వార్నింగ్

15:31 - September 7, 2018

పాకిస్థాన్ : పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీని స్థాపించి పాక్ లో అధికారంలోకి వచ్చారు. కాగా పాకిస్థాన్ లో అధ్యక్షుడు ఎవరైనా..ముఖ్యమంత్రి ఎవరైనా అధికారం మాత్రం సైన్యానిదే. సైన్యం కనుసన్నల్లోని అన్నీ జరుగుతుంటారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ అధికారంలోకి వచ్చాక పాక్ విధి విధానాలు మారతాయనే అందరు ఊహించారు. కానీ సదా మామూలుగానే పాత పద్ధతిలోనే పాక్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఆ దేశ సైన్యం తీరు మాత్రం మారలేదు. ఇండియాను రెచ్చగొట్టేలా పాక్ ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వా వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో తమ సైనికులను చంపితే... అంతకంత ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న కశ్మీర్ ప్రజలకు శాల్యూట్ చేస్తున్నానని చెప్పారు. పాకిస్థాన్ లో జరిగిన డిఫెన్స్ డే ఫంక్షన్ లో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ప్రజలకు తాము మద్దతుగా ఉంటామని చెప్పారు. కశ్మీర్ సోదరులు, సోదరీమణులు చేస్తున్న త్యాగాలు చాలా గొప్పవని అన్నారు. 

21:02 - December 30, 2017

విజయవాడ : కోడిపందేలను ప్రోత్సహించొద్దని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. ఈరోజు పార్టీ నేతలతో సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జన్మభూమితో పాటు జిల్లాల్లోని పార్టీ పరిస్థితులపై చర్చించారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు కోడి పందేలపై పలు సూచనలు చేశారు. కోడిపందేలను సంప్రదాయంగానే చూడాలని, ప్రోత్సహిస్తే జూదంలా మారుతుందని ఆయన అన్నారు. జూదంలా మారితే కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయన్నారు. గోదావరి జిల్లా నాయకులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. 

21:20 - October 6, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు మానుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపక్షాలకు సూచించారు. ప్రతిచిన్న అంశంపైనా విపక్షాలు చిల్లర రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని విమర్శించడమే కాంగ్రెస్‌ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రాజెక్డులకు కాంగ్రెస్‌ నేతలు అడుగడుగునా అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు ఛీకొడుతున్నా కాంగ్రెస్‌కు బుద్దిరావడం లేదని మండిపడ్డారు. సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ విజయం పట్ల కేసీఆర్‌ హర్షాన్ని, కార్మికులకు కృతజ్ఞతలనూ తెలిపారు.

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో.. పాలక పక్షపు అనుబంధ యూనియన్‌.. టీబీజీకేఎస్ గెలుపొందడంపై.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి ఎన్నికల ఫలితం విపక్షాలకు చెంపపెట్టన్నారు. సింగరేణి ఎన్నికల్లో ఓటమితోనైనా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలని సూచించారు. కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని తు.చ. తప్పకుండా అమలు చేస్తామన్నారు. కారుణ్య నియామకాల కింద డిపెండెంట్‌ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నాయకులపైన కేసీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోషల్‌ మీడియాలో తనపై చిల్లర గ్యాంగ్‌తో విషపురాతలు రాయిస్తున్నారని ఆరోపించారు. తనను దొరంటూ పోస్టులు పెడుతున్నారని ఫైర్‌ అయ్యారు. తెలంగాణకు అసలు దొర ఉత్తమ్‌కుమార్‌రెడ్డేనని విమర్శించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలోనే దొరతనపు ఛాయలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారన్న కేసీఆర్‌.. కాలేశ్వరంపై గ్రీన్‌ట్రిబ్యునల్‌లో స్టే తీసుకొచ్చింది దామోదర రాజనర్సింహేనని దుయ్యబట్టారు.

టీజేఏసీ చైర్మన్‌ కోదండరాంపైనా కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోదండరామ్‌ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని విమర్శించారు. కోదండరాం మొదటి నుంచీ టీఆర్‌ఎస్‌ వ్యతిరేకని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం ఆయనకు ఇష్టంలేదన్నారు. టీబీజీకేఎస్‌కు ఓట్లేస్తే సింగరేణి నాశనం అవుతుందని కోదండరాం ఎలా అంటారని ప్రశ్నించారు. దమ్ముంటే కోదండరాం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని.. ఆయనకు జేఏసీ ముసుగెందుకని విమర్శించారు.

