వైసీపీ

15:32 - November 16, 2018

అమరావతి : రాజకీయాలలో అపర చాణుక్యుడిగా పేరొందిని ఏపీ సీఎం చంద్రబాబు సీబీఐని ఏపీలో నిషేధిస్తున్న తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా నిలిచింది. రాజకీయ విశ్లేషకుల నుండి న్యాయ విశ్లేషకుల వరకూ ఈ అంశంపైనే చర్చిస్తున్నారు. అంతేకాదు చంద్రబాబు వ్యూహం ఏమిటా? అని విశ్లేషకులు సైతం ఆలోచిస్తున్నారు. ఈ అంశంపై తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి చంద్రబాబు వ్యూహం ఏమిటీ? 

Image result for CHANDRABABU ON CBI NO ENTRYఉప్పు, నిప్పుగా వున్న కేంద్ర ప్రభుత్వం ఏపీపై విమర్శనాస్త్రాలను సంధిస్తోంది. వేల కోట్ల అవినీతి ఏపీలో జరుగుతోందని బీజేపీ నేత జీవిఎల్ లాంటి వారు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై సీపీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. దీంతో ఇటీవల విశాఖ పట్నం ఎయిర్ పోర్టులో జగన్ పై హత్యాయత్నం కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు హైకోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ దాడులు జరగవచ్చన్న అనుమానం చంద్రబాబుకు చాలా కాలంగానే ఉందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఇప్పుడు సీబీఐ రాష్ట్రంలో దాడులకు రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు సీబీఐని ఏపీలోకి రాకుండా నిషేధించినట్టు ప్రచారం జరుగుతోంది..

Image result for CHANDRABABU and mamata banerjeeజగన్ పై హత్యాయత్నం జరిగాక చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్ ఇంతవరకూ ఏమీ తేల్చలేదు. నిందితుడు శ్రీనివాస్ వెనుక ఎవరున్నారన్నది కనిపెట్టలేదు. అయినా సిట్ బాబు కనుసన్నల్లోనే నడిచి కేసు నీరుగారుస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ పై హత్యాయత్నం కేసు హైకోర్టు కెక్కడం.. సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ నేతలు కోరుతున్న నేపథ్యంలోనే చంద్రబాబు సర్కారు సీబీఐని నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం ఆసక్తి రేపుతోంది. కాగా సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని హర్షించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తమ రాష్ట్రంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించే దిశగా నిర్ణయాలు తీసుకునేందుకు యత్నిస్తున్నామని తెలపటం విశేషంగా చెప్పుకోవచ్చు. 

దీంతో జగన్ పై దాడి కేసు నుండి దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు అలెర్ట్ అయ్యి సీబీఐ ఏపీలోకి రాకూడదంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోపక్క కానీ న్యాయనిపుణులు మాత్రం చంద్రబాబు వేసిన ఎత్తులు కోర్టుల ముందు నిలబడే అవకాశం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహం ఫలించేనా? ఏపీలో సీబీఐ దాడులు ఆగేనా? కోడి కత్తి వ్యవహారం తేలేనా? అనే విషయాలు తేలాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
 

13:31 - November 16, 2018

విజయవాడ : ఏపీలో సీబీఐకి ఎంట్రీ లేదంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. సీబీఐ విచారణకు ప్రభుత్వం భయపడే సాధారణ సమ్మతి నోటిఫికేషన్ వెనక్కి తీసుకుందని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా తప్పుబడుతోంది. నాలుగేళ్ల కాలంలో పలు అక్రమాలు జరిగాయని..ఎంతో అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపిస్తూ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తోంది. ఈ తరుణంలో సీబీఐకు అనుమతించిన కన్సెంట్‌ను విరమించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 15వ తేదీ గురువారం సంచలన నిర్ణయం తీసుకొంది. 
ప్రభుత్వం తీసుకున్ని నిర్ణయంపై నవంబర్ 16వ తేదీ శుక్రవారం వైసీపీ స్పందించింది. రాజధాని భూ సేకరణ...పోలవరం...పట్టిసీమ, మిగిలిన ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందని గత కొంతకాలంగా వైసీపీ ఆరోపిస్తోంది. అంతేగాకుండా విశాఖ భూ కుంభకోణంపై సిట్ విచారణ సరిపోదని, సీబీఐ విచారణ చేయించాలంటూ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా అగ్రిగోల్డ్..ఉపాధి హామీ పథకంలో భారీగా జరిగిన స్కాం..రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీరు - మీరు పథకంలో కూడా అవకతవకలు జరిగాయని పేర్కొంటోంది. జగన్ పై జరిగిన దాడి కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని వైసీపీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. 
వీటన్నింటిపై తాము సీబీఐ విచారణ డిమాండ్ చేయడం జరిగిందని, విచారణలో అవినీతి ఎక్కడ బయటపడుతోందనని భయపడి ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వైసీపీ పేర్కొంటోంది. సీబీఐ దర్యాప్తు లేకపోతే అవినీతి తారాస్థాయికి చేరుకుంటుందని వైసీపీ పేర్కొంటుంటే దీనిని ప్రభుత్వం తప్పంటోంది. సీబీఐ డైరెక్టర్ అధికారి అవినీతిలో ఇరుక్కపోయారని..దీనితో సీబీఐపై నమ్మకం లేదని..నిజాయితీగా పనిచేయడం లేదని ప్రభుత్వం పేర్కొంటోంది. రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బందులు కలుగవని ఏపీ సర్కార్ వెల్లడిస్తోంది. 

