రాజ్యసభ

21:32 - November 1, 2018

ఢిల్లీ: ఇద్దరు చరిత్ర సృష్టించినవారే. వీరిద్దరు దేశఆనికి కీర్తిప్రతిష్టలు తెచ్చి..పతకాలు గెలిచి భరతమాతకు మెడలో వేసినవారే. పంచ్ లతో ఒకరు పతకాన్ని గెలుచుకుంటే మరొకరు బాణాలు సంధించి పతకాన్ని గెలిచారు.ఒకరు ఒలింపిక్స్ షూటింగ్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన వ్యక్తి.. మరొకరు బాక్సింగ్‌లో ఒలింపిక్ మెడల్ గెలిచిన తొలి భారతీయురాలు.. వీళ్లిద్దరూ ఇప్పుడు దేశ అత్యున్నత చట్ట సభ అయిన పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్లలో రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ కేంద్ర క్రీడా, సమాచార శాఖ మంత్రిగా ఉండగా.. బాక్సింగ్ చాంపియన్ మేరీ కోమ్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఈ ఇద్దరూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఫ్రెండ్లీగా బాక్సింగ్ చేశారు. చాంపియన్ అయిన మేరీ కోమ్‌ను డామినేట్ చేయడానికి రాథోడ్ ప్రయత్నించినా.. ఆమె మాత్రం టైమ్‌లీ పంచ్‌లతో రాథోడ్‌ను కంగుతినిపించింది. ఈ ఇద్దరి సరదా బాక్సింగ్ అక్కడున్న వాళ్లందరినీ ఆకట్టుకుంది.
https://twitter.com/ANI/status/1057943763895619584

10:45 - September 12, 2018

ఢిల్లీ : నోటా...ఎందుకు తీసేశారు..అయ్యో వచ్చే ఎన్నికల్లో ఆప్షన్ లేకపోతే ఎలా ? అంటూ కంగారు పడకండి. పూర్తిగా చదవండి. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తుతోపాటు నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్) ను ఏర్పాటు చేశారు.

కానీ ఈ నోటా ఆప్షన్ ఆ ఎన్నికల్లో ఉండదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్‌ పేపర్లలో నోటా గుర్తును తొలగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం ప్రకటించింది. ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌కు సవరణలు సూచిస్తూ సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల బెంచ్‌ తీర్పు చెప్పింది. కేవలం రాజ్యసభ ఎన్నికలకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. లోక్ సభ, శాసనభ వంటి ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే నోటా ఉంటందని వెల్లడించింది. 

 

13:35 - August 29, 2018

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం ఎందరినో కలిచి వేసింది. నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇదిలా ఉంటే ఆయన రాజ్యసభలో చేసిన స్పీచ్ ను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. విభజనను వ్యతిరేకిస్తూ రాజ్యసభలో తెలుగులో ప్రసంగించారు. విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ హిందీలో మాట్లాడాలని డిప్యూటి ఛైర్మన్ పేర్కొన్నా...హిందీలో మాట్లాడే అవకాశం ఉన్నా..ఆయన మాత్రం తెలుగులోనే మాట్లాడుతానని పట్టుబట్టారు. విభజనను వ్యతిరేకించిన హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలుగువారంతా కలిసి ఉండాలని, తెలుగు జాతి ఒక్కటేనని డిమాండ్ చేస్తూ రాజ్యసభ సభ్యత్వం నుంచి ఆయన తప్పుకున్నారు. తెలుగు భాషా దినోత్సవం రోజునే హరికృష్ణ మృతి ఘటన దురదృష్టకరమని టీడీపీపీ పేర్కొంది.

