విచారణ

14:40 - November 13, 2018

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ పై విమానాశ్రయంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే తనపై దాడి జరిగిందని జగన్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణను ఏపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని పిటిషన్ లో ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఈ హత్యాయత్నంపై విచారణ జరిపించాలని పిటీషన్ లో జగన్  కోరారు. ఈ నేపథ్యంలో నేడు జగన్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ ఆర్పీ ఠాకూర్ సహా 8 మందికి నోటీసులు జారీచేసింది. రెండు వారాల్లోగా ఈ విషయమై తమ ప్రతిస్పందనను తెలియజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పోలీసులు జరిపిన విచారణ నివేదికను సీల్డ్ కవర్ లో సమర్పించాలని సూచించింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది. కాగా అక్టోబర్ 25న హైదరాబాద్ కు వస్తున్న జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. 
 

15:32 - November 12, 2018

ఢిల్లీ : రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై జనవరి నెలలో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై వెంటనే  విచారణ జరపాలంటూ దాఖలైన మరో పిటిషన్‌ ను ఈరోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాగా అఖిల భారత హిందూ మహాసభ తరపున న్యాయవాది బరుణ్ కుమార్ సిన్హా దాఖలు చేసిన ఈ పిటీషన్ పై స్పందించని దేశ అత్యున్నత దేవస్థానం అయిన సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. దేశంలోకొన్ని రాష్ట్రాలలో  సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయని, ఈలోగానే కేసును విచారించాలని న్యాయవాది బరుణ్ కుమార్ సిన్హా వాదించారు. దీనిపై స్పందించని న్యాయస్థానం ఇప్పడు కుదరదని జనవరిలోనే విచారిస్తామని తెలిపింది. 
ఈ కేసును జనవరికి వాయిదా వేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌ కే కౌల్ ధర్మాసనం, అఖిల భారత హిందూ మహాసభ వేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది. ఇప్పటికే కోర్టు ఈ కేసులో ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేసిన ధర్మాసనం, అప్పీళ్లన్నింటినీ జనవరిలోనే పరిశీలిస్తున్నామని, ముందస్తు విచారణకు అనుమతి నిరాకరిస్తున్నామని తెలిపింది. 
 

 

12:52 - November 12, 2018

ఢిల్లీ : రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాదం కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ముందస్తు విచారణ చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మరోసారి కొట్టివేసింది. అఖిల భారత హిందూ మహాసభ వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో పలు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, జనవరి మాసంలో ధర్మాసనం ముందు కేసుకు సంబంధించిన పలు పిటిషన్‌లు రానున్నాయని..ముందస్తు విచారణ చేపట్టలేమని వ్యాఖ్యానించింది. వచ్చే జనవరి మొదటి వారంలో ధర్మాసనం పరిశీలిస్తుందని..విచారణ తేదీలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. అఖిల భారత హిందూ మహాసభ తరపున న్యాయవాది బరుణ్ కుమార్ సిన్హా ఈ పిటిషన్ దాఖలు చేశారు. 2010లో అలహాబాద్ హైకోర్టు అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని కక్షిదారులైన సున్నీ వక్ప్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లా పక్షాలు సమానంతో తలో భాగం పంచుకోవాలని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. 

12:56 - November 8, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఓట్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటు వేసిన పిటీషన్ పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ అంశంపై ఎన్నికల వేళ ఓటర్ల జాబితా అంశంపై జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని, ఆ జాబితాతోనే ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోందంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రిశశిధర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల కమిషన్‌ వ్యవహారాల్లో ఎలా తదూరుస్తామని ఈ సందర్బంగా  ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓటర్ల జాబితా అంశంపై ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్‌ కోర్టును ఆశ్రయించింది.
 

