సైరా

12:00 - September 19, 2018

మెగాస్టార్ చిరంజీవితో ఒక్క సినిమా తీయాలని...ఆ సినిమాలో చిరు పక్కన నటించాలని...దర్శక, హీరోయిన్లు భావిస్తుంటారు. కానీ ఆ అవకాశాలు కొంతమందికే దక్కుతుంటాయి. 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన చిరు ప్రస్తుతం 151 సినిమాలో నటిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ‘సైరా నరసింహారెడ్డి’ పాత్రలో చిరు నటిస్తున్నాడు. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో చిత్రం రూపొందుతోంది. ఇతర వుడ్ లలో ఉన్న హీరోలు నటిస్తుండడం విశేషం. 

త్వరలో జార్జియాలో షూటింగ్ జరుగనుందని...దాదాపు 40 రోజుల పాటు యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఈ యుద్ధ సన్నివేశాల కోసం సుమారు రూ.50కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే చిరంజీవితో సినిమా తీయాలని కొరటాల అనుకుంటున్నారు. కేవలం చిరంజీవి కోసమే మంచి సామాజిక సందేశం ఉన్న కథను కూడా సిద్ధం చేశారంట. వచ్చే ఏడాది మార్చిలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు టాలీవుడ్ టాక్. 'భరత్‌ అనే నేను'తో మంచి విజయాన్నికొరటాల అందుకున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో చిత్రం స్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

10:36 - September 15, 2018

భారీ బడ్జెట్ తో .. భారీ కాస్టింగ్ తో మెగా స్టార్ హీరోగా వస్తున్న మూవీ సైరా నరసింహారెడ్డి.. మెగా పవర్ స్టార్ నిర్మిస్తున్న ఈ మూవీలో మెగా డాటర్ కూడా ఓ రోల్ చేయబోతుందట. మెగాస్టార్ చిరంజీవి భారీ బడ్జెట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్టార్ కాస్టింగ్ నటిస్తున్న మూవీ సైరాలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి లాంటి అదర్ లాంగ్వేజ్ స్టార్ యాక్టర్స్ అందరూ కనిపించబోతున్నారు. మెగా తనయుడు రాంచరణ్  నిర్మిస్తున్నఈ మూవీలో మరో మోగా ఫ్యామిలీ స్టార్ జాయిన్ అవ్వబోతున్నట్టు టాక్.

రీసెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మెగా డాటర్ నిహారిక సైరాలో ఓ క్యారక్టర్ లో కనిపించబోతుందట. సైరాలో ఓ కథాకళి డాన్సర్ క్యారక్టర్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీలో నిహారిక పదినిమిషాల పాత్ర చేయనున్నరట. ఈ క్యారక్టర్ కోసం స్పెషల్ గా నిహారిక కథకళిలో ట్రైనింగ్ తీసుకుంటోందట. పెద్ద పెద్ద స్టార్ యాక్టర్స్ నటిస్తున్నఈ మూవీలో నిహారిక కూడా జాయిన్ అవ్వబోతున్నట్టు టాలీవుడ్ టాక్.

‘ఒక మనసు’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన నిహారికా కొణిదెల... అంతకు ముందు కొన్ని వెబ్ సిరీస్ లలో కనిపించింది. ఆ తరువాత సుమంత్ అశ్విన్ కాంబోలో ‘హ్యాపీ వెడ్డింగ్’ చేసింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వకపోయినా నిహారిక నటనకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో హీరోయిన్ గా కొణిదెల వారి వారసురాలు సెట్ అయినట్లే అని చెప్పోచ్చు.

10:56 - September 12, 2018

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రంపై ఓ వార్త సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ‘సైరా’ సినిమాను నిషేధిస్తారనే వార్త కలకలం రేపుతోంది. తెలుగు సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో ఇతర భాష నటీనటులు కూడా నటిస్తున్నారు. శాండల్‌వుడ్ కు సంబంధించిన స్టార్ హీరో సుదీప్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఓ టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘సైరా నరసింహారెడ్డి' సినిమాపై నిషేధం విధించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.  భారీ బడ్జెట్‌తో తెరకెక్కే తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల డబ్బింగ్ వెర్షన్ ని కన్నడలో విడుదల చేయాలని నిషేధించాలని అక్కడ సినీ పరిశ్రమపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందంట. మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించే వరకు తెలియదు. 

