సంజయ్ దత్

15:45 - April 24, 2018

ముంబై: బాలీవుడ్ ఫిల్మ్ స్టార్ సంజయ్ దత్ జీవిత కథను ఆధారం చేసుకుని తీస్తున్న సంజూ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. సంజయ్ దత్ రోల్‌ను రణ్‌బీర్ కపూర్ పోషిస్తున్నాడు. ఈ ఫిల్మ్‌ను రాజ్‌కుమార్ హిరానీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సంజయ్ తన జీవితంలో ఎదుర్కొన్న భిన్న పరిస్థితులను ఈ ఫిల్మ్‌లో చూపించనున్నారు. సినీ లైఫ్‌ను ఎలా ఎంజాయ్ చేశాడో.. అక్రమ ఆయుధాల కేసులో ఎలా జైలుకు వెళ్లాల్సి వచ్చిందో ఈ ఫిల్మ్‌లో ప్రజెంట్ చేయనున్నారు. దత్ జీవితంలోని వివిధ కోణాలను నవ్వుకునే రీతిలో తెరకెక్కించారు. ఈ సినిమాలో పరేశ్ రావల్, మనీషా కోయిరాలా, అనుష్కా శర్మ, సోనమ్ కపూర్, దియా మీర్జా, విక్కీ కౌశల్, జిమ్ సార్బా, బోమన్ ఇరానీలు కూడా ఉన్నారు. 

10:42 - October 9, 2017

బాలీవుడ్ లో బయోపిక్ ల హావా కొనసాగుతోంది. గతంలో..ఇటీవలే ప్రముఖ రాజకీయ, క్రీడా..ఇతర రంగాలకు చెందిన వ్యక్తుల జీవిత చరిత్ర ఆధారంగా పలు సినిమాలు నిర్మితమైన సంగతి తెలిసిందే. ఆయా పాత్రల్లో హీరోలు..హీరోయిన్లు నటించి అభిమానుల మెప్పు పొందారు. పలు చిత్రాలైతే కలెక్షన్ల వర్షం కురిపించాయి. తాజాగా బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ గా వెలిగిన 'సంజయ్ దత్' జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది.

రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'రణబీర్ కపూర్' నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పలు విశేషాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అచ్చు సంజయ్ దత్ గా 'రణ బీర్' కనిపిస్తుండడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంజయ్ దత్ జీవితంలోని పలు కీలక ఘట్టాలను ఎలా తెరకెక్కిస్తారనేది ఉత్కంఠను కలుగ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే చిత్ర బృందం సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ ఫిల్మ్ కు 'సంజూ' అని టైటిల్‌ పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో 'సంజయ్‌ దత్‌'ను ముద్దుగా 'సంజూ బాబా' అని పిలుస్తారనే సంగతి తెలిసిందే. కానీ చిత్ర బృందం మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. పరేశ్ రావల్..మనీషా కోయిరాలా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 30వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు టాక్. 

11:56 - August 31, 2017

బాలీవుడ్ అలనాటి హీరో 'సంజయ్ దత్' చాలా ఏళ్ల అనంతరం మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నాడు. ప్రస్తుతం 'భూమి' సినిమాలో నటిస్తున్న 'సంజు' మరో చిత్రానికి సైన్ చేసేశాడు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైల ర్ ఇటీవలే విడుదలైంది. గత చిత్రాల్లో సంజయ్ ఎలా కనిపించారో అలాగే ట్రైలర్ లో కనిపించడం అభిమానులను సంతోష పరుస్తోంది.

ఇదిలా ఉంటే 'భూమి' చిత్రాన్ని రూపొందిస్తున్న ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో మరో చిత్రం రూపొందనుంది. 'ద గుడ్ మహారాజ' పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'సంజయ్' నటించబోతున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్, నవానగర్ మహారాజా సాహిబ్ దిగ్విజయ్ సింగ్జీ రజింత్ సింగ్జీ పాత్రలో కనిపించనున్నాడు.