తన మిత్రుడు, పరిటాల రవీంద్ర తనయుడి వివాహానికి వెళ్లినంత మాత్రాన.. టీడీపీతో సాన్నిహిత్యమన్న ఊహాగానాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికే లేదని, పోతిరెడ్డిపాడు లాంటి అంశాల్లో ఆ పార్టీ స్థానిక నేతలు రాష్ట్రానికి అనుకూలంగా స్పందించడం లేదని కేసీఆర్‌ అన్నారు. ఇక రాష్ట్రంలో కొత్త పార్టీ ప్రస్తావనే లేదని, వ్యక్తులు పార్టీ పెడితే నడిచే పరిస్థితి ఉండదని కేసీఆర్‌ అన్నారు.

కాళేశ్వరంపై గ్రీన్‌ ట్రైబ్యునల్‌ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. మూడేళ్లలోనే బంగారు తెలంగాణ సాధ్యంకాదని.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. త్వరలోనే లక్షా 12వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. సింగరేణిని బొగ్గుకే కాకుండా మిగతా రంగాలకు విస్తారిస్తామని చెప్పారు. బయ్యారం గనులను సింగరేణికి అప్పగిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

18:12 - April 23, 2017

హైదరాబాద్ : జనసేన అధినేత ట్విట్టర్ వేదికగా మరోసారి కేంద్రంపై పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలతో కేంద్రం సఖ్యతగా వ్యవహరించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. ఈమేరకు ఆదివారం ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. రాష్ట్రాల సాంప్రదాయాలు..సాంస్కృతిక..భాషలను గౌరవించి నడచుకోవాలని, భాష..జాతుల వైరుఢ్యాలకు నిలయమైన ఉప జాతీయత గుర్తింపును కేంద్రం గౌరవించాలని పేర్కొన్నారు. లేకుంటే దేశంలో వేర్పాటు ఉద్యమాలకు కేంద్రమే బలమైన పునాదులు వేసినట్లవుతుందని తెలిపారు.

08:05 - April 8, 2017
20:56 - February 28, 2017

కృష్ణా : జిల్లాలో నందిగామ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముళ్లపాడు బస్సు ప్రమాద బాధితులను జగన్‌ పరామర్శించిన అనంతరం..వైద్యుల వద్ద ఉన్న పోస్టుమార్టం రిపోర్టును తీసుకున్నారు. ఆ తర్వాత జగన్‌ చేతిలో ఉన్న పోస్టుమార్టం నివేదికను కలెక్టర్‌ మళ్లీ తీసుకున్నారు. దీంతో ఆగ్రహించిన జగన్‌ కలెక్టర్‌ను జైలుకు పంపుతానని హెచ్చరించారు. 

 

 

06:24 - November 2, 2015

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు దూకుడు పెంచారు. పని చేయని అధికారులపై తనదైన శైలిలో క్లాస్ తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితమే నెల్లూరులో మున్సిపల్, పారిశుద్ధ్య అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు..తాజాగా గుంటూరు జిల్లాలో రెవెన్యూ అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయని అధికారులను సస్పెండ్‌ చేస్తానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

మీ ఇంటికి - మీ భూమి..రెండో విడత 
గుంటూరు జిల్లాలో రెండవ విడత "మీ ఇంటికి- మీ భూమి" కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు.. ములకుదురు, చింతలపూడి గ్రామాల రైతులతో ముఖాముఖి నిర్వహించారు. పొలాలకు, భూములకు సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాల స్థానంలో 1బి ఎంతమంది మార్చుకున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా గ్రామంలోని కొందరు రైతులు స్థానిక ఎమ్మార్వో, వీఆర్వోలు, సర్వేయర్లు పెడుతున్న ఇబ్బందులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సర్వే చేయడానికి, ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడానికి లంచాలు అడుగుతున్నారంటూ మరికొందరు చంద్రబాబుకు వివరించారు. ప్రజలు సమస్యలు చెప్పగానే చంద్రబాబు సదరు గ్రామానికి చెందిన అధికారులను స్టేజ్ మీదకు పిలిచి క్లాస్‌ తీసుకున్నారు. అధికారులు తప్పులు చేస్తే సస్పెండ్ చేస్తానంటూ హెచ్చరించారు.