14:28 - November 2, 2018

ఢిల్లీ : మళ్లీ ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చింది. దీనిపై త్వరగా విచారించాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ పై సుప్రీం స్పందించింది. శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఫిబ్రవరిలో విచారణకు స్వీకరిస్తామని స్పష్టం చేసింది. దీనితో మరలా ఒకసారి ఓటుకు నోటు కేసు వార్తల్లోకెక్కింది. 
ఓటుకు నోటు కేసు రాజకీయంగా తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ వ్యవహారంలో ఉన్నారంటూ ఆరోపణలు రావడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ వ్యవహారంలో ఆడియో, వీడియో టేపులు బయటికి రావడంతో... ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ దుమారం చెలరేగింది. 
కేసును త్వరగా విచారించాలంటూ ఆళ్ల సుప్రీంను ఆశ్రయించారు. ఆయన రెండు పిటిషన్ లు దాఖలు చేశారు. 2017 నుండి ఆయన పోరాటం చేస్తున్నారు. 
దీనిపై ఆళ్ల స్పందించారు. మార్చి 6వ తేదీన బాబుకు సుప్రీం నోటీసులు జారీ చేసిందని, సాక్ష్యాధారాలతో సహా ముందుకు వచ్చారని..దీనిపై సమాధానం చెప్పాలని గతంలో బాబుకు నోటీసుల్లో పేర్కొన్నారని తెలిపారు. కానీ కోర్టు ఎదుట హాజరు కాలేదని తెలిపారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బాబు దిట్ట అని, గతంలో దాఖలు చేసిన పిటిషన్ లు ఇంతవరకు విచారణకు రాకపోవడమే కారణమన్నారు. కానీ చివరకు శుక్రవారం సుప్రీంలో బాబు తరపు న్యాయవాది వాదనలు వినిపించారని తెలిపారు. రెండు సంవత్సరాలవుతున్నా బాబు కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. 
ఓటుకు నోటు కేసులో రెండు ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. తొలి ఛార్జిషీట్ లో ఆడియోల్లోని గొంతులు ఒరిజనల్‌వేనంటూ ఫోరెన్సిక్ ఇచ్చిన నివేదిక,, ఆధారాలను కోర్టుకు సమర్పించారు. అందులో రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్‌‌తోపాటు ఉదయ్‌ సిన్హాను నిందితులుగా పేర్కొంది. 
కానీ ఛార్జిషీట్లలో ఏపీ సీఎం చంద్రబాబు పాత్రపై ఎక్కడా ప్రస్తావించలేదు. దీనితో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల కోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలో వద్దో ఏసీబీ కోర్టు నిర్ణయిస్తుందని కోర్టు పేర్కొంటూ ఆర్కే పిటిషన్‌‌ను కొట్టివేసింది. దీనితో ఆళ్ళ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి పిటిషన్ లు దాఖలు చేశారు. దీనిపై విచారించిన సుప్రీం వివరణ ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబుకి గతంలో నోటీసులిచ్చింది. ప్రస్తుతం ఫిబ్రవరి నుండి విచారిస్తామని కోర్టు స్పష్టం చేయడంతో టీడీపీ ఎలా స్పందిస్తందో వేచి చూడాలి. 
 

09:14 - November 2, 2018

విశాఖపట్టణం : వైసీపీ అధ్యక్షుడు జగన్ దాడికి సంబంధించి శ్రీనివాసరావు పోలీసు కస్టడీ నేటితో ముగియనుంది. దీనితో కోర్టు ఎదుట అతడిని హాజరు పరుచనున్నారు. విచారణ జరుగుతోందని..అతని కస్టడీ కొనసాగించాలని సిట్ అధికారులు రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. కోర్టు కస్టడీ పొడిగిస్తుందా ? లేదా ? అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు విచారణలో శ్రీనివాసరావు ఎలాంటి కీలక అంశాలు వెల్లడించారనేది తెలియడం లేదు. మొత్తం ఈ కేసులో 40మందిని విచారించారు. ఇందులో 30 మంది అమ్మాయిలు ఉండడంతో విచారణ మందకొడిగా సాగిందని తెలుస్తోంది. దాడికి ముందు శ్రీనివాసరావు పదివేల కాల్స్ చేశారని గుర్తించిన కాప్స్ 300 పైచిలుకు కాల్స్ పై దర్యాప్తు చేపట్టారు. ఇందులో గంటల వ్యవధిలో మాట్లాడడం..అధికంగా ఏ వ్యక్తులతో మాట్లాడారో వారిని పోలీసులు గుర్తించారు. వీరిని కూడా సిట్ అధికారులు విచారించినట్లు సమాచారం. శ్రీనివాసరావు కస్టడీకి కోర్టు అనుమతినిస్తుందా ? లేదా ? అనేది కాసేపట్లో తెలియనుంది. 

