సినిమా

16:06 - November 5, 2018

హైదరాబాద్ : టాలీవుడ్..బాలీవుడ్..హాలీవుడ్..ఇలా ఏ వుడ్ అయినా యూ ట్యూబ్‌ని చక్కగా ఉపయోగించుకొంటోంది. సినిమాలకు సంబంధించిన టీజర్..ట్రైలర్..ఇతర వీడియోలను యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. కొన్ని వీడియోస్‌కి నెటిజన్ల నుండి తెగ రెస్పాన్స్ వస్తోంది. మిలియన్..వ్యూస్ వచ్చాయంటూ ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్‌లో రూపొందుతున్న ఓ చిత్రం ట్రైలర్ యూ ట్యూబ్‌ని షేక్ చేస్తోంది. 
Image result for Yedu Chepala Katha Teaserఅడల్ట్ మూవీ..అంటూ ఇటీవలే ‘ఏడు చేపల కథ’ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. యూ ట్యూబ్‌లో దుమ్ము రేపుతోంది. యూత్‌ని ఆకట్టుకొనే విధంగా శృంగారాన్ని ఒలకపోశారు. శ్యామ్ జే చైతన్య దర్శకత్వంలో, చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్‌పై, రామకృష్ణా రెడ్డి సమర్పణలో, శేఖర్ రెడ్డి జీ.వీ.ఎన్‌లు ఈ సినిమాను నిర్మిస్తు్న్నారు. ఈ చిత్రంలో అభిషేక్‌ రెడ్డి, బిగ్ బాస్ ఫేం భాను శ్రీ,, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు నటించారు. సినిమా టీజర్‌లో లిప్ కిస్‌లు..అమ్మాయిలు గోడల మీద నుండి దూకడం...రొమాన్స్ సీన్స్‌లతో కుర్రాళ్లను పిచ్చెక్కించారు. ఒక్కమాటలో చెప్పాలంటే పోర్న్ సినిమాను తలదన్నేలా ఉందని అంటున్నారు. 
ఇదిలా ఉంటే అప్‌లోడ్ చేసిన ఒక రోజుకే.. పది లక్షలకు అంటే వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి. తాజాగా అన్ని ఛాన‌ల్స్ క‌లిపి 16 మిలియ‌న్స్ (దాదాపు కొటి అర‌వై ల‌క్ష‌లు ) వ్యూస్ రావ‌టం గ్రేట్ అని నిర్మాతలు పేర్కొంటున్నారు. 
అడల్డ్ కామెడీ జోనర్‌లో సినిమాను రూపొందించడం జరిగిందని, సినిమాలో అందరూ కొత్తవారేనని నిర్మాతలు వెల్లడించారు. టీజర్‌కు ప్రశంసలు దక్కుతున్నాయని, దర్శకుడు శామ్ జే చైతన్య విభిన్నమైన కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా మలిచారన్నారు. సినిమా విడుదల విషయంలో త్వరలోనే నిర్మాతలు ఓ ప్రకటన చేయనున్నారు. 

09:39 - October 25, 2018

తమిళనాడు : కొందరు నటులు మాత్రమే. మరికొందరు దర్శకులు మాత్రమే. కానీ నటులను తయారుచేసినవారు మాత్రం కొందరే వుంటారు. నటనలో శిక్షణనిచ్చే ఇనిస్టిట్యూస్ చాలామంది స్థాపిస్తారు. కానీ కొన్ని సంస్థలు మాత్రమే నటులను తయారు చేస్తాయి. వాటిలో అత్యంత పేరెన్నికగన్న ఇనిస్టిట్యూట్ ‘కూత్తుపట్టరై’. ఆ ఇనిస్టిట్యూట్ ను స్థాపించి నటులు విజయ్ సేతుపతి, విమల్, విదార్థ్‌లతోపాటు మరెందరినో తీర్చిదిద్దిన ‘కూత్తుపట్టరై’ వ్యవస్థాపకుడు ముత్తుస్వామి తన 82 ఏట అనారోగ్యంతో మృతి చెందారు. తంజావూరు జిల్లా పుంజై గ్రామానికి చెందిన ముత్తుస్వామి 'కూత్తుపట్టరై' పేరిట నట శిక్షణ కేంద్రాన్ని స్థాపించి సినీ పరిశ్రమకు కొత్త ముఖాలను పరిచయం చేశారు. తొలుత వీధినాటకాల్లో శిక్షణ ఇచ్చిన ఆయన ఆ తర్వాత చెన్నైలో శిక్షణ ఇచ్చారు. తమిళ చిత్ర పరిశ్రమలోని పలువురు సినీ కళాకారులను తీర్చిదిద్దింది ఇక్కడే. అంకితభావానికి మారుపేరైన ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఆయన చెన్నైలో కన్నుమూశారు. ఆయన మృతికి కోలీవుడ్ సంతాపం తెలిపింది.

