సీపీఎం

22:13 - October 10, 2018

హైదరాబాద్: తెలంగాణలో  త్వరలో  ఒక ప్రజాస్వామిక, ప్రజల ప్రభుత్వం ఏర్పడబోతోందని  టీపీసీీసీ అధ్యక్షుడు  ఉత్తమ్ కుమార్ రెడ్డి  అన్నారు.  ఆపద్దర్మ ముఖ్యమంత్రి  కేసీఆర్‌కు  ఆయన ఒక లేఖ రాశారు. అనంతరం  విలేఖరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవడం రాజకీయ పార్టీలకు సహజమని, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకోవడాన్ని విమర్శిస్తున్న టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. 2009లో తెలంగాణకు టీడీపీ అనుకూలంగా లేఖ ఇచ్చినందుకే  టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకున్నామని ఆనాడు కేసీఆర్ చెప్పారని,   చంద్రబాబు లో ఏం మార్పు వచ్చిందని  చండీయాగానికి పిలిచి సన్మానించారని ఉత్తమ్  ప్రశ్నించారు. టీడీపీ నాయకురాలు, ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడి వివాహానికి వెళ్లి మీరు  టీడీపీ నాయకులతో రహస్య మంతనాలు జరపలేదా ,ఈ రోజు మేము  ఎన్నికల పొత్తులు పెట్టుకుంటే మీకు అభ్యంతరం వచ్చిందా అని  ఉత్తమ్ కుమార్ రెడ్డి  ప్రశ్నించారు. గతంలో తెలంగాణకు బద్ద వ్యతిరేకయిన సీపీఎంతో  కూడా టీఆర్ఎస్ ఎన్నికల  పొత్తులు పెట్టుకుందని   ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

16:35 - September 9, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరుగబోయే ఎన్నికలపై జనసేనానీ 'పవన్ కళ్యాణ్' దృష్టి సారించారు. ఆదివారం పార్టీ రాజకీయ వ్యవహార కమిటీతో పవన్ సుదీర్ఘంగా చర్చించారు. మాదాపూర్ లోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఎన్నికలపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి ? ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలనే దానిపై చర్చించారు. గతంలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో జరిపిన చర్చల వివరాలను పవన్ కు సభ్యులు వివరించారు. తదుపరి చర్చలు పవన్ తో జరపాలని సీపీఎం సభ్యులు పేర్కొన్నారని వారు తెలిపారు. దీనితో చర్చలకు పవన్ అంగీకరించారు. సీపీఎం నేతలను చర్చలకు ఆహ్వానించాల్సిందిగా పవన్ సూచించారు. మంగళ, బుధ వారాల్లో ఈ సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది. 

14:51 - August 27, 2018

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. స్మార్ట్ సిటీ అని చెప్పుకోవడం తప్పా పనులు పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో అపరిష్కృతంగా ఉన్న చేపల మార్కెట్, డంపింగ్ యార్డుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తాము వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించినా ఏ ఒక్క అధికారి లేడని విమర్శించారు. 

14:02 - August 27, 2018

 విజయనగరం : జిల్లాలోని పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయం  దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యాలయం ముట్టడికి వచ్చిన సీపీఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. జీ ప్లస్‌ త్రీ హౌసింగ్‌ స్కీంలో అవకతవకలు జరిగాయంటూ సీపీఎం ఆందోళనకు దిగింది.

 

18:23 - August 26, 2018

హైదరాబాద్ : ఎన్నికల్లో రాజకీయ పార్టీలు చేసే ఖర్చుపై నియంత్రణ విధించాలని సోమవారం నాడు జరిగే ఎన్నికల కమిషన్ సమావేశంలో కోరుతామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను అందులో పెట్టాలని అనుకుంటున్నారని, కొన్ని అక్రమాలకు దారి తీసే పరిస్థితులున్నాయని తాము అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ హడావుడి చూస్తుంటే రాష్ట్రంలో ముందదస్తు ఎన్నికలు వచ్చినట్లుగా ఉందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సీపీఎం, బీఎల్ఎఫ్ సిద్ధంగా ఉందని సీపీఎం నేత తమ్మినేని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో 119 స్థానాలకు పోటీ చేయబోతున్నట్లు, అందులో సీపీఎం స్థానాలు ఏమిటీ ? సెప్టెంబర్ 2వ వారంలో జిల్లాల కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. 

19:23 - August 20, 2018

విశాఖపట్నం : వరద ముంపులో చిక్కుకున్న కేరళకు సాయం చేసేందుకు సీపీఎం నడుంబిగించింది. సహాయక చర్యల్లో భాగంగా 10 టన్నుల మెటీరియల్‌ సేకరించినట్లు సీపీఎం నాయకులు నర్సింగరావు తెలిపారు. ఈ మెటీరియల్‌ను కేరళకు పంపేందుకు రైల్వే సహాయం కోరింది. ప్రజా సంఘాలతో కలిసి రైల్వే డీఆర్‌ఎంను కలిసి సేకరించిన మెటీరియల్‌ను కేరళకు పంపడానికి ప్రత్యేక బోగి కావాలని కోరగా దీనికి రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. కేరళకు కావాల్సిన మెటీరియల్‌ను ఉచితంగా రవాణా చేస్తామని హామీ ఇచ్చారు. గాజువాక జగదాంబ సెంటర్‌ వద్ద సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రజలు అక్కడికి వచ్చి తమ వంతు సాయం చేయాలని నర్సింగరావు కోరారు.

