హైదరాబాద్

15:33 - September 18, 2018

హైదరాబాద్ : నిరుద్యోగ యువతకు ఏపీ సర్కార్ శుభవార్త అందించింది. మెగా రిక్రూట్ మెంట్కు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 20 వేల 10 ఉద్యోగాల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎస్సీ, పోలీస్ శాఖ సహా వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు. డీఎస్సీ ద్వారా 9275 పైగా టీచర్ల నియామకం జరుగనుంది. గ్రూప్ 1లో 150, గ్రూప్ 2లో 250, గ్రూప్ 3లో 1670, పోలీసు ఎగ్జిక్యూటివ్ డిపార్ట్‌మెంట్ లో 3 వేల ఉద్యోగాలు, వైద్య శాఖలో 1604 ఖాళీలు, ఇతర ఖాళీలు 1636, పాలిటెక్నిక్ లో లెక్షరర్ పోస్టులు 310,  జూనియర్ లెక్షరర్ పోస్టులు 200 పోస్టులతోపాటు ఇతర శాఖల్లోఖాళీగా ఉన్నపోస్టులను భర్తీ చేయనున్నారు. 

 

13:58 - September 18, 2018

హైదరాబాద్ : విద్యుత్ సంస్థలో పని చేస్తున్నఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణకు అడ్డంకులు తొలగిపోయాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణపై వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించడాన్నిసవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంపై అపద్ధర్మసీఎం కేసీఆర్ హర్షం వక్తం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ ఇక రెగ్యులర్ ఉద్యోగులేనని సీఎండీ ప్రభాకర్ రావు ప్రకటించారు. 

 

12:05 - September 18, 2018

హైదరాబాద్: హైదరాబాద్‌లో డెంగ్యూ వ్యాధి విజృంభిస్తోంది. గతంలో ఒకరు మరణించగా.. సోమవారం మరో 52 ఏళ్ళ మహిళ చికిత్స పొందుతూ నగరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మరణించింది. ఈ సీజన్‌లో డెంగ్యూ మరణాల సంఖ్యం 11 కు చేరింది.

పహాడీషరీఫ్ ప్రాంతంలో నివసించే షహనాజ్ బేగం అనే విద్యార్థి నాలుగు రోజుల క్రితం జ్వరంతో దగ్గరలోని ఓ ఆసుపత్రిలో చేరింది. జ్వరం తీవ్రం కావడంతో ఆమెను ఓ కార్పొరేట్ అసుపత్రికి తరలించగా..రెండు రోజుల అనంతరం మరణించిందని బంధువులు తెలిపారు.

10:00 - September 18, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ ముమ్మరం చేస్తోంది. సాంకేతిక అంశాలపై అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు, అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

రాష్ర్టంలో ఎన్నికల ఏర్పాట్లలో వేగం పెంచారు ఎన్నికల ప్రధానాధికారి. సుప్రీం కోర్డు తీర్పు మేరకు ఈవీఎంలతోపాటు.. వివిప్యాట్ ను ఉపయోగించనున్నారు. జిల్లా కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ అధికారులతో ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ సమావేశం నిర్వహించారు. వివి ప్యాట్‌ వినియోగంపై  శిక్షణ ఇచ్చారు. 

 న్నికల ఏర్పాట్లపై అధ్యయనానికి కేంద్ర ఎన్నికల బృందం మరోసారి పర్యటించనుంది. దీనికి ముందు రాష్ర్ట ఎన్నికల అధికారులతో ఢిల్లీలో ఈసీ భేటీ కానున్నట్లు సమాచారం. మొత్తంగా ఒకటి, రెండు రోజుల్లో ఢిల్లీలో ఈసీ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా.. ఎన్నికలు ఎప్పుడన్నది తేలనుంది. పలు పార్టీలు ఓటర్లతో చేయించిన తీర్మాణాలపై ఈసీ స్పందించింది. బలవంతంగా తీర్మానాలు, ప్రతిజ్ఞలు చేయించినట్లు తమ  దృష్టికి వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరిస్తోంది. 

