సమస్యలు

19:13 - October 4, 2018

నల్లగొండ :  ప్రజాశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో జిల్లా ప్రజలల్లో చైతన్యాన్ని మరోసారి రగిలించేందుకు పూనుకున్నారు. ఇంటింటికీ రెండు నెలల్లో నీళ్లు రాబోతున్నాయి. అసెంబ్లీలో చెప్పిన మాట నెరవేరబోతుంది అని కేసీఆర్ స్పష్టం చేశారు. కరెంట్ కష్టాలు, ఫ్లోరైడ్ సమస్య, కూలిపోయిన కులవృత్తులు, రైతులు, చేనేతల ఆత్మహత్యలు వంటి పలు సంక్షోభాల నుండి కూలిపోతున్న బతుకుల్ని స్వంత రాష్ట్రంలో సొంత పాలనలో నిలబెట్టుకున్నామని కేసీఆర్ మరోసారి ప్రజల్లో ఉద్వేగాన్ని నింపారు.  పోచంపల్లిలో ఏడుగురు చేనేత కార్మికులు చనిపోతే తానే స్వయంగా వచ్చి.. రూ. 50 వేలు ఇవ్వమంటే ఆనాడు పాలకులు ఇవ్వలేదనీ..మరలా గతకాలపు పాలకులపై విమర్శల వర్షం కురిపించారు. బోర్లు వేసి వేసి బొర్లా పడ్డ పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకునే చేనేత కార్మికులు. ధైర్యంగా ప్రయాణం ప్రారంభించాం. కరెంట్ సమస్య అన్ని వర్గాలను పట్టిపీడించింది. ఐదారు నెలల్లోనే కరెంట్ సమస్యను పరిష్కరించుకున్నాం. 24 గంటలు రైతాంగానికి కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇవ్వగలుగుతున్నామనీ..మంచినీళ్ల సమస్య పరిష్కారం కావాటానికి మిషన్ భగీరథ 1,50,000 కిలోమీటర్లు, 12 వేల క్లియరెన్స్‌లు దాటుకొని 99 శాతం పూర్తి  అయిందని కేసీఆర్ తెలిపారు.

19:12 - October 1, 2018

పాకిస్థాన్ : పాకిస్థాన్ లో వున్న పలు సమస్యలకు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి చిటికెలో పరిష్కారాన్ని చెప్పేశారు. పేదిరకం,ఉగ్రవాదం, సైస్యం పెత్తనం వంటి సమస్యలు పోవాలంటే పాకిస్థాన్ ను నాలుగు ముక్కలు చేయడమే ఆ దేశానికి పరిష్కారమన్నారు. ‘‘పాకిస్తాన్‌కు ఒకే ఒక్క మార్గం ఉంది. బలోచ్‌లు పాకిస్తాన్‌తో కలిసి ఉండేందుకు ఇష్టపడడం లేదు. సింధీలు, పస్తూన్లది కూడా అదే దారి. కాబట్టి పాకిస్తాన్‌ను బలోచ్, సింద్, పస్తూన్ మూడింటితో పాటు అవశేష పశ్చిమ పంజాబ్‌గా విడగొట్టాలి....’’ అని స్వామి పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ గురించి మాట్లాడుతూ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సమయం వృధా చేసుకోవద్దనీ.. భారత్ తిట్టినప్పుడల్లా పాకిస్తాన్ వెర్రి ఆనందం పొందుతుందన్నారు. ‘‘పాకిస్తాన్‌ను పక్కనపడేసి మన సైన్యాన్ని సన్నద్ధం చేసుకోవాలి. అదనుచూసి ఒకరోజు దాన్ని నాలుగు ముక్కలుచేస్తే సరి...’’ అని స్వామి వ్యాఖ్యానించారు. కాగా పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదం, మానవ హక్కుల ఉల్లంఘపై ఇటీవల సుష్మా స్వరాజ్‌ ఐరాసలో లేవనెత్తిన నేపథ్యంలోనే స్వామి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

09:44 - August 24, 2018

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఆగష్టు 29న ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దశలవారీగా తమను క్రమబద్దీకరణ చేయాలని విద్యుత్‌ సంస్థల్లో దలారీ వ్యవస్థను రద్దు చేసి సంస్థ నేరుగా వేతనాలు చెల్లిచాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని తదితర డిమాండ్లతో గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. వారి ఆందోళనకు గల కారణాలు, వారి పట్ల ప్రభుత్వ వైఖరిపై ఇవాళ్టి జనపథంలో ఏపీ విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల ఐక్య వేదిక కన్వీనర్‌ బాలకాశి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

11:42 - August 16, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గ్రామాలపై దృష్టి సారించారు. గ్రామాల్లో పర్యటించి అక్కడున్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. గురువారం 'గ్రామదర్శిని' కార్యక్రమంపై ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నోడల్ అధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు. గురు, శుక్రవారాల్లో అందరూ గ్రామాలు సందర్శించాలని, అందరీ సహకారం తీసుకోవాలన్నారు. డిసెంబర్ కల్లా ప్రజా సమస్యలను పరిష్కరించాలని సీఎం బాబు ఆదేశించారు. ప్రతి ఇంటికి సెన్సార్ ఏర్పాట్లు చేయాలని, డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి శాంతిభద్రతలను కాపాడాలని సూచించారు. 

