రూపాయి

11:40 - December 1, 2018

ఇస్లామాబాద్ :(పాకిస్థాన్) :  మన పొరుగుదేశం పాకిస్థాన్‌ను ఆర్థిక కష్టాలు వీడడం లేదు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి వందరోజులు పూర్తయిన సందర్భంగా సంబరాలు చేసుకుంటున్న సమయంలో పాక్‌ను కరెన్సీ పతనం తీవ్రంగా కలవరపెడుతోంది. శుక్రవారం ఒక్కరోజే పాకిస్థాన్ రూపాయి విలువ దారుణంగా పతనమైంది. ప్రస్తుతం కరెన్సీ మారకం ప్రకారం డాలర్‌కు 144 రూపాయిల కనిష్ట స్థాయికి చేరుకుంది పాక్ కరెన్సీ. ఉగ్రవాద ఛాయలను తుడుచుకుని, దేశాన్ని అభివృద్ధి బాటలో నడపాలని భావిస్తున్న ఇమ్రాన్ ఖాన్‌కు ఇది కచ్ఛితంగా పెద్ద సమస్యే. గురువారం రోజు డాలర్‌కు 134 పాక్ రూపాయిలకు చేరిన మారకం విలువ... శుక్రవారం అంటే నవంబర్ 30వ తేదికి  మరో 10 రూపాయలు పడిపోయింది.
రూపాయి విలువ పతనాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తున్నాం : ఎస్బీఐ 
ఇది పాక్ రూపాయి చరిత్రలోనే అత్యంత తగ్గుదల కావటం గమనించాల్సిన విషయం. భారతీయ కరెన్సీతో పోలిస్తే ఒక్కో రూపాయికి రెండు పాక్ రూపాయిలు అన్నమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ తెలిపిన వివరాల ప్రకారం ‘ప్రస్తుతం మార్కెట్ అస్సలు బాగోలేదు. రోజురోజుకీ కరెన్సీ విలువ భారీగా పడిపోతోంది. అయితే దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం...’ అంటూ తెలిపారు. ప్రస్తుతం పాక్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్ (ఐఎమ్ఎఫ్)తో ఆర్థిక సాయం కోసం చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు పెద్దగా సఫలీకృతం కావడం లేదు. ఈ ప్రభావం కూడా కరెన్సీ విలువ పడిపోవడానికి ఓ కారణం. అదీకాకుండా ప్రస్తుతం చైనా అందిస్తున్న ఆర్థికసాయన్ని కూడా వదులుకోవాలని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం భావిస్తుండడం కూడా పాక్ కరెన్సీ పడిపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 
మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్..
కరెన్సీ విలువ రోజురోజుకీ పతనమవుతున్నా ఇమ్రాన్‌ఖాన్ మాత్రం... ‘దేశాభివృద్ధిలో పాలు పంచుకునేందుకు పెద్దఎత్తున పెట్టుబడిదారులు పోటీపడుతున్నారు’ అంటూ వ్యాఖ్యానించడం విశేషం. కానీ కరెన్సీ మార్కెట్లో ఏమాత్రం పెరుగుదల కనిపించలేదు. ఓపెన్ మార్కెట్లో డాలర్ రూ.10లు పెరిగింది. రూపాయి విలువకు కొంత బలం కావడానికి ముందు ఒకేసారి 144 రూపాయల వద్ద ట్రేడింగ్ జరిగింది. భారీ వనరుల కోసం బ్లాక్ మార్కెటింగ్ ప్రధాన కారణం అని నీటి వనరుల మంత్రి ఫైసల్ వడ మీడియాకు తెలిపారు.  
 

12:21 - October 4, 2018

ముంబై : డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత దిగజారింది. దీనితో దేశీయ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. గత సెషన్ లో 550 పాయిట్లు తగ్గిన సెన్సెక్్స గురువారం ఏకంగా 700 పాయింట్ల మేర పతనం కావడం గమనార్హం. ప్రారంభం నుండే అమ్మకాల వత్తిడి అధికంగా ఉంది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, కరెంటు ఖాతాలతో మరింత పెరుగుతుందని అంచనాలు రావడం..దీని ప్రభావం మార్కెట్లపై పడింది. ముడి చమురు ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడం అమ్మకాలపై వత్తిడి పెరుగుతోంది.  

ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి విలువ పతనమైంది. వరుసగా మూడో రోజు రూపాయి మారకం విలువ పడిపోయింది. డాలర్ తో పోలిస్తే 73.77కు రూపాయం మారకం పడిపోయింది. రాబోయే రోజుల్లో జీడీపీ గ్రోత్ రేట్ పెరుగుతుందని అంచనాలున్నా ఆ దిశ కనిపించడం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆర్థిక పరిస్థితులు ఛిన్నాభిన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రూపాయి మారకం విలువ మరింత పడిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఎగుమతుల విషయాల్లో పలు చర్యలు తీసుకుంటే రూపాయి బలపడే అవకాశం ఉందని, వ్యవసాయ రంగంలో ఈ గ్రోత్ రాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉందని పేర్కొంటున్నారు. 

12:42 - October 3, 2018

ఢిల్లీ : రూపాయి విలువ భారీగా పతనమైంది. అమెరికా కరెన్సీ డాలర్‌కు డిమాండ్ పెరిగిపోవడంతో దేశీయ కరెన్సీ రూపాయి విలువ మరోసారి భారీగా క్షీణించింది. మార్కెట్‌ చరిత్రలోనే తొలిసారిగా 73 మార్క్‌ను దాటింది. 73.34 వద్ద అత్యంత కనిష్టానికి రూపాయి పడిపోయంది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.34 వద్ద తాజా జీవనకాల కనిష్ఠాన్ని తాకింది. మంగళవారం నాటి సెషన్‌లో 72.91 వద్ద స్థిరపడ్డ రూపాయి.. నేడు 35 పైసలు నష్టపోయి 73.26 వద్ద ప్రారంభమైంది. కాసేపటికే మరింత దిగజారి 73.34 వద్ద అత్యంత కనిష్ఠానికి పడిపోయింది. ప్రస్తుతం 9.45 గంటల ప్రాంతంలో రూపాయి మారకం విలువ 73.33గా కొనసాగుతోంది.

దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో పాటు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడంతో దేశీయంగా రూపాయి విలువ భారీగా పతనమైందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. సోమవారం నాటి ట్రేడింగ్‌లో రూ. 1,842కోట్ల పెట్టబడులను విదేశీ సంస్థాగత మదుపర్లు వెనక్కి తీసుకున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా ముడిచమురు ధర బ్యారెల్‌కు 85 డాలర్లుగా ఉంది. కాగా.. రూపాయి పతనం స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. నేటి ట్రేడింగ్‌లో దేశీయ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

13:31 - September 12, 2018

ముంబై : రూపాయి మరింత క్షీణించింది. గత కొన్ని రోజులుగా రూపాయి కనిష్టస్థాయికి పడిపోతున్న సంగతి తెలిసిందే. అమెరికా డాలర్ తో పొలిస్తే రూపాయి విలువ 72.91గా నమోదైంది. బుధవారం మరో 22 పైసలు క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, అమెరికా డాలర్‌కు గిరాకీ పెరగడం వంటి కారణాలతో రూపాయి విలువ మరింత బక్కచిక్కిపోతోంది. డాలర్ కు డిమాండ్ పెరిగిపోతుండడంతో పాటు ముడి, చమురు ధరలు పెరగడం..కరెంటు ఖాతా లోటు ఎక్కువగా ఉండడం రూపాయి విలువపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని బిజినెస్ విశ్లేషకులు పేర్కొటున్నారు. 