 

15:46 - October 19, 2018

తిరుమల: వెంకన్నను వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి, సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మలు దర్శించుకున్నారు. వీరితో పాటు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్ర యూనిట్ సభ్యులు కూడా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం వర్మ మాట్లాడుతూ, పుట్టినప్పటి నుంచి తాను దేవుడిని దర్శించుకోలేదని చెప్పారు. కేవలం దివంగత ఎన్టీఆర్ పై ఉన్న గౌరవంతోనే తిరుమల వెంకన్నను దర్శించుకున్నానని చెప్పారు. 
గతంలో తాను తెరకెక్కించిన 'గోవిందా గోవిందా' చిత్రం యాక్షన్ మూవీ అని... 'లక్ష్మీస్ ఎన్టీఆర్' వాస్తవిక చిత్రమని వర్మ తెలిపారు. ఈ సినిమాలో నమ్మలేని ఎమోషన్స్ ఉంటాయని చెప్పారు. నిజాలను ప్రజలకు అందించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని దేవుడిని ప్రార్థించానని తెలిపారు. నిజాలను చూపించే ధైర్యం, సాహసం, శక్తి ఇవ్వాలని కోరుకున్నానని చెప్పారు.
 

13:57 - October 19, 2018

హైదరాబాద్ : ఎన్టీఆర్ జీవితం ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. సినిమా చిత్రీకరణంలో అందరి స్టైల్ వేరు వర్మ స్టైల్ వేరు అనే మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో వివాదాల దర్శకుడు వర్మ  'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఎలా ఉండబోతుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణ కొనసాగుతున్నవిషయం కూడా తెలిసిందే. ఒకరి కథనే ఇద్దరు దర్శకులు వారి వారి కోణాలలో వారి వారికి అందించిన సమాచారాన్ని బట్టి తీస్తున్న ఈ సినిమాపై ఉత్కంఠ సమంజసమే. కానీ ఈ ఇద్దరు దర్శకులలో ఒకరు వర్మ కావటమే ఈ సంచలనానికి కారణం. ఈ ఉత్కంఠకు తెర దించుతు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఎలా వుండబోతోందనే విషయంపై వర్మ తన వాయిస్ ఓవర్ ద్వారా వెల్లడించాడు. 
వర్మ వాయిస్ లో సినిమా గురించి ప్రకటన సారాంశం..
''ఎన్.టి.రామారావు గారి నిజమైన అభిమానులకి నా బహిరంగ ప్రకటన. సినిమా అనేదానికి సరైన నిర్వచనం జీవితానికి అద్దం పట్టడం. జీవితానికి అర్ధం నిజంగా జీవించడం. అసలు నిజానికి నిజంగా జీవించే వారికి మరణం అనేది ఉండదు.ఎందుకంటే అలాంటి వారు భౌతికంగా మరణించినా.. వారిని ప్రేమించే మనుషుల గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు.. ఎన్టీఆర్ గారి మీద సినిమా తీయడానికి ముఖ్య కారణం ఆయన జీవితంలో అత్యంత భావోద్వేగమైన ఘట్టాలు ఉండడం వలన.. ఆ ఘట్టాలు అన్నింటిలో ముఖ్యమైన ఘట్టం.. ఆయన జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశం తరువాత ఉద్భవించిన కొన్ని అత్యంత కీలకమైన విపత్కర పరిణామాలు.అందుకనే ఈ సినిమాకి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్ పెట్టడం జరిగింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ ని కేవలం ఒక సినిమా అనడం సినీ కళామతల్లిని, ఎన్టీఆర్ గారిని కూడా అవమానించినట్లే.. ఎందుకంటే ఇది ఒక జీవిత సత్యాన్ని చెరపడం కోసం చచ్చేంత ప్రయత్నం చేసినా.. చేరపలేకుండా చేయడానికి కెమెరాతో వేయబోతున్న అతి కచ్చితమైన రౌద్ర ముద్ర. లక్ష్మీ పార్వతి గారి గురించి నాకు వేరు వేరు మంది వేరు వేరు అభిప్రాయాలని , వేరు వేరు ఉదంతాలను చెప్పారు. వారు తెలిసి చెప్పారో.. తెలియక చెప్పారో.. రకరకాల కారణాలు ఉండొచ్చు.