15:57 - August 14, 2018

హైదరాబాద్ : ప్రజావైద్యాన్ని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేటు వైపుకు అడుగులు వేయడం బాధకరమని సిపిఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్ ఎన్ జే కాన్సర్ ఆస్పతిని అటానమస్ చేయాలనే ఆలోచన నుంచి తెలంగాణా ప్రభుత్వం బయటకు రావాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లక్‌డీకపూల్ నుంచి ఎమ్ ఎన్ జే ఆస్పత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. ఆస్పత్రి ఎదుట సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌ బైఠాయించారు. ప్రజా వైద్యాన్ని కాపాడాలంటూ ఆందోళన చేశారు. ప్రభుత్వం ప్రజా వైద్యాన్ని పేదలకు దూరం చేయవద్దన్నారు. సీపీఎం ఆందోళనపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

06:58 - August 14, 2018

అమరావతి : ఏపీలో వామపక్ష, జనసేన పార్టీల కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై మూడు పార్టీల అగ్రనేతలు సమాలోచనలు చేస్తున్నారు. విజయవాడ వేదికగా ఈ పార్టీల నేతలు భేటీ అయ్యి చర్చించారు. టీడీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించాలని నిర్ణయించారు.

ఏపీలో దూకుడు పెంచిన లెఫ్ట్‌, జనసేన కూటమి..
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, వామపక్షాల కూటమి దూకుడు పెంచింది. రాజకీయంగా వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని సమస్యలపై ఉద్యమించేందుకు మూడు పార్టీలు రెడీ అవుతున్నాయి. ప్రజా సమస్యలే ఎజెండాగా మూడు పార్టీలు ఉమ్మడి ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నాయి.

యాత్రల పేరుతో జనానికి దగ్గరవుతున్న జనసేనాని..
ఇప్పటికే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ యాత్రల పేరుతో ప్రజలకు దగ్గరవుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు వామపక్షాలు సైతం ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్నాయి. ఆయా రంగాల్లోని ప్రజలను ఐక్యం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన నేతలు ఐక్యంగా ముందుకు సాగేందుకు విజయవాడలో సమావేశం అయ్యారు. భవిష్యత్‌ ఉద్యమానికి రూపకల్పన చేశారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టేలా ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ప్రత్యేకహోదా, పోలవరం నిర్వాసితులు, నిరుద్యోగం, సీపీఎస్‌ రద్దుతోపాటు మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణపై చర్చించారు. రానున్న రోజుల్లో ప్రజాసమస్యలపై ఉమ్మడి పోరాటాలను మూడు పార్టీలు కలిసి చేపడుతాయని సమావేశానంతరం నేతలు స్పష్టం చేశారు. మొత్తానికి మూడు పార్టీల నేతల భేటీ నేపథ్యంలో త్వరలో ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కబోతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అధికార టీడీపీతోపాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీని టార్గెట్‌ చేస్తూ , వారి వైఫల్యాలను ఎత్తిచూపేలా మూడూ పార్టీలో జనంలోకి వెళ్తనున్నాయి.

13:45 - August 7, 2018

నెల్లూరు : జిల్లా రావూరు పోలీస్‌ స్టేషన్‌ దాడి ఘటన ఎస్‌ఐ దురుసు ప్రవర్తన వల్లే జరిగిందని, ఎస్‌ఐను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేశారు ఏపీ సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధు. రావూరు హరిజనవాడలో పర్యటించిన మధు అక్కడి స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన దళితులను 15 రోజుల్లోగా విడుదలచేయకుంటే అన్ని దళిత, ప్రజాసంఘాలను కలుపుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామంటున్న మధుతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

13:22 - August 4, 2018

విజయవాడ : కర్నూలు జిల్లాలోని హత్తెబెళగల్ వద్ద జరిగిన క్వారీ ప్రమాద బాధ్యత ప్రభుత్వానిదేనని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. క్వారీ పేలుడు ఘటనలో 12 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు మధు సానుభూతి తెలియచేశారు. అనంతరం ఆయన మీడయాతో మాట్లాడారు. అక్రమ క్వారీలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారని, శుక్రవారం గ్రామదర్శినిలో గ్రామ ప్రజలు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. విదేశీ పరిశ్రమలకు అనుకూలంగా చట్టాలు మారుస్తున్నారని, ప్రజల భద్రతను గాలికొదిలేశారని తెలిపారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - సీపీఎం