సాహిబ్ చరిత్ర పుటల్లో నిలిచిన సంగతి తెలిసిందే. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వందలాది మంది చిన్నారులకు ఆశ్రయం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ కథను వెండి తెరపై చూపించబోతున్నారు. మహారాజాకు సంబంధించిన కొన్ని ఫోటోలు లభ్యమయ్యాయని తెలిపిన దర్శకుడు వాటి ఆధారంగానే సంజయ్ దత్ లుక్ ను డిజైన్ చేసినట్టుగా తెలిపారు. సినిమాను భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ చిత్రంగా తెరకెక్కించనున్నారు.

13:08 - August 18, 2017

బాలీవుడ్ లో సీనియర్ స్టార్ అయిన ‘టబు’ అతిథి పాత్రలో కనిపించబోతోంది. టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ అనంతరం సినిమాలు చేయలేదు. పాండురంగడు చిత్రంలో టాలీవుడ్‌లో చివరిసారిగా కనిపించింది టబు. బాలకృష్ణ పక్కన భక్తి చిత్రంలో కూడా నటించిన సంగతి తెలిసిందే.  ఈ మధ్య తల్లి పాత్రలో ఫితూర్ – హైదర్ వంటి సినిమాల్లో టబు నటించింది. తాజాగా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

సంజయ్ పాత్రలో యంగ్ హీరో రణబీర్ కపూర్ నటిస్తుండగా అతిథి పాత్రలో ‘టబు’ నటిస్తోంది. 2004 రిలీజ్ అయిన మున్నాభాయ్ ఎంబీబీయస్ సినిమాకు గానూ టబు చేతుల మీదుగా సంజయ్ అవార్డు అందుకున్నాడు. ఇప్పుడు అదే సినిమా కోసం అతిథి పాత్రలో నటించేందుకు టబు అంగీకరించింది. తన రియల్ లైఫ్ క్యారెక్టర్ లోనే రీల్ లైఫ్ లోనూ నటించనుంది. పరేశ్ రావల్, మనీషా కోయిరాల, సోనమ్ కపూర్, దియా మీర్జా, అనుష్క శర్మ తదితర నటులు నటిస్తున్నారు. 

07:48 - August 11, 2017

బాలీవుడ్ నటుడు 'సంజయ్ దత్' ఈజ్ బ్యాక్ అంటున్నారు ఆయన అభిమానులు. ఎందుకంటే ఆయన నటించిన తాజా చిత్రం 'భూమి' ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్ర ట్రైలర్ చూసిన ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జైలు శిక్ష కారణంగా సినిమాలకు దూరమైన సంజయ్ దత్.... శిక్ష ముగిసిన తర్వాత తొలి సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంజయ్ దత్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'భూమి' చిత్రానికి ఓమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో ఆదితి..సంజయ్ దత్ లు తండ్రి కూతుళ్లుగా నటిస్తున్నారు. గురువారం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. ట్రైలర్ లో సంజయ్ ఫెర్మామెన్స్ చూసిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ట్రైలర్ చూసిన అనంతరం చిత్రంపై మరింత అంచనాలు పెరిగిపోయాయని పేర్కొంటున్నారు.

కూతురును ఎంతగానే ప్రేమించే తండ్రి పాత్రలో కనిపించిన సంజయ్.... కొన్ని సంఘటనల కారణంగా ఇబ్బందుల్లో పడ్డ తన కూతురును కాపాడుకోవడానికి ఏం చేశాడు అనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారు. సెప్టెంబర్ 22, 2017న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

