సోనియాగాంధీ

14:30 - May 23, 2018

కర్ణాటక : రాష్ట్రంలో కొత్త సర్కార్ కొలువుదీరనుంది. జేడీఎస్ అధినేత కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమయ్యింది.కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య ఎట్టకేలకు కొలువుల పంపకాల ఒప్పందాలు కుదిరాయి. కాంగ్రెస్ కు 22, జేడీఎస్ కు 12 పదవులకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. సీఎంగా కుమారస్వామి,డిప్యూటీ సీఎంగా జి.పరమేశ్వర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో బల నిరూపణ తర్వాతనే శాఖల కేటాయింపు వుంటుంది. మే 25న స్వీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా వుంటుంది. స్పీకర్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్.రమేశ్ కుమార్, డిప్యూటీ స్పీకర్ పదవి జేడీఎస్ కు దక్కనుంది. ఈ క్రమంలో కుమారస్వామి ప్రమాణస్వీకారానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. తాను సీఎం అయ్యేందుకు కారణమయిన కాంగ్రెస్ అధినేతలు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ,ఉపాధ్యక్షురాలు సోనియాగాంధీలను కుమారస్వామీ స్వయంగా ఢిల్లీ వెళ్లిన ఆహ్వానించారు. కుమరస్వామి ఆహ్వానాన్ని మన్నించిన రాహుల్, సోనియాలు ఇప్పటకే బెంగళూరు చేరుకోనున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బెంగళూరు చేరుకున్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ సీఎం పినరాయి విజయన్, యూపీ మాజీ సీఎం మాయావతి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వంటి బీజేపీ ఏతర సీఎంలు, పార్టీ అధినేతలతోపాటు ప్రముఖులంతా కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నారు.

13:41 - May 21, 2018

ఢిల్లీ : భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ 27వ వర్థంతి సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీలు రాజీవ్‌ గాంధీ స్మారకస్థూపం వద్ద నివాళులు అర్పించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా రాజీవ్‌ గాంధీకి నివాళులర్పించారు. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ రాహుల్‌ ఓ ట్వీట్‌ పెట్టారు. రాహుల్‌ గాంధీ తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. ద్వేషాన్ని నమ్ముకున్నవారు జైల్లో ఉన్నట్లేనని మా నాన్న చెప్పారు. అందర్నీ ప్రేమించాలని, ప్రతి ఒక్కరిని గౌరవించాలని నాన్న నాకు నేర్పినందుకు ఆయనకు ధన్యవాదాలంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. 1991, మే 21న తమిళనాడులోని పెరంబూరులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రాజీవ్‌గాంధీని ఎల్‌టీటీఈ హత్య చేసింది. రాజీవ్‌ గాంధీ వర్థంతి నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ అధినేత కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారానికి వాయిదా పడ్డ విషయం తెలిసిందే.

18:35 - March 30, 2018

కర్నూలు : ముఖ్యమంత్రి చంద్రబాబు.. కాంగ్రెస్‌ నాయకురాలు సోనియాగాంధీకి కోవర్టుగా మారారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు  విమర్శించారు. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సోనియాతో రహస్య మంతనాలు జరుపుతున్నారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూసి పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలను ముందుకు రావడంలేదన్నారు. 

17:37 - March 17, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మోది ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోది హయాంలో చోటుచేసుకున్న అవినీతిని కాంగ్రెస్‌ బయటపెడుతుందని సోనియా స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో మోది 'సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌, నేను తినను...ఇతరులను తిననివ్వను' లాంటి హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. రాజ్యాంగ సంస్థలపై దాడులు, పార్లమెంట్‌ను నిర్లక్ష్యం చేయడం, మతపరంగా దేశాన్ని విభజించడం, విపక్షాలను టార్గెట్‌ చేసే మోది ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పోరాటం కొనసాగుతుందని సోనియా పేర్కొన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను కేవలం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే నెరవేర్చగలదని సోనియాగాంధీ అన్నారు. 

17:33 - March 13, 2018

ఢిల్లీ : బిజెపికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు రాత్రి విపక్షాలకు విందు సమావేశం ఏర్పాటు చేశారు. డిఎంకె, తృణమూల్‌, ఆర్జేడి, ఎస్పీ, వామపక్షాలతో పాటు యూపీఏ భాగస్వామ్య పక్షాలను ఆహ్వానించారు. పిఎన్‌బి స్కాం, రైతుల సమస్యలు, రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందంలో అక్రమాలు తదితర అంశాలపై మోది ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ఓ వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది.

 

20:53 - December 16, 2017

ఢిల్లీ : వచ్చే ఎన్నికల్లో ప్రియాంక గాంధీ రాయబరేలి లోక్‌సభ నుంచి పోటీ చేస్తారని మీడియాలో కథనాలు హల్‌ చల్‌ చేశాయి. దీనిపై ప్రియాంకా గాంధీ స్పందించారు. రాయబరేలీ నుంచి తాను పోటీ చేయబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ప్రియాంక స్పష్టం చేశారు. ఆ స్థానంలో తన తల్లి సోనియా గాంధీనే పోటీ చేస్తారని చెప్పారు. తాను చూసిన శక్తిమంతమైన మహిళల్లో సోనియా గాంధీ ఒకరని...ఆమె సేవలు పార్టీకి చాలా అవసరమని పేర్కొన్నారు. మరోవైపు రాహుల్‌ గాంధీ పట్టాభిషేకానికి  ప్రియాంకా గాంధీ తన భర్త రాబర్ట్‌ వాద్రాతో కలిసి హాజరయ్యారు. ప్రియాంకా గాంధీ అందర్నీ పలకరిస్తూ సందడి చేశారు.

