వాయు కాలుష్యం

12:00 - November 4, 2018

హైదరాబాద్: దీపావళి అంటే గుర్తొచ్చేది టపాసుల మోతలు అవి పంచే వెలుగులు. అయితే వినోదం మాటున దాగున్న కాలుష్యం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం కావడంతో సుప్రీంకోర్టు కీలక తీర్పున్చింది. దీపావళి రోజున కేవలం రెండు గంటలు మాత్రమే బాణాసంచా కాల్చాలని సూచించింది. సుప్రీం తీర్పు నేపధ్యంలో మార్గదర్శకాల అమలు పై గ్రేటర్ హైదరాబాద్‌లో ఉత్కంఠ నెలకొంది. సమయం దాటి టపాసులు కాల్చేవారిని ఎలా అదుపు చేస్తారు. టపాసులు పేల్చిన తర్వాత కాలుష్యాన్ని ఎలా లెక్కిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వాకిళ్లలో వెలుగులు నింపే దీపావళి సంబరాలంటే చిన్నా పెద్దా అందరికి సంబరమే. ఈ వేడుక రోజు రకరకాల టపాసులతో పెద్దవాళ్లు సైతం చిన్నపిల్లలుగా మారిపోయి కేరింతలు కొడతారు. అయితే ఈ దీపావళి వెలుగుల వెనుక కాలుష్యపు చీకటి కోణంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై సుప్రీంకోర్టు కూడా బాణాసంచా కాల్చడంపై మార్గదర్శకాలు విడుదల చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏవైనా రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలని ఆదేశించింది. సుప్రీం ఆదేశాల నేపధ్యంలో నగరంలో బాణాసంచా కాల్పులపై నియంత్రణ ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ వ్యవహారం కాలుష్య నియంత్రణ మండలి పరిధిలోకి రావడంతో ఇప్పుడు అధికారులు ఈ వ్యవహారంపై దృష్టిసారించారు.

Image result for diwali supreme courtహైదరాబాద్ నగరంలో కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ పొల్యూషన్‌ను నియంత్రించేందుకు నగరంలోని కాలుష్య నియంత్రణ మండలి కంటిన్యూయస్ యాంబ్యియంట్ ఎయిర్ క్వాలిటీ అనే అధునాతన యంత్రంతో వాయు కాలుష్యాన్ని లెక్కగడుతోంది. ఈ పరికరంతో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, బెంజిన్, టోలిన్ వంటి కాలుష్యకారకాల మోతాదును లెక్కిస్తుంది. వీటితో పాటు నగరంలోని మరో 21 పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాల్లో పీసీబీ డస్ట్ శాంప్లర్ అనే వాటితితో గాలిలోని ధుమ్ము ధూలిని లెక్కకడుతోంది.

సుప్రీం మార్గదర్శకాల ప్రకారం నగరంలో దీపావళికి వారం రోజుల ముందు తరువాత నగరవ్యాప్తంగా ఉన్న వాయు కాలుష్యాన్ని లెక్కించాలి. అయితే దీనికి అవసరమైన సిబ్బంది అందుబాబులో లేరని పీసీబీ అధికారులు చెబుతున్నారు. దీంతో దీపావళి పండుగ రోజు అవధులు దాటే కాలుష్యాన్ని ఎలా లెక్కిస్తారన్నది సప్పెన్స్‌గా మారింది. మరోవైపు పర్యావరణానికి హాని కలిగిస్తున్న టపాసులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.

Image result for diwali supreme courtమరోవైపు సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించి బాణా సంచా కాలిస్తే చర్యలు తప్పవంటున్నారు పోలీసులు. సుప్రీంకోర్టు పండుగ రోజు 2 గంటలు మాత్రమే బాణాసంచా కాల్చలాన్న నిర్ణయం అమలులో ఇబ్బందులున్నా అమలుపరచ్చాల్పిందేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయితే పండుగ రోజు తమ తమ సంప్రదాయాలకు అనుగుణంగా కాల్చుకోవచ్చని సుప్రీంకోర్టు వెసులుబాటు ఇచ్చిందని అంటున్నారు న్యాయనిపుణులు.

