రాహుల్ గాంధీ

19:08 - September 22, 2018

ఢిల్లీ : రాఫెల్ డీల్ పై కాంగ్రెస్...బీజెపి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీ..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. రాఫెల్ విమానం డీల్ సందర్భంగా భారత ప్రభుత్వం అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్ కంపెనీ పేరును ప్రతిపాదించిందని హోలాండే ప్రకటన చిచ్చు రాజేస్తోంది. తాజాగా మరోసారి దీనిపై పలు వ్యాఖ్యలు చేశారు. మోడీపై పలు ఆరోపణలు గుప్పించారు. 

ఈ ఆరోపణలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. కాంగ్రెస్‌ పార్టీనే అవినీతికి పుట్టిల్లు లాంటిదని, పలు స్కాంల కారణంగా కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారని...మాజీ ప్రధాని మన‍్మోహన్‌  విచారణను ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఒప్పందంకంటే 9 శాతం తక్కువకే ఒప్పందం చేసుకోవడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ హాయాంలోనే ఈ ఒప్పందం జరిగిందని చెప్పుకొచ్చారు. 2012లో జరిగిన ఈ ఒప్పందం దేశ చరిత్రలో ప్రధానిపై ఈ తరహా ఆరోపణలు ఏ పార్టీ అధ్యక్షులు చేయలేదని వివరించారు. 

21:27 - September 18, 2018

మధ్యప్రదేశ్ : రాహుల్ గాంధీ చాలా పద్ధతిగా వుండటాడనే పేరు వుంది. కానీ పార్టీకి అధ్యక్షుడు అయిన తరువాత రాహుల్ కు అంతకుముందు రాహుల్ కు మధ్య వ్యత్యాసాలు చాలానే కనిపిస్తున్నాయంటున్నారు చాలామంది. దానికి నిదర్శనం ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ చిలిపి పనులకకు వేదికగా మారాడు. జులైలో ప్రభుత్వంపై జరిగిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్లమెంటులో రాహుల్ కన్ను కొట్టిన తీరు అప్పట్లో సంచలనమైంది. తాజాగా మరోసారి రాహుల్ కన్ను కొట్టారు. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రాహుల్ నేతలతో కలిసి టీ బ్రేక్ తీసుకున్నారు. భోపాల్‌లోని ఓ టీస్టాల్ వద్ద అందరూ కలిసి టీ తాగారు.

రాహుల్ టీ బ్రేక్‌కు ఆగడంతో సెల్ఫీల కోసం అభిమానులు పోటీ పడ్డారు. రాహుల్ నవ్వుతూ సెల్ఫీలకు పోజిచ్చారు. అందరినీ విష్ చేస్తూ హుషారుగా కనిపించారు. ఈ సందర్భంగా తనను పలకరించిన అభిమానులకు అభివాదం చేస్తూ రాహుల్ కన్ను కొట్టడం వీడియోలో కనిపించింది. ఈ వీడియోను కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేయగా వైరల్ అయింది. ప్రచారంలో రాహుల్ వెంట జ్యోతిరాదిత్య సింధియా, కమల్‌నాథ్ వంటి నేతలు ఉన్నారు.

17:07 - September 18, 2018

కర్నూల్ : కాంగ్రెస్ నిర్వహిస్తున్న సత్యమేవ జయతే సభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అనీ..అందుకే ఢిల్లీ నుండి వచ్చిన వెంటనే సంజీవయ్యగారి నివాసానికి వెళ్లానని రాహుల్ గాంధీ తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా వున్న సమయంలో సంజీవయ్యను సీఎంగా చేయాలనే ప్రతిపాదన వచ్చిందని రాహుల్ తెలిపారు. తెలుగు వారైన కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, ప్రధానిగా పీవీ నర్శింహారావులను మీరు గెలిపించారనీ..నిజాయితీపరులైన నాయకులను మీరెప్పుడు గెలిపించారనీ..మాకు అవకాశం ఇస్తే అటువంటి నాయకులను కాంగ్రెస్ పార్టీ తయరు చేస్తుందని హామీ ఇస్తున్నాననీ రాహుల్ పేర్కొన్నారు. దేశానికే ఏపీ దశ, దిశ, నిర్ధేశం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏపీతో సుదీర్ఘమైన అనుబంధం వుందని రాహుల్ గుర్తు చేసుకున్నారు. 