 

16:10 - September 11, 2018

ముంబయి: రూపాయి మరింత క్షీణించి డాలరు విలువలో రూ 72.73 స్థాయికి పడిపోయింది. రూపాయి విలువ మంగళవారం నాడు 28 పైసలు మేరకు తగ్గింది, ప్రారంభంలో 15 పైసలు తగ్గినా.. సాయంత్రం ట్రేడింగ్ లో 28 పైసలు మేర పడిపోయింది. ఈ ఏడాది ఇంతవరకు డాలరు విలువలో 13 శాతం మేర తగ్గింది. ఆసియా కరెన్సీలలోనే రూపాయి అత్యంత బలహీనమైన పనితీరును కనబరిచింది. 

ఇదిలాఉండగా, కేంద్ర ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిందిగా రిజర్వు బ్యాంకు అధికారులను ఆదేశించింది.

15:57 - September 10, 2018

హైదరాబాద్ : డాలరు విలువతో పోల్చితే రూపాయి విలువ సోమవారం మరింత దిగజారింది. రూపాయి మరింత పతనమై డాలర్ రేటుతో 72.67 స్థాయికి పడిపోయింది. వాణిజ్య లోటుతోపాటు అమెరికా డాలర్ కు ఎగుమతి  దారుల వల్ల డిమాండ్ పెరగటంతో రూపాయి విలువ పడినట్టు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

దేశీయ ద్రవ్య విలువ ఈరోజు డాలర్ రేట్ పై 71.73 దగ్గర మొదలై అత్యల్పంగా 72.15 వద్ద ముగిసింది. నిన్నటి 72.11 విలువను రికార్డు స్థాయిలో దాటి 72.67 గా నమోదయ్యింది.

20:43 - August 31, 2018

పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండటం పరిపాటిగా మారిపోయింది. ఈ విషయంలో సామాన్యుడు ఎంతగా మెత్తుకున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. గత కొంతకాలం నుండి వరుసగా పెరుగతునే వున్నాయి. ముంబైలో రై.85.78 పైసలుగా వుంటే హైదరాబాద్ లో రూ.83.02 పైసలుగా వుంది. రికార్డులో స్థాయిలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడి నడి విరుస్తున్నాయి. దీంతో నిత్యావసర వస్తువులు ధరలు కూడా పెరుగుతున్నాయి. ధరలు నియంత్రణలో ప్రభుత్వాలు ఎందుకు విఫలం అవుతున్నాయి? డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ కూడా అంతకంతకు దిగజారుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపుతోంది. ఈ అంశంపై ప్రముఖ ఆర్థిక నిపుణులు పాపారావు విశ్లేషణతో..

17:56 - August 31, 2018

ముంబై : అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ముడిచమురు ధరల్లో పెరుగుదల వెరసి రూపాయి పతనం కొనసాగుతోంది. తాజాగా డాలరుకు రూపాయి మారకం విలువ రూ.71కి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ కు డిమాండ్ పెరగడంతో పాటు పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ముడిచమురు ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఫారెక్స్ మార్కెట్ లో రూపాయి విలువ 26 పైసలు పడిపోయింది. ట్రేడింగ్ సెషన్ లో రూ.70.74 వద్ద ముగిసిన రూపాయి విలువ తాజాగా మరో 26 పైసలు కోల్పోయి తొలిసారిగా రూ.71కు దిగజారి ఆల్ టైం గరిష్టానికి చేరుకుంది. చమురు సెగకు తోడు అమెరికా చైనా వాణిజ్య యుద్ధం భయం, దేశంలో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు నెలకొన్న వేళ రూపాయి పతనం ఈ రోజు కూడా కొనసాగింది. కాగా ప్రస్తుతం రూపాయి విలువ అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్ లో డాలర్ కు రూ.70.94 వద్ద ట్రేడ్ అవుతుంది. దీంతో భారత కరెన్సీ రూపాయి విలువ రికార్డ్‌ స్థాయిలో పతనమైంది. డాలర్‌తో పోలిస్తే 26 పైసలు పతనమై అత్యంత కనిష్ట స్థాయి 71 రూపాయలకి చేరింది. క్రూడాయిల్‌ ధరలు పెరుగుతుండడం, అమెరికా డాలర్‌కు విపరీతమైన గిరాకీ ఏర్పడడమే రూపాయి పతనానికి కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