21:26 - November 13, 2018

తూర్పుగోదావరి : జిల్లాలోని రామచంద్రాపురంలో పర్యటిస్తున్న నేపథ్యంలో  వైసీపీ అధ్యక్షుడు జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో ఘాటు  విమర్శలు చేశారు. జగన్ పై తాను  వ్యక్తిగతంగా విమర్శించడం లేదని పవన్ క్లారిటీ ఇచ్చి మరీ విమర్శలు సంధించారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వెళ్లి ప్రజాసమస్యలపై చర్చించకుండా..ప్రశ్నించకుండా తనపై విమర్శలు చేయటం సరికాదన్నారు. అసెంబ్లీకి వెళ్లి సీఎంను నిలదీయాల్సిన బాధ్యత ప్రజలు వైసీపీకి ఇచ్చారని... కానీ ప్రతిపక్ష నాయకుడు బుగ్గలు నిమరడం తప్ప ప్రశ్నించడంలేదన్నారు. బడుగు బలహీన వర్గాలు అండగా ఉంటామన్న వైసీపీ.. రెల్లికులస్థుల భూములను ఆ పార్టీ నేత దోచుకున్నా పట్టించుకున్న నాథుడు లేడన్నారు. ఒక ఎమ్మెల్యే, ఎంపీలేని తానే ఇన్ని ప్రజా సమస్యలకు పరిష్కారం కనుక్కుంటున్నానని.. వైసీపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు పవన్.
 

 

14:40 - November 13, 2018

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ పై విమానాశ్రయంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే తనపై దాడి జరిగిందని జగన్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణను ఏపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని పిటిషన్ లో ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఈ హత్యాయత్నంపై విచారణ జరిపించాలని పిటీషన్ లో జగన్  కోరారు. ఈ నేపథ్యంలో నేడు జగన్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ ఆర్పీ ఠాకూర్ సహా 8 మందికి నోటీసులు జారీచేసింది. రెండు వారాల్లోగా ఈ విషయమై తమ ప్రతిస్పందనను తెలియజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పోలీసులు జరిపిన విచారణ నివేదికను సీల్డ్ కవర్ లో సమర్పించాలని సూచించింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది. కాగా అక్టోబర్ 25న హైదరాబాద్ కు వస్తున్న జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. 
 

17:30 - November 10, 2018

విజయవాడ: కత్తి దాడి గాయం నుంచి కోలుకున్న ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ప్రజల మధ్యకు రానున్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు.  ఈ నెల 12 నుంచి ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటానని జగన్ వెల్లడించారు. ఈ మేరకు ‘12వ తేదీ నుంచి మీ మధ్యకు వస్తున్నా. మీతోనే ఉంటా’ అన్న పేరుతో ఫేస్‌బుక్‌లో శనివారం పోస్ట్ పెట్టారు.
అభిమానుల ప్రార్థనలు, దేవుడి ఆశీస్సులు, తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దీవెనలతో కత్తిదాడి నుంచి తాను కోలుకున్నానని జగన్ తెలిపారు. కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలతో కలిసి అడుగులు వేసేందుకు, వారికి భరోసా ఇచ్చేందుకు ఈ నెల 12 నుంచి ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటానని వెల్లడించారు.
గత నెల 25న విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో జగన్‌పై శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో జగన్ ఎడమ చేతికి 9 కుట్లు పడ్డాయి. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న జగన్ తిరిగి పాదయాత్ర ప్రారంభించనున్నారు. 
కాగా, జగన్‌పై హత్యాయత్నం ఘటనపై ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం 11 గంటలకు మీడియా ముందుకు రానున్నారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ మీడియాను ఉద్దేశించి మాట్లాడనున్నారు. జగన్‌పై దాడి తదనంతర పరిణామాలపై ఆమె వివరణ ఇవ్వనున్నారు.