16:31 - August 10, 2018

ఢిల్లీ : ట్రిపుల్ తలాక్ ((ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు ఆగిపోయింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టడం లేదు. శుక్రవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టాలని కేంద్రం పలు ప్రయత్నాలు చేసింది. కానీ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీనితో ఈ బిల్లును ప్రవేశ పెట్టడం లేదని రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు ప్రకటించారు. బిల్లులో సవరణలకు ప్రతిపక్షాలు పట్టుబట్టినప్పటికీ కేంద్రం అందుకు అంగీకరించకుండానే లోక్‌సభలో బిల్లును పాస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం కీలక సవరణలు చేసింది.

ట్రిపుల్ తలాక్ ముసాయిదా బిల్లు 2017గా ప్రభుత్వం పేర్కొంది. ఈ బిల్లు ప్రకారం భార్యకు మాటల ద్వారా కానీ, రాత పూర్వకంగా కానీ, ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా కానీ ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరం అవుతుందని పేర్కొంది. అందులో భాగంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. దీనిపై ముస్లిం సంఘాల నుండి వ్యతిరేకత వ్యక్తమైంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను సోమవారం వరకు పొడిగించేందుకు కాంగ్రెస్, టీఎంసీ అంగీకరించలేదని సమాచారం.  

19:33 - August 9, 2018

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ పదవికి జరిగిన ఎన్నికల్లో విపక్షాలకు చుక్కెదురైంది. ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ విపక్షాల తరపున పోటీచేసిన హరిప్రసాద్‌పై 20 ఓట్ల తేడాతో గెలుపొందారు. కొత్త డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ పేరును రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ విజయం సాధించారు. విపక్షాల తరపున పోటీ చేసిన కాంగ్రెస్‌ ఎంపీ హరిప్రసాద్‌పై 20 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

రాజ్యసభలో మొత్తం 244 మంది సభ్యులుండగా 230 మంది హాజరయ్యారు. ఎన్డీయేకు 125 ఓట్లు, విపక్షాల అభ్యర్థికి 105 ఓట్లు వచ్చాయి. ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ డిప్యూటి చైర్మన్‌గా ఎన్నికైనట్లు సభాపతి వెంకయ్యనాయుడు ప్రకటించారు.

ఈ ఎన్నికలో 14 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉండడంతో సంఖ్యాబలం 230కి తగ్గింది. దీంతో విజయలక్ష్యం 119 నెంబర్‌కే పరిమితమైంది. కాంగ్రెస్‌, వైసిపి, డిఎంకె, టిఎంసి, పిడిపిలకు చెందిన ఇద్దరేసి సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఆప్‌కు చెందిన ముగ్గురు సభ్యులు, ఎస్పీ ఎంపి జయబచ్చన్‌ కూడా గైర్హాజరయ్యారు.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. హరివంశ్‌ మంచి విద్యావంతుడని... సభను హుందాగా నడిపే సమర్ధత హరివంశ్‌కు ఉందన్నారు.

రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌గా ఎంపికైన జెడియు ఎంపి హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ను విపక్షాలు అభినందించాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగడం సర్వసాధారణమని..రాజ్యాంగ బద్దమైన పదవికి ఎంపికైన వ్యక్తులు పార్టీలకు అతీతంగా పనిచేయాల్సి ఉంటుందని కాంగ్రెస్‌ పక్షనేత గులాంనబీ ఆజాద్‌ అన్నారు. హిందీ భాష అభివృద్ధికి ఆయన చాలా కృషి చేశారని కొనియాడారు. ఓ జర్నలిస్ట్‌ డిప్యూటి ఛైర్మన్‌గా ఎంపిక కావడం వల్ల మీడియాలో సభ కార్యకలాపాలకు చెందిన వార్తలు ఎక్కువగా వస్తాయని నవ్వుతూ చెప్పారు.

