సీఎం చంద్రబాబు

22:11 - November 10, 2018

గుంటూరు : కేంద్ర ప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఐటీ రైడ్స్ జరుపుతూ ప్రత్యర్థులపై కక్ష తీర్చుకుంటూ... రాజకీయ లబ్ధి పొందే పరిస్థితికి వచ్చారని మండిపడ్డారు. దేశాన్ని కాపాడుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. ఎన్డీఏ హయాంలో నోట్లరద్దుతో ఏటిఎంలు ఖాళీ అయ్యాయని విమర్శించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. డిమానిటైజేషన్ స్వార్థంతో చేశారని...దీని వల్ల అందరూ ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. ఏటీఎంలు, బ్యాంకులలో డబ్బులు లేవని, ఎక్కడికక్కడ సమస్యలు వచ్చాయన్నారు. ’మన డబ్బులు తీసుకునేందుకు ఏటీఎం, బ్యాంకుల చుట్టూ క్యూ కట్టే పరిస్థితి వచ్చింది’ అని పేర్కొన్నారు. నోట్లరద్దు వల్ల దుష్ఫలితాలు వచ్చాయని, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని విమర్శించారు. గ్రోత్ రేట్ పడిపోయిందన్నారు. రూపాయి విలువ పతనం అయిందని, పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయన్నారు. ఫెర్టిలైజర్ ధరలు విపరీతంగా పోయాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం వల్ల నిరుద్యోగం పెరిగిందన్నారు. వ్యవసాయ సంక్షోభం తలెత్తిందని, రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. 

ఎవరైనా మాట్లాడితే వారిపై దాడులు చేస్తున్నారని తెలిపారు. మీడియా, కంపెనీలు, రాజకీయ పార్టీల నాయకులపై దాడులు చేస్తున్నారని తెలిపారు. భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితికి వచ్చారని అన్నారు. తనకు స్వలాభం లేదని చెప్పారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలని సురక్షితంగా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. రాహుల్ గాంధీ అమరావతి పర్యటనపై త్వరలో ప్రకటన చేస్తామని చెప్పారు. యాంటీ బీజేపీ వేదిక ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

 

09:27 - November 5, 2018

శ్రీకాకుళం : తిత్లీ తుపాన్‌ బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ చెక్కులు పంపిణీ చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో చెక్కుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయం, మత్స్యకారులు, ఇల్లు కోల్పోయినవారు.. ఇలా బాధితులందరికీ మొత్తం 540 కోట్ల రూపాయలు పరిహారం అందించనున్నారు. పలాస మున్సిపాలిటీ పరిధిలోని జూనియర్‌ కళాశాల గ్రౌండ్స్‌లో చంద్రబాబు కొంతమందికి చెక్కులు అందిస్తారు. అలాగే జిల్లాలోని అన్ని పంచాయితీల్లో అధికారులు చెక్కులు అందిస్తారు. మధ్యాహ్నం పలాసకు చేరుకోనున్న చంద్రబాబు... చెక్కుల పంపిణీ అనంతరం.. బహిరంగ సభలో పాల్గొంటారు. 

 

09:01 - November 5, 2018

తూర్పు గోదావరి : గత ఎన్నికల్లో తాను మద్దతు ఇవ్వకపోతే చంద్రబాబు ఈపాటికి రాజకీయాల నుంచి రిటైర్‌ అయ్యేవారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తాను మద్దతు ఇవ్వడంతోనే ఆయన సీఎం అయ్యారని చెప్పారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని దుయ్యబట్టారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.... బీజేపీపైనా, జగన్‌పైనా విమర్శనాస్త్రాలు సంధించారు. 

ప్రజాపోరాటయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్‌... చంద్రబాబుపై మండిపడ్డారు. గత ఎన్నికల్లో తాను మద్దతు ఇవ్వకపోతే చంద్రబాబు రిటైరై  ఉండేవారని ఎద్దేవా చేశారు. తన మద్దతుతోనే సీఎం అయ్యారని చెప్పారు. చంద్రబాబు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్‌కు పెట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన బిల్లు ఆమోద సమయంలో టీడీపీ ఎంపీలను కొట్టిన కాంగ్రెస్‌తో టీడీపీ జట్టుకట్టడమేంటని నిలదీశారు.

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైనా పవన్‌ కల్యాణ్‌ పదునైన విమర్శలు సంధించారు. ఆంధ్రులు దోపిడీదారులని టీఆర్ఎస్‌ నేతలు కించపరుస్తోంటే జగన్‌ నోరు మెదపకపోవడాన్ని పవన్‌ తప్పుపట్టారు. టీఆర్‌ఎస్‌ నేతలను ప్రశ్నించాలంటే జగన్‌కు ఏవో భయాలున్నాయన్నారు.  తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడలేనివారు ఏపీకి ముఖ్యమంత్రి కాలేరని... కారాదని.. ఇదే శాసనమని ఆవేశంగా మాట్లాడారు. 

