సమావేశం

19:34 - September 12, 2018

విశాఖ : రైల్వే డీఆర్ ఎం మీటింగ్ ను ఉత్తరాంధ్ర ఎంపీలు బాయ్ కాట్ చేశారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర అనుసరిస్తున్నవైఖరికి నిరసనగా సమావేశాన్నిఉత్తరాంధ్ర ఎంపీలు బహిష్కరించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో చత్తీస్ గఢ్, ఒడిషా ఎంపీలతో డీఆర్ ఎం సమావేశం అయ్యారు. 

 

14:02 - August 28, 2018

ఢిల్లీ : హస్తినలో బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం అయింది. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా నేతృత్వంలో సమావేశం నిర్వహిస్తున్నారు. 2019 లో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారు. కేంద్ర పథకాల అమలు తీరును సమావేశంలో సమీక్షించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

13:13 - August 27, 2018

ఢిల్లీ : రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం ప్రారంభం అయింది. పార్టీల ఎన్నికల ఖర్చుపై పరిమితి, ఓటర్ల నమోదు యంత్రాంగం ఏర్పాటు, పార్టీ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్లు అంశాలపై అభిప్రాయాన్ని ఈసీ సేకరిస్తుంది. టీడీపీ తరపున కనమేడల రవీంద్ర కుమార్, రావులు చంద్రశేఖర్ రెడ్డి, టీఆర్ ఎస్ నుంచి ఎంపి వినోద్, సీపీఐ తరపున నారాయణ, బీజేపీ నుంచి జేపీ నడ్డా, భూపేంద్రయాదవ్ లు హాజరయ్యారు. 

 

08:29 - August 27, 2018

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఇవాళ అన్ని రాజకీయ పార్టీలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి 7 జాతీయ పార్టీలు, 51 ప్రాంతీయ పార్టీలకు ఆహ్వానం అందింది. ఈ భేటీలో ప్రధానంగా రాజకీయ పార్టీల కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు, ఎమ్మెల్సీ ఎన్నికలకు వ్యయపరిమితి నిర్ణయించడం, ఓటర్ల జాబితాల సవరణకు శాశ్వత యంత్రాంగం ఏర్పాటు వంటి అంశాలపై చర్చించనుంది.  అయితే వచ్చే ఎన్నికల్లో పేపర్‌ బ్యాలెట్‌ వినియోగానికి విపక్షాలు పట్టుబట్టనున్నాయి. రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితత్వం, పారదర్శకత, ఓటర్ల నమోదులాంటి అంశాలైనా చర్చ జరుగనుంది.ఈ మీటింగ్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి టీఆర్‌ఎస్‌, టీడీపీ నుంచి నేతలు హాజరవుతున్నారు. ఎన్నికల సంస్కరణలకు తమ పార్టీ సానుకూలంగా ఉందని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ అన్నారు. 

 

12:53 - August 22, 2018

హైదరాబాద్ : న్యూ ఢిల్లీలోని బ్రిటీష్‌ హై కమిషనర్‌ రాజకీయ, మీడియా విభాగాధిపతి కిరణ్‌ డ్రాకె, డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రా ఫ్లెమింగ్‌, రాజకీయ, ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్‌లు హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంలో ఎంపీ కవితను కలిశారు. ఈ సందర్భంగా వారికి కాకతీయ తోరణం, సిద్ధిపేట ప్రాంతానికి చెందిన గొల్లభామ చీరలు, భారతదేశ కోహినూర్‌ వజ్రం-తెలంగాణ అనే పుస్తకాన్ని బహుకరించారు కవిత. అనంతరం తెలంగాణలో అమలవుతోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. నిజామాబాద్‌ దశాబ్దాల కల అయిన పసుపుబోర్డు ఏర్పాటు కోసం చేసిన ప్రయత్నాలను ఎంపీ కవిత వివరించారు.

 

17:57 - August 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్రకార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. పార్టీ నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారంగా ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేయడంతో పాటు పార్టీ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల నిర్వహణ, విస్తృత స్థాయి ప్రచారం లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. రెండు రోజుల పర్యటనకు హైదరాబాద్‌ వచ్చిన రాహుల్‌కు ఎన్నికల సవాలు విసిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి ఏడు గంటలకు సమావేశం వివరాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీడియాకు వివరించనున్నారు.