ఓవైపు సుప్రీంకోర్టు మరోవైపు ప్రజల విశ్వాసాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.

12:43 - August 10, 2018

తినే తిండి విషయంలో శ్రద్ధ పెరిగింది. తాగే నీటి విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నాం. కానీ..మనం బతికేందుకు ప్రధాన వనరు అయిన 'గాలి' విషయంలో మాత్రం మన దారుణంగా నష్టపోతున్నాం. అదే ఆరోగ్యం విషయంలో . మనం నిజానికి, తిండికన్నా, నీటికన్నా గాలినే మనం ఎక్కువగా అవసరం. అనుక్షణం ఆక్సిజన్ మన శరీరంలోని అణువణువుకూ అందాలి. అప్పుడే మనం సజీవంగా ఉండగలుగుతాం. సృష్టిలో జీవులకు, నిర్జీవులకు మధ్య అదే అతిపెద్ద తేడా. మనం మనగలుగుతున్నా మంటే అందుకు కారణం ప్రాణవాయువే. ఆ గాలి ఎంతగా కాలుష్యమౌతోందంటే, అది మన మనుగడకే శాపంగా మారింది. విషవాయువుల్ని పీలుస్తూ మనకు తెలియకుండానే మనం మన ఆయుషును కోల్పోతున్నాం.

దేశవ్యాప్తంగా కాలుష్య నగరాల సంఖ్య 100..
దేశంలోని వంద నగరాల్లో అత్యవసర కాలుష్య నిరోధక కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది అంటే వాయు కాలుష్యం ఎంతటి పెను ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో ఊహించలేం. ముంబై, పూణే, నాగపూర్, లక్నో, కాన్పూర్, వారణాసి, చంఢీఘడ్, కోల్ కతాలతోపాటు వంద నగరాల్లో కాలుష్య నివారణకు చర్యలు చేపట్టనుంది. కానీ ఇది ఎప్పటికి ఆచరణలో వచ్చేనో..మన ప్రాణాలకు ఎప్పుడు రక్షణ దొరికేనో? అదంతా పాలకు చేతిలోనే వుంది.

వాయు కాలుష్యంతో డయాబెటిస్ ముప్పు..
భారత్‌లోని ప్రధాన నగరాల్లో వాతావరణ కాలుష్యం ఎంతగా పెరిగిపోతోందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఈ కాలుష్యం మనుషుల్లో పలు వ్యాధులకు కారణం అవుతోంది. దీని కారణంగా డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం కూడా అధికమని తాజాగా పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతోన్న వారి సంఖ్య పెరగడానికి గాలి కలుషితం కావడం కూడా ఓ కారణమని పరిశోధకులు గుర్తించారు.

ఇన్సులిన్‌ ఉత్పత్తిపై వాయు కాలుష్య ప్రభావం..
కలుషితమైన గాలి మనిషిలో ఇన్సులిన్‌ ఉత్పత్తిపై ప్రభావం చూపుతోందని.. రక్తంలోని గ్లూకోజ్‌ను శక్తిగా మారకుండా అడ్డుకుంటుందని పరిశోధనలో తేలింది. గాలి కాలుష్యం విషయంలో తక్కువ ఆదాయ దేశాల్లో ఎలాంటి ప్రత్యామ్నాయ పాలసీలు లేవని, దీంతో ఆయా దేశాల్లో ప్రజలు అత్యధికంగా గాలి కాలుష్యం వల్ల డయాబెటిస్‌ బారిన పడుతున్నారని గుర్తించారు.

