విశ్వరూపం

18:57 - August 10, 2018

2013లో వచ్చిన 'విశ్వరూపం' చిత్రానికి సీక్వెల్‌గా 'విశ్వరూపం 2' రూపొందించారు. కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. పూజా కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్ ముఖ్య పాత్రలు పోషించారు. కానీ పలు కారణాల వల్ల ఐదేళ్ల తరవాత ఈ సినిమా శుక్రవారం రిలీజైంది. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్ర రివ్యూ...రేటింగ్ కోసం వీడియో క్లిక్ చేయండి.

 

12:47 - August 2, 2018

హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు 'కమల్ హాసన్' హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయన నటించిన 'విశ్వరూపం 2' త్వరలో విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఆయన హైదరాబాద్ కు వచ్చారు. గురువారం ముంబై నుండి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు రానా, హీరోయిన్ పూజలున్నారు. వీరికి దర్శకుడు జిబ్రాన్, మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ స్వాగతం పలికారు. అనంతరం పార్క్ హయత్ హోటల్ కు వెళ్లారు. 

11:03 - July 4, 2017

హిందూ ప్రజల బంధువు శ్రీ నందమూరి బాలి కాకయ్యది ఒక వీడియో బయటకొచ్చిందుల్లో. కాకయ్యకు ఎంత బలుపు ఉంటది..ఎంత మస్తీ ఉంటది..ఆయన ఏషాలు ఎట్లుంటయి..అన్ని వేరియేషన్ లో ఒక్కటే వీడియోలో చూపెట్టిండు. ఏ పుణ్యాత్ముడు తీసిండో ఆ వీడియో గాని మొత్తం మీద 'మల్లన్న ముచ్చట్లు' దాక చేరింది. ఇక్కడ దాక వస్తే మీ దాక వచ్చినట్లే గదా..మరి బాలయ్య ఏమి చేసిండో..తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