16:02 - August 20, 2018

మెగాస్టార్ 'చిరంజీవి'...ఆయన తాజా చిత్రం కోసం అభిమానులతో పాటు ఇతరులు ఎదురు చూస్తున్నారు. చాలా కాలం తరువాత 150 సినిమా 'ఖైదీ నెంబర్ 150' ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం 151సినిమాకు చాలా రోజుల గ్యాప్ తీసుకున్నారు. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత చరిత్ర ఆధారంగా 'సైరా నరసింహారెడ్డి' చిత్రం తెరకెక్కుతోంది. 'కొణిదెల ప్రొడక్షన్స్' పతాకంపై మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'సురేందర్ రెడ్డి' దర్శకత్వం వహిస్తుండగా.. 'నయనతార' 'చిరు' జోడీ కడుతోంది. బాలీవుడ్ నుండి 'అమితాబ్ బచ్చన్', కోలీవుడ్ నుండి 'విజయ్ సేతుపతి', శాండిల్ ఉడ్ నుండి 'కిచ్చా సుదీప్'లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేగాకుండా నటిస్తుండగా.. 'జగపతిబాబు' కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్.

ఇదిలా ఉంటే ఆగస్టు 22వ తేదీ 'చిరంజీవి' జన్మదినం సందర్భంగా 'సైరా' సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయబోతోంది. ఆగస్టు 15వ తేదీన ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆగష్టు 21 ఉదయం 11:30 గంటలకు 'సైరా' సందడి చేయనుంది. 

14:31 - August 2, 2018

మోగా స్టార్ రీఎంట్రోలో రెండవ సినిమా అయిన 'సైరా' లో హేమా హేమీ నటులు నటిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నిర్మాణంలో వస్తున్న సైరాలో బిగ్గెస్ట్ స్టార్స్ నటిస్తున్నారు.

బిగ్గెస్ట్ స్టార్లతో సైరా..
అగ్రహీరోయిన్ గా వెలుగొందుతున్న నయనతార కథానాయికగా నటిస్తుండగా, ముఖ్య పాత్రల్లో అమితాబ్..జగపతిబాబు..సుదీప్..విజయ్ సేతుపతి నటిస్తున్నారు. వీరి వీరి పాత్రలు ఇప్పటకే ఖరారైనట్లుగా తెలుస్తున్నా..తమిళ నటుడు విజయ్ సేతుపతి పాత్రపై ఉత్కంఠ నెలకొంది. మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయిన విజయ్ సేతుపతికి తమిళనాట మంచి క్రేజ్ వుంది. నటుడిగా, నిర్మాతగా, పాటల రచయితగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.
'ఓబయ్య' గా విజయ్ సేతుపతి..
ఈ సినిమాలో ఆయన 'ఓబయ్య' అనే తమిళుడి పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఆంగ్లేయులతో పోరాట సమయంలో తెలుగువారిని .. తమిళులని ఏకం చేయడానికి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ప్రయత్నంలో భాగంగా సైరా కుడిభుజంగా ఓబయ్య వ్యవహరిస్తాడని సినీ పరిశ్రమ సమాచారం. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ పాత్రను తీర్చిదిద్దారని..విజయ్ సేతుపతి కెరియర్లో ఇది చెప్పుకోదగిన పాత్రగా నిలిచిపోతుందని సమాచారం. 

14:18 - August 2, 2018

రీ ఎంట్రీతో వచ్చి మెగా హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి తన రెండో సినిమాను బయోపిక్ తో వస్తున్న విషయం తెలిసందే. బ్రిటీష్ వారికి ముచ్చెమటలు పట్టించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో 'సైరా' చిత్రం తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నరసింహారెడ్డిగా చిరంజీవి నటిస్తుండగా, రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అడపాదడపా చిన్నచిన్న ఆటంకాలు ఎదురవుతున్న విషయం కూడా తెలిసిందే. తాజాగా ఉయ్యాలవాడ వంశీకుల నుంచి నిరసనల పర్వం ఎదురవుతోంది.