Image result for lakshmis ntr varmaకానీ వాదించే దానికి వీలు లేని పూర్తి నగ్న సత్యమేమిటంటే ఎన్టీఆర్ గారు చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఒక ఇంటర్వ్యూలో లక్ష్మీ పార్వతి గారు గురించి ఎనలేని గౌరవంతో  మాట్లాడారు. అందుచేత ఆమెని అవమానిస్తే.. సాక్షాత్తు ఎన్టీఆర్ ని అవమానించినట్లే.. అలా అని నేను ఎవరో ఒకరి మాటలే వినడం లేదు.. లక్ష్మీ పార్వతి నుండి ఆమె ఇంట్లో అప్పట్లో పని చేసిన పనివాళ్లు, పార్టీ మెంబర్లు ఆమె శత్రువులు అందరితో గూడంగా ఇంటర్వ్యూలు జరిపి కళ్ళు బయర్లు గమ్మే నిజాన్ని లోతుగా తవ్వి బయటకి తీశాను.సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా లక్ష్మీపార్వతిని పిలిచాను కాబట్టి ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలోనే సినిమా ఉంటుందని అనుకుంటే పొరపాటే ఎందుకంటే నేను సినిమా తీసేది ఆమె కోసం కాదు.. ఎన్టీఆర్ గారి గురించి. ఆయన మీదున్న గౌరవం మూలాన ఆవిడని గౌరవించి ఆయన మీదున్న  గౌరవాన్ని నిలబెట్టడం నిజమైన అభిమానుల కనీస బాధ్యత. ఆవిడని  పిలిచిన ఒక కారణం ఎన్టీఆర్ భార్యగా, ఆయన మీదున్న గౌరవంతో.. రెండో కారణం సినిమాలో ఆమెది చాలా చాలా ముఖ్య పాత్ర.

Image result for lakshmis ntr varmaఎవరి పాయింట్ ఆఫ్ లో వ్యూలో సినిమా ఉంటుందనే దానికి నా సమాధానం కేవలం నిరూపించగలిగే నిజాల పాయింట్ ఆఫ్ లో మాత్రమే ఉంటుందని చెప్పగలను. జనవరి 24న విడుదల కాబోతున్న ఈ సినిమా వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవని చెప్పినా మీరు నమ్మరు కాబట్టి చెప్పను. ఎన్టీఆర్ జీవితం మీద ఎన్ని సినిమాలు వచ్చిన ఆయన ఆశీస్సులు మాత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కి మాత్రమే ఉంటాయని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలను ఇది నా ఓపెన్ ఛాలెంజ్'' అంటూ తన వాయిస్ ద్వారా తెలిపారు వివాదాల వర్మ.
 

16:45 - October 17, 2018

హైదరాబాద్ : తెలుగు బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ కు ఆయన ఆర్మీకి ఇప్పటికింకా విన్నింగ్ కిక్ దిగలేదు. ఎందుకంటే ఎన్నో అవమానాలు, అవహేళనల మధ్య ఒంటిరిపోరాటంతో స్వతంత్రంగా పోరాడి సాధించుకున్న విజయం  ఎంతటి కిక్ ఇస్తుందో చెప్పలేం. ఇప్పుడు ఆ కిక్ లోనే వున్నాడు బిగ్ బాస్ విన్నర్ కౌశల్. నిన్న మొన్నటి వరకూ కౌశల్ అంటే ఎవరికీ పెద్దగా తెలియదు. 'బిగ్ బాస్ 2' విన్నర్ ఎవరు అంటే చంటిపిల్లాడు కూడా చెప్పే పేరు కౌశల్. ఇప్పుడు కౌశల్ నేషనల్ సెలబ్రిటీ అయిపోయాడు. ఈ రియాలిటీ షో ద్వారా ఆయన అంతగా పాప్యులర్ అయ్యాడు. ఈ క్రేజ్ తో ఆయన వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అభిమానులు ఆశపడుతున్నారు. తాను విలన్ పాత్రలకి బాగా పనికొస్తానని ముందుగానే చెప్పిన కౌశల్, మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కాగా సినీ పరిశ్రమలో ఎవరు క్రేజ్ లో వుంటారో వారితో పలువురు టచ్ లో వుంటారు. ఈ నేపథ్యంలో కౌశల్ కు పలు సినిమాల్లో  పెద్ద పెద్ద దర్శక నిర్మాతల వద్ద నుండి ఆఫర్లు వచ్చాయి.