15:30 - August 10, 2017

హైదరాబాద్: దాదాపు రెండున్న‌ర ఏళ్ళ త‌ర్వాత భూమి అనే చిత్రంలో న‌టించిన సంజ‌య్ ద‌త్ తాజాగా త‌న చిత్ర ట్రైల‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ ట్రైల‌ర్ ప్ర‌తి ఫేం ఆడియ‌న్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ట్రైల‌ర్ చూసిన ఫ్యాన్స్ మూవీపై భారీగా హోప్స్ పెట్టుకున్నారు. చిత్రం త‌ప్ప‌క విజ‌యం సాధిస్తుంద‌నే ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భూమి చిత్రం తండ్రి, కూతురు నేపథ్యంలో రూపొందుతుండగా ఇందులో సంజయ్ కూతురిగా అదితి రావు హైదరి నటిస్తుంది. సందీప్ సింగ్ మరియు భూషన్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని టీ- సిరీస్ బేనర్ పై నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 22, 2017న ఈ మూవీ విడుద‌ల కానుండ‌గా ఈ చిత్రం ఫ్యాన్స్ కి ప‌క్కా ట్రీట్ ఇస్తుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. ఈ మూవీ పూర్తైన త‌ర్వాత సంజ‌య్ ద‌త్ మ‌రికొన్ని సినిమాలు చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం అవి ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్నాయి.

12:06 - July 29, 2017

బాలీవుడ్ హీరో 'సంజయ్ దత్' జైలు నుండి విడుదలైన తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ నటుడు ఓ చిత్రంలో నటిస్తూ బిజీగా నటిస్తున్నాడు. డైరెక్టర్ ఓమంగ్ కుమార్ దర్వకత్వం వహిస్తున్న సినిమాలో 'సంజయ్ దత్' హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు 'భూమి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తండ్రి..కూతురు నేపథ్యంలో చిత్ర కథ సాగుతుందని టాక్ వినిపిస్తోంది.
సంజయ్ దత్ కూతురిగా ఆదితి రావు హైదరి నటిస్తోంది. సందీప్ సింగ్, భూషణ్ కుమార్ లు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన లుక్ ను విడుదల చేసింది. ఈ ఫొటో లో సంజయ్ దత్ రఫ్ గా కనిపిస్తున్నాడు. సెప్టెంబర్ 22వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

21:28 - July 27, 2017

మహారాష్ట్ర : బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు కష్టాలు తీరేలా కనిపించడం లేదు. వీఐపీ స్టేట‌స్ వ‌ల్లే సంజ‌య్‌ద‌త్‌ను ముందుగానే జైలు నుంచి విడుద‌ల చేసిన‌ట్లు భావిస్తే.. అత‌న్ని తిరిగి జైలుకు పంపొచ్చని మ‌హారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు స్పష్టంచేసింది. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారన్న కేసులో జైలుకు వెళ్లిన సంజయ్‌దత్‌- సత్‌ప్రవర్తన కారణంగా 8 నెలల ముందే విడుదలయ్యారు. ద‌త్ ప్రవ‌ర్తన బాగున్నట్లు అధికారులు ఎలా నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు? అత‌ను శిక్షా కాలంలో స‌గం పెరోల్‌పై బ‌య‌టే ఉన్నపుడు అత‌ని ప్రవ‌ర్తన‌ను ఎలా అంచ‌నా వేశారని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం- సంజయ్‌ విడుదలపై నిబంధనలు అతిక్రమిస్తే మళ్లీ అతనికి జైలుకు పంపడంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కోర్టుకు తెలిపింది. 1993 బాంబు పేలుళ్ల సంద‌ర్భంగా సంజ‌య్‌ద‌త్ అక్రమంగా ఆయుధాలు క‌లిగి ఉన్నాడ‌న్న కేసులో సుప్రీంకోర్టు అత‌నికి ఐదేళ్ల శిక్ష విధించిన విషయం తెలిసిందే. సంజయ్‌ను 8 నెలలు ముందుగా విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త ప్రదీప్‌ భాలేకర్ ముంబై హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