పార్లమెంట్‌ సభ్యుడిగా హరివంశ్‌ పనితీరుపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సంతృప్తి వ్యక్తం చేశారు. రచయిత, సంపాదకుడు, బ్యాంకర్, రాజకీయ కార్యకర్తగా ఎంతో అనుభవం గడించిన ఆయన ఏ విషయమైనా రిసెర్చ్‌ చేసి చర్చించే వారని ఆయన తెలిపారు. హరివంశ్‌ డిప్యూటి ఛైర్మన్‌గా ఎంపిక కావడం ద్వారా సభా హుందాతనం మరింత పెరుగుతుందని ఆశిస్తున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. కిడ్నీ ప్లాంటేషన్‌ చేయించుకున్న తర్వాత జైట్లీ తొలిసారిగా పార్లమెంట్‌కు హాజరయ్యారు.

తనని రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌గా ఎన్నుకున్నందుకు హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తాను నిష్పక్షపాతంగా సభను నడిపిస్తానని హామి ఇచ్చారు. ఈ పదవిని చేపట్టడం తనకు కొంత భయంగానే ఉందని... రాజ్యసభలో ఎందరో అనుభవజ్ఞులున్నారని వారి సూచనలతో సభను హుందాగా నడిపిస్తానని హరివంశ్‌ పేర్కొన్నారు.

హరివంశ్‌కు ఎన్డీయే మిత్రపక్షాలతో పాటు బిజెడి, టిఆర్‌ఎస్‌, శివసేన మద్దతు తెలిపాయి. డిప్యూటి ఛైర్మన్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ సభ్యులు మద్దతు ఇచ్చినందుకు బిహార్‌ సిఎం నితీష్‌కుమార్‌ తెలంగాణ సిఎం కేసీఆర్‌కు ఫోన్‌ చేసి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో తమ సహకారం ఉంటుందని నితీష్‌ అన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి ఎస్పీ, బిఎస్పీ, ఎన్‌సిపి, టిఎంసి, టిడిపి, వామపక్షాలు మద్దతుగా నిలిచాయి. ఎన్డీయే అభ్యర్థిని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమైనప్పటికీ ఫలితం దక్కలేదు.

16:28 - August 9, 2018

ఢిల్లీ : కొంతమంది ఎంతటి ప్రతిభ వున్నా వారు వెలుగులోకి రావటానికి ఈ ప్రపంచానికి పూర్తిస్థాయిలో పరిచయం కావటానికి ఓ కీలక సందర్భం తోడ్పడుతుంది. వారు ఆ స్థాయికి రావటానికి మహానుభావుల ప్రభావం కూడా వుండవచ్చు. పెద్ద మనస్సున్నవారి వద్ద పనిచేసినంత మాత్రాన పెద్ద మనసు వస్తుందన్న నమ్మకం లేదు. మేధావుల వద్ద పనిచేసినంత మాత్రాన వారికి మేధావుల సరసన చోటు దక్కుతుందన్న గ్యారంటీ లేదు. కానీ ప్రతిభ వున్నవారి ఎదుగుదలను మాత్రం ఎవరు నియంత్రించలేరు. అటువంటివారికి ఓ సమయం..ఓ సందర్భం..అ అవకాశం..ఓ కీలక పరిణామం వారిని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఓ కీలక సందర్భం వారికి కీలక పదవి వరిస్తుంది. అటువంటి సమయం, సందర్భం, అవకాశం తాజాగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన హరివంశ్ నారాయణ సింగ్ ఇప్పుడు పూర్తిస్థాయిలో భారతదేశానికి పరిచయం అయ్యారు.

జర్నలిజం నుండి డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్
రాజకీయ సలహాదారుడిగా..బ్యాంకు ఉద్యోగిగా..జర్నలిస్టుగా వివిధ బాధ్యతలను నిర్వహించిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన హరివంశ్ నారాయణ సింగ్ యుపిలో బలియా జిల్లా డయారా అనే గ్రామంలో జన్మించిన ఈయన బెనారస్‌ హిందీ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. ఆ తర్వాత హరివంశ్‌ హిందీ దినపత్రిక ప్రభాత్‌ ఖబర్‌లో ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌గా పనిచేశారు. ఆ తర్వాత రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హైద్రాబాద్‌ బ్రాంచ్‌లో కొన్నాళ్లు బాధ్యతలు నిర్వర్తించిన హరివంశ్‌..భారతదేశపు 11వ ప్రధాని చంద్రశేఖర్‌కు మీడియా సలహాదారుగా కూడా వ్యవహరించారు. బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు సన్నిహితుడుగా ఉన్న ఈయన 2014 లో మొదటిసారి రాజ్యసభ కు ఎన్నికయ్యారు.