Image result for ధృవ అరవిందస్వామిషో తరువాత పలు ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతున్న కౌశల్ ఓ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..రామ్ ఛరణ్, విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన నవ మన్మధుడు అరవింద్ స్వామి కాంబినేషన్ లో వచ్చిన  'ధ్రువ' సినిమా సూపర్ హిట్ సాధించింది. ఆ సినిమాలో విలన్ గా అరవిందస్వామి చేసిన పాత్రను అంత తేలికగా మరిచిపోలేం.

Image result for aravinda sametha jagapathi babu photosఅలాగే రీసెంట్ గా వచ్చిన 'అరవింద సమేత' సినిమాలో విలన్ గా జగపతిబాబు పోషించిన పాత్ర కూడా అద్భుతం. అలాంటి విలన్ పాత్రలు చేయాలనుందని కౌశల్ తన మనసులోని మాటను తెలిపాడు.  ఆ తరహా పాత్రల్లో నన్ను నేను నిరూపించుకోవాలని వుంది. అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాను అని కౌశల్ తన మనసులోని మాటను బైటపెట్టాడు. మరి కౌశల్ ఆశ, ఆయన ఆర్మీ కోరిక తీరాలను కోరుకుందాం..
 

18:16 - October 6, 2018

హైదరాబాద్ : ఒక వ్యక్తి కోసం ఆర్మీ పుట్టటం సాధారణ విషయం కాదు. దానికి బిగ్ బాస్ 2 రియాల్టీ షో వేదికయ్యింది. షో విన్నర్ కౌశల్ అభిమానులకు అంతు లేకుండా పోతోంది. కౌశల్ బైట కనిపిస్తే చాలు చుట్టుముట్టేస్తున్నారు. అంతులేని అభిమానాన్ని కురిపిస్తున్నారు. అదే ప్రాంతంలో సినిమా హీరోయిన్ వున్నా పట్టించుకోనంతగా కౌశల్ రేంజ్ పెరిగిపోయింది. దీనికి షాపింగ్ మాల్ ఓపెనింగ్ వేదికగా నిలిచింది. 
బిగ్ బాస్ షోలో తన సహజమైన శైలితో వ్యవహరించి విన్నర్ గా నిలచిన అతడి కోసం కౌశల్ ఆర్మీ పుట్టుకొచ్చింది. ఇది ఫేక్ ఆర్మీ అని ఎంతమంది ఎన్ని రకాలుగా అంటున్నా.. వారు మాత్రం ఎప్పటికప్పుడు కౌశల్ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తునే వున్నారు. 
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత అభిమానులు ఆయన ఎక్కడికి వెళ్తున్నా విడిచిపెట్టడం లేదు. తాజాగా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వెళ్లిన కౌశల్ ని అభిమానులు చుట్టుముట్టారు. ఈ ప్రారంభోత్సవానికి కౌశల్ తో పాటు Rx100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా వచ్చింది. అయితే కౌశల్ ఫాలోయింగ్ ముందు పాయల్ కు అస్సలు గుర్తింపే లేకుండా పోయింది. అస్సలు అక్కడ ఓ సినిమా హీరోయిన్ వుందనే ధ్యాసలోనే కౌశల్ ఆర్మీ వ్యవహరించారు. కౌశల్ కారుని అభిమానులంతా చుట్టుముట్టడంతో అతడు వారి నుండి తప్పించుకొని వెళ్లడానికి చాలా సమయమే పట్టింది. కౌశల్, కౌశల్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్లన్నీ బ్లాక్ చేశారు అభిమానులు. బహుసా కౌశల్ కూడా ఇంతటి అభిమానాన్ని ఊహించి ఉండడు. ఆయనకి దక్కుతోన్న ప్రేక్షకాదరణ హీరోలకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. 
 

