రాముడు

10:48 - November 5, 2018

ఉత్తరప్రదేశ్‌ :  రామజన్మ భూమిలో రామ మందిరం కోసం కంకణం కట్టుకున్నామంటున్న బీజేపీ ప్రభుత్వం 2019 ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఆ అంశాన్ని తెరమీదికి తెస్తోంది. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం రాముడి పేరుతో మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుని పనులు ప్రారంభించేసింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన రాముడి విగ్రహాన్ని సరయూ నది ఒడ్డున ప్రతిష్ఠించాలని యోచిస్తున్న యోగి సర్కారు అందుకోసం శిల్పిని వెతికే పనిలో పడింది. అందులో భాగంగా ఆర్కిటెక్ట్, డిజైన్ కన్సల్టెంట్‌ను ఎంపిక చేయడానికి ఇప్పటికే టెండర్లు పిలిచింది. షార్ట్ లిస్ట్ అయిన సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి ప్రజంటేషన్ ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. ఆర్కిటెక్ట్‌ను ఎంపిక చేసిన అనంతరం విగ్రహ నిర్మాణ సంస్థను ఎంపిక చేస్తామన్నారు.  రాముడి విగ్రహం మొత్తం నిర్మాణం ఎత్తు 201 మీటర్లు కాగా, అందులో పీఠం ఎత్తు 50 మీటర్లు, విగ్రహం ఎత్తు 151 మీటర్లు వుండేలా  యోగీ ప్రయత్నాలను ప్రారంభించింది.
 

12:10 - August 6, 2018

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నాయి. అప్పటి నుండి టిడిపి ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. విభజన హామీలు..ప్రత్యేక హోదా తదితర వాటిపై ఆందోళన..నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద వర్షంలో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. రోజుకో వినూత్న వేషధారణలో పార్లమెంట్‌ సమావేశాలకు హాజరవుతున్న ఎంపీ శివప్రసాద్‌ ఈరోజు... శ్రీరాముడి వేషధారణలో వచ్చారు. శ్రీరాముడు ఒకే మాట, ఒకే బాణం అన్న ధర్మాన్ని పాటించగా... శ్రీరాముడే దేవుడిగా భావించే బీజేపీ మాత్రం ఆడిన మాట తప్పుతుందని శివప్రసాద్‌ ఆరోపించారు. 

06:29 - July 27, 2018

భద్రాద్రి : అపర శబరి పోకల దమ్మక్క. రాముడిని పూజించిన మానవోత్తమురాలు. ఈ మహా భక్తురాలికి ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహిస్తారు భద్రాద్రి అధికారులు. ఈ పూజలకు పెద్ద ఎత్తున గిరజన ప్రజలు హాజరవుతారు. గిరిజన ప్రజల కోసం అధికారులు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు. ఇలాంటి పూజలకు చంద్రగ్రహణం అడ్డంకిగా మారింది. చంద్రగ్రహణంతో ఇవాళ జరగబోయే పూజలు నిలిచిపోనున్నాయి.

భద్రగిరి కొండపై శ్రీరామున్ని మొదట గుర్తించిన వ్యక్తి పోకల దమ్మక్క. దమ్మక్క గుర్తించిన అనంతరం ప్రజలకు శ్రీరాముని విగ్రహాల గురించి తెలిసినట్లు.. అనంతరం రామదాసు గుడిని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. గిరిజన మహిళ అయిన దమ్మక్కను దేవతగా భావించి ఆమెకు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తుంటారు గిరిజనలు. ఆషాఢం మాసంలో వచ్చే పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు. గత పది సంవత్సరాలుగా ఈ పూజలను రామాలయం అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు గిరిజనులు పెద్ద ఎత్తున తరలివస్తారు. వీరికి కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా మూల విరాట్‌ బంగారు కవచంలో దర్శనమిస్తాడు. భక్తులు గిరి ప్రదక్షిణిలు చేయటంతో పాటు సంప్రాదాయ నృత్యాలు చేస్తారు. దమ్మక్క ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో సీతారాముల కల్యాణం జరుగుతుంది. అలాగే తాతగుడి సెంటర్‌లో గోవిందరాజు స్వామి తిరు కల్యాణం జరగుతుంది. ఈ రెండు కల్యాణాలు ఉదయం 10 గంటలకు మొదలయి మధ్యాహ్నం 12 గంటలకు పూర్తవుతాయి.

