయ్యారు.

అశోక్‌గజపతిరాజు నాలుగేల్లపాటు కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ కాలంలో జిల్లా అభివృద్ధికి ఆయన అంతగా చేసిందేమీ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ,గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణాలకు సంబంధించి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి కనీసం పునాదిరాయి కూడా వేయలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్ల వ్యవహారంలోనూ ప్రతిపక్షాలు ఆయనపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇక ఆయన చేసిన అభివృద్ధికి నిదర్శనంగా చెప్పుకునే విజయనగరం పట్టణంలోని సంతకాల బ్రిడ్జి వ్యవహారంలోనూ విమర్శలు మూటగట్టుకున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా... కొన్ని సాంకేతిక సమస్యలతో అది ప్రారంభానికి నోచుకోకపోవడం. ప్రతిపక్ష నేతల విమర్శలకు అవకాశం కల్పించినట్టైంది. ఇక అశోక్‌ బంగ్లాలో ఆయన ముఖ్య అనుచరుడిగా ఒక కాంట్రాక్టర్‌ జిల్లా పాలనలో జోక్యం చేసుకోవడం, రోడ్ల విస్తరణలో మితిమీరిన జోక్యం, అధికారులపై అజమాయిషీలాంటి వ్యవహారాలు అశోక్‌ ప్రతిష్టను మరింత దిగజార్చుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జిల్లా ఇంచార్జీ మంత్రిగా గంటా శ్రీనివాస్‌రావును నియమించినప్పటి నుంచే అశోక్‌ వ్యవహార శైలిలో మార్పు వచ్చిందని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ జిల్లా అధ్యక్షుని ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు మితిమీరిన జోక్యం అశోక్‌ను తీవ్ర మనస్థాపానికిగి గురిచేసింది. వచ్చే ఎన్నికల్లో తన వారసురాలిగా కుమార్తెను ఎన్నికల్లో నిలబెట్టే అంశంపై .. సీఎం తన వద్దకు పిలిపించుకుని ఆరా తీయడంలాంటి ఘటనలతో.. అధిష్టానంతో ఆయన అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. విజయనగరం మహారాజుల బిడ్డగా, నీతి నిజాయితీ కలిగిన నేతగా... ప్రతిపక్ష నేతలు సైతం ఆయన్ని గౌరవించే పరిస్థితి ఉండేది. అటువంటి నేతపై ఇప్పుడు చోటామోటా నాయకులు సైతం అదేపనిగా విమర్శలు, ఆరోపణలు గుప్పించే పరిస్థితి రావడం.. ఆయకు, పార్టీకి ప్రతికూలంగా మారింది.

06:36 - July 25, 2018

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఏపి విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. బిల్లులో పేర్కొన్న హామీల్లో 90 శాతం హామీలను కేంద్రం ఇప్పటికే నెరవేర్చిందని... మిగిలినవి కూడా పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. రైల్వే జోన్‌పై ప్రతికూలంగా నివేదిక వచ్చినా జోన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకూ 6754 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. పోలవరం ప్రాజెక్ట్‌ కోసం తొలి కేబినెట్‌ భేటీలోనే తెలంగాణకు చెందిన 7 ముంపు మండలాలను ఏపీలో కలిపడమే తమ చిత్తశుద్ధికి నిదర్శనమని హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాతో సమానంగా ప్రత్యేక ప్యాకేజీకి సిఎం చంద్రబాబు అంగీకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు వ్యతిరేకంగా ఉన్నాయని మంత్రి తెలిపారు.

ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వొద్దన్న 14వ ఆర్థిక సంఘం ఏపికి మాత్రం 42 శాతం కేంద్రం నిధులు ఇవ్వాలని సూచించినట్లు ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయెల్‌ అన్నారు. రెవెన్యూ లోటు కింద ఏపీకి ఐదేళ్లలో 22 వేల కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫారసు చేసిందన్నారు. ఏపీకి చేస్తున్న సాయానికి ధన్యవాదాలు తెలుపుతూ సిఎం చంద్రబాబు లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

విభజన చట్టంలోని హామీల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నత విద్యా సంస్థలను మంజూరు చేసినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. తిరుపతిలో ఐఐటి, ఐసిఈఆర్‌.... వైజాగ్‌లో ఐఐఎం, కర్నూల్‌లో ట్రిపుల్‌ ఐటిలు ఇప్పటికే నడుస్తున్నాయన్నారు. అనంతపూర్‌లో సెంట్రల్‌ యూనివర్సిటీని త్వరలోనే ప్రారంభిస్తామని... గిరిజన విశ్వవిద్యాలయానికి కూడా అప్రూవర్‌ లభించిదన్నారు. ఏపికి ప్రత్యేక హోదాపై కేంద్రం తన వైఖరిని వెల్లడించిన నేపథ్యంలో టిడిపి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాలి. 

19:36 - July 24, 2018

ఏపీ విభజన హామీల విషయంపై రాజ్యసభలో దాదాపు నాలుగు గంటలపాటు చర్చ కొనసాగింది. ఈ నేపథ్యంలో విభజన హామీలు నెరవేర్చటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. మరోపక్క 90 శాతం నెరవేర్చామనీ హామీలు నెరవేర్చామని అధికార బీజేపీ తరపున మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. విభజన హామీలు నెరవేర్చటంలో బీజేపీ ప్రభుత్వం విఫలం అయ్యిందనీ..తాము అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదాపైనే చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది.. ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీలపై పెద్దల సభలో నిందలు, నిష్టూరాలతో కొనసాగింది. ఇదే అంశంపై 10టీవీ చర్చ. ఈ చర్చలో కాంగ్రెస్ గంగాధర్,బీజేపీ పాండురంగ విఠల్,టీడీపీ నేత రామకృష్ణ ప్రసాద్, వైసీపీ గౌతంరెడ్డి పాల్గొన్నారు. ఈ చర్చపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

21:11 - July 23, 2018

విశాఖపట్టణం : వైసీసీ చేపట్టిన బంద్‌కు ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని కోరుతూ వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళలు నల్ల చీరలతో ధర్నా నిర్వహించారు. సీఎం చంద్రబాబు చేసిన మోసం ప్రజలందరికీ తెలియజేసేందుకే రేపు బంద్‌ చేపట్టామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్‌లో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారని మహిళలు తెలిపారు. 

21:04 - July 23, 2018

అనంతపురం : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఊమెన్‌ చాందీ చెప్పారు. రాహుల్‌ ప్రధాని అయిన వెంటనే హోదా ఫైలు పైనే తొలి సంతకం చేస్తారని చెప్పారు. అనంతపురంలో కాంగ్రెస్‌ అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమావేశం నిర్వహించిన చాందీ... హోదా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ చేసిన ఈ తీర్మానంపై విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - హోదా