22:10 - July 23, 2016

ఢిల్లీ : టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ చరిత్ర సృష్టించాడు. ఆంటీగా లోని సర్ వీవ్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న తొలిటెస్ట్ రెండోరోజుఆటలో...డబుల్ సెంచరీతో విశ్వరూపం ప్రదర్శించాడు. టీమిండియా 566 పరుగుల భారీస్కోరు సాధించడంలో ప్రధానపాత్ర వహించాడు. తన కెరియర్ లో తొలి అంతర్జాతీయ డబుల్ సెంచరీతో రికార్డుల మోత మోగించిన విరాట్ కొహ్లీ పై 10 స్పోర్ట్స్ స్పెషల్ ఫోకస్.....
అసాధారణ నవతరం క్రికెటర్
విరాట్ కొహ్లీ...అంతర్జాతీయ క్రికెట్లో అసాధారణ నవతరం క్రికెటర్. ఫార్మాట్ ఏదైనా సరే..అలవోకగా పరుగులు సాధించడంలో తనకుతానే సాటి. ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్, ఇన్ స్టంట్ వన్డే క్రికెట్...క్లాసికల్ టెస్ట్ క్రికెట్...రూపం ఏదైనా సరే...కొహ్లీ బ్యాట్ పట్టి క్రీజులో అడుగుపెట్టాడంటే చాలు.. పరుగులు జాలువారాల్సిందే... సెంచరీలు మోకరిల్లాల్సిందే...రికార్డులు దాసోహమని తీరాల్సిందే.
మొట్టమొదటి డబుల్ సెంచరీ 
నాలుగుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా...ఆంటీగా వేదికగా వెస్టిండీస్ తో ప్రారంభమైన తొలిటెస్ట్ రెండోరోజుఆటలోనే విరాట్ కొహ్లీ విశ్వరూపం ప్రదర్శించాడు. తన అంతర్జాతీయ కెరియర్ లోనే మొట్టమొదటి డబుల్ సెంచరీ సాధించాడు. ఆరవ నెంబర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ తో కలసి 5వ వికెట్ కు 168 పరుగుల భాగస్వామ్యంతో భారీస్కోరుకు పునాది వేశాడు.283 బాల్స్ లో 24 బౌండ్రీలతో విరాట్ డబుల్ సెంచరీ సాధించాడు. 
విదేశీగడ్డపై డబుల్ సెంచరీ 
విదేశీగడ్డపై డబుల్ సెంచరీ సాధించిన భారత తొలి కెప్టెన్ గా కొహ్లీ చరిత్ర సృష్టించాడు. గతంలో అజార్  సాధించిన 192 పరుగుల రికార్డును కొహ్లీ అధిగమించాడు. కొహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్ లో ఇదే తొలి ద్విశతకం కావడం మరో విశేషం.2006 తర్వాత విదేశీ గడ్డపై డబుల్ సెంచరీ సాధించిన భారత తొలిక్రికెటర్ గౌరవాన్ని విరాట్ సొంతం చేసుకొన్నాడు. అంతేకాదు..కరీబియన్‌ గడ్డపై డబుల్ సెంచరీ సాధించిన ఐదో విదేశీ కెప్టెన్ గా విరాట్ నిలిచాడు.
169 పరుగుల రికార్డును కొహ్లీ తెరమరుగు 
ఆస్ట్రేలియా గడ్డపై కంగారూటీమ్ తో జరిగిన 2014 సిరీస్ లో నమోదు చేసిన అత్యధిక స్కోరు 169 పరుగుల రికార్డును కొహ్లీ తెరమరుగు చేశాడు. ఈ క్రమంలో 12వేల అంతర్జాతీయ పరుగుల క్లబ్ లో విరాట్ కొహ్లీ చోటు సంపాదించాడు. ఈ ఘనత దక్కించుకొన్న8వ భారత క్రికెటర్ గా విరాట్ కొహ్లీ రికార్డుల్లో చేరాడు. విరాట్ కొహ్లీ డబుల్ సెంచరీ స్కోరుతో...విండీస్ పై టీమిండియా 8 వికెట్లకు 566 స్కోరుతో డిక్లేర్ చేయగలిగింది. కరీబియన్ టీమ్ పై భారత్ కు ఇది రెండో అత్యుత్తమ టెస్ట్ స్కోరు కావడం మరో విశేషం. తన కెరియర్ లో ఇప్పటి వరకూ 41 టెస్టులు ఆడిన కొహ్లీకి 72 ఇన్నింగ్స్ లో 11 సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ, 12 హాఫ్ సెంచరీల రికార్డు ఉన్నాయి.
విరాట్ కొహ్లీ ఐదు సెంచరీలు సాధించడం 
విదేశీ సిరీస్ ల్లోనే విరాట్ కొహ్లీ ఐదు సెంచరీలు సాధించడం విశేషం.
తన అభిమాన క్రికెటర్ సర్ వీవ్ రిచర్డ్స్ స్టేడియంలో...రిచర్డ్స్ కామెంట్రీ చెబుతుండగా...టీమిండియా చీఫ్ కోచ్ అనీల్ కుంబ్లే స్టిల్ ఫోటోగ్రాఫర్ అవతారమెత్తిన సమయంలో...కొహ్లీ డబుల్ సెంచరీ పూర్తి చేయడం..ఆధునిక క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన ఘట్టంగా మిగిలిపోతుంది.

 

19:12 - June 19, 2016

రమ్య బెహరా..అతి తక్కువ కాలంలో మంచి సింగర్ గా పేరు తెచ్చుకున్నారు. తన పాటతో శ్రోతలను ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా టెన్ టివి రమ్య బెహరాతో ముచ్చటించింది. తనకు డాడి సెంటర్ ఆఫ్ యూనివర్స్ అని పేర్కొన్నారు. డాడీ అన్నింటికంటే ఎక్కువ అని, మాటల్లో చెప్పలేనన్నారు. తాను ఇంట్లో విశ్వరూపం చూపిస్తానని, అన్నీ నాన్న భరిస్తారన్నారు. అమ్మ..డాడీ తనకు ఇద్దరూ క్లోజ్ అని,
ఏ సమస్య వచ్చినా తాను డాడీతో చర్చించడం జరిగిందన్నారు. ఇంకా ఏమి మాట్లాడారో వీడియోలో చూడండి. 