07:48 - August 9, 2018

తెలంగాణలో పంచాయతీ కార్మికులు గత 17 రోజులుగా సమ్మె చేస్తున్నారు. తమకు మున్సిపల్‌ కార్మికుల మాదిరిగా.. వేతనాలు పెంచి ఇవ్వాలని తమ వేతనాన్ని ప్రభుత్వమే చెల్లించాలని తమను క్రమబద్దీకరణ చేయాలని తదితర డిమాండ్లతో వారు సమ్మె చేస్తున్నారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని గతంలో తమకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. పంచాయతీ కార్మికుల సమ్మెకు గల కారణాలు ప్రభుత్వ విధానంపై ఇవాళ్టి జనపథంలో పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పాలడుగు భాస్కర్‌ మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.. 

11:37 - July 13, 2018

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని.. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉపాధ్యాయుల సమస్యలు, వాటి పట్ల ప్రభుత్వ విధానంపై ఉపాధ్యాయుల భవిష్యత్ కర్తవ్యం ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తుండటం మనం చూస్తోన్నాం. ప్రస్తుతం వారు చేస్తున్న డిమాండ్లను ఎలా చూడాలి? వంటి పలు ఉపాధ్యాయ సమస్యలపై మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త లక్ష్మణ్‌రావు విశేషాలు, విశ్లేషణలను ఈనాటి జనపథంలో మీకోసం..

13:44 - July 12, 2018

హైదరాబాద్ : రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో నగరం లో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఏకధాటిగా వర్షం కురవడంతో ప్రధాన రాదారులపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. చందానగర్, లింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో బయటకు రావడానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లింగంపల్లి అండర్ బ్రిడ్జ్ నుంచి గుల్మొహర్ పార్క్ వరకు, నల్లగండ్ల ఫ్లైఓవర్ ఫై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. రెండు కిలోమీటర్లమేర నిలిచినా వాహనాలు నెమ్మదిగా కదిలాయి. ఇటు గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, హాఫిజ్‌పేట్ ప్రాంతాల రహదారులపై వాహనాలు కిక్కిరిసాయి.

12:49 - July 12, 2018

కాకినాడ : అధికారుల నిర్లక్ష్యం అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. ఆర్మీ సెలక్షన్స్‌ కోసం దూర ప్రాంతాల నుండి వచ్చిన అభ్యర్థులకు ఇక్కట్లు తప్పలేదు. కాకినాడలో కనీస జాగ్రత్తలు పాటించకుండా అధికారులు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

కాకినాడలో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ క్యాంప్‌ సమస్యలకు కేంద్రంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ నాలుగు రోజులుగా క్యాంప్‌ నిర్వహిస్తున్నారు. ట్రాక్‌ సరిగా లేకపోవడంతో బురదలో అభ్యర్థులు పడుతోన్న కష్టాలు వర్ణనాతీతం. కొందరు అభ్యర్థులకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 

ఇక దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి వసతుల్లేవు. కనీసం మరుగుదొడ్ల ఏర్పాట్లు కూడా చేయలేదు అధికారులు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు అభ్యర్ధులు చెబుతున్నారు. రాత్రి పూట బస చేయడానికి అవకాశం లేకపోవడంతో రోడ్లపైనే విశ్రమించాల్సి వస్తుందంటున్నారు. 

పెద్ద సంఖ్యలో యువత తరలిరావడంతో హోటళ్లు, లాడ్జీలలో రేట్లు అమాంతం పెంచేశారు. దీంతో అభ్యర్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టిన అధికారులు అభ్యర్థులకు కనీస జాగ్రత్తలు చేపట్టడంలో విఫలమయ్యారు. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

08:21 - July 11, 2018

తెలంగాణలో కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఆందోళన బాట పట్టారు. ఈ నెల 15వ తేదీన శంఖారావం పేరుతో ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. జులై 1 నుంచి రెగ్యులర్‌ ఎంప్లాయిస్‌కు అమలైనట్లే తమకు కూడా కొత్త పీఆర్‌సీని అమలు చేయాలని.. వారికి పెంచినట్లుగానే తమకూ జీతాలు పెంచాలని.. తమను పర్మినెంట్‌ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. వారి డిమాండ్లు వారిపట్ల ప్రభుత్వ విధానాలపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు జె.వెంకటేశ్‌ మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం..

 

20:35 - July 10, 2018

తమ సమస్యలు పరిష్కరించాలంటు ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులంతా జూలై 11న మహాధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఉపాధ్యాయులను స్కూల్స్ , నివాసాల వద్ద ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని వారి ఆందోళనను అడ్డుకునేందుకు సిద్ధమయ్యింది. అసలు ఉపాధ్యాయుల సమస్యలేమిటి? ఎందుకు వారు ఆందోళన బాట పట్టాల్సివచ్చింది అనే అంశంపై చర్చ. ఈ చర్చలో ఉపాధ్యా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి పాల్గొన్నారు

Pages

Don't Miss

Subscribe to RSS - సమస్యలు