విశాఖ

19:34 - September 12, 2018

విశాఖ : రైల్వే డీఆర్ ఎం మీటింగ్ ను ఉత్తరాంధ్ర ఎంపీలు బాయ్ కాట్ చేశారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర అనుసరిస్తున్నవైఖరికి నిరసనగా సమావేశాన్నిఉత్తరాంధ్ర ఎంపీలు బహిష్కరించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో చత్తీస్ గఢ్, ఒడిషా ఎంపీలతో డీఆర్ ఎం సమావేశం అయ్యారు. 

 

13:04 - September 5, 2018

విశాఖ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో ఇసుక కొరత ఏర్పడింది. లారీ ఇసుకను 40వేలకు విక్రయిస్తున్నారు. ఐటీ, రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణ అవసరాలను ఆసరా చేసుకుని ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. ఉచిత ఇసుక పథకానికి తూట్లు పొడుస్తోంది. తమ దందాకు సహకరించని వారిని వేధింపులకు గురిచేస్తూ.. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. 
ప్రభుత్వం ఉచిత ఇసుకని చెబుతున్నా... ఇసుక అమ్మకం
ఏపీలో ప్రభుత్వం ప్రజలందరికీ ఉచిత విధానం అమలు చేస్తోంది. అంటే ఇసుకను ఎవరైనా ఉచితంగా తీసుకెళ్లవచ్చు. కానీ శ్రీకాకుళంలో మాత్రం ఇది అమలు కావడంలేదు.  ఇసుక మాఫియా క్వారీలను తమ గుప్పిట్లోకి తీసుకుంది. ప్రభుత్వం ఉచిత ఇసుకని చెబుతున్నా... లారీ ఇసుక 40వేల రూపాయలకు విక్రయిస్తోంది. విశాఖలో ఐటీ, రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణ అవసరాలను ఆసరా చేసుకుని ఇసుక మాఫియా సొమ్ము చేసుకుంటోంది.  శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేతలు, అధికారులు కుమ్మక్కై ఉచిత ఇసుక పథకానికి తూట్లు పొడుస్తున్నారు.
విశాఖ జిల్లాలో ఇసుక రీచ్‌లకు అనుమతి లేదు
విశాఖ జిల్లాలో ఇసుక రీచ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో రాజమండ్రి, శ్రీకాకుళం నుంచి విశాఖకు ఇసుకను తీసుకొస్తున్నారు. విశాఖలో జరిగే నిర్మాణ అవసరాలకు రోజుకు రాజమండ్రి నుంచి 100 లారీలు, శ్రీకాకుళం నుంచి 250 లారీల ఇసుక వస్తోంది. ఎక్కువ మంది శ్రీకాకుళం నుంచి ఇసుకను తీసుకొస్తున్నారు. ఒక లారీ ఇసుక లోడింగ్‌, ఇతర ఖర్చులకు గాను 2500 తీసుకుంటున్నారు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ సృష్టించడం.. లారీ ఇసుక రేటును 30 నుంచి 40 వేలకు పెంచడం రివాజుగా మారింది.  శ్రీకాకళం నుంచి ఇసుక తీసుకొస్తున్నప్పుడు రెవెన్యూ, పోలీస్‌, విజిలెన్స్‌ ఇలా అన్ని శాఖల అధికారులు ఎక్కడికక్కడ లారీలను ఆపడం, అందినంత దండుకోవడం చేస్తున్నారు. ఒక రేటు నిర్ణయించుకుని అవగాహనతో వెళ్లిపోతున్న సమయంలో ప్రభుత్వం ఇసుకను పూర్తిగా ఉచితంగా చేడయంతో వివాదం మొదలైంది. విశాఖ అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. శ్రీకాకుళం జిల్లాలో ఒకటో, రెండో రీచ్‌లను కేటాయిస్తే.. వాటి నుంచి ఇసుకను తెచ్చుకుంటామని బిల్డర్లు, లారీల యజమానులు కోరుతున్నారు.
రాజకీయ నేతలకు లబ్ధి 
శ్రీకాకుళంలోని కొందరు అధికారులు రాజకీయ నేతలకు లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక మాఫియా తమ దందాకు సహకరించని లారీ యజమానులను వేధింపులకు గురిచేస్తోంది.  సహకరించని లారీ యజమానులను ఎంచుకొని వేధిస్తున్నారు. ఆ లారీలకు బీమా ఇవ్వవద్దని బీమా కంపెనీలకు లేఖలు కూడా రాశారు. గత 15 రోజుల్లో 90 లారీలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్టు లారీ యజమానుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. 
ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్
దళారులు, మాఫియాకు మాత్రమే లాభం చేకూర్చుతున్న ఉచిత ఇసుక విధానాన్ని తక్షణం ప్రభుత్వం రద్దు చేయాలని క్రెడాయి అధ్యక్షుడు కోటేశ్వరరావు డిమాండ్‌ చేస్తున్నారు. ఉచిత ఇసుకంటూ రెవెన్యూ అధికారుల అండతో ఇసుకను రవాణా చేస్తున్న లారీలను సీజ్‌ చేస్తున్నారని తెలిపారు. వాటిని ఎందుకు సీజ్ చేశారో చెప్పడం లేదన్నారు. ఒక్కో లారీకి రెండు లక్షల జరిమానా చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. అందుకే  లారీల సమ్మె చేయనున్నట్టు తెలిపారు.  దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుతున్నారు.