17:35 - June 19, 2016

ఆదిలాబాద్ : చదువుల తల్లి కొలువైన చోట... అనంతమైన అవినీతి. భక్తులు ఇచ్చే లక్షలాది రూపాయల కానుకలు... ఆలయ సిబ్బంది కైంకర్యం చేస్తున్నారు. చివరికి ఆలయ భూముల్ని సైతం అమ్మకానికి పెట్టినట్టు విజిలెన్స్‌ తనిఖీల్లో తేలింది. ఇదేందని అడిగితే అంతా మాఇష్టం... అంటున్నారు అక్కడి అధికారులు. ఆదిలాబాద్ జిల్లా బాసర సరస్వతీ ఆలయంలో అవినీతి విశ్వరూపం ధరించింది. అధికారులు..సిబ్బంది అన్న తేడా లేకుండా.. ఎవరి స్థాయిలోవారు వసూళ్లకు పోటీపడుతున్నారు. ఇందులో కొందరు పూజారులకు కూడా వాటాలు ముడుతున్నట్టు ఆలయ ఉద్యోగులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.

అమ్మవారి నగలు మాయం..
బాసర క్షేత్రానికి వెళ్లితే చదువుల బాగా వస్తాయని భక్తులు నమ్ముతారు. కాని.. ఆలయంలో చిన్నదో.. పెద్దదో.. ఏదో ఒక కొలువు ఉంటే చాలు. కాసులు బాగా సంపాదించవచ్చని ఇక్కడి ఉద్యోగులు నమ్ముతున్నారు. అక్షరాభ్యాసం నుంచి అన్నప్రాసన, లడ్డూప్రసాదం ఇలా ప్రతిటిక్కెట్ల అమ్మకాల్లో అంతులేని అవినీతి జరుగుతోంది. వీళ్లను అడిగేవారే లేరు. డ్యూటీలు వారే వేసుకుంటారు.. జీతాలు వారే ఇచ్చుకుంటారు. చివరికి బ్యాంక్‌ లాకర్లలో ఉంచిన అమ్మవారి 70కేజీల వెండివీణ, ఇతర నగలు మాయమైనట్టు విజిలెన్స్‌ తనఖీల్లో తేలినా.. ఒక్కరంటే ఒక్కరిపైనా చర్యలు తీసుకోరు. సంవత్సరాలకు సంత్సరాలు ఆలయంలోనే తిష్టవేసి.. అందిన కాడికి మేసేస్తున్నా పట్టించుకునే నాథుడేలేడు. బాసర గుడిలో అవినీతి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే... సిబ్బంది తెలివిగా సమాధానం చెబుతారు. ' తప్పులు జరుగుతుంటాయ్‌.. పైఅధికారులు మెమోలు ఇస్తరు.. మేం సమాధానం ఇస్తాం... వారు సంతృప్తి చెందుతారు.. మధ్యలో మీరడిగేదేంటి..?' అని ఎదురు ప్రశ్నలు వేస్తుంటారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన బంగారు నగల కనిపించకుండా పోవడంతో... విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. అవినీతి జరిగినట్టు తేలింది. అయినా.. ఇక్కడ ఉద్యోగులకు ఏమాంత్రం జంకులేదు. అంతా మామూలే... అంతా మారాజ్యమే అన్నట్టు మాట్లాడుతున్నారు.

బకాయిలు రూ.1కోటి 27లక్షలు..
మరోవైపు.. ఆలయభూములను కూడా కొందరు కబ్జాపెట్టారు. విజిలెన్స్ నివేదికలో ఈ విషయం వెలుగు చూసింది. ఆలయానికి 180ఎకరాల భూమి ఉంది గత కొన్నేళ్లుగా ఆ భూమికి కౌలు కూడా రావడంలేదు. మొత్తం 'కోటి 27లక్షల రూపాయలు' ఆలయానికి రావాల్సిన బకాయిలు ఉన్నట్టు లెక్కలు ఉన్నాయి. అయితే...అవి వసూలు చేసేవారే కరువయ్యారు. అటు కొందరు అర్చకులు కూడా ఆలయభూమిని తమపేరిట మార్చుకుని అమ్మకానికి కూడా పెట్టినట్టు ఆరోపణలొస్తున్నాయి. ఆలయంలో జరుగుతున్న అవినీతి, అవకతవకలపై విజిలెన్స్ నివేదికలు ఇచ్చినా... ప్రభుత్వంలో ఉలుకూపలుకూ లేదు. ఆలయాల అభివృద్ధిపై తెగహడావుడి చేస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కారుకు... బాసర ఆలయంలోని ఆగడాలు కనిపించడంలేదా... అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకుంటుందో లేదో చూడాలి. 