12:19 - November 10, 2018

కడప : సీనియర్ నేత సి.రామచంద్రయ్య రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ జంపింగ్ కు సిద్ధపడ్డారు. పార్టీలు మారటంలో ఆయనదిట్ట. ఈ క్రమంలో వైసీపీలో చేరనున్నారు. 1981లో రాజకీయాల్లోకి ప్రవేశించిన రామచంద్రయ్య 1985లో కాంగ్రెస్ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది మంత్రిగా పనిచేశారు. 
కాంగ్రెస్ పార్టీ మాజీ నేత సి.రామచంద్రయ్య వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీడీపీతో కాంగ్రెస్ జతకట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రామచంద్రయ్య కొద్దిరోజుల క్రితం పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఈ నెల 13న బొబ్బిలిలో జరగనున్న బహిరంగ సభలో జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు.ఆ తర్వాత కాలక్రమంలో టీడీపీలో చేరిన రామచంద్రయ్యకు చంద్రబాబు పొలిట్ బ్యూరో సభ్యుడి హోదాను కట్టబెట్టారు. తదనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో ఆయన 2008లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో ఎమ్మెల్సీగా గెలుపొంది దేవాదాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేసిన తరువాత..గతంలో టీడీపీలో కూడా పనిచేసిన రామచంద్రయ్యకు ఇప్పుడు టీడీపీ, కాంగ్రెస్ కలవటం ఇష్టం లేదట. అందుకనే రామచంద్రయ్యగారు వైసీపీలో చేరుతున్నారట. ఎక్కడ పదవులు దక్కుతాయంటే అక్కడ కాకుల్లా వాలిపోవటం రాజకీయనేతలకు పరిపాటే. కానీ దాని ఎక్కడ లేని వంకలు పెట్టకుని ప్రజలను మోసం చేసేస్తు వారి పబ్బం గడుపుకోవటం వారికి అలవాటే.కాకపోతే ఇటువంటి నేతల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండి ఓటు వేసే సమయంలో ఆలోచించాల్సిన అవుసరముంది. 
 

07:07 - November 5, 2018

అనంతపురం  : ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తు ఏమాటనైనా కుండ బద్ధలు కొట్టినట్లుగా మాట్లాడే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తన స్టైల్ లో స్పందించారు. ప్రతిపక్ష నేత జగన్ పై విరుచుకుపడ్డారు. రెడ్లకు, రాష్ట్రానికి  జగన్ శనిలా దాపురించాడని మండిపడ్డారు.  కోడికత్తితో చిన్న గాయమైతే దానికిన్ని డ్రామాలు అవసరమా? అని ప్రశ్నించారు.శ్రీకాకుళం జిల్లా తిత్లీ తుపాను కారణంగా తీవ్ర నష్టాల పాలైతే జగన్ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు. జగన్‌కు కామన్‌సెన్స్ అనేదే లేదన్న జేసీ.. పట్టిసీమను వద్దన్న మూర్ఖుడు అని విమర్శించారు.చంద్రబాబు సీఎం అయితేనే అనంతపురం జిల్లాకు నీళ్లొస్తాయన్న జేసీ.. ఆయన్ను పట్టుదల, విజన్ ఉన్న నాయకుడిగా అభివర్ణించారు.

14:58 - November 3, 2018

ప్రకాశం : జాతీయ మూడో ఫ్రంట్ కు తెర తీసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీ, వైసీపీ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వరజమెత్తారు. ఒంగోలులో రెండో రోజు కొనసాగుతున్న నేపథ్యంలో మాట్లాడుతూ.. ఏపీకి ఇచ్చిన హామీల ప్రకారం విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేటాయించకుండా అభివృద్ధికి అవరోధం కల్పిస్తోందని తెలిపారు. విభజన చట్టాన్ని అమలు చేయకపోగా రాష్ట్రంపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నారు.  దీంతో ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి డిమాండ్ చేసిన ప్రజా ప్రతినిధులపై కేంద్రం ఐటీ దాడులు చేయిస్తోందనీ.. అందుకే ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతాం. అడుక్కుంటే లాభం లేదు. ఎన్టీఆర్‌ స్ఫూర్తి మనది. మనది ఒక వ్యవస్థ. దేశానికి సమస్య వచ్చినప్పుడు దారి చూపే పార్టీ మనది. ధర్మంకోసం, న్యాయం కోసం పారాడుతాం. ఎవరికి భయపడను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. 