 

21:29 - August 25, 2018

విశాఖ : ఏజెన్సీ ప్రాంతంలో గంజాయిని నిర్మూలించి ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జవహర్‌ అన్నారు. అందుకోసం గిరిజనులు గంజాయి పంట సాగు చేయడం మానుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా పాడేరులో గంజాయి నిర్మూలన, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహనా సదస్సు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 

 

20:49 - August 25, 2018

విశాఖ : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను మాజీ డీజీపీ సాంబశివరావు కలిశారు. సాంబశివరావు పార్టీలో చేరుతున్నట్లు వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. సాంబశివరావు చేరికతో వైసీపీకి అదనపు బలం వచ్చిందని చెప్పారు. రాంబిల్లి మండలం హరిపురంలో జగన్‌ను సాంబశివరావు కలిశారు. గతంలో సాంబశివరావు ఏపీ డీజీపీగా..ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేశారు. 

 

17:05 - August 23, 2018

విశాఖపట్నం : ఏయూ జ్నానభేరి సభలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..దేశంలోనే మెరుగైన ర్యాంక్స్ లో ఏయూ వర్శిటీ కాలేజ్ లున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో టాప్ వర్శిటీల్లో ఏయూ వుండాలని..మరింత కాలంలో నెంబర్ వన్ వర్శిటీగా ఏయూ పేరు తెచ్చుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. దీనికి విద్యార్ధుల చేతిలోనే వుందని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతీ విద్యార్థికి ఒక విజన్ వుండాలని సూచించారు. ప్రతి విద్యార్థి టెక్నాలజీని మెరుగు పరుచుకోవాలన్నారు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ వృద్ధి చెందింది అంటే ఐటీ టెక్నాలజీతోనే సాధ్యమైందని దీనికోసం 2020 విజన్ తోనే అది సాధ్యమైందని..అందుకే ప్రతి విద్యార్థి ఓ విజన్ ను టార్గెట్ చేసుకోవాలని సూచించారు. ప్రపంచాన్ని సాసించే శక్తి యువతకు వుందనీ..ప్రపంచంలో ఏ దేశానికి లేని యువ శక్తి భారత్ సొంతమని టెక్నాలజీలోను తెలుగు యువత ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోందన్నారు.

యువతకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు విద్య : చంద్రబాబు
విద్యార్ధులకు కావాల్సిన అన్ని వసతుల్ని, వనరుల్ని అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఏయూ జ్నానభేరి సభలో చంద్రబాబు హామీ ఇచ్చారు. నేటి యువతకు పెద్దవారు ఇవ్వాల్సింది ఆస్తి పాస్తులు కాదనీ..చక్కటి చదవును. సంస్కారాలను ఇవ్వాలన్నారు. ఏపీలో ప్రతీ విద్యార్థిని, విద్యార్ధుల ఉన్నత భవితకు ప్రభుత్వం అండగా వుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

20:38 - August 18, 2018

విశాఖ : చంద్రబాబునాయుడు, అయ్యన్నపాత్రుడులు నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని వైఎస్‌ జగన్‌ అన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న జగన్‌... చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఏమీ చేయకపోయినా... భూములను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు-చెట్టు పేరుతో చెరువుల్లో తవ్వకాలు జరిపి మట్టితో పాటు... ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారంటున్నారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయంతో గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. చంద్రబాబు పాలన అంతా మోసం, అవినీతి, అన్యాయమే అన్నారు. 