11:52 - May 15, 2016

హైదరాబాద్ : ఐపీఎల్ తొమ్మిదోసీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కొహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. హోంగ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ లయన్స్ తో జరిగిన పోటీలో...ఏబీ డివిలియర్స్ తో కలసి రెండో వికెట్ కు డబుల్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు. కొహ్లీ 55 బాల్స్ లో 5 బౌండ్రీలు, 8 సిక్సర్లతో 109 పరుగులు నమోదు చేస్తే...డివిలియర్స్ కేవలం 52 బాల్స్ లో 10 బౌండ్రీలు, 12 సిక్సర్లతో 129 పరుగులు సాధించాడు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కొహ్లీకి ఇది మూడో సెంచరీ కావడం ఓ రికార్డు. అంతేకాదు..బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 248 పరుగుల భారీస్కోరు సాధించి...మరో రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్ ఒకే ఇన్నింగ్స్ లో ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు సాధించడం కూడా మరో రికార్డుగా మిగిలిపోతుంది. కొహ్లీ- డివిలియర్స్ రెండో వికెట్ కు 229 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. గుజరాత్ లయన్స్ ప్రత్యర్థిగా బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించిన ఘనత కూడా కొహ్లీకే దక్కుతుంది...

 

14:20 - April 7, 2016

హైదరాబాద్ : మాదిగల విశ్వరూప యాత్రకు హైకోర్టు సింగిల్‌ జడ్జ్ అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు లేని శాంతిభద్రతల సమస్య తాను యాత్ర చేస్తేనే వస్తుందా అని ప్రశ్నించారు. సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌ చేస్తామని ప్రకటించారు. యాత్రకు అనుమతి ఇవ్వాలంటూ మందకృష్ణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే ఈ యాత్రతో శాంతిభద్రతల సమస్య వస్తుందని పోలీసుల తరపు లాయర్‌ వాదించారు. పోలీసుల వాదనలో నిజం ఉందన్న కోర్టు. విశ్వరూప యాత్రకు అనుమతి నిరాకరించింది. తమ ఆవేదనను అర్థం చేసుకోవాల్సినవసరం ఉందని, న్యాయవ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతుందని ఆశించామని, ఇక ఏ వ్యవస్థపై నమ్మకం పెట్టుకోవాలని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.  

11:39 - March 9, 2016

తిరుపతి : సీఎం చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖా అయిన నారావారిపల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇక్కడ అడుగు పెట్టనీయమని టిడిపి శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. జాతీయ రహదారిపై బైఠాయించడంతో తిరుపతి - బెంగళూరు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మాదిగ రిజర్వేషన్ వర్గీకరణ కోరుతూ మందకృష్ణ మాదిగ విశ్వరూప చైతన్యయాత్రను చంద్రగిరి నుండి నిర్వహించతలపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం టిడిపి శ్రేణులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా వారు టెన్ టివితో మాట్లాడారు. న్యాయస్థానంలో ఉన్న సమస్య అని, కేవలం పబ్లిషిటి కోసం చేస్తున్నారని విమర్శించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తామని, ఇలాంటి కార్యక్రమాలు చేయడం తగదన్నారు.

07:00 - October 11, 2015

ఢిల్లీ : మార్టినా హింగిస్‌-సానియా మిర్జా జోడీ ఈ ఏడాది తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. కలయా, నిజమా అన్నట్టు ఈ హైదరాబాద్ అమ్మాయి తన స్విట్జర్లాండ్ భాగస్వామితో కలిసి ఈ ఏడాది ఎనిమిదో టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం ముగిసిన చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ జంట తమ సీడింగ్‌కు తగ్గట్టుగా రాణించి విజేతగా అవతరించింది. గంటా 40 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్ పోరులో సానియా-హింగిస్ ద్వయం 6-7, 6-1, 10-8తోసూపర్ టైబ్రేక్‌లో ఆరో సీడ్ హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ జంటపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన సానియా-హింగిస్ జంటకు ప్రైజ్‌మనీగా 2 కోట్ల 13 లక్షలతోపాటు 1వెయ్యి ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఇదిలా ఉంటే 2015 సీజన్‌లో సానియాకు ఇది తొమ్మిదో టైటిల్‌ విజయం కాగా, హింగిస్‌ తో జతకట్టి వరుసగా 8 టైటిల్‌ కావడం విశేషం. ఇంతకు వీరి జోడి వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌ డబుల్స్‌ టైటిళ్లను కైవసం చేసుకున్నారు.

 

Don't Miss

Subscribe to RSS - విశ్వరూపం