అవినీతిలో టీడీపీ నేతలు కాంగ్రెస్‌ నాయకులను మించిపోయారని పవన్‌ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని దుయ్యబట్టారు. బీజేపీ అంటే చాలా కోపముందని పవన్‌ అన్నారు. రాష్ట్రాన్ని విడదీస్తుంటే ఎందుకు చేస్తున్నారని ఒక్క బీజేపీ నాయకుడూ ప్రశ్నించలేదన్నారు.  యూపీని ఇలాగే చీల్చుతారా అని ప్రశ్నించారు. యూపీని నాలుగు ముక్కలుగా చెయ్యకపోతే తమ కడుపుమంట చల్లారదని అన్నారు.

08:38 - November 4, 2018

ప్రకాశం : ప్రజాస్వామ్యం ప్రమాదం బారిన పడినప్పుడు.. తనలాంటి వారు కూడా మౌనం వహిస్తే.. స్వాతంత్ర్యంకోసం పోరాడిన మహనీయుల ఆత్మ క్షోభిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అలా జరగకూడదన్న ఉద్దేశంతోనే.. జాతీయ కూటమికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తుపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలను చంద్రబాబు తప్పుపట్టారు. బీజేపి రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ చదువుతున్నారని విమర్శించారు. కోడి కత్తిని మోడీ తన కత్తిగా మార్చుకుని.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కుట్ర పన్నారని చంద్రబాబు ఆరోపించారు

 

08:44 - November 1, 2018

హైదరాబాద్ : కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎంతోపాటు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు వెళ్లనున్నారు. బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తేవడం లక్ష్యంగా సీఎం పర్యటన కొనసాగనుంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, శరద్‌పవార్, ఫరూక్‌అబ్దుల్లా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తేజస్వియాదవ్‌లతో ఆయన భేటీ కనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు శరద్‌పవార్‌ను కలవనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. రాబోయే ఎన్నికలు, దేశ రాజకీయాలపై సీఎం చర్చించనున్నారు. ములాయంసింగ్‌ యాదవ్‌ను కూడా కలవనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీని ఓడించాలని చంద్రబాబు కసర్తత్తు చేస్తున్నారు.

 

08:03 - November 1, 2018

గుంటూరు : రాజకీయాల్లో శాత్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని మరోసారి నిరూపితమైంది. ఇన్నాళ్లూ బద్ద శత్రువులుగా ఉన్న కాంగ్రెస్‌, టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో ఒకటి అయ్యాయి. తొలిసారి టీజేఎస్‌, సీపీఐతో కూటమిగా ఏర్పడి టీఆర్‌ఎస్‌ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాహుల్‌గాంధీతో ఇవాళ భేటీ కాబోతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అందరితో మాట్లాడి అందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రకటించారు.

అమరావతిలో టీడీపీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ అవుతున్నట్టు తెలిపారు.  ఆయనతో కూడా మాట్లాడి అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తానన్నారు. అందరితో కలిసి జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు. దేశాన్ని ప్రమాదం నుంచి బయటపడవేసేందుకు తాను బాధ్యత తీసుకుంటానన్నారు.   ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్ని దాడులు చేసినా భయపడేది లేదన్నారు.  టీడీపీ దేశానికి ఎన్నోసార్లు దశ దిశ చూపిందని, మరోసారి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సిన సమయం వచ్చిందన్నారు.  దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. 

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేశారని, నమ్మక ద్రోహం  చేశారని ధ్వజమెత్తారు. ఎన్డీయే ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలను విస్మరించారని విమర్శించారు. ప్రత్యేకహోదా హామీని తుంగలో తొక్కారని ఫైర్‌ అయ్యారు. ఏపీకి కేంద్రం  చేసిన ద్రోహంపై ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత టీడీపీ కార్యకర్తలదేన్నారు. ప్రజలను చైతన్యవంతం చేస్తే... వారే బీజేపీతో కలిసి పనిచేస్తోన్న వైసీపీ, జనసేనను వచ్చే ఎన్నికల్లో గంగలో ముంచుతారన్నారు.

దేశంలోని ప్రభుత్వ వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టిస్తోందని చంద్రబాబు దుయ్యబట్టారు. బీజేపీ విధానాలతో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం చంద్రబాబు టీడీపీ సభ్యత్వ పునరుద్దరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన సభ్యత్వాన్ని పునరుద్దరించుకున్నారు.