 

07:27 - August 11, 2018

ఢిల్లీ : పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టీఆర్‌ఎస్‌ ఎంపీలు కలిశారు. తెలంగాణలో కొత్త సచివాలయ నిర్మాణానికి రక్షణ భూములు ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌ అంశాలను ప్రధాని దృష్టికి తెచ్చారు. లోక్‌సభ ఫ్లోర్‌ లీడర్‌ జితేందర్‌ రెడ్డి, రాజ్యసభ ఫ్లోర్‌ లీడర్‌ కే.కేశవరావు నాయకత్వాన పార్లమెంట్‌లో టీఆర్ఎస్‌ ఎంపీలు ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 3 ఏళ్లుగా సీఎం కేసీఆర్‌ ఆశిస్తోన్న కొత్త సచివాలయ నిర్మాణానికి బైసన్‌ పోలో, జింఖానా మైదానం, రక్షణ భూములు రాష్ట్రానికి ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరినట్లు టీఆర్‌ఎస్‌ ఎంపీలు తెలిపారు. కేంద్రం ఇచ్చే భూములకు ఎక్స్‌చేంజ్‌గా ఇవ్వాల్సిన భూములపై కూడా ప్రధానికి వివరించామన్నారు. 
భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఎంపీలు
కేంద్రం ఇచ్చే భూములకు బదులుగా ఇవ్వాల్సిన భూములను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానికి వివరించామన్నారు టీఆర్‌ఎస్‌ ఎంపీలు. రోడ్ల విస్తరణకు ఇవ్వాల్సిన భూముల వలన తాము నష్టపోయే 31 కోట్ల రూపాయలను ప్రతి ఏటా ఇవ్వాలని రక్షణ శాఖ కోరిందని మోదీకి తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం అడిగిన వెంటనే 210 ఎకరాల భూమిని ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన రక్షణ శాఖ తెలంగాణకు మాత్రం భూమిని బదలాయించడంలో ఆసల్యం చేస్తోందన్నారు. రాష్ట్ర సమస్యలను త్వరగా పరిష్కారం చేయాలని ప్రధానిని కోరినట్లు టీఆర్ఎస్‌ ఎంపీలు తెలిపారు. ఈ సమస్యలపై ప్రధాని సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 

13:59 - August 10, 2018

ఢిల్లీ : టీఆర్ఎస్‌ ఎంపీలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. టీఆర్ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో ప్రధానిని కలిసి రాష్ర్టంలో కొత్త సెక్రటేరియట్‌కు రక్షణ భూములు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. బైసన్‌ పోల్‌, జింఖానా మైదానం, రక్షణ శాఖ భూములు రాష్ర్టప్రభుత్వానికి ఇవ్వాలని కోరామని తెలిపారు. పెండింగ్ అంశాలను ప్రధాని దృష్టికి తెచ్చామని తెలిపారు.

07:24 - August 10, 2018

హైదరాబాద్ : నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల నిర్మించ తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డును ప్రపంచ స్థాయి ఎక్స్ ప్రెస్స్ వేగా నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఔటర్‌ రింగ్‌ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో ఆయన ప్రగతి భవన్ లో సమావేశం అయ్యారు. వరల్డ్ క్లాస్ ఎక్స్ ప్రెస్స్ వేగా తీర్చిదిద్దే విధంగా డీపీఆర్ తయారు చేయాలంటూ అధికారులను కోరారు. అయితే దానికి సంబంధించి నిధుల మంజూరు విషయంలో తాను స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానన్నారు. 
 

 

16:24 - August 4, 2018

తూ.గో : రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా సాగింది. అధికార విపక్ష నేతల మధ్య వాగ్వాదం జరిగింది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ వైసీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. పోడియం ముందుకు వెళ్లి నిరసన తెలిపారు. వారిని వారించేందుకు మేయర్‌ ప్రయత్నించినా ఆందోళన విరమించకపోవడంతో 7గురు కార్పొరేటర్లను సస్పెండ్ చేశారు. సస్పెండ్‌ చేసినప్పటికీ బయటకు వెళ్లకపోవడంతో పోలీసులు జోక్యం చేసుకొని వారిని బయటకు పంపించారు. దీంతో అధికార పార్టీ తీరుపై వైసీపీ నేతలు మండిపడ్డారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - సమావేశం