గాలి కాలుష్యం 30లక్షల మంది మృతి..
పర్యావరణ రక్షణ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలు కలిసి అతి తక్కువ కాలుష్యంగా గుర్తించిన ప్రదేశాల్లోనూ డయాబెటిస్‌ పెరిగిపోయిందని పరిశోధకులు తెలిపారు. 2016లో గాలి కాలుష్యం వల్ల ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మధుమేహ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. మరి ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి వాయు కాలుష్యం తగ్గించటంలో చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం..లేకుండే మానవ మనుగడకు ముప్పును మనకు మనమే మన విధి విధానాలతో కొన్ని తెచ్చుకునే ప్రమాదంలో పడిపోతాం..ఎన్నికల సమయంలో పాలకులకు ప్రజల ఓట్లు కోరేవారు ప్రజల ఆరోగ్య విషయంలో కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవరముంది. లేకుంటే స్వచ్ఛమైన గాలి కావాలంటు ప్రజలే ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. 

12:43 - April 7, 2018

హైదరాబాద్ : ట్విట్టర్‌ వేదికగా పవన్‌ కల్యాణ్‌ మరోసారి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టారు. దేశంలో వాయుకాలుష్యంపై ప్రశ్నించారు. భారత్‌ ఆర్థికంగా దూసుకుపోతున్నా, భారత్ వెలిగిపోతున్నా.. దేశంలో స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే పరిస్థితి లేదని అన్నారు. ఇందుకు నాయకుల చర్యలే కారణమని అన్నారు. స్వచ్ఛమై గాలి, నీరు దొరకడం లేదని తుందుర్రు యువత ప్రశ్నిస్తోందన్నారు.

 

08:20 - January 15, 2018

విశాఖ : జిల్లాలోని పెందుర్తీ నియోజక వర్గ ప్రజలను లారీలు భయపెడుతున్నాయి. ఐదునిముషాలు గ్యాప్‌లేకుండా తిరుగుతున్నలారీల రోడ్లన్నీ గుల్లవుతున్నాయి. దుమ్ము ధూళితో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రజల ఆరోగ్యాలను, రహదారులను గుల్లచేస్తున్న లారీలను వెంటనే నిలిపేయాలని స్థానికులు ఆందోళనబాట పట్టారు. 
నిత్యం వందలాది భారీ వాహనాలు 
విశాఖ జిల్లా పెందుర్తి నియోజక వర్గాన్ని కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. పరవాడ ఫార్మాసిటీ.. హింధూ జా విద్యత్ ఉత్పత్తి కేంద్రం మరో వైపు, ఎన్టీపీసీ పరిశ్రమ. దాంతోపాటు పలు ఫెర్రో ఎల్లాయిస్ కంపేనీలు ఉన్నాయి. వీటికి తోడు నియోజకవర్గం గుండా ఉన్న జాతీయ రహదారి మీద నిత్యం వందలాది భారీ వాహనాలు విరామం లేకుంబడా తిరుగుతూ ఉంటాయి. ఎన్టీపీసీ, హిందూజా, ఫెర్రొఎల్లాయిస్  కంపేనీలకు బోగ్గును సరఫరా చెసేందుకు నిత్యం వందలాది లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. వాస్తవానికి ఈ పరిశ్రమలు తమ బొగ్గు అవసరాల కోసం రైల్వే కనెక్టివిటీ ఏర్పాటు చేస్తుకోవాలి. కాని పరిహారం విషయంలో హిందూజా విద్యుత్‌ సంస్థకు స్థానిక రైతులకు వివాదం ఏర్పడ్డంతో రైల్వేలైన్లు ప్రతిపాదనకే పరిమితం అయ్యాయి. దీంతో పలు సంస్థలు  లారీలద్వారానే బొగ్గును తెచ్చుకుంటున్నాయి. బొగ్గులారీ నుంచి వెలువడుతున్న దుమ్ముధూళితో పెందుర్తి నియోజవర్గంలోని పలుగ్రామాల్లో కాలుష్యం ప్రమాదకారస్థాయికి పెరిగిపోయింది. 
రోడ్లన్నీ గతుకులమయం
ఈ లారీలు అన్ని పరవాడ, సబ్బవరం మండలాల్లోని 20కు పైగా గ్రామాల నుంచి రాపోకలు సాగిస్తున్నాయి.  పరిమితికి మించి లోడ్‌తో వెళ్లడంవల్ల రోడ్లన్నీ గతుకుల మయంగా మారిపోయాయి. పైగా బొగ్గులోడుతో వస్తున్న లారీలు కనీసం టార్పాలిన్‌ షీట్లుకూడా కప్పకండా వస్తున్నాయి. దీంతో రేణువులు గాల్లోకలిసి గాలికాలష్యం ఏర్పడుతోంది. పలు గ్రామాల్లో ప్రజలకు శ్వాసకోశవ్యాధులు వస్తున్నాయి.  అంతేకాదు మితిమీరిన వేగంతో దూసుకుపోతున్న లారీలతో తరచుగా రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. లారీలు అధికార పార్టీ నేతలకు చెందినవే కావడంతో చర్యలు తీసుకోవడానికి అధికారులు జంకుతున్నారు. 
ప్రజలు ప్రత్యక్ష అందోళన
ఎన్ని సార్లు అధికారులకు మోరపెట్టుకున్న వారి నుంచి ఎటువంటి స్పంధన లేదు..దీంతో ఆయా గ్రామాల ప్రజలు ప్రత్యక్ష అందోళను దిగుతున్నారు..అని ప్రజా సంఘాలతో పాటుగా అన్ని రాజకీయ పక్షాలు అంధోళనకు దిగుతున్నాయి. ప్రజల ఆందోళనతో  పెందుర్తి  ఎమ్మేల్యే బండారు సత్యనారాయణమూర్తి   స్పందించారు. సాధ్యమైనంత త్వరగా హింధూజా యాజమాణ్యంతో నూ ఇతర ఫెర్రో ఎల్లాయ్ సంస్థలతోనూ మాట్లాడి   రైల్వే ట్రాక్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తానంటున్నారు. నాయకులు హామీలు ఎప్పటిలాగే గొప్పగా ఉన్నా.. సమస్యమాత్రం పరిష్కారం కావడంలేదని స్థానక ప్రజలు అంటున్నారు. నాయకులు, అధికారులు తగిన చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పెందుర్తి నియోజకవర్గ ప్రజలు తేల్చి చెబుతున్నారు. 