కంటతడి పెట్టిన ఉయ్యాలవాడ వంశీకులు..
తమ వంశానికి చెందిన ఓ గొప్ప వీరుడి చరిత్రను తెరకెక్కిస్తుడటంతో ఉయ్యాలవాడ వంశీలుకు సంతోషపడుతున్నారు. కానీ తమను ఏమాత్రం గుర్తించడంలేదని ఉయ్యాలవాడ వంశీకులు ఆవేదన వ్యక్తం చేస్తు..ఆవేదన వ్యక్తం చేస్తు కంటతడి పెట్టారు. తమను కర్నూలు నుంచి హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నామని... చిరంజీవి కానీ..రామ్ చరణ్ కానీ తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవిగారు వచ్చి మాట్లాడతారని చెబుతూనే ఉన్నారని... ఇంతవరకు అది జరగలేదని వాపోయారు. 

11:35 - July 25, 2018

ఢిల్లీ : ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద టిడిపి ఎంపీలు ఆందోళన చేశారు. హోదా ఇవ్వాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. రోజుకో వేషధారణలో వస్తూ ఆకట్టుకుంటున్న చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్ మరో వేషధారణలో కనిపించారు. మరో వేషధారణలో ఎంపీ శివప్రసాద్...ఉయ్యాల వాడ నరసింహారెడ్డి వేషధారణలో వచ్చిన ఆయన ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ...
 

'సమర శంఖం పూరించిన స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ. తెల్లదొరలను ఎదిరించిన ధీరుడు...ఉరికంబం ఎక్కిన గొప్ప విప్లవకారుడని తెలిపారు. ఆత్మ స్వరూపుడైన హోదా కోసం పోరాడుతున్న ప్రజలను ఆవహించాలి. మిస్టర్ మోడీ...ఆయన కన్నా గొప్పవాడివా ? ఏమయ్యా..మాట ఇచ్చి తప్పావు కదా...ఐదు కోట్ల ప్రజల ఆగ్రహానికి గురైన మోడీ..పదవిలో కొనసాగేందుకు అర్హుడివా ? ప్రజలు సమస్యల్లో ఉంటే విదేశీ పర్యటనలు అవసరమా ? నీ పతనం ఖాయమైంది..రాజ్యసభలో ఇచ్చిన అవకాశం కోల్పోయారు. ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదు' అంటూ తనదైన శైలిలో మాట్లాడారు. 

11:24 - July 25, 2018

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలూ బుధవారం తిరిగి ప్రారంభమయ్యాయి. లోక్ సభ..రాజ్యసభలో స్పీకర్..డిప్యూటి ఛైర్మన్ లు సమావేశాలను కొనసాగించారు. లోక్ సభలో పలువురు సభ్యులు వేసిన ప్రశ్నలకు ఆయా శాఖలకు చెందిన మంత్రులు సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉంటే టిడిపి ఎంపీలు ఎప్పటిలాగానే నిరసనలు చేపట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేశారు. హోదా ఇవ్వాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. రోజుకో వేషధారణలో వస్తూ ఆకట్టుకుంటున్న చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్ మరో వేషధారణలో కనిపించారు. మరో వేషధారణలో ఎంపీ శివప్రసాద్...ఉయ్యాల వాడ నరసింహారెడ్డి వేషధారణలో వచ్చిన ఆయన ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. 