12:06 - November 1, 2018

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ హత్యాయత్నం కేసు మలుపులు తిరుగుతోంది. విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో జగన్ పై శ్రీనివాస్ అనే వ్యక్తి పందెం కోళ్లకు కట్టే కత్తితో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అనంతరం పోలీసు కస్టడీలో ఉన్న శ్రీనివాస్ పలు విషయాలు తెలియచేస్తున్నాడు. ఇదిలా ఉంటే తనపై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి జగన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం కోర్టు విచారణ జరిపింది. జగన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో కుట్ర దాగి ఉందని, కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. దీనిని ప్రభుత్వ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతికంగా జరుగుతోందని లాయర్ కోర్టుకు తెలిపారు. దీనితో ఇరువురి వాదనలు విన్న కోర్టు మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు దాడికి సంబంధించి వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, అరుణ్ కుమార్ లు మరో రెండు పిటిషన్లు వేశారు. ఈ మూడు పిటిషన్లను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

09:57 - October 31, 2018

విశాఖ : వైసీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డిపై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. నిందితుడు శ్రీనివాస్ ఫోన్ నుండి 10 నుంచి 12 సార్లు సైరా బీకి ఫోన్ కాల్స్ వెళ్లినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఫోన్ నంబర్ వివరాల ఆధారంగా కనిగిరికి చెందిన సైరా బీతో శ్రీనివాస్ మాట్లాడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. పిడుగురాళ్లలో ఉంటున్న సైరా బీ సోదరుడు నాగూర్ వలి పేరుతో సిమ్ అడ్రస్ ఉంది. కాల్ లిస్ట్ ఆధారంగా కనిగికి చెందిన మహిళను విచారించేందుకు పిడుగురాళ్లకు అధికారులు రప్పించారు.

 

15:35 - October 29, 2018

ఢిల్లీ : అయోధ్య రామ మందిరం- బాబ్రీ మసీదు కేసు విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అయోధ్య రామ మందిరి కేసు ఇప్పుడంత అత్యవసరంగా విచారించాల్సిన అవుసరం లేదంటు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుపై విచారణ నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను చేసింది. అనంతరం తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది. విచారణ తేదీలను, ధర్మాసనం వివరాలను వెల్లడిస్తామని ప్రకటించింది. 2010లో అలహాబాద్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి తీర్పును వెలువరించింది. ఆ సందర్భంగా ముగ్గురు న్యాయమూర్తులు మూడు రకాలైన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా గొగోయ్ మాట్లాడుతూ, వాస్తవానికి జనవరిలో కూడా ఈ పిటిషన్లపై విచారించాల్సిన అవసరం లేదని... సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు దీనిపై విచారణ అనవసరమని చెప్పారు. తరుపరి విచారణను జనవరికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి... నాలుగు నిమిషాల్లో విచారణను ముగించారు. 
 

11:54 - October 28, 2018

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనను ధర్డ్ పార్టీతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ ఆపార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు రాష్ట్రపతిని, కేంద్ర హోంమంత్రిని కలవనున్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి నేతృత్వంలో పలువురు మాజీ ఎంపీలు, పార్టీ ముఖ్యనాయకులు ఆదివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈమధ్యాహ్నం వారు కేంద్ర హోం మంత్రిరాజ్ నాధ్ సింగ్ ను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. విశాఖ విమానాశ్రయంలో 3 రోజుల క్రితం జగన్ పై హత్యాయత్నం జరిగిన ఘటన వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.

గవర్నర్ నేరుగా డీజీపీకి ఫోన్ చేసి వివరాలుతెలుసుకోవటం పై సీఎం చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. హత్యాయత్నం ఘటనపై విచారణకు డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ పై తనకు నమ్మకంలేదని జగన్ అభ్యంతరం తెలిపారు. దాంతో హత్యాయత్నం ఘటనను ఏపీకి చెందిన పోలీసు అధికారులతో కాకుండా థర్డ్‌ పార్టీతో నిష్పక్షపాతంగా విచారణ చేయించాలని వైఎస్సార్‌సీపీ నేతలు రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరనున్నారు. రాష్ట్రపతి, గవర్నర్ అపాయింట్ మెంట్ ఖరారు అయిన తర్వాత వారిని కూడా కలిసి రాష్ట్రం లో శాంతిభద్రతల పరిస్ధితిని వైసీపీ నేతలు వివరిస్తారు.

Pages

Don't Miss

Subscribe to RSS - విచారణ