06:37 - January 8, 2018

ఖమ్మం : వాయు కాలుష్యంలో ఖమ్మం నగరం మహానగరాలతో పోటీ పడుతోంది. నగరంలోని దానవాయిపేట డపింగ్‌ యార్డు కాలుష్యం ప్రాణాలను కబళించివేస్తోంది. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా కాల్చివేస్తున్న వ్యర్థాలతో ఎన్నో అనర్థాలు తలెత్తున్నాయి. సమీప కాలనీల్లోని ప్రజలు ఆరోగ్య సమ్యలతో అల్లాడుతున్నారు. దానవాయిపేట డంపింగ్‌ యార్డుపై 10 టీవీ ప్రత్యేక కథనం. నగరంలో సేకరించే చెత్త, ఇతర వ్యర్థాలకు ఇక్కడకు తెచ్చి కాల్చివేస్తున్నారు. కొండల్లా పేరుకుపోయిన చెత్త గుట్టలను మున్సిపల్‌ సిబ్బంది రాత్రి, పగలు అన్న తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు కాల్చి వేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకుని ఊపిరాడక జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దానవాయిపేట దంపింగ్‌ యార్డు నుంచి వస్తున్న పొగలను పీలుస్తున్న ప్రజలు రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ, గుండె జబ్బులతో బాధపడుతున్నారు. చర్మవ్యాధులు ఇబ్బంది పెడుతున్నాయి. గర్భిణిలు, చంటిపిల్లలు, వృద్ధుల బాధలు వర్ణనానీతంగా ఉన్నాయి.