 

10:56 - September 18, 2018

కర్నూలు : గ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలు నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. విద్యార్థులు, రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించనున్నారు.  కర్నూలులోని ఎస్టీ బీసీ కళాశాల గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రాహుల్‌ పర్యటనకు కాంగ్రెస్‌ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాహుల్‌ గాంధీ పెదపాడులోని మాజీ సీఎం దామోదరం సంజీవయ్య ఇంటిని కూడా సందర్శించనున్నారు. కాసేపట్లో హైరాబాద్‌కు రాహుల్‌ చేరుకోనున్నారు. ఉ. 11.15కు ప్రత్యేక హెలికాప్టర్‌లో కర్నూలుకు పయనం కానున్నారు. ధ్యాహ్నం 12.15కు కర్నూలు చేరుకోనున్నారు. పెద్దపాడులో రాహుల్‌ పర్యటించనున్నారు. హోదా సహా విభజన హామీలపై క్లారిటీ ఇవ్వనున్నారు.

 

18:24 - September 10, 2018

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు ఏఐసీసీ అధ్యక్షులు రాజీవ్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. 2011-12 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్నురిటర్నులకు సంబంధించిన వివాదంలో సోనియా, రాహుల్ వేసిన పీటిషన్ ను కోర్టు సోమవారం తిరస్కరించింది.    

వారు  వేసిన రిట్ పిటీషన్లు పనికిరావు.. ఆదాయపు పన్ను శాఖకు ఆ ఏడాది పన్ను ఎసెస్మెంటును తిరిగి ఓపెన్ చేసే అధికారం ఉన్నందున ఈ పిటీషన్లు చెల్లవని కోర్డు నిర్ధారించింది.

ఆదాయపు పన్ను శాఖ ఈ ఏడాది మార్చిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు పంపిన నోటీసులలో వారు 2011-12 సంవత్పరానికి గాను సమర్పించిన పన్ను వివరాలను తిరిగి పున:పరిశీలిచాల్సి ఉందని తెలిపింది. దీనికి వ్యతిరేకంగా సోనియా, రాహుల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అలాగే మరో కాంగ్రెస్ నేత ఆస్కర్ ఫెర్నాండేజ్ వేసిన పిటీషన్ ను సైతం కోర్టు కొట్టివేసింది.

ఇంగ్లీషు పత్రిక నేషనల్ హెరాల్డ్ ఆదాయపు పన్ను కేసుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ పున:పరిశీలకు చర్యలు చేపట్టింది. 2008 సంవత్సరంలో హెరాల్డ్ పత్రిక మూసివేసే సమయానికి రూ 90 కోట్ల అప్పులు చెల్లించకపోవడంతో ఆదాయపు పన్ను శాఖ కేసును ధాఖలు చేసింది.  

10:27 - September 10, 2018

ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు జరుగుతున్న భారత్ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మానస సరోవర యాత్ర ముగించుకుని రాహుల్ ఢిల్లీకి చేరుకున్నారు. పెట్రో ధరలు పెంపుపై సోమవారం భారత్ బంద్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భగా ఆయన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెట్రోల్ ధరల్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతకంటే ముందు రాజ్‌ఘాట్‌ వద్ద ఆయన నివాళులర్పించారు. అనంతరం అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు. రాజ్‌ఘాట్ నుంచి జకీర్ హుస్సేన్ కాలేజ్ వరకు జరిగిన ఈ ర్యాలీ కొనసాగింది. రాహుల్ నిరసన కార్యక్రమం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బీహార్ లో...
పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వామపక్ష నేతలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. దర్బంగ్‌లో కార్యకర్తలంతా రైల్ రోకోలు నిర్వహించారు. పలు రైళ్లను అడ్డుకోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

15:40 - September 6, 2018

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తెలంగాణ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ దేశంలోనే ఒక పెద్ద బఫూన్ అని అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకుంటే...ఇక్కడే అమలు కావాలని..కానీ ఢిల్లీలో కాదని తెలిపారు. ఢిల్లీకో గులాం హమ్ కో నహీ బన్ నా..అని పేర్కొన్నారు. 

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. గురువారం వాటికన్నింటికీ తెరపడింది. కేబినెట్ రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ ఏక వ్యాఖ్య తీర్మానం చేశారు. దీనిని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉభయ రాష్ట్రాల గవర్నర్ తో భేటీ అయిన కేసీఆర్, మంత్రివర్గం సభ రద్దుకు సంబంధించిన లేఖను అందచేశారు. కొద్దిసేపట్లోనే గవర్నర్ ఆమోద ముద్ర వేశారని కార్యదర్శి ప్రకటన చేశారు.

ఎన్నికల అభ్యర్థులను కూడా కేసీఆర్ ప్రకటించారు. అనేక సర్వేలు చేసిన అనంతరం 105 అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు, ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేదన్నారు. మంచిర్యాల, సంగారెడ్డి అందోల్ నియోజకవర్గం ఎమ్మెల్యేలకు మాత్రం టికెట్ ఇవ్వలేదన్నారు. మేడ్చల్, మల్కాజ్ గిరి, చొప్పదండి, వికారాబాద్., వరంగల్ ఈస్ట్ జిల్లాల పెండింగ్ లో పెట్టినట్లు తెలిపారు. 