08:34 - September 18, 2018

హైదరాబాద్ : కేసీఆర్ ప్రకటించిన మొదటి జాబితాలో పేరు రాకపోవడంతో ఆశావశులు టీఆర్ ఎస్ పై తిరుగుబావుటా ఎగరవేశారు. టికెట్ ఆశించి భంగపడిన నేతలందరూ కేసీఆర్ పై భగ్గుమంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనకు దిగారు. కేసీఆర్ పై విమర్శనాస్త్రాశాలు సందిస్తున్నారు. జాబితాలో తమ పేరు ప్రకటించకపోవడంతో కొండా సురేఖ దంపతులు టీఆర్ ఎస్, కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అసమ్మతి నేతలను దారిలోకి తెచ్చుకునేపనిలో పడింది గులాబీపార్టీ. 105 నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకే  మరోసారి ఛాన్స్‌ ఇవ్వడంతో నేతల్లో అసంతృప్త జ్వాలలు రగులుకున్నాయి. చాలా చోట్ల నేతల అసమ్మతి తార స్థాయికి చేరుకుంది. ప్రచారపర్వం మొదలు పెట్టేలోపే అసమ్మతి నేతలను శాంతింపచేయాలని గులాబీపార్టీ పావులు కదుపుతోంది.
 
అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష పార్టీల కంటే ముందుగానే  మెజార్టీ అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ ఎస్ అధినేత కేసిఆర్......ఆ పరిణామాలను కూడా ఎదుర్కొంటున్నారు. పార్టీలో నిన్న మొన్నటి వరకు టికెట్లు ఆశించిన నేతలకు  స్థానాలు దక్కకపోవడంతో పార్టీ అగ్రనాయకత్వంపై  వారంతా  అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో స్వతంత్రంగా రంగంలో నిలిచేందుకు ఇప్పటి నుంచే  పావులు కదుపుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి కూడా  పరిస్థితి ఇదే విధంగా ఉంటే..... ఖచ్చితంగా బరిలో ఉంటామన్న సంకేతాలను   అసమ్మతి నేతలు పార్టీ  పెద్దలకు పంపుతున్నారు.

టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు....ఓ వైపు ప్రచారం నిర్వహిస్తూనే మరో వైపు అసమ్మతి నేతల నిరసనలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇవే పరిస్థితులు కొనసాగితే..... ఎన్నికల నాటికి ఇబ్బందులు తప్పవన్న   అంచనాతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగుతున్నారు. అసమ్మతి నేతలను బుజ్జగించే పనిని మంత్రి కేటిఆర్ కు ముఖ్యమంత్రి కేసిఆర్ అప్పగించారు. గత నాలుగైదు రోజులుగా క్యాంపు కార్యాలయంలో  మంత్రి కేటిఆర్ అసమ్మతి నేతలను హైదరాబాద్ పిలిపించుకుని బుజ్జగింపులు మొదలు పెట్టారు.  ఇప్పటికే చెన్నూరు నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే ఓదేలును దారిలోకి తెచ్చుకున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నా.....వారందరినీ ఏకం చేశారు. గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో కూడా ఉన్న అసంతృప్తులను  శాంతింప చేశారు. మంత్రి బుజ్జగింపులతో అసమ్మతి నేతలు కొంత వరకు చల్లబడుతున్నారు. మంత్రి కేటిఆర్ అసమ్మతి నేతలను బుజ్జగించే బాధ్యతలను తీసుకోవడంతో..... వచ్చే ఎన్నికల తర్వాత కేటిఆర్ మరింత కీలకం గా మారనున్నారన్న ప్రచారం కూడా  మొదలైంది.
 

16:16 - September 16, 2018

హైదరాబాద్ : సనత్ నగర్ లో ఈరోజు జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. 2002లో గుజరాత్ లో నరేంద్ర మోదీ ముందస్తు ఎన్నికలకు వెళ్లలేదా? అని ప్రశ్నించారు. 2004లో వాజ్ పేయి ముందస్తుకు వెళ్లలేదా? అని అడిగారు. మీరు చేస్తే తప్పు కాదు... మేము చేస్తే తప్పా? అని మండిపడ్డారు. 