దమ్మక్కను ప్రజలు ఇంతగా పూజించటం వెనుక ఓ కథ ఉంది. ఒక రోజు రాముడు దమ్మక్కకు కలలో కనిపించి తాను గౌతమీ తీరాన భద్రగిరిపై వెలిసినట్లు చెబుతాడు. కుమారునితో కలిసి భద్రగిరిపై వెతికిన దమ్మక్కకు ఎంతవెతికిన రాముడు కనిపించడు. మర్నాడు రాత్రి మళ్లీ కలలోకి రావటంతో రామున్ని వెతుకుతుంది. కొండపై గల ఒక పుట్టలో సీతారాములను గుర్తిస్తుంది. ప్రతిరోజు పూజలు చేసి రామున్ని పూజిస్తుంది. రామున్ని పూజించటంతో అనారోగ్యంతో ఉన్న మనుషులను కాపాడే శక్తి దమ్మక్కకు వచ్చిందనే కథలు ప్రచారంలో ఉన్నాయి. రాముని కృపతోనే దమ్మక్కకు మనుషులను కాపాడేశక్తి వచ్చిందని ప్రజలు ఇప్పటికి నమ్ముతారు. దమ్మక్క గృహా కలతలను కూడా చాకచక్యంతో పరిష్కరించేవారని ఆమెపై వ్యాసాలు రాస్తున్న వారు చెబుతున్నారు.

ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించే దమ్మక్క ఉత్సవాలకు ఈ సారి ఆటంకం ఏర్పడింది. చంద్రగ్రహణం ఉండటంతో మధ్యాహ్నమే ఆలయాన్ని అధికారులు మూసి వేస్తున్నారు. దీంతో భక్తులు గూడిలోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. అమ్మవారిని, స్వామిని దర్శించుకుందామనుకునే భక్తలకు ఈ సారి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. 28న తెల్లవారుజాము నుంచే దర్శనాలు ప్రారంభమవుతాయని.. మరుసటి రోజు దర్శించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఘన చరిత్ర గలిగిన దమ్మక్క చరిత్రపై పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని భక్తులు అంటున్నారు. 

14:58 - October 22, 2017

'రాముడు'లో మంచితనం లేదని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ తెలిపారు. రంగనాయకమ్మతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె రచించిన 'రామయణ విషవృక్షం' పై స్పందించారు. రాజు అనే పెద్ద దొర అని..అతనికి ఆస్తి..భూమి విపరీతంగా ఉంటుందన్నారు. రాముడు..రావణుడులు ఇద్దరు రాజులని, ఇందులో గొప్ప ఏముందన్నారు. రాజు అనే వాడు దోపిడి దారుడని..రాముడులో ఒక మంచితనం లేదని స్పష్టం చేశారు. ఇక్కడ రాముడిపై కవి ఎందుకు రాశాడు అంటే అతనికి అంతకంటే జ్ఞానం లేదన్నారు. రామాయణంలో ఏ చెడ్డ క్యారెక్టర్లు అన్నారో అవి మంచి క్యారెక్టర్లు అని..ఏవీ గొప్ప క్యారెక్టుర్లు అని పేర్కొన్నారో..అవి చెడ్డ క్యారెక్టర్లని విమర్శించారు. సీత..ఊర్మిళ..వీరి తప్పేమి లేదని..భర్తలు ఎలా చెబితే అలా విన్నారని పేర్కొనడం జరిగిందన్నారు. మతం అనేది ద్రోహం..రాజు పెద్ద ద్రోహి అని, మార్క్సిజం చదివిన అనంతరం ఈ పుస్తకం రాసి 'రామాయణ విషవృక్షం' అని పేరు పెట్టడం జరిగిందన్నారు. ఇలాంటి పేరు పెట్టవద్దని ముద్రణ చేసే వ్యక్తి కోరడం జరిగిందన్నారు. ముందు శ్రీశ్రీతో మాట్లాడాలని అతను సూచించడం జరిగిందని కానీ తాను శ్రీశ్రీని ఇష్టపడనని..అతని కవిత్వం బాగుండొచ్చన్నారు. ఎవరితోనూ మాట్లాడనని ఖరాఖండిగా చెప్పడం జరిగిందన్నారు. చివరకు ముద్రణ వేయడం..మంచి అమ్మకాలు జరిగాయన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:28 - August 15, 2017

ఢిల్లీ : రాముడు, కృష్ణుడు ఆదర్శ పురుషులని.... ఆలమందను కాపాడేందుకు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తాడని ప్రధాని గుర్తుచేశారు... పరిపానల అంటే ఇలా ఉండాలంటూ రాముడు ఆచరించి చూపారని మోదీ చెప్పారు.. 125 కోట్ల మంది భారతీయులందరం ఒక్కటై కొత్త సంకల్పంతో ఏదైనా సాధించగలమని.. ఆ దిశగా అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

13:11 - April 5, 2017

భద్రాద్రి : పుణ్య దంపతులుగా భక్తులు భావించే సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాద్రిలోని మిథిలా స్టేడియంలో ఈ కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. సిగ్గులొలికే సీతమ్మ మెడలో అందాల రాముడు మూడుముళ్లు వేశాడు. ముత్యాల తలంబ్రాలు సీతారాముల శిరస్సులపైనుంచి జాలువారాయి. వేదమంత్రోచ్ఛరణలతో భద్రాద్రి మారుమోగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి లు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఇతరు అధికారులు పాల్గొన్నారు. సరిగ్గా మధ్యాహ్నం 12.00 గంటలకు అభిజిత్ లగ్నమున సీతారాముల వారి శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచారు. శిల్పకళా శోభితమై అలరారే కల్యాణమండపంలో జరిగే జగదభి రాముడి కల్యాణాన్ని కనులారా తిలకించి తరించేందుకు భక్తులు భద్రాద్రి చేరుకున్నారు.