 

17:58 - December 9, 2017
21:48 - October 27, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. సిమ్లా పర్యటనలో ఉన్న సోనియా హుటాహుటిన అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకొని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు.  ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 70 ఏళ్ల సోనియా గాంధీకి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత ఏడాది సోనియాగాంధీ అమెరికా వెళ్లి చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని త్వరలోనే పార్టీ పగ్గాలను స్వీకరిస్తారని సోనియా ఇదివరకే ప్రకటించారు.

 

20:28 - July 6, 2017

హైదరాబాద్ : సోనియాగాంధీపై వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ సీనియర్ నేత వీహెచ్‌ తీవ్రంగా ఖండించారు. భూమన వ్యాఖ్యలను జగన్‌ ఖండించి.. సోనియాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు. జగన్‌పై సీబీఐ ఎంక్వయిరీ వేయాల్సిన అవసరం సోనియాగాంధీకి ఏమి అవసరమని వీహెచ్‌ ప్రశ్నించారు. 

 

21:24 - June 22, 2017

ఢిల్లీ: అధికార, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధులు ఖరారయ్యారు. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ను బరిలో దింపుతున్నట్టు ప్రకటించారు. ఎన్డీయే తరుపున బీహార్‌ గవర్నర్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును బీజేపీ ముందుగానే ప్రకటించింది. ఎన్డీయే అభ్యర్థిని ప్రకటించిన నాలుగు రోజుల తర్వాత ప్రతిపక్షాలు తమ అభ్యర్థిని ప్రకటించాయి. రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థుల కూడా దళితులే.

ప్రకాశ్‌ అంబేద్కర్‌, మీరాకుమార్‌

ఢిల్లీలోని పార్లమెంటు లైబ్రరీలో సమావేశమైన 16 ప్రతిపక్షాలు.. అంబేద్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేద్కర్‌, మీరాకుమార్‌, కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, గాంధీ మనవడు గోపాలకృష్ణగాంధీ పేర్లను పరిశీలించాయి. చివరికి మీరాకుమార్‌ అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం కుదరడంతో ఈమె పేరును ప్రకటించాయి.

వచ్చే నెల 17న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌

వచ్చే నెల 17న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ జరుగుతుంది. జులై 20 ఓట్లు లెక్కిస్తారు. విపక్షాల అభ్యర్థిగా ఖరారైన మీరాకుమార్‌ ఈనెల 27 లేదా 28 తేదీల్లో ఏదో ఒకరోజు నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. నామినేషన్‌ పత్రాలపై సంతకాల కార్యక్రమాన్ని కూడా విపక్షాలు ప్రారంభించాయి. బీహార్‌కు చెందిన మీరాకుమార్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంలో సీపీఎం కీలక పాత్ర పోషించింది.

1945 మార్చి 31న జన్మించిన మీరాకుమార్‌

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా బరిలో దిగుతున్న మీరాకుమార్‌ 1945 మార్చి 31న జన్మించారు. మాజీ ఉపప్రధాని జగ్‌జీవన్‌రామ్‌ కుమార్తె. మీరాకుమార్‌ డెహ్రాడూన్‌, జైపూర్‌లో పాఠశాల విద్యాబ్యాసం చేశారు. బసస్థలి విద్యాపీఠంలో కొద్దికాలం పాటు చదివారు. ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఇంద్రప్రస్థ కాలేజీ నుంచి ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. ముందుగా న్యాయవాదిగా పనిచేసిన మీరాకుమార్‌, ఆతర్వాత యూపీఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసి 1970లో IFSకు సెలక్ట్‌ అయ్యారు. ఇండియన్‌ ఫారెన్‌ సర్వీసులో దౌత్యవేత్తగా పనిచేశారు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామాచేసి రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌ నుంచి ఎన్నికయ్యారు. ఢిల్లీలోని కరోల్‌బాగ్‌ నుంచి మూడుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 1999 పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో ససారం నుంచి ఓటమి

ఆ తర్వాత 2004, 2009 పార్లమెంటు ఎన్నికల్లో బీహార్‌లోని ససారం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ససారం నుంచి ఓడిపోయారు. 2004-2009 మధ్య ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ, పర్యావరణ శాఖల మంత్రిగా పని చేశారు. 2009 జూన్‌ 4 నుంచి 2014 మే 18 వరకు లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు. లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన మొదటి మహిళ మీరాకుమార్‌.

మిగిలిన పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు

మీరాకుమార్‌ అభ్యర్థిత్వానికి మిగిలిన పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. ఎన్డీయే లౌకిక అభ్యర్థిని ప్రకటిస్తుందని ఆశించామని, ఇందుకు విరుద్ధంగా జరగడంతో ప్రతిపక్షాల తరుపున అభ్యర్థిని నిలబెడుతున్నట్టు వామపక్షాలు చెబుతున్నాయి. ప్రతిపక్షాల సమావేశానికి బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జనతాదళ్‌ (యూ) డుమ్మాకెట్టింది. నితీశ్‌ బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు ప్రకటించారు. అయితే బీహార్‌ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆర్జేడీ మాత్రం మీరాకుమార్‌కు మద్దతు ఇస్తోంది. విపక్షాల సమావేశంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - సోనియాగాంధీ