హైకోర్టు

16:09 - November 20, 2018

కేరళ : సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని హామీ ఇచ్చిన కేరళ సర్కార్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. రాజ్యాంగబద్దంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలా? లేదా హైకోర్టు చీవాట్లకు తల వొగ్గాలో తెలీక కేరళ సర్కార్ మల్లగుల్లాలు పడుతోంది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం ఏమో గానీ కేరళ సర్కార్ కు సుప్రీంకోర్టు నిర్ణయం తలనొప్పిలా తయారయ్యింది. ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు..మరోవైపు స్థానికంగా తలెత్తుతున్న శబరిమల వివాదాలతో కేరళ సీఎం పినరాయి విజయన్ సర్కార్ కు ఇరుకునపడింది. 

Image result for sabarimalaనవంబర్ 19వ తేదీన ఆదివారం అర్థరాత్రి శబరిమల ఆలయంలో దాదాపు 70 మంది భక్తులను అరెస్ట్ చేయించింది. దీంతో మరోసారి కేరళ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు మొదలయ్యాయి. తిరువనంతపురంలోని కేరళ సీఎం పినరయి విజయన్ నివాసంతోపాటు అలప్పూజ, కొచ్చి, అలువా, కోజికోడ్ తదితర ప్రాంతాల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, హిందూ సంఘాలు ఆదివారం భారీ ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో, అదుపులోకి తీసుకున్నవారిని విడుదల చేయాలంటూ నిరసన తెలపడమే కాదు, ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారించిన కేరళ హైకోర్టు పినరయి ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. ప్రశాంతతకు మారుపేరైన శబరిమల అయ్యప్ప ఆలయ పరిసరాలను ప్రభుత్వం రణరంగంగా మార్చివేసిందని అభిప్రాయపడింది. 

Image result for sabarimalaస్వామి దర్శనానికి వస్తున్న భక్తులను బందిపోట్లలా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం, ఆలయం వద్ద 144 సెక్షన్ అవసరమేంటని నిలదీసింది. వారిపై వాటర్ క్యాన్లను ప్రయోగించడం ఏంటని ప్రశ్నించిన న్యాయమూర్తులు, యాత్రికులకు ప్రత్యేకించిన ప్రదేశాల్లో పోలీసులు వారి శిబిరాలకు మాత్రమే పరిమితం కావాలని సూచించింది. భక్తుల అరెస్ట్‌పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన న్యాయస్థానం, నెయ్యాభిషేకం టికెట్‌లను కొనుగోలు చేసిన భక్తులను రాత్రిపూట సన్నిధానంలో ఉండనివ్వాల్సిందేనని స్పష్టం చేసింది. సన్నిధానం వద్ద నియమించిన పోలీసుల అనుభవానికి సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆదేశించింది. 

Image result for sabarimalaమరోవైపు, ఈ వ్యవహారంపై స్పందించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆందోళనకారులంతా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలేనని, వారు కావాలనే ఆలయం వద్దకు వచ్చి ఉద్రిక్తతలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. భక్తులంటే తమకు ఎంతో గౌరవం ఉందని వ్యాఖ్యానించారు. శబరిమలలో ఉద్రిక్తతలను సృష్టించడమే వారి ప్రధాన లక్ష్యమని, గతంలో శ్రీచిత్ర తిరునాళ్ ఉత్సవం సందర్భంలోనూ అయ్యప్ప సన్నిధానంలో ఇలాగే వ్యవహరించారని అన్నారు. నెయ్యాభిషేకం టిక్కెట్లు కొనుగోలుచేసిన భక్తులను సన్నిధానం నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు హుకుం జారీచేయడంతో భక్తులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేయడం వివాదానికి కారణమైంది. 
 

18:55 - November 16, 2018

హైదరాబాద్ : అగ్రిగోల్డ్‌ కేసు కొత్త మలుపు తిరిగింది. వేలాదిమంది బాధితులకు ఇదొక సరికొత్త షాక్ గా భావించవచ్చు. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో హాయ్‌లాండ్‌ ఆస్తులపై హైకోర్టు అగ్రిగోల్డ్‌ కంపెనీ అభిప్రాయం తీసుకుంది. దీంతో హాయ్‌లాండ్‌ ఆస్తులు అగ్రిగోల్డ్‌వి కావని హాయ్‌లాండ్‌ ఎండీ ఆలూరి వెంకటేశ్వరరావు హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈ విషయాన్ని అగ్రిగోల్డ్‌ యాజమాన్యం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఆస్తులు వేలం వేసినప్పటి నుంచి ఎందుకు స్పందించలేదని హైకోర్టు అగ్రిగోల్డ్ కంపెనీని నిలదీసింది. హాయ్‌లాండ్‌ ఆస్తులపై స్పెషల్‌ సిట్‌ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని ఏపీ సీఐడీని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్  23కు వాయిదా వేసింది. 