11:41 - June 7, 2018

అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగాస్టార్ చిరంరజీవి 150వ సినిమా విడుదల అవ్వటం..సూపర్, డూపర్ హిట్ సాధించింది. దీంతో ఇనుమడించిన ఉత్సాహంతో మెగాస్టార్ సైరాకు సై అన్నారు. ఈ నేపథ్యంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి 151వ సినిమాగా 'సైరా' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ షూటింగ్ జరుపుకుంది. తాజా షెడ్యూల్ ఈ రోజు న హైదరాబాద్ లో మొదలైంది. 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారు. మరోపక్క కొన్నిరోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ లో తాను పాల్గొన్న సన్నివేశాలకి సంబంధించిన కొన్ని ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో అమితాబ్ పోస్ట్ చేయడం వలన, చిరంజీవి లుక్ ఎలా ఉంటుందనే విషయం తెలిసిపోయింది. అయితే అధికారికంగా ఈ సినిమా నుంచి చిరంజీవి ఫస్టులుక్ ను ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 22వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ రోజున మెగా అభిమానులకి పండుగేనని చెప్పాలి. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో వున్నారు. 

16:27 - May 17, 2018

'రంగస్థలం' సినిమా రామ్ చరణ్ సినీ కెరీర్ లో చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఈ సినిమా హిట్ అనంతరం రామ్ చరణ్ చాలా చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు. రంగస్థలం సినిమాలో చాలా ప్రత్యేకతలున్నాయి. పాటలు,చరణ్ నటనతో పాటు రంగస్థలం గ్రామం సెట్టింగ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సినది. 'రంగస్థలం' సినిమా కోసం హైదరాబాదులో వేసిన విలేజ్ సెట్లో ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రం షూటింగ్ చేస్తున్నారు. అక్కడి బంగ్లా సెట్లో చిరంజీవి, తమన్నా తదితరులు పాల్గొనే సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు.

రెజ్లర్ గా రానా..
రానా దగ్గుబాటి త్వరలో రెజ్లర్ గా నటించనున్నాడు. ప్రముఖ మల్లయుద్ధ వీరుడు కోడి రామ్మూర్తి బయోపిక్ గా రూపొందే చిత్రంలో ఆయన పాత్రను పోషించడానికి రానా ఓకే చెప్పినట్టు సమాచారం.

యోధుడిగా కోడి రామ్ముర్తి చరిత్ర..
తెలుగు దేశంలో ప్రఖ్యాత తెలగ వీర యోధ వంశాలలో కోడి వారి వంశం ఒకటి, ఈ వంశ పరంపరలోని శ్రీ కోడి వెంకన్న నాయుడు కోడి రామ్ముర్తి తండ్రి. 1882లో పుట్టిన కోడి రామ్ముర్తి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేరణతో విజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణస్వామి దగ్గర పెరిగారు కోడి రామ్ముర్తి. అక్కడ ఒక వ్యాయామశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే ఇతడు ఛాతిపై 1 1/2 టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగేవాడటం కోడి రామ్ముర్తి. మద్రాసులో సైదాపేట కాలేజిలో ఒక సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చి విజయనగరం శిక్షణ తర్వాత వ్యాయామోపాధ్యాయుడుగా సర్టిఫికేట్ అందుకుని, విజయనగరంలో తాను చదివిన హైస్కూలులో వ్యాయామ శిక్షకుడుగా చేరాడు.

రామ్ముర్తి ప్రదర్శనలకు విశేష స్పందన..
శరీరానికి కట్టిన ఉక్కు గొలుసును కట్టించుకుని ముక్కలుగా తుంచి వేసేంత దేహధారుడ్యం అతని సొంతం. రెండు కార్లను రెండు భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకుని స్వీడ్ నడిపినాగానీ కార్లను మాత్రం ఏమాత్రం కదలనీయని యోధుడు కోడి రామ్ముర్తి, ఛాతీ పై పెద్ద ఏనుగును ఎక్కించుకునేవాడు. 5 నిమిషాల పాటు, రొమ్ముపై ఏనుగును అలాగే ఉంచుకునేవాడు. తండోపతండాలుగా ప్రజలు వారి ప్రదర్శనలు చూచేవారు. అటువంటి మల్లయోధుడి కథలో దగ్గుపాటి రానా నటించనున్నట్లుగా సినీ పరిశ్రమ సమాచారం. 

Pages

Don't Miss

Subscribe to RSS - సైరా