డంపింగ్‌ యార్డు పొగతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానవాయిపేట డంపింగ్‌ యార్డు పొగతో గర్భిణిలు ఎన్నో బాధలు పడుతున్నారు. పట్టబోయే బిడ్డల ఆరోగ్యంపై కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను ఈ ప్రాంత ప్రజలు ఎన్నోసార్లు ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఎవరూ ఏమీ చేయడంలేదని ఆవేదన చెందుతున్నారు. ఖమ్మం మున్సిపాలిటీగా ఉన్నప్పుడు దానవాయిపేట డంపింగ్‌ యార్డు పట్టణానికి చాలా దూరంగా ఉండేంది. మున్సిపల్‌ కార్పొరేషన్‌గా మారిన తర్వాత నగరం బాగా విస్తరించింది. ఎన్నో ఉద్యమాలు, ఆందోళనలు, విన్నపాల తర్వాత ఇటీవల దానవాయిపేట డంపింగ్‌ యార్డు ప్రాంతానికి వచ్చిన మున్సిపల్‌ కమిషనర్‌ సందర్శించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి బదులు... ఫిర్యాదు చేసిన కాలనీ వాసులను బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయి.

నగర పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దానవాయిపేట డపింగ్‌ యార్డును తరలిస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదని టీఆర్‌ఎస్‌ నేతలే అంటున్నారు. డంపింగ్‌ యార్డు సమస్యపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని మున్సిపల్‌ కమిషనర్‌ వ్యవహారంపై ఈ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. డంపింగ్ యార్డును తరలించకపోతే ఉద్యమం తప్పదని సీపీఎం నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు అఖిపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దట్టమైన పొగమంచుకు డంపింగ్‌ యార్డు పొగతోడవడంతో ఈ ప్రాంతంలో అతిసమీపంలోని దృశ్యాలు కూడా కనిపించని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. డంపింగ్‌ యార్డు తరలింపుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని దానవాయిపేట డంపింగ్‌ యార్డు ప్రాంత కాలనీల ప్రజలు కోరుతున్నారు. 

20:24 - November 30, 2017

మామూలుగా గాలి పీల్చక పోతే చస్తారు.. కానీ, ఇక్కడ గాలి పీల్చినందుకు చస్తున్నారు..ఇది మామూలు గాలి కాదు.. ఊపిరితిత్తులను రోజుకింత కొరుక్కు తినేస్తోంది. ఇది ఏ ఒక్క ప్రదేశానికో, నగరానికో పరిమితం కాదు.. దేశంలోని పెద్ద పెద్ద నగరాలనుంచి, చిన్న స్థాయి పట్టణాల వరకు ఇదే పరిస్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే వాయు కాలుష్యం అంతులేకుండా పెరుగుతోంది. ప్రాణాంతకంగా మారుతోంది. ఈ అంశంపై ప్రత్యేక కథనం...ఆకాశహర్మ్యాలు.. సకల సౌకర్యాలు..అత్యంత నాగరికం.. ఇక్కడ దొరకనిది లేదు.. అందనిది లేదు. కానీ, ఈ నగరాలే.. ప్రాణాలను తీసేస్తున్నాయి. ఆక్సిజన్ ని మింగేస్తూ, ప్రమాదకర వాయువులను అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. దేశమంతా కాలుష్య కాసారంలా మారుతోంది. ఆక్సిజన్ తక్కువ.. కార్బన్ ఎక్కువ.. పీలిస్తే రోగాలు ఖాయం..అటు ఢిల్లీ నుండి ఇటుహైదరాబాద్ వరకు..