అధికారులపై చంద్రబాబు ఆగ్రహం..
రెవెన్యూ శాఖకు సంబంధించి అన్నింటినీ ఆన్ లైన్‌లో పొందు పరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, దీని ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ భూముల వివరాలను ల్యాండ్ బ్యాంక్‌లో చూసుకోవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు మాత్రం అడ్డగోలు విమర్శలు చేస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. మొత్తానికి మీ ఇంటికి- మీ భూమి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని రెవెన్యూ సిబ్బందికి చంద్రబాబు గట్టి హెచ్చరికలు పంపారు. స్టేజీ పై ఎమ్మార్వోలను, వీఆర్వోలను మందలించడం అవసరం అయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో, అక్కడికి వచ్చిన రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

11:43 - October 13, 2015

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి అడుగుపెట్టి ఈ రోజుకు 19 ఏళ్లు పూర్తయింది. ఈ రోజును పవన్ అభిమానులు ‘వరల్డ్ పవనిజం డే’గా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం వర్మ కొన్ని ట్వీట్లు చేశాడు. ''ఓ పవన్ కళ్యాణ్ అభిమానిగా.. మిగతా ప్రతి అభిమానులందరికంటే నేనే ఎక్కువగా పవన్ కళ్యాణ్ పై కేర్ చూపిస్తాను. ఈ ప్రపంచ పవనిజం డే నాడు.. సర్దార్ గబ్బర్ సింగ్ ‘బాహుబలి’ కంటే మిన్నగా ప్రపంచానికి చేరువవుతుందని బలంగా నమ్ముతున్నా. పవన్ కళ్యాణ్ అర్జెంటీనా ఐలాండ్ ఆఫ్రికా మొత్తం అమెరికాలో చాలా ఫేమస్. వరల్డ్ పవనిజం డే సందర్భంగా కంగ్రాట్స్'' అంటూ ట్వీట్లు చేశాడు వర్మ.

ఐతే ఈ ట్వీట్లతో పాటు ఇంతకుముందు పవన్ ఫ్యాన్స్ ను ఎద్దేవా చేస్తూ వర్మ చేసిన ట్వీట్లను కూడా దృష్టిలో ఉంచుకుని బండ్ల గణేష్.. వర్మకు వార్నింగ్ ఇచ్చాడు. ''మా పవన్ కళ్యాణ్ మీద వచ్చే విమర్శలు మాకు ఊరేగింపులో పడే మల్లె పూల లాంటివి ఆర్జీవీ సార్. సూర్యడి మీద ఉమ్మేస్తే...'' అంటూట ముందు ఓ ట్వీట్ చేశాడు బండ్ల. ఆ తర్వాత మళ్లీ.. ''ఆర్జీవీ.. మీకు పవన్ ఫ్యాన్స్ మీద అంత కోపం పనికి రాదు. మా లాంటి ఫ్యాన్స్ కి మీరు ముందు నిలబడి నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ఆర్జీవీ.. నా హంబుల్ రిక్వస్ట్. పవన్ కళ్యాణ్ పై రాత్రి పూట ట్వీట్లు చేసి నిద్ర పాడు చేయొద్దు. పగలు ట్వీట్లతో పని చెడగొట్టొద్దు'' అంటూ మరో ట్వీట్ చేశాడు బండ్ల.

ఈ ట్వీట్ల తర్వాత వర్మ లైన్లోకి వచ్చాడు. పవన్ గురించి తానెప్పుడూ గొప్పగానే మాట్లాడానన్నాడు. అంతటితో ఆగకుండా.. ''పవనిజం పుస్తకంలో ప్రస్తావించిన ఆర్దర్ స్కోపెన్ హెయిర్ ఫిలాసఫీ ఆధారితంగానే నేను వ్యాఖ్యలు చేశారు. నిరక్షరాస్యుల కసం నా అక్షరాస్యతను లెవెల్ ను తగ్గించుకోలేను'' అంటూ పంచ్ వేశాడు. దీనిపై గణేష్ మళ్లీ సెటైర్ వేశాడు.. ''మీరు బాగా చదువుకొని ఉండొచ్చు. కాని మాకు సంస్కారవంతమైన జీవితం ఇచ్చిన పవన్ వివేకవంతుడు'' అన్నాడు. దీనికి బదులుగా వర్మ.. ''నువ్వు అనవసరంగా పవన్ అభిమానులను పాడుచేసి మిస్ డైరెక్ట్ చేస్తున్నావ్. నేను చెప్పినదంతా పవనిజం పుస్తకంలోదే'' అని రిప్లై ఇచ్చాడు. మళ్లీ బండ్ల బాబు.. ‘‘మాకు పుస్తకాలు అక్కర్లేదు.. పవన్ లుక్ మాపై పడితే చాలు'' అంటూ పంచ్ వేసే ప్రయత్నం చేశాడు. మొత్తానికి ఇద్దరి మధ్య ఈ ట్వీట్ల యుద్ధం కొందరికి మజా ఇస్తే.. ఇంకొందరికి చిర్రెత్తేలా చేసింది....

