సమంత

17:17 - October 26, 2018

సమంత గతనెలలో యూటర్న్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం భర్త నాగ చైతన్యతో కలిసి, నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్‌లో, మజిలీ(వర్కింగ్ టైటిల్) మూవీలో నటిస్తుంది.. ఇప్పుడు సమంత చెయ్యబోయే కొత్త సినిమాకి సంబంధించిన అప్‌డేట్ తెలిసింది..  అలా మొదలైందితో దర్శకురాలిగా పరిచయమైన నందినీ రెడ్డితో శ్యామ్ ఒక సినిమా చెయ్యనుందనీ, ఆ సినిమా మిస్ గ్ర్యానీ అనే కొరియన్ మూవీకి అఫీషియల్ రీమేక్ అని తెలుస్తోంది. సమంత ఈ సినిమాలో 70ఏళ్ళ బామ్మగా కనిపించనుందట. అందాల భామ బామ్మగానా? అని ఆశ్చర్యపోతున్నారా.. తన జీవితంలో జరిగిన అనూహ్యమైన సంఘటనల వల్ల, 70ఏళ్ళ బామ్మ కాస్తా 20 ఏళ్ళ అమ్మాయిగా ఎలా మారింది, బామ్మ, భామగా మారిన తర్వాత ఎలాంటి బాధలు పడింది అనేదే మిస్ గ్ర్యానీ కథ.. డిసెంబర్, లేదా, జనవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది..  

18:04 - October 20, 2018

మీ టూ లో, ఎప్పుడు, ఎవరి పేరు వినబడుతుందోనని సినిమా రంగంలో కలకలం మొదలైంది.. ఏ ముహూర్తాన తనుశ్రీ దత్తా, నానాపటేకర్‌పై ఆరోపణలు చేసిందో.. ఇక అక్కడినుండి రచ్చ మొదలైంది.. ఇప్పుడు మీ టూలో యాక్షన్ కింగ్ అర్జున్ పేరుకూడా వినబడుతుంది.. మెన్నీమధ్యే అర్జున్ 150వ సినిమా కురుక్షేత్రం రిలీజైంది.. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శృతి హరిహరన్ తాజాగా అర్జున్‌పై ఆరోపణలు చేసింది.. కురుక్షేత్రం‌లో శృతి, అర్జున్ భార్యగా నటించగా, షూటింగ్ టైమ్‌లో అర్జున్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడనీ, రిహార్సల్స్ అప్పుడు తనని హగ్ చేసుకోవడమేకాక, తన చేతితో ఆమె వీపుపై రాసాడనీ, అప్పుడు చెప్పాలంటే ధైర్యం చాల్లేదు.. ఇప్పుడు మౌనంగా భరించకూడదనే జరిగిందంతా బయటపెట్టాను అని చెప్పుకొచ్చింది శృతి హరిహరన్..
అయితే, తమ అభిమాన హీరోపై శృతి చేసిన ఆరోపణల విషయంలో అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. షూటింగ్‌లో ఆయన చేసిన దానికి లైంగిక వేధింపులు అని చెప్పి, దాని ద్వారా ఫ్రీ పబ్లిసిటీ పొందాలనేది ఆమె ప్లాన్ అని కొట్టిపారేస్తున్నారు... దీనిపై అర్జున్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి..  