బీజేపీ అంటేనే 'భారతీయ జూటా పార్టీ' అని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలనలో అచ్చేదిన్ కాకుండా చచ్చేదిన్ వచ్చిందని విమర్శించారు. బ్లాక్ మనీని వెలికి తీసి... ఎంత మంది పేదలకు పంచారని ప్రశ్నించారు. చేతికి చీపురు ఇచ్చి స్వచ్ఛభారత్ అనడం మినహా... మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు. బీజేపీ అధినేత పేరు అమిత్ షా కాదని, భ్రమిత్ షా అని దుయ్యబట్టారు. అమిత్ షా రోజుకొక రంగుల కల కంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కాపాడుకుంటే చాలని అన్నారు. ఒక్క కార్పొరేటర్ ను కూడా గెలిపించుకోలేకపోయిన బీజేపీ నేతలు... ఇప్పుడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ తోనే టీఆర్ఎస్ కు పోటీ అని తెలిపారు. కాగా ఈ సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, టీఆర్ఎస్ కొర్పొరేటర్లు హాజరయ్యారు.

16:14 - September 15, 2018

హైదరాబాద్ : నిర్భయలాంటి ఎన్ని చట్టాలొచ్చినా మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. అనునిత్యం ఆడపిల్లలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు చిన్నపిల్లలను సైతం వదలం లేదు. రోజు రోజుకూ మానవత్వం మంటగలిసి పోతోంది. హైదరాబాద్ లో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయినా ఓ కామపిశాచి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరంలోని ఆజాన్ ఇంటర్నేషన్ స్కూల్ లో ఐదేళ్ల బాలికపై స్కూల్ ఉద్యోగి జిలానీ అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. బాలికను నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. స్కూల్ ఎదుట బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. నిందితున్ని ఉరితీయాలంటూ ఆందోళన చేపట్టారు.  

 

21:18 - September 14, 2018

హైదరాబాద్ : ఆపరేషన్‌ గరుడ పేరుతో ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సినీనటుడు శివాజీ.. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు జారీ అయిన కోర్టు నోటీసుపై తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబుకు ధర్మాబాద్‌ కోర్టు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. ఏపీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా భారీ కుట్ర జరుగుతోందన్నారు. త్వరలో మరో రెండు నోటీసులు కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. నోటీసులకు భయపడి మహారాష్ట్ర వెళ్తే ఉచ్చులో దింపుతారని శివాజీ చెప్పారు. మహారాష్ట్ర వెళ్లడం మంచిదికాదన్నారు. ప్రైవేటు విమానాల్లో తిరగడం కూడా మంచిదికాదని చంద్రబాబుకు సూచించారు. 

 

19:29 - September 14, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) వేగవంతం చేసింది. రాష్ట్రంలోని 32,574 పోలింగ్ బూత్ లలో ఓట్ల జాబితాల పరిశీలనకు ఏర్పాట్లు పూర్తి చేసింది. శాంతిభద్రతల నిర్వహణపై సమీక్ష నిర్వహించింది. ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సివుందని సీఈవో రజత్ కుమార్ అన్నారు. శాంతిభద్రతల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో రూ.7.6 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈసారి ధన ప్రభావాన్నితగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 

 

22:59 - September 13, 2018

హైదరాబాద్ : బాబ్లీ ప్రాజెక్టు కేసులో ఏసీ సీఎం చంద్రబాబుకు మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈనెల 21న కోర్టు ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పట్లో చంద్రబాబుతో పాటు 15 మంది టీడీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. అయితే దీని వెనకాల కేంద్రప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలేమైన ఉన్నాయా అన్నఅనుమానం కలుగుతుంది. చంద్రబాబుకు కోర్టు నోటీసులు జారీ చేయడం హాస్యాస్పదంగా ఉందని ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఉన్నారు. బీజేపీ నేతల చర్యలు కొండనుతవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - హైదరాబాద్