విభజన

14:58 - October 1, 2018

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయి ఎవరి పాలన వారు చేసుకుంటున్నారు. కాగా ఇరు రాష్ట్రాలకు ఉమ్మడిగా వున్న హైకోర్టును త్వరంగా విభజించాలని తెలంగాణ రాష్ట్రం కేంద్రం న్యాయశాఖను త్వరపెడుతుందో. మరోవైపు హైకోర్టుకు సంబంధించిన భవనాల నిర్మాణం ఇంకా పూర్తికాలేదనేది ఏపీ వాదన. దీనిపై త్వరగా నిర్మాణం పూర్తి చేసి హైకోర్టను ఏపీకి తీసుకెళ్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే గత మూడేళ్లనుండి ఈవిషయంపై ఓ కొలిక్కి రాలేదు. 
ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.  ఎప్పుడు సిద్ధమవుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు సిద్ధమవుతుందని సుప్రీంకోర్టుకు ఏపీ తరపు న్యాయవాది నారీమన్ తెలిపారు. ఏపీ మూడేళ్లుగా ఇదే మాట చెబుతున్నారని కేంద్ర, తెలంగాణ తరపు లాయర్లు కోర్టుకు విన్నవించారు. హైకోర్టు భవనం ఎప్పటిలోగా సిద్ధమవుతుందో అఫిడవిట్ రూపంలో రెండు వారాల్లో కోర్టుకు అందజేయాలని జస్టిస్ ఏకే సిక్రీ ధర్మాసనం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
 

 

07:32 - September 1, 2018

ఉమ్మడి హైకోర్టు విభజనపై ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టుకు దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టుల ఏర్పాటుపై కేంద్రం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎకె సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరురాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా వున్న హైదరాబాద్‌లో వేరే భవనంలో వేర్వేరుగా హైకోర్టుల ఏర్పాటుపై కేంద్రం ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఎందుకు హైకోర్టులను ఏర్పాటు చేయకూడదని కేంద్రం ఈ పిటిషన్‌లో పేర్కొంది. హైకోర్టు విభజన ఎంతమాత్రం జాప్యం చేయటం వీలులేదని తెలంగాణ తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి, రెండు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేయాల్సిందేనని కేంద్ర న్యాయశాఖ తరపున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌లు వాదించారు. కేంద్రం వాదనలతో తెలంగాణ ఏకీభవించింది. దీనిపై ఏపిలో హైకోర్టు భవన నిర్మాణాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా..దీనికి సంబంధించిన నిర్మాణాలు పూర్తి కాలేదని కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు రెండు ప్రతిపాదనలు పెట్టింది. ప్రస్తుత హైకోర్టు భవనంలో ఖాళీగా ఉన్న 24 హాళ్లలో ఏపికి వేరుగా హైకోర్టు ఏర్పాటు చేయవచ్చునని, లేదంటే రెండో ప్రత్యామ్నాయంగా ప్రస్తుత హైకోర్టు భవనాన్ని తాము ఖాళీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. చట్టసభలు, అధికారుల విభజన జరిగిందని, కానీ న్యాయవ్యవస్థ విభజన జరగలేదని ముకుల్‌ రోహత్గి కోర్టుకు విన్నవించారు. హైకోర్టు విభజన ఆలస్యం కావడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, న్యాయమూర్తుల్లో 40 శాతం ఉండాల్సిన తెలంగాణ వాటా కూడా లేదని కోర్టుకు తెలిపింది. కేసు వాదనల సమయంలో ఏపి ప్రభుత్వం తరపు న్యాయవాది గైర్హాజయ్యారు. దీంతో ఏపి ప్రభుత్వానికి, హైకోర్టుకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను సుప్రీం కోర్టు ధర్మాసనం రెండు వారాలపాటు వాయిదా వేసింది. ఈ అంశంపై 10టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఏపీ బీజేపీ అధికార ప్రతినిథి ఆర్.డి. విల్సన్, కాంగ్రెస్ మాజీ ఎంపీ, తులసిరెడ్డి, టీఆర్ఎస్ నేత రాకేశ్ , టీడీపీ నేత లాల్ వజీర్ పాల్గొన్నారు. 