08:18 - April 5, 2017

హైదరాబాద్ : ఈసారి భద్రాద్రి రాముడి కళ్యాణ మహోత్సవానికి సీఎం కేసీఆర్ దంపతులు హాజరు కావడం లేదు. ప్రభుత్వం తరపున శ్రీరాముడికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. కానీ బుధవారం ఉదయం వరకు సీఎం కేసీఆర్ పర్యటన ఖరారు కాలేదు. ఆఖరి నిమిషంలో పర్యటన రద్దయ్యింది. దీనితో ప్రభుత్వం తరపున శ్రీరాముడికి పట్టువస్త్రాలను డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, ముత్యాల తలంబ్రాలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి దంపతులు అందచేయనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

09:51 - December 7, 2016

కర్నూలు : ఫ్యాక్షన్ కక్షలకు కేంద్ర బిందువుగా వుండే రాయలసీమలో మరోసారి పాతకక్షల నేపథ్యంలో ఫ్యాక్షన్ రాజకీయాలు బైటపడ్డాయి. టీడీపీ నేతను ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కర్నూలు నగర శివారులోని హంద్రినీవా కాలువ వద్ద చోటుచేసుకుంది. కోడుమూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ పార్టీ ఇన్ చార్జ్ ముఖ్య అనుచరుడిగా వుండే కురువ రాముడు అనే వ్యక్తిని ప్రత్యర్థులు వాహనంతో ఢీకొట్టి అనంతరం రాడ్డులతో మోది.. దారుణంగా హత్య చేశారు. రాముడు పనిమీద కర్నూలు వెళ్లి స్వగ్రామం రుద్రవరానికి వస్తుండగా దారిలో కాపుకాసిన ప్రత్యర్ధులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. రాముడి హత్యతో రుద్రవరంలో ఉద్రిక్తత నెలకొంది. కాగా రాముడు కల్లూరు మండలం రుద్రవరం గ్రామ జడ్పీటీసీ మాధవికి మామ అవుతాడు. ప్రత్యర్ధులు హత్యచేసిన ప్రమాదంగా మార్చటానికి యత్నిస్తున్నారని హతుడి బంధువులు పేర్కొంటున్నారు. 

15:42 - November 6, 2016

విజయవాడ : మావోయిస్టు నేత ఆర్కే తమ వద్ద లేడనే విషయాన్ని కోర్టుకు తెలిపామని ఏపీ డీజీపీ సాంబశివరావు వెల్లడించారు. పోలీసులపై బురదజల్లడం మావోయిస్టులకు అలవాటే అన్నారు. మావోయిస్ట్‌లది మొదటి నుంచి ప్రతికార ధోరణే అన్నారు. ఆయుధాలు లేకుండా చర్చలకు రమ్మని మావోయిస్టలును కోరుతున్నామని చెప్పారు. గాయపడిన మావోయిస్ట్‌లు లొంగిపోతే పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తామన్నారు. కటాఫ్ ఏరియాలో వారం కిందటే బలగాలను ఉపసంహరించుకున్నామని చెప్పారు. 

15:24 - October 5, 2016

వారణాసి : ఉత్తర్ ప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తుంటే రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి ? వచ్చిన అవకాశాన్ని వదలరు. అది ఏ కార్యక్రమమైనా అందులో తమ పార్టీని ప్రచారం చేసుకోవాలని అనుకుంటారు. సరిగ్గా అదే జరిగింది. రెండు..మూడు రోజుల్లో 'దసరా' పండుగ రానున్న సంగతి తెలిసిందే. దీనిని చక్కగా వినియోగించుకోవాలని కాషాయ దళం యోచించింది. బుధవారం వారణాసిలో ఓ పోస్టర్ వెలిసింది. బీజేపీ మిత్రపక్షమైన శివసేన పార్టీకి చెందిన కార్యకర్తలు ఈ పోస్టర్ ను వేసినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ యుద్ధం చేస్తున్న 'రాముడిగా' చిత్రీకరించారు. మరి రావణుడిని ఎవరు అనుకుంటున్నారా ? పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ను చిత్రీకరించారు. ఓరీ.. రావణా కాసుకో.. ఇంకా ఒకే ఒక్క సర్జికల్ స్ట్రైక్ బాణంతో నీ కథ ముగుస్తుంది అని మోడీ హెచ్చరిస్తున్నట్లు పోస్టర్లు వెలిశాయి. ఇక రావణుడి కొడుకు మేఘనాథుడిగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గా చిత్రీకరించారు. ఇటీవలే భారత ఆర్మీ అధికారులు సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సర్జికల్ స్ట్రైక్ పై కేజ్రీవాల్ పలు వ్యాఖ్యలు చేశారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్మీ ఆపరేషన్ కు కూడా రాజకీయాలు జోడించడంపై పలువురు నోరెళ్ల బెడుతున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - రాముడు