మాజీ ప్రధానికి మీఇయా సలహాదారుడిగా హరివంశ్
చంద్రశేఖర్‌కు మీడియా సలహాదారుగా కూడా వ్యవహరించిన క్రమంలో ప్రభౄత్ ఖబర్ ఎడిటర్ పోస్టుని కాదనుకున్నారు. రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవటంతో హరివంశ్ కూడా పదవిని కోల్పోయారు. దీంతో ఆయన తిరిగి జర్నలిజంలో చేరిపోయారు. 1980లో 'ధర్మయుగ్' అనే హిందీ వారపత్రికలో జర్నలిజం ప్రస్థానాన్ని ప్రారంభించిన హరివంశ్ తరువాత బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ గా మరో బాధ్యతల్లోకి ఒదిగిపోయారు. కానీ కుటుంబ సభ్యులు జర్నలిజంలోనే కొనసాగితే బాగుంటదనటంతో తిరిగి 'రణవీర్' అనే పత్రికలో చేరారు.
జర్నలిస్ట్ నుండి ఎడిటర్ గా ఎదిగిన హరివంశ్
ఒక సాధారణ జర్నలిస్టుగా 1989లో రాంచీలోని ప్రభాత్ ఖబర్ లో చేరిన హరివంవ్ అన పత్రికకు చీఫ్ఎడిటర్ స్థాయికి ఎదిగారు. 2014లో జేడీయూ తరపున రాజ్యసభ ఎంపీ కాగానే ఎడిటర్ పదవికి రిజైన్ చేసి ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా బీహార్ ముఖ్యమంత్రిగా వున్న నితీశ్ కుమార్ కు తన పత్రిక ద్వారా మద్దతు పలికారన్న విమర్శలు హరివంశ్ పై వున్నాయి. కాగా దీంతోనే హరివంశ్ ను రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ కుమార్ నామినేట్ చేసి వుండవచ్చు అనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను కూడా తనకు అనుకూలంగా మలచుకున్న మేధావిగా హరివంశ్ ను చూడవచ్చు. మంచి మనులు చేసినప్పుడు ఎక్కడ పనిచేసినా మెచ్చుకోవాల్సిందేనంటారు హరివంశ్. వ్యవస్థను టార్గెట్ చేస్తునే నిర్మాణాత్మక విమర్శలతో జర్నలిజం వుండాలని ఆయన అభిప్రాయపడుతుంటారు. ఏది ఏమైనా ఒక సాధారణ వ్యక్తి జీవితంలో అసాధారణ పెను మార్పులు సంభవించాయి అంటే ఆ వ్యక్తి వెనుక ఒక పెద్ద నేతగానీ..వ్యక్తి గానీ..వ్యవస్థ గానీ వుంటుందనే మాటకు నిదర్శనం ఈరోజు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ సింగ్ ఎన్నికను మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఒక రాజ్యాంగ సభకు ప్రతినిథిగా వుండటమంటే పార్టీలకు.. వ్యక్తులకు, పదవులకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా పనిచేయటమేనని హరివంశ్ నారాయణ సింగ్ తన బాధ్యతను నిర్వహిస్తారని ఆశిద్దాం..