08:57 - September 5, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఎవరైనా భోజనం చేయాలనుకుంటున్నారా అయితే 82,500 రూపాయలను సిద్ధం చేసుకోవాల్సిందే. ఆశ్చర్యపోతున్నారా..? అయితే మీరే చూడండి. రాహుల్‌ గాంధీ ఇటీవల యూకే పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ నిర్వహించిన కార్యక్రమాల పట్ల పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్‌ హాజరైన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి నిర్వహకులు ఒక్కొక్కరి దగ్గర నుంచి 900యూరోలు( సుమారు రూ.82,500) వసూలు చేశారు. భారత్‌కు చెందిన విలేకరులతో మాట్లాడేందుకు రాహుల్‌ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దానిని ఇండియన్‌ ఓవర్‌సీస్‌ కాంగ్రెస్‌(ఐఓసీ‌) నిర్వహించింది. అయితే ఐఓసీ దానిని ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమం మాదిరిగా నిర్వహించిందని, పార్టీ అధ్యక్షుడు మాట్లాడే కార్యక్రమానికి నిధులు ఆ విధంగా సేకరించడం పట్ల కాంగ్రెస్‌ పార్టీలో కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాహుల్‌ యూకే, జర్మనీ పర్యటన కార్యక్రమాలకు ఐఓసీ‌ నిర్వహణ
రాహుల్‌ యూకే, జర్మనీ పర్యటనలోని దాదాపు కార్యక్రమాలను ఇండియన్‌ ఓవర్‌సీస్‌ కాంగ్రెస్సే నిర్వహించింది. పలు కార్యక్రమాలను సరిగ్గా నిర్వహించలేదని పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. భాజపాకు ఎక్కువ సన్నిహితంగా ఉండే కన్జర్వేటివ్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఇండియా ఓ కార్యక్రమాన్ని ప్లాన్‌ చేసింది. దానికి కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీకి సన్నిహితంగా ఉండే వ్యక్తి హోస్ట్‌ చేసేలా ప్రణాళిక వేశారు. ఐఓసీనే ఇలాంటి కార్యక్రమాన్ని ప్లాన్‌ చేయడం పట్ల కాంగ్రెస్‌ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాగా చివరి నిమిషంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు సమాచారం. దానికి బదులుగా యూకే హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో మరో కార్యక్రమానికి రాహుల్‌ వెళ్లేలా ప్రణాళికను మార్చారు. మరికొన్ని కార్యక్రమాలు కూడా ఇలాగే గందరగోళంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

 

06:38 - August 31, 2018

ఢిల్లీ : 500, 1000 నోట్ల రద్దు నిర్ణయంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్రమోదిపై ధ్వజమెత్తారు. పెద్దనోట్ల రద్దు ఓ పెద్ద కుంభకోణమని ఆరోపించారు. దేశంలోని 15-20 మంది క్రోని కాపిటలిస్టుల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకే మోది కావాలనే నోట్లరద్దు నిర్ణయం తీసుకున్నారని రాహుల్‌ ధ్వజమెత్తారు. చిన్న, మధ్యతరగతి వ్యాపారులను దెబ్బతీసి... అమెజాన్‌ లాంటి పెద్ద కార్పోరేట్‌ సంస్థలకు ఊతమిచ్చేందుకే పెద్దనోట్లను రద్దు చేశారని ఆయన మండిపడ్డారు. మోదిని టీవీల్లో మార్కెటింగ్‌ చేసేందుకు కార్పోరేట్లు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని....ఆ డబ్బును ప్రజల నుంచి తీసుకుని వారి జేబుల్లో వేస్తున్నారని రాహుల్‌ విమర్శించారు. 

17:57 - August 30, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమంలో పాల్గొనకూడదని కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సలహా ఇచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఓ విషమన్న విషయం అందరికీ తెలిసిందేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే- రాహుల్‌తో అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తన హిందుత్వ వాదాన్ని వ్యాపింపజేస్తోందని...అందులో మనం ఎందుకు భాగస్వాములం కావాలని ప్రశ్నించారు. వాళ్లు రాజ్యాంగం కన్నా మనుస్మృతినే నమ్ముతారని ఖర్గే అన్నారు. రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్‌ పార్టీకు చెందిన ఏ నేత కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వచ్చే నెల జరిపే ఓ కార్యక్రమంలో రాహుల్‌గాంధీని ఆహ్వానించిన విషయం తెలిసిందే.

Pages

Don't Miss

Subscribe to RSS - రాహుల్ గాంధీ