15:21 - August 9, 2018

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఆనాటి నుండి వైసీపీ పోరాటం చేస్తోందని వైసీపీ నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో 'వంచనపై గర్జన' పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తమను ఎన్నుకుంటే పది హేను సంవత్సరాల పాటు 'హోదా' ఇస్తామని గతంలో పేర్కొన్నారని తెలిపారు. రెండు చోట్ల ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత 'హోదా' పరిస్థితులపై ఆనాటి నుండి ఇప్పటి వరకు వైసీపీ నిలదీస్తూ వస్తోందన్నారు. హోదా వద్దు..ప్యాకేజీ ముద్దు అని కేంద్రం పేర్కొందని..కానీ హోదానే ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేసిందన్నారు. 'హోదా'కు బదులు 'ప్యాకేజీ' ఇస్తామని కేంద్రం చెబుతుంటే వైసీపీ అడ్డు పడుతోందని ఆనాడు బాబు పేర్కొన్నారని గుర్తు చేశారు. 'హోదా' కోసం వైసీపీ ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం అరెస్టులు చేసిందని, ప్రస్తుతం బాబు మళ్లీ 'హోదా' మాటెత్తుతున్నారని తెలిపారు. 

16:12 - August 7, 2018

ఢిల్లీ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో దేశ రాజధానిలో ఏపీ ఎన్ ఎస్ యూఐ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్‌లో జరిగిన ఆందోళనకు కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఏఐసీసీ కార్యదర్శి జేడీ శీలం మద్దతు తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీ ప్రజలను మోసం చేసిందని ఎన్ ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు భగత్‌ ఆరోపించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీ అందిస్తారు. 

09:12 - August 3, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. మూడు రోజుల పాటు హస్తినలో ఉండనున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ రాష్ట్రపతి పర్యటన ఉన్నా ఆయన ఢిల్లీకి వెళుతుండడం గమనార్హం. ప్రధానంగా పెండింగ్ లో ఉన్న వాటిని పరిష్కరించుకొనేందుకు ఆయన పర్యటన కొనసాగనుంది. ప్రధాన మంత్రి మోడీ..కేంద్ర మంత్రులు..ఇతర అధికారులను ఆయన కలుసుకోనున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర హోం శాఖ, న్యాయ శాఖ ఆమోదించినట్లు సమాచారం. కానీ దీనికి సంబంధించిన ఫైల్ పీఎంవో కార్యాలయంలో పెండింగ్ లో ఉంది. ఇది ఆమోదం తెలిపితే రాష్ట్రపతికి వెళ్లనుంది. ఆయన అనుమతి ఇచ్చిన అనంతరం జోనల్ వ్యవస్థ ఏర్పడనుంది. తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడింది ? ఉమ్మడి రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ ఎందుకు తొలగించాల్సి వచ్చింది ? అనే దానిపై ప్రధానికి..కేంద్ర మంత్రులకు కేసీఆర్ వివరించనున్నారు. అలాగే విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఇంకా అమలు కాలేదని...నిధులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని..కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని ఆయన కోరనున్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇతరత్రా విషయాలపై ఆయన చర్చించనున్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

07:33 - August 2, 2018
19:33 - August 1, 2018

ఢిల్లీ : విభజన హామీలు.. ముఖ్యంగా కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం.. తెలుగుదేశం నేతలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. పార్లమెంటు లోపలా, బయటా ఆందోళనలు సాగిస్తూనే.. రాష్ట్రపతి దృష్టికీ ఈ అంశాన్ని తీసుకు వెళ్లారు. ఇంకోవైపు.. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీతోనూ టీడీపీ నేతలు భేటీ అయి.. తమ డిమాండ్‌కు మద్దతును సమీకరించారు. 

విభజన హామీల సాధన దిశగా.. తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటివరకు పార్లమెంటు ప్రాంగణంతో పాటు ఉభయసభల్లో ఆందోళన కొనసాగిస్తున్న ఆ పార్టీ ఎంపీలు తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. సుజనాచౌదరి నేతృత్వంలోని బృందం.. రాష్ట్రపతిని కలిసి.. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకునేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఉక్కు కర్మాగారం ఆంధ్రుల మనోభావాలకు చెందిన అంశం కాబట్టి ఆ హామీ నెరవేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో.. టీడీపీ ఎంపీలు.. కేంద్ర ఉక్కు శాఖమంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌నూ కలిశారు. కడప జిల్లా నాయకులతో కలిసి.. టీడీపీ ఎంపీలు.. కేంద్ర మంత్రిని కలిశౄరు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

అటు పార్లమెంటు ప్రాంగణంలో.. బుధవారం కూడా టీడీపీ ఎంపీలు ఆందోళనను కొనసాగించారు. పార్లమెంటు గాంధీ విగ్రహం దగ్గర ఏపీకి న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. మరోవైపు.. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ ప్రజాకవి వేషధారణలో మోదీ వైఖరిపై మండిపడ్డారు. మాటలగారడీ.. వినయం పేరడీతో మోదీ ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. ఇంకోవైపు.. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీతోనూ.. టీడపీ ఎంపీలు సుజనాచౌదరి, కేశినేని నాని భేటీ అయ్యారు. పార్లమెంటులో ఆమెను కలిసి.. తమ ఆందోళనకు మద్దతును కోరారు. 

