వినాయక చవితి

10:10 - September 13, 2018

దైవభక్తి, దేశభక్తి మేళవించిన రూపం...ఆయన ఆకారం విద్యా బుద్ధులకు సాకారం...ఆయన నామస్మరణం...సర్వ పాప హరణం... ఆయనే విఘ్నేశ్వరుడు... వినాయక పూజకున్న విశిష్టత ఏంటి? గణపతి నేర్పే విద్యాబుద్ధులేంటి? తదితర అంశాలపై వినాయక చవితి సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బంగారయ్య శర్మ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

09:27 - September 13, 2018
చిత్తూరు : పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కాణిపాకంలో వినాయక సంబరాలు మొదలయ్యాయి. గురువారం నుంచి అక్టోబరు 3 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం వేకువజామున ఆలయ అర్చకులు అభిషేకాలు జరిపించారు. అనంతరం ఉదయం 4గంటల నుండి స్వామి వారి దర్శనం కల్పించారు. శుక్రవారం ఉదయం స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమం..రాత్రి హంస వాహన సేవ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ నెల 22న ధ్వజావరోహణం, త్రిశూల స్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. 
08:34 - September 13, 2018

హైదరాబాద్ : గణపతి అందరి దైవం.. అందరికీ ఆనందాన్ని పంచే దైవం. విఘ్నాల్ని తొలగించి, విజయాలను అనుగ్రహించే దైవం. వినాయక చవితి సందర్బంగా ఈరోజు భక్తులు వినాయకుడి పూజ చేసుకుని వ్రతకల్పం చదువుకోవడం..  అక్షతలు వేసుకుని, వినాయకుడి దీవెనలు అందుకుంటారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి సందడి మొదలైంది. అన్ని ప్రాంతాల్లో మండపాలు వెలిశాయి. కాసేపట్లో మండపాల్లో గణేశులు కొలువుతీరనున్నారు. మరోవైపు మార్కెట్లలో విఘ్నేశ్వరుడి వివిధ రూపాల ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. వినాయకచవితి సందర్బంగా మార్కెట్లు కిక్కిరిసిపోతున్నాయి. 

13:51 - September 12, 2018

తెలుగు సినిమా రంగంలో మల్టీస్టారర్ సినిమాలు ట్రెండ్ కొనసాగుతోంది. తన వయస్సు..చూడకుండా జోరుగా సినిమాలు చేస్తున్న హీరోల్లో ఒకరు ’నాగార్జున’. టాలీవుడ్ లో మన్మథుడిగా పేరొందిన ఈ నటుడు చిన్న..పెద్ద హీరోలతో నటిస్తున్నాడు. తెలుగు సినిమాలో నాచురల్ స్టార్ గా పేరు గడించిన ‘నాని’తో ‘నాగ్’ నటిస్తున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాను యువ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘దేవదాస్’ పేరు ఖరారు చేశారు. ఈ చిత్ర టీజర్..లిరికల్ వీడియోలు సందడి చేస్తున్నాయి. 

'వినాయకచవితి' కావడంతో చిత్ర యూనిట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది. ఈ సాంగ్ దుమ్ముదుమ్ము రేపుతోంది. వినాయక నిమజ్జన ఉత్సవానికి సంబంధించిన పాటను వదిలారు."లక లక లకుమీకరా లంబోదరా .. జగ జగ జగదోద్ధారా విఘ్నేశ్వరా . . లక లక లకుమీకరా లంబోదరా .. రకరకముల రూపాలు నీవే దొరా .. వెళ్లి రారా .. మళ్లీ రారా .. ఏడాదికోసారి మాకై దిగిరారా .." అంటూ ఈ పాట కొనసాగుతోంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