14:42 - October 20, 2018

ప్రస్తుతం సినీ పరిశ్రమలో అలజడి రేపుతుంది, మీ టూ ఉద్యమం.. గంట గంటకీ ఆరోపణలు చేస్తున్నవారు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నవాళ్ళూ పెరుగుతూనే ఉన్నారు.. రకరాల పరిస్ధితుల్లో వేధింపులకు గురైనవారు, ఒక్కొక్కరుగా సోషల్ మీడియా వేదికగా తమ బాధని వ్యక్తం చేస్తున్నారు.. పలువురు ప్రముఖులు బాధిత మహిళలకు సపోర్ట్‌గా ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు మీ టూ గురించి సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పందించారు.. మీ టూలో ఆరోపణలు చేస్తున్న వారు నిజంగా వేధింపులు ఎదుర్కొని ఉంటే, న్యాయం జరిగేవరకూ ఓపికగా ఉండాలి.. వైరముత్తు‌పై వచ్చిన ఆరోపణల విషయంలో నిజా నిజాలు వెలుగు చూడాలనీ, సొంత ప్రయోజనాల కోసం మీ టూని మిస్‌యూజ్ చెయ్యొద్దని సలహా ఇచ్చారు.. శంకర్ డైరెక్షన్‌లో చేసిన 2.ఓ రిలీజ్‌కి రెడీ అవుతుండగా, ప్రస్తుతం పేట్టా సినిమాలో నటిస్తున్నారు రజనీ..  

18:19 - October 16, 2018

ప్రస్తుతం సినీ పరిశ్రమలో అలజడి రేపుతుంది, మీ టూ ఉద్యమం.. గంట గంటకీ ఆరోపణలు చేస్తున్నవారు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నవాళ్ళూ పెరుగుతూనే ఉన్నారు.. సమంత, విశాల్ కూడా బాధిత మహిళలకు సపోర్ట్‌గా ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే.. మీ టూ లో తమిళ నటి రిత్విక తనుకూడా  లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పగా, కోలీవుడ్‌లో మరో నటి, తన సహ నటుడిపై కేసు పెట్టింది..
నటిగా తెలుగుతో పాటు తమిళ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న రాణి అలియాస్ రక్ష, ప్రస్తుతం ఒక తమిళ్ సీరియల్‌లో నటిస్తోంది.. ఆ సీరియల్ షూటింగ్ సమయంలో సహనటుడు షణ్ముగరాజన్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాక, లైంగికంగా వేధించాడనీ రక్ష సెంగుడ్రమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.. ఈ హఠాత్పరిణామంపై కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది
 
  

14:22 - October 16, 2018

మీ టూ లో, ఎప్పుడు, ఎవరి పేరు వినబడుతుందోనని సినిమా రంగంలో కలకలం మొదలైంది.. కంగనా రనౌత్ క్వీన్ దర్శకుడిపై, తనుశ్రీ దత్తా, నానాపటేకర్‌పై ఆరోపణలు చెయ్యడంతో, ఈ మీ టూ ఉద్యమం ఊపందుకుంది.. మరోవైపు సింగర్ చిన్మయి, సమంత, విశాల్ వంటివారు కూడా బాధిత మహిళలకు సపోర్ట్‌గా ట్వీట్స్ చేస్తున్నారు.. ఇకనుండి తమ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ పెట్టబోమని మేకర్స్, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొనే వారితో కలిసి పని చెయ్యం అని కొందరు హీరోలు తేల్చి చెప్పారు..
ఇప్పుడీ మీ టూ లో తమిళ నటి రిత్విక కూడా చేరింది.. తమిళనాట పలు చిత్రాలద్వారా గుర్తింపు తెచ్చుకున్న రిత్విక, తమిళ బిగ్‌బాస్ 2 టైటిల్ విన్ అయింది.. రీసెంట్‌గా ఒక తమిళ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వూలో, ప్రస్తుతం సినీ పరిశ్రమలో అలజడి రేపుతున్న మీ టూ గురించి మాట్లాడుతూ, తనుకూడా చిన్నతనంలో  లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాననీ, అప్పుడు ఎలా చెప్పాలో, ఎవరికి చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాననీ, ఇప్పుడు బాధిత మహిళలంతా ధైర్యంగా గొంతు విప్పుతున్నారు, వాళ్ళందరికీ నా సపోర్ట్ ఉంటుందని రిత్విక చెప్పుకొచ్చింది..
 