Image result for chandrababuవచ్చే ఎన్నికలు ఏకపక్షంగా ఉం డాలి. కోడికత్తి, జెల్లికట్టు, పోలవరం కాలువలు తెగొట్టడం, అసెంబ్లీకి రాకపోవటం, పార్లమెంట్‌లో రాజీనామాలు చేయటం మనకు తయారైన ప్రతిపక్షం పనిగా పెట్టుకుందని ఎద్దేవా చేశారు. ఓటు వేసే బాధ్యత మీది...జీవన ప్రమాణాలు, ఆదాయం పెంచే బాధ్యతను తాను తీసుకుంటానని మార్టూరు మండలం డేగరమూడిలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించిన గ్రామదర్శినిలో సభలో చంద్రబాబు పిలుపునిచ్చారు.

11:16 - November 2, 2018

హైదరాబాద్ : వైసీసీ అధ్యక్షుడు జగన్ పాదయాత్ర మరోసారి వాయిదా పడనుందా ? గాయంతో ఆయన కోలుకోలేదని తెలుస్తోంది. ఆయన చేయి ఏ మాత్రం పైకి లేవడం లేదని..సహకరించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. Image result for jagan attack caseహైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోని ఆయన నివాసంలో జగన్ విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు మరోసారి వైద్యులు ఆయన్ను పరిక్షీంచనున్నారు. విశాఖకు వెళ్లి శనివారం నుండి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించాలని జగన్ యోచించారు. కానీ గాయం మానకపోవడంతో వైద్యులు మరో వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలుస్తోంది. యాత్ర చేసే సమయంలో ఇబ్బందులు వస్తాయని వైద్యులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీనితో నవంబర్ 10వ తేదీ నుండి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించాలని వైసీపీ యోచిస్తోందని తెలుస్తోంది. దీనిపై వైసీపీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 
Image result for jagan attack caseవిశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే వ్యక్తి జగన్ పై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో టీడీపీ - వైసీపీ పార్టీల మధ్య మరింత చిచ్చు రేపింది. ఘటనకు ప్రభుత్వమే బాధ్యత అని, సీఎం చంద్రబాబు నాయుడు హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఘటన జరిగిన అనంతరం నేరుగా జగన్ హైదరాబాద్ కు వచ్చారు. మరోవైపు శ్రీనివాసరావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఆయన కస్టడీ శుక్రవారంతో ముగినుంది. 

09:32 - November 2, 2018

విశాఖపట్టణం : వైసీపీ అధ్యక్షుడు జగన్ పై దాడి కేసు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. Image result for Jagan Mohan Reddy Going Vishakaఈ ఘటనతో టీడీపీ - వైసీపీ పార్టీల మధ్య మరింత చిచ్చు రేపింది. ఘటనకు ప్రభుత్వమే బాధ్యత అని, సీఎం చంద్రబాబు నాయుడు హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఘటన జరిగిన అనంతరం నేరుగా జగన్ హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ కు వచ్చిన ఏపీ పోలీసులకు జగన్ స్టేట్ మెంట్ ఇవ్వలేదని ప్రచారం జరిగింది. ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని..జాతీయ సంస్థలతో విచారణ చేయించాలని జగన్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిని కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. 
Image result for Jagan Mohan Reddy Going Vishakaమరోవైపు చికిత్స అనంతరం..విశ్రాంతి తీసుకున్న జగన్ శుక్రవారం విశాఖలో అడుగు పెట్టనున్నారు. పాదయాత్రను తిరిగి ప్రారంభించడానికి ఆయన హైదరాబాద్ నుండి బయలుదేరనున్నారు. దీనితో సిట్ పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖ ఎయిర్ పోర్టులో అడుగు పెట్టిన అనంతరం జగన్ స్టేట్ మెంట్ తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ దర్యాఫ్తునకు సహకరించాలని, తమకు స్టేట్ మెంట్ ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. కానీ జగన్ స్టేట్ మెంట్ ఇస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - వైసీపీ