కరీంనగర్ నుండి ఖమ్మం లాంటి పట్టణాల వరకు ఇదే తీరు. నిత్యం పెరుగుతున్న వాయు కాలుష్యం లక్షలాదిమందిని రోగాలపాల్జేస్తోంది.. ఉసురు తీస్తోంది. దేశానికే కాదు.. కాలుష్యానికీ క్యాపిటల్ గా నిలుస్తోంది.. పట్టపగలే పొగమంచు పేరుకుని ఎదురుగా వచ్చే వాహనాలే కనిపించని పరిస్థితి. పొల్యూషన్ లో బీజింగ్ ని దాటి శరగవేగంగా దూసుకుపోతోంది ఢిల్లీ.. ఢిల్లీలో ప్రజారోగ్యం ఇప్పటికే ప్రమాదంలో ఉంది. ఇదిలాగే సాగితే కొన్నాళ్లకు దేశ రాజధానిలో ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో ఊహించటం కూడా కష్టమే..అన్ని అనర్ధాలకు కారణం కారణం ఏమిటి? నగరాలు ఎందుకు ఇంత కాలుష్య భరితంగా మారుతున్నాయి. ఒక్క భారత్ లోనే కాదు.. అనేక వర్ధమాన దేశాల గాలి ప్రమాదకరంగా ఎందుకు మారుతోంది? ఊహించని అనర్ధాలకు ఎందుకు కారణం అవుతోంది. దీనిని నియంత్రింకపోతే ఎలాంటి అనర్థాలు జరిగే అవకాశాలున్నాయి?

ప్రమాదపు చివరి అంచులో ఉన్నాం. వాయుకాలుష్యం ఇదే రీతిలో పెరిగితే దేశంలో సగం జనాభా ఆస్పత్రుల్లోనే మకాం పెట్టే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపడాల్సిందే లేదు. పర్యావరణ ముప్పునుండి ఈ భూగోళాన్ని కాపాడుకోటానికి ఎలాంటి మార్గాలున్నాయి? వాయు కాలుష్యం.. గ్లోబల్ వార్మింగ్ కు కారణంగా మారకుండా నియంత్రించే మార్గాలే లేవా? ముందూ వెనుకా చూడకుండా అభివృద్ధి కోసం పరుగులో మిగుల్చుకుంటున్నది, పోగుచేస్తున్నది అపారమైన కాలుష్యాన్ని మాత్రమే. దీన్నిలాగే కొనసాగిస్తే ఇప్పటికే వెల్లువెత్తుతున్న విపత్తులు మరింత ఉగ్రరూపం దాల్చి ప్రపంచదేశాలను అన్ని రకాలుగా కబళించటం ఖాయం..అన్నిటికంటే ముందు నూట ముప్ఫై కోట్లతో నిండిన నిండు కుండలాంటి భారతదేశానికి ఈ పరిణామాలు వీలైనంత త్వరగా మేల్కొవలసిన అవసరాన్ని సూచిస్తున్నాయి. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి…

06:49 - November 12, 2017

హైదరాబాద్ : కాలుష్యం.. కాలుష్యం..! ఇప్పుడు దేశమంతటా ఎక్కడ చూసినా ఇదే మాట. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యపు మేఘం కప్పేయడంతో.. జనం బయటకు రావడానికే భయపడే పరిస్థితి ఉంది. ఇది ఢిల్లీ ఒక్కదానికే పరిమితం కాలేదు. దేశంలోని చాలా ప్రధాన నగరాలూ.. ఇదే తరహా కాలుష్యపు కాసారాలుగా మారాయి. అయితే.. కాలుష్యానికి కడు దూరంగా నిలిచిన నగరాలూ లేకపోలేదు. వీటిల్లో కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం అగ్రభాగాన ఉండడం విశేషం. దేశంలోనే అత్యల్ప పీపీఎం నమోదైన రాజధానిగా త్రివేండ్రం నిలిచింది.

భారత దేశాన్ని ఇపుడు వాయు కాలుష్యం పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ పరిధిలో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరింది. ఢిల్లీలో పొల్యుషన్‌ ఎమర్జెన్సీ ప్రకటించారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాదిలో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ పరిధిలో అత్యధిక వాయు కాలుష్యం నమోదైంది. ఢిల్లీలో పొల్యుషన్‌ లెవల్ పిఎం 502 స్థాయికి చేరగా... ఘజియాబాద్‌లో రికార్డ్‌ స్థాయిలో 720 పిఎం నమోదైంది. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సోమవారం నుంచి సరి బేసి విధానాన్ని అమలు చేస్తోంది.