Image result for hailand and agri gold
కాగా గతంలోనే అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కొనుగోలు చేస్తామని జీఎస్సెల్ గ్రూప్ ముందుకొచ్చింది.. తర్వాత మళ్లీ వెనక్కు తగ్గింది. అయితే ఉన్నట్టుండి మళ్లీ కొనటానికి ఆసక్తి చూపించడంతో మరింత ఆసక్తిగా మారింది. అంతేకాదు గతంలో జీఎస్సెల్ గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా వెనక్కు తీసుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. 20 వేల ఎకరాల అగ్రిగోల్డ్‌ ఆస్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి బాధితులకు న్యాయం చేయాలని అటు బాధితులు, ఇటు ప్రజాసంఘాలు, వామపక్షపార్టీలు డిమాండ్ చేస్తున్నారు.

12:06 - November 1, 2018

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ హత్యాయత్నం కేసు మలుపులు తిరుగుతోంది. విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో జగన్ పై శ్రీనివాస్ అనే వ్యక్తి పందెం కోళ్లకు కట్టే కత్తితో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అనంతరం పోలీసు కస్టడీలో ఉన్న శ్రీనివాస్ పలు విషయాలు తెలియచేస్తున్నాడు. ఇదిలా ఉంటే తనపై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి జగన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం కోర్టు విచారణ జరిపింది. జగన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో కుట్ర దాగి ఉందని, కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. దీనిని ప్రభుత్వ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతికంగా జరుగుతోందని లాయర్ కోర్టుకు తెలిపారు. దీనితో ఇరువురి వాదనలు విన్న కోర్టు మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు దాడికి సంబంధించి వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, అరుణ్ కుమార్ లు మరో రెండు పిటిషన్లు వేశారు. ఈ మూడు పిటిషన్లను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

15:59 - October 31, 2018

ఢిల్లీ: హ‌సిమ్‌పురా ఊచ‌కోత కేసులో 16 మంది పోలీసుల‌కు ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదు శిక్ష‌ను ఖ‌రారు చేసింది. 1987లో హ‌సిమ్‌పురా ఊచ‌కోత ఘ‌ట‌న చోటుచేసుకుంది. గతంలో వీరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపారేస్తూ తాజాగా ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మొత్తం 16 మంది అధికారులకు జీవిత ఖైదు విధిస్తూ ఢిల్లీ హై కోర్టు నేడు సంచలన తీర్పు వెల్లడించింది.

Breaking News : 1987 నాటి సామూహిక హత్యల కేసులో 16 మంది అధికారులకు జీవిత ఖైదుజ‌స్టిస్ ముర‌ళీధ‌ర్‌, వినోద్ గోయ‌ల్‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఆ తీర్పును ర‌ద్దు చేస్తు  ఈ తీర్పును వెల్లడించింది. కొంతమందిని లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడుల్లో మైనారిటిలు ఎందరో ప్రాణాలు కోల్పోయారని, బాధితుల కుటుంబాలకు న్యాయం జరగడానికి 31 ఏళ్లు పట్టిందని ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈమేరకు తాజాగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్విటర్ ద్వారా ఈ వార్తను వెల్లడించింది. కాగా ఆ ఊచ‌కోత‌లో 42 మంది మైనార్టీ వ‌ర్గీయులు చ‌నిపోయిన విషయం తెలిసిందే. 
ఢిల్లీ హైకోర్టు తీర్పుపై బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తంచేశాయి. 31 ఏళ్ల పోరాటం అనంతరం ఎట్టకేలకు తమకు న్యాయం జరిగిందని, దోషులకు శిక్ష పడిందని కోర్టు వెలుపల ఈ తీర్పు కోసం వేచిచూస్తున్న పలువురు బాధితులు అభిప్రాయపడ్డారు.   

Related imageకాగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సామూహిక హత్యలపై సెప్టెంబర్ 24న సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసిన సుప్రీంకోర్టు సామూహిక హత్యలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అన్ని రాష్ట్రాలు తెలియజేయాలంటూ వారం రోజుల సమయం ఇచ్చింది. ఆ హత్యలను ఆపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్పందించాలంటూ సెప్టెంబర్ 13వరకు గడువు ఇచ్చింది. ఆదేశాలను స్పందించని ఆయా రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీలకు సమన్లు జారీ చేసింది.