07:27 - September 12, 2018

హైదరాబాద్ : దేశమంతా వినాయక చవితి సందడి మొదలైంది. ఇప్పటికే ప్రతి వీధిలో వినాయక మండపాలు వెలిశాయి. కొంతమంది ఇప్పటికే బొజ్జ గణపయ్యలను కొనుగోలు చేసి మండపాలకు తరలిస్తుండగా.. మార్కెట్‌లో అనేక రూపాల్లో వినాయక విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. కొంతమంది ప్రత్యేకంగా ఆర్డర్‌ ఇచ్చి వినాయక విగ్రహాలను తయారు చేయించుకోగా... పలువురు మార్కెట్‌లో లభ్యమవుతున్న విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు.  ఎన్నో ఏళ్లుగా ప్రకృతికి హాని కలిగించే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలనే చాలామంది కొనుగోలు చేస్తుండగా.. ఈసారి చాలామంది మట్టి గణేషుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాల మాదిరిగానే మట్టి గణపతులకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఇప్పటికే చాలామంది విగ్రహాలను వేలాది రూపాయలకు కొనుగోలు చేసి మంటపాలకు తరలిస్తున్నారు. అయితే.. గతేడాదితో పోలిస్తే రేట్లు పెరిగాయని భక్తులంటున్నారు. మరోవైపు గత రెండు రోజులుగా హైదరాబాద్‌ నగరంలో వర్షం కురుస్తుండడంతో కొనుగోలు ఎలా ఉంటాయోనన్న టెన్షన్‌లో వ్యాపారస్తులు ఉన్నారు. 

21:54 - August 28, 2017

వినాయక చవితి సందర్భంగా మానవి స్పెషల్ ప్రోగ్రామ్ నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ వివరాలను వారిమాటల్లోనే.. 'పండుగ పేరుతో చందాల దందాలు. వీధికి నాలుగు వి(నా)యకుల విగ్రహాలు. విగ్రహాల ఎత్తులో పోటీలు, భక్తి పేరుతో బేజారెత్తించే వాతావరణం. ప్రకృతి సిద్ధమైన పత్రాల పండుగతో రసాయన వినియోగాలు. ఇవేనా పండుగలంటే.? మనుష్యులను, మనసులను దగ్గర చేసే పండగలనే చేసుకుందాం. అసహజ వాతావరణంలో ఆర్టిఫిషియల్ పండగలను నిషేదిద్దామని' అని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:18 - August 26, 2017

హైదరాబాద్ : వినాయక చవితి సందర్భంగా... నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా...పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే గణేశ్‌ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, రాజకీయ పార్టీల నేతలు, మండపాల నిర్వాహకులతో పోలీస్‌ శాఖ సమావేశం నిర్వహించి... పలు సూచనలు చేశారు. నగర మంతటా 25 వేలమంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. గతేడాదితో పోలీస్తే ఈసారి మూడింతలు భద్రతను పెంచింది పోలీస్‌ శాఖ.

36 అధునాతన సీసీ కెమెరాలు
మొత్తం మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో సైబరాబాద్‌లో 6 వేల మంది పోలీసులు, రాచకొండ కమిషనరేట్‌లో 6 వేల మంది పోలీసులతో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోని ఖైరతాబాద్‌, బాలాపూర్‌, పాతబస్తీ కవాడిగూడాలోని భారీ గణేశ్‌ విగ్రహాల వద్ద 400కు పైగా పోలీసులు భద్రత చర్యలు తీసుకున్నారు.  ఉత్సవాలు ముగిసేవరకు రౌండ్‌ ది క్లాక్‌ సెక్యూరిటీ అందుబాటులో ఉండనుంది. ఈసారి వినూత్నంగా షాడో టీమ్స్‌ను రంగంలోకి దించారు పోలీసులు. ఒక్క ఖైరాతాబాద్‌ భారీ గణనాథుని వద్దే మొత్తం 36 అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వీటిని సెంట్రల్‌ జోన్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేయనున్నారు. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ ద్వారా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధాన వినాయక మండపాల వద్ద అంబులెన్స్‌, అగ్నిమాపక యంత్రం, తాగునీరు, విద్యుత్తు దీపాలు అందుబాటులో ఉండేలా ఇతర శాఖలతో సమన్వయం చేశారు. ఉత్సవాల అనంతరం.. వినాయక నిమజ్జనం రోజున ప్రజలకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. 

12:59 - August 25, 2017
12:50 - August 25, 2017

హైదరాబాద్‌ : కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.  టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి  ఏకదంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉత్తమ్‌కుమార్‌ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అన్నీ సమస్యలు తొలగి తెలంగాణ ప్రజలంతా.. సంతోషంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.  
బీజేపీ కార్యాలయంలో 
హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పూజలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. ఏ శుభ కార్యానికైనా మొదట విఘ్నేశ్వరుడినే పూజిస్తామని దత్తాత్రేయ అన్నారు. 

 

12:38 - August 25, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - వినాయక చవితి