21:29 - August 15, 2018

రూపాయి.. పతనమైంది... నిజమే.. అయితే.. దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వస్తుంది..? అసలు ఈ పతనం ఎవరికైనా మేలు చేస్తుందా..? వాచ్‌ దిస్‌ స్టోరీ.. 72వ స్వాతంత్ర్య దినోత్సవాన.. దేశీయ రూపాయి విలువ దారుణంగా పతనమైపోయింది. ఇన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేని రీతిలో డాలర్‌తో మారకం విలువ 70 రూపాయల 09 పైసల స్థాయికి పడిపోయింది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. ఆ కోణాన్ని పక్కనుంచితే.. రూపాయి పతనం కావడం.. భారతీయులపై ఎట్లాంటి ప్రభావం చూపబోతోంది అన్నది ప్రశ్న.
మొదటగా దిగుమతులపైనే ప్రభావం  
రూపాయి విలువ పడిపోయిందంటే.. ఎప్పుడైనా ఫస్ట్‌గా దాని ప్రభావం పడేది దిగుమతులపైనే. దేశీయ దిగుమతుల్లో సింహభాగం.. క్రూడాయిల్‌ ఉంటోంది. అంటే పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇక కొండెక్కే అవకాశం ఉంది. అదే జరిగితే.. సరకుల రవాణా ఖర్చు పెరిగి ఆమొత్తాన్ని వినియోగదారులే భరించాల్సి ఉంటుందన్నమాట. దిగుమతి చేసుకుంటున్న యంత్రసామగ్రి, ల్యాప్‌టాప్‌ లాంటి వస్తువుల ధరలూ బాగా పెరుగుతాయి. విదేశీ విద్యకు వెళ్లాలనుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులకు భారం తడిసి మోపెడు కానుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడులూ వెనక్కి వెళ్లొచ్చు. 
రూపాయి పతనం.. కొందరికి మేలు 
రూపాయి ఇలా పతనం కావడం.. కొందరికి మాత్రం మేలు చేయబోతోంది. మన దేశం నుంచి ఇతర దేశాలకు వస్తువులను ఎగుమతి చేసే వారు బాగా లాభపడతారు. అంతేకాదు.. విదేశాల్లోని తమ పిల్ల నుంచి డబ్బులు పొందే తల్లిదండ్రులకూ లాభమే. మారకం విలువ ప్రకారం అక్కడి వారు  ఓ వెయ్యి డాలర్లు పంపితే గతంలో.. ఓ 65 నుంచి 66 వేలు వచ్చేవి. ఇప్పుడు.. 70వేల వరకూ వస్తుంది. మొత్తానికి డాలర్‌తో రూపాయి విలువ పతనం కావడం.. దేశంలో ఆర్థిక మాంద్యానికీ కారణం కావచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

 

13:42 - August 14, 2018

ముంబై : డాలర్ తో రూపాయి మారకపు విలువ ఆల్ టైమ్ కనిష్ఠాన్ని నమోదు చేసింది. చరిత్రలో తొలిసారిగా ఒక డాలర్ మారకపు విలువ రూ. 70.08ను తాకింది. టర్కీలో ఆర్థిక సంక్షోభంతో డాలర్ కు డిమాండ్ పెరుగగా, ఆ ప్రభావం రూపాయిపై పడిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. క్రితం ముగింపుతో పోలిస్తే, ఈ ఉదయం ఫారెక్స్ మార్కెట్ లో 69.85 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ, ఆపై కాసేపటికే ఆల్ టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. 2013, సెప్టెంబర్ 3 తరువాత నిన్న రూపాయి విలువ తొలిసారిగా ఒక్కరోజులో 110 పైసల పతనాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. రూపాయి విలువ మరింతగా పడిపోవచ్చని, డాలర్ తో మారకం సమీప భవిష్యత్తులోనే రూ. 71ని దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - రూపాయి