 

18:50 - August 18, 2018

విశాఖ : వైసీపీ అధినేత వైస్ ఎస్ జగన్ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపట్టారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనంతా మోసం, అబద్ధాలు, అవినీతిమయమని విమర్శించారు. లంచాలు తీసుకునేది చంద్రబాబేనని ఆరోపించారు. జగన్ ప్రజా సంకల్పయాత్ర 239 రోజుకు చేరింది. నర్సీపట్నంలో ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మూడులక్షలు విలువ ఉన్న ప్లాట్ ను పేదవాడికి 6లక్షలకు అమ్ముతున్నాడని పేర్కొన్నారు. 20 సం.రాలు నెలకు మూడు వేల రూపాయల చొప్పున పేదవాడు కట్టాలని సీఎం చంద్రబాబు చెప్పారని తెలిపారు. ఎన్నికలు వస్తున్నాయి...కనుక అపార్ట్ మెంట్లు ఇస్తాని చంద్రబాబు అంటున్నారని...ప్లాట్లు ఇస్తే తీసుకోండన్నారు. తాము అధికారంలోకి వస్తే.. ప్లాట్ కు కట్టాల్సిన మూడు లక్షల రూపాయలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 
మధ్యాహ్నం భోజన కార్మికుల తొలగింపు
ఐదు నెలల నుంచి మిడ్ డే మీల్స్ కు చంద్రబాబు డబ్బులు ఇవ్వడం లేదన్నారు. మధ్యాహ్నం భోజన పథకంలో పనిచేస్తున్న వెయ్యి మందిని తీసేశారని తెలిపారు. ఈ పథకాన్ని ప్రయివేట్ వ్యక్తులకు కాంట్రాక్టుకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. జాబు రావలంటే.. బాబు రావాలన్నారు.. బాబు వచ్చాడు.. కానీ జాబు రాలేదని ఎద్దేవా చేశారు. నర్సీపట్నం నియోజకవర్గంతోపాటు రాష్ట్రంలో అన్యాయ పాలన సాగుతుందన్నారు. బాబు నాలుగేళ్ల పాలనలో మోసం, అబద్ధాలు, అవినీతి జరిగిందని విమర్శించారు. 'అబద్ధాలు చేప్పేవాడు మీకు నాయకుడు కావాలా?' 'మోసం చేసేవాడు మీకు నాయకుడు కావాలా?'.. 'మీకు ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచించుకోవాలి' అని అన్నారు. చెడిపోయిన రాజకీయాల్లోకి నిజాయితీ, విశ్వసనీయత రావాలన్నారు. తనకు అందరి ఆశీస్సులు కావాలని కోరారు.

 

19:43 - August 17, 2018

విశాఖ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు ముగిశాయి. వాజ్‌పేయి స్మృతులతో యావత్‌దేశం నివాళులు అర్పించింది. వాజ్‌పేయితో తమకున్న అవినాభావ సంబంధాలను గుర్తు చేసుకుంది. అటల్‌ బిహారీ వాజ్‌పేయికి విశాఖతో మంచి అనుబంధం ఉంది. ఆయన జన్‌ సంఘ్‌ నేతగా ఉన్నప్పటి నుండి తరచుగా విశాఖను సందర్శించేవారు. ఏయూతో పాటు అనేక సభలలో వాజ్‌పేయి ప్రసంగించారు. 
ప్రధాని హోదాలో విశాఖను సందర్శించిన వాజ్‌పేయి
ప్రధాని హోదాతో పాటు కేంద్రమంత్రి హోదాలో ఉన్న సమయంలో వాజ్‌పేయి చాలా సార్లు విశాఖను సందర్శించారు. ఇక్కడి కార్యక్రమాలు, ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఆయన ప్రధాని అవక ముందు వైజాగ్‌ వచ్చినప్పుడల్లా తోటి నాయకులతో ప్రతి రోజూ బీచ్‌కు వెళ్లేవారు. సాగరతీరం, ప్రకృతి అందాలను చూసి వాజ్‌పేయి ఎంతో మురిసిపోయేవారని ఆయనతో సన్నిహితంగా గడిపిన పీవీ చలపతి రావు తెలిపారు.  
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు రూ.13వేల కోట్ల నిధి ఇచ్చిన వాజ్‌పేయి
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు 13వేల కోట్ల నిధిని వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే కేటాయించారు. జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ, విశాఖ పోర్టుకు కనెక్టివిటీ రోడ్లు, నేవీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ అప్‌గ్రేడ్‌, యూనివర్సిటీల పటిష్టతలో భాగంగా ఏయూలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగాల స్థాపన వంటి వాటికి కృషి చేశారు.
1982లో విశాఖకు వాజ్‌పేయి
1980లో బీజేపీ ఏర్పాటు తర్వాత వాజ్‌పేయి 1982లో విశాఖ వచ్చారు. 1981లో జరిగిన ఎన్నికలలో విశాఖ మున్సిపాలిటీలో 50 వార్డులకు గాను బీజేపీ 25వార్డులలో విజయభేరి మోగించింది. ఈ బీజేపీ మేయర్‌ ఎన్నికల విజయోత్సవ సభలో వాజ్‌పేయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు వన్‌టౌన్‌లోని ప్రస్తుత జీవీఎంసీ స్టేడియం ఉన్న స్థలంలో పౌరసన్మానం చేశారు. 
1983లో మరోసారి విశాఖకు వచ్చిన వాజ్‌పేయి
1983లో వాజ్‌పేయి మరోసారి విశాఖ వచ్చారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ తరపున ప్రచారం చేశారు. 2004 ఎన్నికల సమయంలో కె. హరిబాబు వన్‌టౌన్‌ ఎమ్మెల్యేగా, ఎమ్ వీవీఎస్ మూర్తి ఎంపీగా పోటీ చేశారు. అప్పట్లో టీడీపీ-బీజేపీ పొత్తు కారణంగా ఇరు పార్టీల అభ్యర్థుల తరపున వాజ్‌పేయి ప్రచారం చేశారు. 
వాజ్ పేయికి విశాఖ వాసులు అశ్రు నివాళి 
వాజ్‌పేయి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ విశాఖ వాసులు ఆయనకు అశ్రు నివాళి అర్పించారు. ఆర్కేబీచ్‌లో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ వాజ్‌పేయి సైతక శిల్పాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్‌ నేతలు ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌, సీనియర్‌ నేత పీవీ చలపతిరావు తదితరులు వాజ్‌పేయి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. 

