రూపాయి పతనం

12:21 - October 4, 2018

ముంబై : డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత దిగజారింది. దీనితో దేశీయ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. గత సెషన్ లో 550 పాయిట్లు తగ్గిన సెన్సెక్్స గురువారం ఏకంగా 700 పాయింట్ల మేర పతనం కావడం గమనార్హం. ప్రారంభం నుండే అమ్మకాల వత్తిడి అధికంగా ఉంది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, కరెంటు ఖాతాలతో మరింత పెరుగుతుందని అంచనాలు రావడం..దీని ప్రభావం మార్కెట్లపై పడింది. ముడి చమురు ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడం అమ్మకాలపై వత్తిడి పెరుగుతోంది.  

ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి విలువ పతనమైంది. వరుసగా మూడో రోజు రూపాయి మారకం విలువ పడిపోయింది. డాలర్ తో పోలిస్తే 73.77కు రూపాయం మారకం పడిపోయింది. రాబోయే రోజుల్లో జీడీపీ గ్రోత్ రేట్ పెరుగుతుందని అంచనాలున్నా ఆ దిశ కనిపించడం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆర్థిక పరిస్థితులు ఛిన్నాభిన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రూపాయి మారకం విలువ మరింత పడిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఎగుమతుల విషయాల్లో పలు చర్యలు తీసుకుంటే రూపాయి బలపడే అవకాశం ఉందని, వ్యవసాయ రంగంలో ఈ గ్రోత్ రాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉందని పేర్కొంటున్నారు. 

13:31 - September 12, 2018

ముంబై : రూపాయి మరింత క్షీణించింది. గత కొన్ని రోజులుగా రూపాయి కనిష్టస్థాయికి పడిపోతున్న సంగతి తెలిసిందే. అమెరికా డాలర్ తో పొలిస్తే రూపాయి విలువ 72.91గా నమోదైంది. బుధవారం మరో 22 పైసలు క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, అమెరికా డాలర్‌కు గిరాకీ పెరగడం వంటి కారణాలతో రూపాయి విలువ మరింత బక్కచిక్కిపోతోంది. డాలర్ కు డిమాండ్ పెరిగిపోతుండడంతో పాటు ముడి, చమురు ధరలు పెరగడం..కరెంటు ఖాతా లోటు ఎక్కువగా ఉండడం రూపాయి విలువపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని బిజినెస్ విశ్లేషకులు పేర్కొటున్నారు. 

 

Don't Miss

Subscribe to RSS - రూపాయి పతనం