 

14:29 - October 9, 2018

విజయ్ సేతుపతి, వైవిధ్య భరితమైన కథల్ని ఎంపిక చేసుకుంటూ వరస విజయాలు సాధిస్తున్నాడు.. విజయ్ రీసెంట్ మూవీ 96 తమిళనాట సంచలన విజయం సాధించింది.. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలుగులో రీమేక్ చెయ్యబోతున్నారు..
ఇప్పుడు విజయ్ మరో ఢిఫరెంట్ ఫిలిమ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. త్యాగరాజన్ కుమార‌రాజా డైరెక్షన్‌లో విజయ్ సేతుపతి, సమంత, ఫహద్ ఫాజిల్, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం సూపర్ డీలక్స్..
ఈ మూవీలో విజయ్ సేతుపతి హిజ్రాగా కనిపించనున్నాడు.. మూవీ యూనిట్ సూపర్ డీలక్స్ ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేసింది.. ఆ లుక్‌లో విజయ్‌ని చూసి అందరూ షాక్ అయ్యారు.. చీరకట్టు,నుదుట బొట్టు, ముక్కు పుడకతో విజయ్ వెరైటీగా ఉన్నాడు..
ఈ పోస్టర్‌లో లేడీ బృహన్నలలా రెడీ అయిన విజయ్‌తోపాటు, సీనియర్ నటి రమ్యకృష్ణ, సమంత కూడా ఉన్నారు.. యువన్ శంకర్ రాజా ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.. ఈ మధ్యే నవాబ్ సినిమాతో తెలుగు వారికి పరిచయం అయిన విజయ్ సేతుపతి, మెగాస్టార్ చిరంజీవి, సైరా నరసింహా రెడ్డిలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు...

 

10:51 - October 6, 2018

అక్టోబర్ 6వ తేదీ.. ఈరోజు అక్కినేని కుటుంబానికీ, అక్కినేని అభిమానులకీ జీవితాతం గుర్తుండిపోయే రోజు..
ఎందుకంటే, ఇవాళ అక్కినేని నాగచైతన్య, సమంతల పెళ్లిరోజు.. పోయిన సంవత్సరం ఇదే రోజున వీరి వివాహం గోవాలో గ్రాండ్‌గా జరిగింది.. మొదట హిందూ సాంప్రదాయం ప్రకారం, తర్వాత అక్టోబర్ 7వ తేదీన క్రిస్టియన్ పద్ధతుల ప్రకారం చైతు, సమంతల పెళ్ళి ఘనంగా జరిగింది..
వివాహం తర్వాత భార్యాభర్తలిద్దరూ సినిమాలతో బిజీ అయిపోయారు... ఈ మధ్యే, చైతు శైలజారెడ్డి అల్లుడు, సమంత యూటర్న్ సినిమాలతో సందడి చేసారు..
మొన్నటివరకూ ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ వెళ్ళొచ్చిన ఈ జంట.. మ్యారేజ్ తర్వాత మజిలీ అనే మూవీలో నటిస్తున్నారు.. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు.. చైతు, సమంతల వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు ఈ కపుల్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు..

09:29 - September 26, 2018
పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత అక్కినేని వ్యక్తిగతంగానూ, ప్రొఫెషనల్‌ గానూ మంచి జోష్ మీద ఉన్నారు. అటు సినిమాలను, పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నారు. సమంత, చైతన్య వివాహం జరిగి ఏడాది పూర్తి కావోస్తున్నది. వారి వివాహం గతేడాది గోవాలో అక్టోబర్ మొదటివారంలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం జరిగిన సంగతి తెలిసిందే. వీరికి సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ అభిమానులను అలరస్తున్నారు. 
తాజాగా సమంత పోస్టు చేసిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. వివాహమైనా గ్లామర్ డోస్ ను ఏ మాత్రం తగ్గించడం లేదని ఈ ఫొటో చూపిస్తోంది. భర్త నాగ చైతన్యతో కలిసి ఓ ప్రాంతానికి వెళ్లినట్లు..ఆ సమయంలో ఈ ఫొటో తీసినట్లు టాక్. టూపీస్ ఫొటోస్ అదరగొడుతున్న ఈ ఫొటో కొన్ని క్షణాల్లోనే వైరల్ గా మారింది.  నాగ చైతన్యతో ఓ సినిమా త్వరలోనే ప్రారంభం కానున్నది.  అలాగే నందిని రెడ్డి సినిమాకు కూడా సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 
12:35 - September 12, 2018