 

13:42 - August 10, 2018

విశాఖ : ఐటీ రంగానికి కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా మారబోతున్న కాపులపాడ ఐటీ పార్క్‌ని మంత్రి నారా లోకేష్‌ పరిశీలించారు. నాలుగు దశల్లో కాపులపాడ ఐటీ పార్క్‌ అభివృద్ధి చేస్తామని మొదటి దశగా వంద ఎకరాల్లో అందుబాటలోకి రానుందని తెలిపారు. మొత్తం 700 ఎకరాల్లో ఐటీపార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఒక్క కాపులపాడ ఐటీ పార్క్‌లో సుమారుగా 5 లక్షల మంది ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు.  రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్‌ ఇతర మౌలిక వసతుల కల్పన సెప్టెంబర్‌లోపు పూర్తి చేయాలని అధికారులని ఆదేశించారు.

08:15 - August 10, 2018

విశాఖ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీల అమల్లో విఫలమైన బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు శపథం చేశారు. విభజన హామీలు అమలు చేసే వరకు ప్రధాని మోదీ నేత్వత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ధర్మపోరాటం ఆగదన్నారు. గిరిజనులందరికీ యాభై ఏళ్లకే పెన్షన్లు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి విధాన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా పాడేరులో జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దితోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు... గిరిజనులకు ప్రస్తుతం ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను 75 యూనిట్ల నుంచి వంద యూనిట్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు. 
పాడేరులో పర్యటించిన చంద్రబాబు 
ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గంలో పర్యటించారు. చింతలవీధి పంచాయతీ అడారిమెట్టలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో గర్భిణిలకు శ్రీమంతాలు నిర్వహించి, చంటిపిల్లలకు అన్నప్రాసన చేశారు. అక్కడే అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. పాఠశాలలో డిజిటల్‌ తరగతులకు శ్రీకారం చుట్టారు. అడారిమెట్ట గ్రామ సభలో పెన్షన్లు, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లికానుక వంటి పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 
ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు
పాడేరు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ మైదానంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లోనూ చంద్రబాబు పాల్గొన్నారు. ఆరువేల మందికిపైగా గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ.... గిరిజనుల కోసం అన్నీ చేస్తున్న మంచి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. బీజేపీ మెడలు వంచి హక్కులు సాధించుకుంటామన్నారు. యాభై ఏళ్ల వయసు నిండిన గిరిజనులందరికీ పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. పాడేరు సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించిన కొందరు యువకులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
రాష్ట్ర ప్రభుత్వ పండుగగా మోదుకొండమ్మ జాతర 
విశాఖ మన్యంలో గిరిజనులు జరుపుకునే మోదుకొండమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా చంద్రబాబు ప్రకటించారు. సభా వేదికపై గిరిజనులు బహుకరించిన సంప్రదాయ టోపీని ధరించారు.  ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులతో మంజూరు చేసిన ఇన్నోకార్లు, జీపులను లబ్దిదారులకు చంద్రబాబు పంపిణీ చేశారు. విలువిద్యలో ప్రతిభ కనబరచిన గిరిజన విద్యార్థులకు ఆర్చరీ పరికరాలు ఆందచేశారు. గిరిజన బాలికలతో కలిసి థింసా నృత్యం చేశారు. ఆ తర్వాత పాడేరు నుంచి అమరావతి బయలుదేరి వెళ్లారు.
 

 

Pages

Don't Miss

Subscribe to RSS - విశాఖ