ఉత్తరాదితో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణ కాలుష్యం తక్కువగా ఉంది. ముఖ్యంగా కేరళ రాజధాని తిరువనంతపురంలో పొల్యుషన్‌లెస్‌ నగరంగా గుర్తింపు పొందింది. పొల్యుషన్‌ లెవల్‌ ఇక్కడ అతితక్కువగా 13 పిఎం మాత్రమే నమోదైంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్‌, విజయవాడ నగరాలు ఢిల్లీ స్థాయితో పోలిస్తే.. అసలు కాలుష్యం లేదనే చెప్పాలి. కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం 50 పీఎంలలోపు కాలుష్యం ఉంటే.. వాతావరణం చాలా బాగా ఉన్నట్లు. ఈలెక్కన, 36 పీఎంలతో హైదరాబాద్‌, 39 పీఎంలతో విజయవాడ, 34 పీఎంలతో రాజమండ్రి, 28 పీఎంలతో విశాఖ.. కాలుష్య రహిత ప్రాంతాలుగా నిలుస్తున్నాయి. పొరుగున ఉన్న బెంగళూరులో కూడా 22 పిఎంల మేరకే కాలుష్యం ఉంది.

కేరళ ప్రభుత్వం పర్యావరణానికి ప్రాధాన్యతనివ్వడం... అడవుల సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుండడం, పర్యావరణం పట్ల ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహనను కల్పించడం వల్లే తిరువనంతపురం అతి తక్కువ కాలుష్యం నమోదైన్నది నిపుణుల అంచనా. బెంగళూరులో కూడా పచ్చదనానికి పెద్దపీట వేయడంతో వాయు కాలుష్యం తక్కువ స్థాయిలో ఉంది. హైదరాబాద్‌ కన్నా విజయవాడలో కాలుష్యం 3 పిఎంలు ఎక్కువగా ఉండడం గమనార్హం.  

12:29 - November 11, 2017

ఢిల్లీ: నగరంలో పెరిగిపోతున్న కాలుష్యంపై ఎన్జీటీ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు మళ్లీ సరి బేసి విధానాన్ని తీసుకురావాలన్న కేజ్రీవాల్‌ ప్రభుత్వం నిర్ణయంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆడ్‌-ఈవెన్‌ అమలుపై సమీక్ష జరిపిన ఎన్‌జిటి ఇదో తమాషాలా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సరి-బేసి అమలు ఉద్దేశం మంచిదే కానీ..అమలవుతున్న తీరును తప్పు పట్టింది. షాక్‌ ట్రీట్‌మెంట్‌ తరహా ఆడ్‌-ఈవెన్‌ అమలు చేయలేమని స్పష్టం చేసింది. సరి-బేసి విధానాన్ని ప్రతి సంవత్సరం అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఎన్‌జిటి సూచించింది. ఏడాది కాలంగా సమయం ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై శనివారం విచారణ చేపట్టనుంది. 

09:01 - November 11, 2017

ఢిల్లీ : దేశ రాజధానిని పొగమంచు వీడడం లేదు. దట్టంగా పొగమంచు అలుముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా కాలుష్య అధిక స్థాయిలో వెదజల్లుతున్న సంగతి తెలిసిందే. రెండు ప్రధాన సమస్యలతో అక్కడి జనం తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. పొగమంచు కారణంగా పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. 64 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా రెండు రైళ్లను రద్దు చేయగా 14 రైళ్ల సమయాల్లో మార్పులు చేశారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడం..రైళ్లు రద్దు కావడం..సమయాల్లో మార్పులు చేయడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. విమాన ప్రయాణంలో కూడా పలు మార్పులు చేసుకుంటున్నాయి.

ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ ప్రభుత్వం సరి బేసి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. నవంబర్‌ 13 నుంచి 17 వరకు ఆడ్‌-ఈవెన్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌ 6 వందల ప్రయివేటు బస్సులను అదనంగా ఏర్పాటు చేసింది. డిటిసి, క్లస్టర్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఢిల్లీ ప్రభుత్వం ప్రయాణికులకు ఆఫర్ ప్రకటించింది. దట్టమైన పొగమంచు కారణంగా సోమవారం వరకు 6 వేల పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

08:33 - November 11, 2017

ఢిల్లీ : కాలుష్యాన్ని నియంత్రించేందుకు మళ్లీ సరి బేసి విధానాన్ని తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ మండిపడింది. తాము సంతృప్తి చెందేవరకు ఆడ్‌-ఈవన్ అమలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. సరి బేసి విధానాన్ని అమలు చేస్తున్న తీరును ఎన్‌జిటి తప్పు పట్టింది. మరోవైపు సరి బేసి విధానం అమలులో భాగంగా బస్సులను ఫ్రీగా నడుపుతామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు మళ్లీ సరి బేసి విధానాన్ని తీసుకురావాలన్న కేజ్రీవాల్‌ ప్రభుత్వం నిర్ణయంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆడ్‌-ఈవెన్‌ అమలుపై సమీక్ష జరిపిన ఎన్‌జిటి ఇదో తమాషాలా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సరి-బేసి అమలు ఉద్దేశం మంచిదే కానీ..అమలవుతున్న తీరును తప్పు పట్టింది. షాక్‌ ట్రీట్‌మెంట్‌ తరహా ఆడ్‌-ఈవెన్‌ అమలు చేయలేమని స్పష్టం చేసింది.

సరి-బేసి విధానాన్ని ప్రతి సంవత్సరం అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఎన్‌జిటి సూచించింది. ఏడాది కాలంగా సమయం ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సరి-బేసి పథకాన్ని అమలు చేయమని సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేదని ట్రిబ్యునల్‌ గుర్తు చేసింది. పొల్యూషన్‌ను నియంత్రించేందుకు వంద మార్గాలను సూచించినా ప్రభుత్వం కేవలం సరి బేసి విధానాన్ని మాత్రమే ఎంచుకుంటోందని ఎన్‌జిటి అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ స్కీంకు ఢిల్లీ ప్రభుత్వం న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంది.

వాతావరణ పరిస్థితి మెరుగవుతున్న సమయంలో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని...ఈ పని ముందే చేస్తే బాగుండేదని ఎన్‌జిటి అభిప్రాయపడింది. సరి-బేసి విధానం వల్ల కాలుష్యం తగ్గితే సరి...లేదా...ఈ పథకాన్ని నిలిపివేస్తామని ఎన్‌జిటి హెచ్చరించింది. ఢిల్లీలో నిర్మాణపు పనుల వల్ల వెలువడుతున్న కాలుష్యంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? నిబంధనలు ఉల్లంఘించిన బిల్డర్లపై విచారణ జరుపుతున్నారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పంజాబ్‌ ప్రభుత్వంపై కూడా ఎన్‌జిటి అక్షింతలు వేసింది. పంటల దహనాలను ఆపకపోతే...జరిమానా చెల్లించడానికి సిద్ధం కావాలని హెచ్చరించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ ప్రభుత్వం సరి బేసి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. నవంబర్‌ 13 నుంచి 17 వరకు ఆడ్‌-ఈవెన్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌ 6 వందల ప్రయివేటు బస్సులను అదనంగా ఏర్పాటు చేసింది. డిటిసి, క్లస్టర్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఢిల్లీ ప్రభుత్వం ప్రయాణికులకు ఆఫర్ ప్రకటించింది. దట్టమైన పొగమంచు కారణంగా సోమవారం వరకు 6 వేల పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Pages

Don't Miss

Subscribe to RSS - వాయు కాలుష్యం