18:16 - October 4, 2018

హైదరాబాద్ : తెలుగు బిగ్ బాస్ 2'లో కౌశల్ ఒక సునామి. ఒంటరిపోరులో విజయం సాధించిన విజేత కౌశల్. అప్పటి వరకూ సాధారణ సెలబ్రిటీగా వుండే కౌశల్ బిగ్ బాస్ 2 తరువాత ఆ గేమ్ కొనసాగుతున్న నేపథ్యంలోను కూడా బిగ్గెస్ట్ సెలబ్రిటీ అయిపోయాదు. ఇది సాధారణంగా వచ్చిన క్రేజ్ కాదు.ఇది కేవలం అతని వ్యక్తిత్వం..నమ్మినదానినే ఆచరించటం..సాటి వ్యక్తుల పట్ల వుండే గౌవరం..సాటివారికి సహాయం చేసే సహజగుణం కౌశల్ లక్షణం.. వీటితోనే అతని వ్యక్తిత్వం బిగ్ బాస్ తో వెలుగులోకి వచ్చింది. మరింతగా ఇనుమడించింది. దీనిపై గిట్టనివారు ఎన్ని విమర్శలు చేసిన అది వారు అసూయతో చేసేదే తప్ప మరేమీ కాదని అశేష అభిమానులు సాటి చెప్పారు. 16మంది పాల్గొన్న ఈ గేమ్ షోలో ఒక్క కౌశల్ కే ఇంతటి క్రేజ్ వచ్చింది అంటే మిగతా కంటెస్టెన్స్ లో ఎక్కడో ఒక్క చోట అయినా ఫేక్ నెస్ కనిపించకమానలేదు అని ఫ్రూవ్ అయింది. ఇదిలా వుంటే బిగ్ బాస్ కౌశల్ వ్యక్తిత్వానికి దర్పణంగా నిలిచిన నేపథ్యంలో అతని క్రేజ్ తో కెరీర్ మరింతగా బాగుంటుందని నమ్మవచ్చు. ఈ నేపథ్యంలో ఈ క్రేజ్ కారణంగా దర్శకుడు బోయపాటి శ్రీను ఆయనపై దృష్టి పెట్టినట్టుగా వార్తలు వచ్చాయి. చరణ్ హీరోగా బోయపాటి చేస్తోన్న సినిమాలో కౌశల్ తో ఒక ముఖ్యమైన రోల్ చేయించనున్నట్టు టాక్ వచ్చింది. నెగెటివ్ షేడ్స్ తో ఈ పాత్ర ఉంటుందని సినీ వర్గాల సమాచారం. 

09:20 - October 2, 2018

హైదరాబాద్ : ఎప్పటికైనా నీతి, నిజాయితీలదే గెలుపు అని బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ద్వారా మరోసారి నిరూపితమైంది. మొత్తం 16మంది బిగ్ బాస్ సభ్యుల్లో ప్రేక్షకుల ఆదరణను చివరి వరకూ తన సంకల్పంతో, నిజాయితీతో, పట్టుదలతో గెలుచుకుని నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు..బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు కౌశల్. ఇప్పటి వరకూ ఎన్నో భాషల్లో బిగ్ బాస్ నిర్వహించినా..ఏ నటుడికీ..ఏ సెలబ్రిటీకి రానంత ఆదరణ, ప్రేమ, గౌరవం దక్కించుకున్నాడు కౌశల్. 16మంది సభ్యుల్లో బిగ్ బాస్ హౌస్ లో 100 రోజులకు పైగా ఒంటరి పోరాటం చేసి ఓపికతో సహనంతో తాను నమ్మినదానినే చివరివరకూ కొనసాగించి విన్నర్ గా నిలిచాడు కౌశల్. తాను విన్నగా నిలిచింనందుకు అభిమానులందరితో తన సంతోషాన్ని పంచుకున్నాడు. పట్టుదలతో స్వయంకృషితో ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని బిగ్ బాస్ 2 విన్నర్ గా నిలిచి తనకు అందిన పారితోషికాన్ని తన తల్లి క్యాన్సర్ తో మృతి చెందిందనీ..అందుకు ఆ మొత్తాన్ని క్యాన్సర్ రోగులకు వినియోగిస్తానని తెలిపి మరోసారి తన ఉదారతను చాటి చెప్పాడు కౌశల్. ఈ క్రమంలో తాను బిగ్ బాస్ లోకి ఎలా ఎంటర్ అయ్యింది. దానికి కారణం ఎవరో తెలిపాడు కౌశల్..
తాను బిగ్‌బాస్ షోలో పాల్గొనడం వెనక టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు ప్రోత్సాహం ఉందని బిగ్‌బాస్-2 విజేత కౌశల్ తెలిపాడు. మహేశ్ బాబు తొలి చిత్రం ‘రాజకుమారుడు’తోనే తమ మధ్య సాన్నిహిత్యం ఉందన్న కౌశల్.. మహేశ్ బాబు లేకుంటే తాను లేనంటూ కౌశల్ చెప్పిన వీడియోను ఇప్పుడు మహేశ్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
తాను బిగ్‌బాస్‌కు వచ్చానంటే దానికి కారణం మహేశ్ బాబేనని కౌశల్ అన్నాడు. హైదరాబాద్‌లో తొలిసారి మోడలింగ్ అకాడమీ ఏర్పాటు చేసింది తానేనన్న కౌశల్.. అందుకోసం మహేశ్ ఎంతో సాయం చేశాడని గుర్తు చేసుకున్నాడు. రాజకుమారుడు సినిమా సమయంలో దగ్గురుండి అకాడమీని ఏర్పాటు చేయించినట్టు చెప్పాడు. దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ఎంతో సాయం చేశారని పేర్కొన్నాడు. ఆ ఏజెన్సీ లేకపోతే తానెప్పుడో తిరిగి వైజాగ్ వెళ్లిపోయి ఉండేవాడినన్నాడు. ఈ సందర్భంగా తన గెలుపునకు కృషి చేసిన కౌశల్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపాడు.  
 