21:14 - July 25, 2018

ఢిల్లీ : తాను ఒకరికి దగ్గర... మరొకరికి దూరం కాదన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌. రాజకీయాల్లోకి వచ్చి జీవితాలు పాడు చేసుకున్నవారే ఎక్కువ.. కానీ ఇప్పుడా పరిస్థితులు మారాయన్నారు. తెలంగాణ బిల్లు పాస్‌ అయ్యేందుకు సరిపడ సభ్యులు ఆనాడు పార్లమెంట్‌లో లేరని.. డివిజన్‌ ఉండదంటే హెడ్‌కౌంట్‌ చేయాలని,... కానీ విభజన బిల్లు సందర్బంగా అలా జరగలేదన్నారు ఉండవల్లి గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ చేసిన అన్యాయం గురించి తాను నాలుగేళ్లుగా చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వాలు తలచుకున్నది చేస్తే.. ఇక చట్టసభలు ఎందుకని ప్రశ్నించారు. ఇక జగన్‌ పవన్‌పై చేసిన వ్యాఖ్యలను ఉండవల్లి ఖండించారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. 

18:33 - July 24, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేహోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎక్కడైనా చెప్పిందా? అలా చెబితే చూపించండి?నిరూపిస్తే తాను ఇప్పుడే రాజీనామా చేస్తానని సీఎం రమేశ్  కేంద్రప్రభుత్వంపైఛాలెంజ్ చేశారు. విభజన హామీలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పినట్టు నిరూపిస్తే ఇప్పుడే తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానని భావోద్వేగంతో ప్రసంగించారు. ఏపీకి ప్రత్యేకహోదాకు సమానంగా ప్రయోజనాలు అందిస్తామంటేనే ప్యాకేజ్ కు ఒప్పుకున్నామని అన్నారు. ప్యాకేజ్ కింద ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? ఏపీ ప్రజలంటే ఎందుకంత నిర్లక్ష్యం? అని ప్రశ్నించిన సీఎం రమేశ్, ప్రాంతీయ పార్టీలను కూడగడతారనే చంద్రబాబును లక్ష్యం చేసుకున్నారని అన్నారు. సభలో అసత్య ప్రచారాలు చేయడం తగదని బీజేపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు.
ఏపీ విద్యార్ధులకు విద్యాసంస్థలు కొరత : సీఎం రమేశ్
రాష్ట్ర విభజన అనతరం ఏపీ ప్రజలు చదువును అభ్యసించేందుకు విద్యాసంస్థల లోటు భారీగా వుందని ఏపీ ప్రజలు ఎక్కడకు వెళ్లి చదువుకోవాలని టీడీపీ సీఎం రమేశ్ ప్రశ్నించారు. విభజన తరువాత ప్రకటించిన విద్యాసంస్థల కోసం కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాన్ని ఏపీ ప్రభుత్వం కేటాయించినా ఇంత వరకూ ఒక్క విద్యాసంస్థను కూడా కేంద్రం నిర్మాణం చేపట్టలేదని ఆరోపించారు. తమకు కావాల్సింది జీవో మాత్రమే కాదనీ..తమ విద్యార్ధులు చదువుకోవటానికి విద్యాసంస్థలు కావాలని డిమాండ్ చేశారు. 

18:15 - July 24, 2018

ఢిల్లీ : ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో చర్చ సందర్భంగా సీపీఎం ఎంపీ రంగరాజన్ మాట్లాడుతు..టీడీపీ పార్టీని బీజేపీ నాలుగేళ్లపాటు వాడుకుని వదిలేసిందని విమర్శించారు. 5 కోట్ల ఆంధ్రులకు న్యాయం చేయని బీజేపీ ప్రభుత్వం దేశంలోని 120 కోట్ల మంది ప్రజలకు న్యాయం చేస్తారా? అని ఎద్దేవా చేశారు. చెన్నైలో 29 శాతం మంది తెలుగువారున్నారనీ..ఏపీ కష్టాలు తమకు తెలుసన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ ప్రజల సమస్యలు, కష్టాలు తమకు తెలుసన్నారు. ఏపీ ప్రత్యేక హోదా అంశం ఏ ఒక్క రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - విభజన