Image result for Massacre in hasimpuraసామూహిక హత్యల నివారణకు మంత్రులతో కమిటీ వేశామని ... దానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చేందుకు సాధ్యసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని చెప్పినట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం ఇదివరకే తెలిపింది. అయితే సామూహిక హత్యలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో 11 రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు తెలిపాయి. పెరుగుతున్న సామూహిక హత్యలను సీరియస్‌గా పరిగణించాలని కేంద్రం ఇలాంటి ఘటనలను ఉక్కుపాదంతో అణిచివేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు జూలై 17న సూచించింది. కేంద్రంపైనే భారం వేసి రాష్ట్రాలు తప్పించుకోవాలని చూడటం సరికాదని సుప్రీం తెలిపింది. ఈ క్రమంలోనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారో తెలపాల్సిందిగా కోరింది. దీనిపై నివేదిక తయారు చేసి కోర్టుకు సమర్పించాల్సిందిగా సూచించింది. ఇదిలా ఉంటే సామూమిక హత్యలకు పాల్పడే వారికి మరణ శిక్ష విధించేలా కేంద్రం త్వరలో చట్టం తీసుకురానుందని జూలైలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ అహిర్ తెలిపారు. ఈ నేపథ్యంలో దాదాపు 31 ఏళ్లకు హంసిరా మారణకాండ కేసులో ఢిల్లీ హైకోర్ట్ సంచలన తీర్పునివ్వంతో బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి.

22:26 - October 26, 2018

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ యాజమాన్యానికి హైకోర్టులో చుక్కెదురైంది. అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రతిపాదనను కోర్టు తిరస్కరించింది. 2022 వరకూ గడువు ఇస్తే రూ. 8500 కోట్లు చెల్లించేందుకు సిద్ధమనే అగ్రిగోల్డ్ ప్రతిపాదనను హైకోర్టు తిరస్కరించింది. శుక్రవారం అగ్రిగోల్డ్ కేసుపై హైకోర్టు విచారణ జరిపింది. హాయ్‌ల్యాండ్ విలువ రూ.550 కోట్లని కోర్టు నిర్ణయించింది. కోర్టు తదుపరి విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది.

ఏపీలో ఉన్న 83 అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను ఏపీ సీఐడీ సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించగా.. తెలంగాణలో ఉన్న 195 అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను తెలంగాణ సీఐడీ కోర్టుకు సమర్పించింది. విజయవాడలో ఉన్న కార్పొరేట్ కార్యాలయ భవనాన్ని విక్రయించగా వచ్చిన రూ.11 కోట్లను కొనుగోలుదారులు కోర్టులో డిపాజిట్ చేశారు.

 

16:02 - October 26, 2018

హైదరాబాద్ : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై హైకోర్టులో రెండు రిట్ పిటిషన్ లు దాఖలు అయ్యాయి. వైవీ సుబ్బారెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని...థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ పై సోమవారం విచారణ జరిపై అవకాశం ఉంది. మరోవైపు జగన్ కు సంఘీభావంగా హైకోర్టులో న్యాయవాదులు భారీ ర్యాలీ నిర్వహించారు. జగన్ పై జరిగిన దాడిపై సీబీఐ విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. జగన్ కు జడ్ ప్లస్ క్యాటగిరీ సెక్యూరిటీ కల్పించాలని పేర్కొన్నారు. 

 

11:09 - October 25, 2018

తమిళనాడు : తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ప్రత్యేకంగా వుంటాయి. దివంగత సీఎం జయలలిత మరణం తరువాత పలు కీలక పరిణామాల మధ్య ప్రభుత్వం ఏర్పడి ఒడిదుడుకుల మధ్య కొనసాగుతోంది. అధికారం కోసం నేతలు చేస్తున్న జిమ్మిక్కులతో తమిళనాటు ప్రభుత్వం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో కోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. Image result for sasikala and jayalalitha

స్నేహితురాలు జయలలిత మరణం తరువాత అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పలు వ్యూహాలు పన్నిన శశికళ ప్రస్తుతం జైలు ఊచలు లెక్కిస్తున్నారు. అయినా జైలు నుండి రాజకీయాలు నడిపి దినకరన్ తో పలు జిమ్మిక్కులు చేశారు. అయినా న్యాయస్థానం నుండి షాక్ ఎదుర్కోక తప్పలేదు. 