11:29 - May 24, 2017

బాలీవుడ్ నటుడు 'సంజయ్ దత్' త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ముంబై బాంబు పేలుళ్ల ఘటనలో శిక్ష అనుభవించి జైలు నుండి రిలీజైన 'సంజయ్' మళ్లీ మేకప్ వేసుకొనేందుకు సిద్ధమౌతున్నాడు. తాజాగా ఆయన న్యూ గెటప్ బయటకొచ్చింది. సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ అవుతోంది. గ్యాంగ్ స్టర్ పాత్రలో 'సంజయ్ దత్' నటించనున్నారని తెలుస్తంది. గతంలో 'వాస్తవ్', 'ఖల్ నాయక్', 'కాంటే', 'మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్' లాంటి చిత్రాల్లో 'సంజయ్' ఆయా పాత్రల్లో ఒదిగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి డాన్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. తిగ్మన్షు దులియా 'సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్' సిరీస్ లో వస్తున్న చిత్రంలో 'సంజయ్' గ్యాంగ్ స్టర్ నటించనున్నారు. ఆగస్టు నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. ఇందులో ఆయన పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే చిత్రం విడుదలయ్యే వరకు ఓపిక పట్టాల్సిందే.

12:04 - February 21, 2017

సినిమాలు రెండు రకాలుగా డివైడ్ చేస్తే అవి ఒకటి కమర్షియల్ సినిమాలు, రెండు అవార్డు సినిమాలుగా మనకి దర్శనం ఇస్తాయి. కానీ అవార్డు వచ్చిన సినిమాలు కొన్ని కమర్షియల్ గా హిట్ ఐన సందర్భాలు ఉన్నాయ్. కధ బాగుంది ,కధనం కట్టిపడేసింది. నటీనటుల యాక్టింగ్ పీక్స్ లో ఉంది, ఇంకేం కావలి ఒక సగటు సినిమాని సగటు ప్రేక్షకుడి దగ్గరకు చేర్చడానికి. ఇలా తెలుగు ఆడియన్ కి రీచ్ ఐన సినిమాలు నేటివిటీ టచ్ ని తుడిచేసి హిందీ లో రీమేక్ అవుతున్నాయి. అలాంటి సినిమా ఒకటి హిందీ లో ఎంట్రీ కోసం రెడీ గ ఉంది. 
రెండు నంది అవార్డులు, రెండు ఫిలిం ఫేర్ అవార్డులు 
2010  లో రిలీజ్ ఐన ఒక తెలుగు సినిమా రెండు నంది అవార్డులను, రెండు ఫిలిం ఫేర్ అవార్డులను గెలుచుకుంది అదే దేవా కట్ట డైరెక్షన్ లో వచ్చిన ప్రస్థానం అనే సినిమా. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో స్టోరీ లో డెప్త్ మైంటైన్ చేస్తూ సాగిన ఈ సినిమా  శర్వానంద్ కెరీర్ ది బెస్ట్ ఫిలిం అనిపిచ్చుకుంటే, సాయికుమార్ నట ప్రస్థానంలో మైలు రాయిగా నిలిచింది. దేవాకట్టా మాటలు ఎమోషన్స్ కి సరిపడా ఉన్నాయ్. ఒక కుటుంబకథకు రాజకీయ నేపధ్యం కల్పించి తెరకెక్కించిన ఈ సినిమా క్రిటిస్ నుండి కూడా పాజిటివ్ రిపోర్ట్ తో వచ్చింది .
రీమేక్ లో సంజయ్ దత్  
తెలుగు ఆడియన్స్ కి నచ్చిన ఈ మూవీ ని హిందీ లో రీమేక్ చేయాలనీ ఎప్పటినుండో దేవాకట్టా ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇంతకాలానికి తన ప్రయత్నాలు నెరవేరయని తెలుస్తుంది. తాజాగా ప్రస్థానం మూవీని సంజయ్ దత్ రీమేక్ చేయబోతున్నాడని సమాచారం. తెలుగులో ఈ చిత్రాన్ని చూసిన సంజయ్ దత్ బాగా ఇంప్రెస్స్ అయినట్టు, దేవా కట్ట కూడా రీమేక్ కు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అంతేగాక స్వయంగా ఆయనే ఈ మూవీ ని నిర్మిస్తారని అంటున్నారు. ప్రస్థానం తరువాత దేవకట్టకు సరైన హిట్ లేకపోవడం తో హిందీ లో ఈ సినిమా ని రీమేక్ చెయ్యాలని గట్టిగ ట్రై చేస్తున్నాడు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - సంజయ్ దత్