13:13 - September 24, 2018

శ్రీనువైట్ల, ఒకప్పుడు కామెడీ సినిమాలకి కేరాఫ్ అడ్రస్. స్టార్ హీరోలతో సైతం కామెడీ చేయించి మంచి హిట్స్ అందుకున్నాడు. వరస హిట్లతో దూకుడు మీద ఉన్న వైట్ల కెరీర్, ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ లాంటి పరాజయాలతో అగాధంలో పడింది. ఇక శ్రీను పని అయిపోయింది అనుకున్నారంతా. ఆలాంటి టైంలో తనకి వెంకీ,దుబాయ్ శీను వంటి హిట్స్ ఇచ్చిన శ్రీనుని ఆదుకోవడానికి మాస్ రాజా రవితేజ లైన్ లోకి వచ్చాడు. 
శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం సినిమాలతో హ్యాట్రిక్  హిట్స్ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై, రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్లో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రానికి బీజం పడింది. గోవా బ్యూటీ ఇలియానా కొంత గ్యాప్ తర్వాత ఈ మూవీతోనే తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది.ఈ మధ్యే అమెరికా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం టీజర్‌ని శ్రీనువైట్ల పుట్టినరోజు సంధర్భంగా..పీవోట్ : రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ పేరుతో రిలీజ్ చేసింది చిత్ర బృందం..టీజర్‌‌లో రవితేజ మూడు డిఫరెంట్ గెటప్‌లలో కనిపిస్తున్నాడు. లుక్ పరంగా కూడా రవితేజ బాగున్నాడు. థమన్ ఇచ్చిన నేపధ్య సంగీతం బాగుంది. 
అమర్ అక్బర్ ఆంటోనీ శ్రీనువైట్ల‌కి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలానే అనిపిస్తుంది. అక్టోబర్ లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నారు.. 

వాచ్ టీజర్...

17:27 - September 4, 2018

హైదరాబాద్ : మలయాళ సూపర్ స్టార్ ముమ్ముటి కుమారుడు దుల్కర్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు సినిమా అభిమానులకు పరిచయమైన దుల్కర్ 'మహానటి' సినిమాతో డైరెక్ట్ గా తెలుగు సినిమా ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యాడు. జెమినీ గణేషన్ పాత్రలో ఒదిగిపోయిన దుల్కర్ ఇప్పుడు విక్టరీ వెంకటేశ్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయనున్నాడు. వెంకటేశ్‌, దుల్కర్ సల్మాన్‌ కథానాయకులుగా ఓ మల్టీస్టారర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ పరిశ్రమ సమాచారం. వార్‌ డ్రామాగా తెరకెక్కించనున్న ఈ సినిమాలో వెంకటేశ్‌ మరో కథానాయకుడిగా సందడి చేయనున్నారని సమాచారం. ఈ మేరకు దర్శక, నిర్మాతలు ఇద్దరినీ కలిసి స్క్రిప్ట్‌ నరేట్‌ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని చెబుతున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - సినిమా