12:28 - July 11, 2015

హైదరాబాద్ : కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై జరిగిన దాడి ఘటనలో ఐఏఎస్ అధికారితో విచారణ కమిటీ వేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హామీనిచ్చింది. తహశీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేనని, అతని అనుచరులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను రెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా పరిగణించి విధులను బహిష్కరించారు. రానున్న పుష్కరాల్లో సైతం పాల్గొనబోమని తేల్చిచెప్పారు. దీనితో ప్రభుత్వం వారితో చర్చలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో శనివారం సీఎం చంద్రబాబుతో రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు, తహశీల్దార్లు భేటీ అయ్యార. ఈభేటీలో ఎమ్మెల్యే చింతమనేని, తహశీల్దార్ వనజాక్షి పాల్గొన్నారు. దాడికి సంబంధించిన విషయాలను బాబు అడిగి తెలుసుకున్నారు. ఈ దాడిపై బాబు విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం. అక్రమాలను అడ్డుకుంటే దాడి చేయడం కరెక్టు కాదని ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులు పేర్కొన్నారు. దాడికి సంబధించిన ఫొటోలు కొన్ని దృశ్యాలను బాబుకు చూపించారు. ఈ సందర్భంగా వనజాక్షి డిమాండ్ మేరకు ప్రభుత్వం ఐఏఎస్ అధికారితో ఒక కమిటీని వేయడానికి బాబు అంగీకరించారని రెవెన్యూ ఉద్యోగ సంఘం నేతలు పేర్కొన్నారు. విచారణ అధికారిని త్వరగా నియమించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్ కు ఆదేశించారు. బోర్డర్ నిర్ధారణ కాకపోవడంపై ఈ సమస్య ఏర్పడిందని బాబు భావించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ ఉద్యోగులు విధులకు హాజరు కావాలని బాబు సూచించారు.
చిన్నమనేనికి బాబు వార్నింగ్...?
ఈ భేటీలో ఎమ్మెల్యే చిన్నమనేనికి సీఎం బాబు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇలా చేయడం కరెక్టు కాదని, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మందలించినట్లు తెలుస్తోంది. బోర్డర్ సమస్యను పరిష్కరించేందుకు వెళ్లానని, అక్కడ ఘర్షణ జరుగుతుంటే తాను ఆపడానికి ప్రయత్నించానని చిన్నమనేని బాబుకు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రెవెన్యూ ఉద్యోగులు, తహశీల్దార్లు తమ ఆందోళనను విరమించారు.

12:56 - July 2, 2015

రాజమండ్రి : ''ఐ డోన్ట్ వాంట్ లిజనింగ్...డోన్ట్ విత్ ప్లే..దేర్ ఈజ్ ఏ కంప్లైంట్..దేర్ ఈజ్ ఏ కంప్లైంట్..యూ టేక్ కేర్..యూ ఆర్ అనెఫిషియెట్ దెన్ క్విట్..యూ ఆర్ కేపబుల్ ..యూ ఆర్ డూ ఇట్..అదర్ వైస్ డోన్ట్ ప్లే విత్ మి..వచ్చే వరకు సరి చేయాలి..లేకుంటే ప్రాపర్ స్థానంలో ఉంటావు..బీ కేర్ ఫుల్''..ఇవన్నీ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు. గురువారం రాజమండ్రికి వచ్చిన ఆయన పుష్కర పనులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి నదిపై 9ఏళ్లుగా బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్న నాలుగో బ్రిడ్జి పనులను ఇంకా పూర్తి చేయకపోవడంపై గామన్ కంపెనీ ప్రతినిధులపై బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరగా పనులు చేపట్టకపోతే బ్లాక్ లిస్టులో పెడుతానంటూ హెచ్చరించారు. పుష్కరాల ప్రారంభానికి అంటే ముందే పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పుష్కరాల విజయవంతం కోసం మూడు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం బాబు వెల్లడించారు.

Don't Miss

Subscribe to RSS - వార్నింగ్