Image result for sasikala and dinakaranశశికళ బంధువు..డీఎంకే బహిష్కృత టీటీవీ దినకరన్ కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. తమిళనాడులో అనర్హతను ఎదుర్కొంటున్న 18 మందిపై న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఆ 18మంది ఎమ్మెల్యేలు అనర్హులేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అనర్హత వేటును సమర్థించిన న్యాయస్థానం, ఎమ్మెల్యేలంతా పదవీచ్యుతులేనని తెలిపింది. ఈ తీర్పు ముఖ్యమంత్రి పళనిస్వామికి పెద్ద ఊరటే. 
కాగా, ఈ 18 మంది ఎమ్మెల్యేలుగా ఉన్న స్థానాల్లో సాధ్యమైనంత త్వరలోనే ఎన్నికలు జరిపిస్తామని తమిళనాడు మంత్రి ఒకరు వెల్లడించారు. అనర్హత చెల్లబోదని తీర్పు వస్తుందన్న ఉద్దేశంతో ఉన్న దినకరన్, తన వర్గం ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించిన సంగతి తెలిసిందే. మరి త్వరలో తమిళనాట కూడా ఉప ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది న్యాయంస్థానం ఇచ్చిన తీర్పును బట్టి చూస్తే. కాగా మరి  దినకర్ తన ఎమ్మెల్యేలతో దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా? లేక ఎన్నికలకు వెళతారా? అనే విషయం కోసం వేచి చూడాల్సి వుంది. 
 

 
11:43 - October 24, 2018

ఢిల్లీ : ఎలాంటి అనుమతులు లేకుండా డిపాజిట్లు సేకరించిన నౌహీరాను 10 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. హీరా గ్రూప్ అధినేత నౌహీరాను కస్టడీకి అనుమతిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్...పోలీసుల తరపున వాదనలను వినిపించారు. తమ క్లయింట్‌పై ఉద్దేశ్య పూర్వకంగానే కక్ష్యతో కేసులు నమోదు చేశారని... పోలీసుల కస్టడీకి అనుమతి ఇవ్వకుండా నౌహీరాకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపున న్యాయవాది కోర్టును కోరారు. డిపాజిట్ దారులకు నష్టం కలుగకుండా చూసేందుకు 25 కోట్ల రూపాయలు కోర్టులో డిపాజిట్ చేస్తామని నివేదించారు. ఇరు వర్గాల వాదనలను విన్న కోర్టు తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇప్పటికే ఇండియాతో పాటు గల్ఫ్ దేశాల్లో దాదాపు 160 బ్యాంకు అకౌంట్లను హీరా సంస్థ క‌లిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయా ఖాతాల్లో హీరా గ్రూప్ జరిపిన లావాదేవిల ఏ విధంగా ఉన్నాయి ? ఆ ఖాతాలు చూసిన తర్వాత ప్రజల దగ్గరి నుంచి ఎంత మెుత్తంలో డబ్బులు వసూలు చేశారన్న దానిపై ఆమెను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. 

 

20:23 - October 23, 2018

హైదరాబాద్ : యాదాద్రిలో మహిళలు, చిన్నారులతో వ్యభిచారం కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. చిన్నారులపై ఆక్సిటోసిన్ ఇంజక్షన్ వాడటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంజక్షన్ వాడకం వల్ల కలిగే అనర్దాలపై ధర్మాసనం వివరణ కోరింది. యాదాద్రిలో రెస్క్యూ అయిన చిన్నారులకు మరోసారి ఉస్మానియా వైద్యులచే వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఆపరేషన్ ముస్కాన్‌లో ఎలాంటి చర్యలు చేపట్టారో చెప్పాలని ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. 

యాదాద్రి డీసీపీ రామచంద్రారెడ్డి, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు హైకోర్టుకు వివరణ ఇచ్చారు. వ్యభిచార ముఠాలకు చెందిన 30 మందిపై కేసులు నమోదు చేశామని యాదాద్రి డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు. పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి, జైలుకు పంపామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

 

15:44 - October 23, 2018

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులోఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగిస్తూ ప్రభుత్వం ఈఏడాది ఆగస్టు 1న జారీ చేసిన జీవో నెంబరు 90ని  హైకోర్టు మంగళవారం కొట్టి వేసింది. వచ్చే 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్పెషల్ ఆఫీసర్ల పాలనను వ్యతిరేకిస్తూ మాజీ సర్పంచ్ లు  దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు ఈమేరకు తీర్పు ఇచ్చింది. స్పెషల్ ఆఫీసర్లుగా ప్రభుత్వం దిగువ కేడర్ ఉద్యోగులను నియమిస్తోందని, వారికి పాలనా అనుభవం లేకపోవటంవల్ల  గ్రామాల్లో  అభివృధ్ది కుంటుపడుతోందని, మాజీ సర్పంచ్ లు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాల పరిమితి ముగిసిన పంచాయతీలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్  ఆఫీసర్ల పాలనతో ఎంతకాలం పాలన సాగిస్తారని  వారు పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై వాదోపవాదాలు విన్న హైకోర్టు  వచ్చే 90 రోజుల్లోగా రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది. 

Pages

Don't Miss

Subscribe to RSS - హైకోర్టు