19:03 - October 27, 2018

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముతో సీఎం చంద్రబాబు తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల సొమ్ముతో పత్రికల్లో, టీవీ చానెళ్లల్లో ప్రకటనలు ఇస్తూ బాబు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అధికారులను అడ్డు పెట్టుకొని అరాచకానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఏపీ నుంచి తెలంగాణకు భారీగా డబ్బుల వరద పారుతోందన్నారు. 500 కోట్ల రూపాయలకు రాహుల్ గాంధీతో చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు విషయంలో ఖచ్చితంగా ఈసీ స్పందించాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో సంపాదించిన డబ్బు మూటలను తెలంగాణకు చేరవేస్తున్నారని పేర్కొన్నారు. అధికార యంత్రాంగాన్ని అడ్డంపెట్టుకుని.. పోలీసు వాహనాలు, అంబులెన్సుల ద్వారా డబ్బును ఇక్కడికి పంపిస్తున్నారని తెలిపారు. అధికార యంత్రాంగాన్ని, వారి ఇంటెలిజెన్సీ వ్యవస్థను ఇక్కడ మోహరించి, డబ్బును పంపిణీ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ పోలీసులకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ ఏపీ అధికారులపై దృష్టి సారించాలని కోరారు. 

చంద్రబాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్.రమణ ఎవరైనా సరే.. వారి వాహనాలను తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. వీరు రిపీట్ అఫెండర్స్ అని అన్నారు. గత ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఇన్నోవా కారులో 3 కోట్ల రూపాయలను దాచుకున్నారని ఆరోపించారు. మినిస్టర్ క్వార్టర్స్ లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణకు ఏం పని అని ప్రశ్నించారు. ఆయన మినిస్టర్ క్వార్టర్స్ లో తిష్ట వేసి ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగంతో, ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులతో సమావేశాలు పెడుతూ ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షిస్తున్నారని ఆరోపించారు. 

డీఎస్ పీ బోసు, తెలంగాణలో ఉండే ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసు వ్యవస్థ రేవంత్ రెడ్డికి రెగ్యులర్ గా కాంటాక్టులో ఉన్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వారిని కలుస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ మధ్య జరుగుతున్న అరాచకీయానికి అనుసంధాన కర్తలుగా రేవంత్ రెడ్డి, ఎల్.రమణలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతంలో తాము ఆరోపించినట్లుగా ప్రస్తుతం ఇవన్నీ వాస్తవాలుగా తేలుతున్నాయన్నారు. వీటన్నింటిపైనా ఈసీ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వీటిని ఈసీ ఉపేక్షిస్తే.. ఎక్కడైనా తమ కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనై.. డబ్బు పంచుతూ ఎవరైనా దొరికితే వారిపై దాడులు జరిపితే దానికి తమ బాధ్యత కాదన్నారు. 

18:31 - October 26, 2018

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్...జగన్ ను పరామర్శించడం తప్పా? అని ప్రశ్నించారు. ఈమేరకు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలు మానవీయ కోణంలో జగన్ ను పరామర్శించారని తెలిపారు. చంద్రబాబు సంబంధాలన్నీ రాజకీయ, ఆర్థిక సంబంధాలేనని విమర్శించారు. చంద్రబాబు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

 

19:49 - October 25, 2018

గుంటూరు : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈమేరకు ఆయన అమరావతిలో పలువురు మంత్రులతో సమావేశం అయ్యారు. జగన్‌పై దాడి, రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది సంబంధంలేని విషయమని స్పష్టం చేశారు. ఈ ఘటనను అడ్డంపెట్టుకొని అల్లర్లకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదని అన్నారు. 

పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ వచ్చేందుకు జగన్ విశాఖ ఎయిర్‌పోర్టుకి వచ్చారు. ఎయిర్‌పోర్టు లాంజ్‌లో కూర్చుని జగన్ విశ్రాంతి తీసుకుంటుండగా.. వెయిటర్ శ్రీనివాస్ జగన్‌పై కోళ్లపందాలకు వాడే కత్తితో దాడికి పాల్పడ్డాడు. 

 

21:49 - October 24, 2018

గుంటూరు : ప్రధాని మోడీపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. మోడీ పాలనలో సీబీఐ నిర్వీర్యమైందన్నారు. ఈమేరకు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆస్థానను కాపాడేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కుట్రలు పన్నుతుందని పేర్కొన్నారు. పోరాటాలు చేసే వారిపై కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులు చేస్తుందని తెలిపారు. ఇలాంటి కుట్రలకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - సీఎం చంద్రబాబు