‘సమంత’...టాలీవుడ్..ఇతర వుడ్ సినిమాల్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి కుర్రకారు గుండెలను కొల్లగొట్టింది. కెరియర్ తొలినాళ్లలో మోడలింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ అనితకాలంలో వెండితెరపై కనిపించింది. 2007లో మాస్కోవిన్ కావేరి సినిమాను ఒప్పుకుంది. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు సినిమా రంగంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది. ఇతర భాషా చిత్రాల్ల కూడా నటించి అక్కడ అభిమానులను సొంతం చేసుకుంది. 

అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య..సమంతలు ప్రేమించుకుని ఇటీవలే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం కొద్ది రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్న వీరు ప్రస్తుతం సినిమాలను అంగీకరిస్తూ బిజీ బిజీగా మారిపోయారు. వీరు నటించిన సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. కానీ సమంతకు సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 

సమంత త్వరలోనే తల్లి కాబోతోందని టాక్. నాగార్జున త్వరలో తాతయ్య కూబోతున్నాడనే వార్త సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. చిన్న పిల్లలంటే తనకు ఎంతో ఇష్టమని ఓ ఇంటర్వూలో సమంత పేర్కొన్నట్లు కథనం. పిల్లల కోసం ప్లాన్ వేసుకుంటున్నట్లు వెల్లడించినట్లు టాక్. ప్రస్తుతం సమంత నటించిన యు టర్న్ సెప్టెంబర్ 13న విడుదల కానుంది. 

11:23 - June 8, 2018

సమంత సినిమాలో వుంది అంటే అది హిట్ అనే స్థాయికి చేరుకుంది ఈ అక్కినేనివారి కోడలు. అభినయానికే ఎక్కువ ప్రాధాన్యత వుండే పాత్రలు చేసే సమంత హిట్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. తన పాత్రల ఎంపికవిషయంలో కీలక నిర్ణయాలతో విజయాలను అందుకుంటున్న సమంతా వివాహానికి ముందుగా చేపట్టిన సినిమాలు వివాహం తరువాత రిలీజ్ అయి హిట్స్ సాధించింది. అంతేకాదు వివాహం తరువాత కూడా సమంతకు ఆఫర్లు తగ్గలేదు. ఈ క్రమంలోనే సమంతా ఇప్పుడు మూడు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది.

మూడు హిట్స్ అందుకుని జోరుమీదున్న సమంతా..
ఈ ఏడాది ఇప్పటికే 'రంగస్థలం', 'మహానటి', 'అభిమన్యుడు' రాజుగారి గది వంటి హిట్లతో మంచి ఊపు మీదున్న కథానాయిక సమంత, ప్రస్తుతం మరో మూడు సినిమాలతో బిజీగా వుంది. సీమరాజా, యూ టర్న్, సూపర్ డీలక్స్ చిత్రాలతో ఆమె బిజీగా వుంది. 'ఈ ఏడాది ఫస్టాఫ్ అద్భుతంగా గడచిపోయింది. సెకండాఫ్ కి రెడీ అవుతున్నాను' అంటూ సమంతా తాజాగా ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రాలకు డబ్బింగ్ మొదలెట్టింది.

వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు..
ప్రస్తుతం వంశీ పైడిపల్లితో ఓ చిత్రాన్ని చేస్తున్న మహేశ్ బాబు, దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పనిచేయనున్నాడు. ఇందుకు సంబంధించిన స్క్రిప్టును సుకుమార్ సిద్ధం చేసి, మహేశ్ కి వినిపించాడని, మహేష్ సంతృప్తి వ్యక్తం చేశాడని తెలుస్తోంది.

Pages

Don't Miss

Subscribe to RSS - సమంత