14:24 - August 9, 2018

ఢిల్లీ : గత కొన్నేళ్లుగా పార్లమెంట్‌ సభ్యుడిగా హరివంశ్‌ పనితీరును తాము చూశామని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. రచయిత, సంపాదకుడు, బ్యాంకర్, రాజకీయ కార్యకర్తగా ఎంతో అనుభవం గడించిన ఆయన ఏ విషయమైనా రిసెర్చ్‌ చేసి చర్చించే వారని జైట్లీ తెలిపారు. వ్యక్తిగత విమర్శలు చేయకుండా సభ నిబంధనలకు అనుగుణంగా హరివంశ్‌ పనిచేశారన్నారు. హరివంశ్‌ డిప్యూటి ఛైర్మన్‌గా ఎంపిక కావడం ద్వారా సభా హుందాతనం మరింత పెరుగుతుందని ఆశిస్తున్నట్లు జైట్లీ పేర్కొన్నారు.

రాజ్యసభలో డిప్యూటి ఛైర్మన్‌ ఎన్నిక సుహృద్భావ వాతావరణంలో జరగడం అభినందనీయమని సమాజ్‌వాద్‌ పార్టీ ఎంపి రామ్‌గోపాల్‌ యాదవ్‌ అన్నారు. ఎన్డీయే తరపున పోటీ చేసిన హరివంశ్‌, విపక్షాల తరపున పోటీ చేసిన కాంగ్రెస్‌ ఎంపి హరిప్రసాద్‌ పరిపక్వత చెందిన వ్యక్తులని ఆయన కొనియాడారు. ఆయా రాష్ట్రాలకు చెందిన సభ్యులకు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని అంశాలు ప్రస్తావించాల్సి ఉంటుందని...ఈ విషయంలో సభాపతి హుందాగా ప్రవర్తించారని రామ్‌గోపాల్‌ యాదవ్‌ కోరారు.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ ఎన్నికయ్యారు. ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌కు 125 ఓట్లు వచ్చాయి. విపక్షాల అభ్యర్థి హరిప్రసాద్‌కు 105 ఓట్లు వచ్చాయి. టీడీపీ కాంగ్రెస్‌ అభ్యర్థికి, టీఆర్‌ఎస్‌ ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేశాయి. వైసీపీ ఓటింగ్‌కు దూరంగా ఉంది. 

13:39 - August 9, 2018

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌గా ఎంపికైన జెడియు ఎంపి హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ కాంగ్రెస్‌ పక్ష నేత గులాంనబీ ఆజాద్‌ విపక్షాల తరపున అభినందనలు తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగడం సర్వసాధారణమని..రాజ్యాంగ బద్దమైన పదవికి ఎంపికైన వ్యక్తులు పార్టీల కతీతంగా పనిచేయాల్సి ఉంటుందని ఆజాద్‌ పేర్కొన్నారు. హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ హిందీ భాష అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఓ జర్నలిస్ట్‌ డిప్యూటి ఛైర్మన్‌గా ఎంపిక కావడం వల్ల ఆ అనుభవం పార్లమెంట్‌ కార్యకలాపాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆజాద్‌ తెలిపారు.

 

12:40 - August 9, 2018

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్ డీఏ అభ్యర్థి జెడియు ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ హరివంశ్ నారాయణ్ కు అభినందనలు తెలిపారు. హరివంశ్ మంచి విద్యావంతుడు అన్నారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నుంచి హరివంశ్ నారాయణ్ స్ఫూర్తి పొందారని తెలిపారు. డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన హరివంశ్ పై పూర్తి విశ్వాసం ఉందన్నారు. హరివంశ్ చాలా ఏళ్లుగా సమాజ సేవలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 

 

11:55 - August 9, 2018

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. ఓటింగ్ లో మొత్తం 222 మంది సభ్యులు పాల్గొన్నారు. ఎన్ డీఏ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు అనుకూలంగా 125 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 105 ఓట్లు వచ్చాయి. ఇద్దరు వైసీపీ సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. రాజ్యసభ సభ చైర్మన్ హోదాలో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. తీర్మానాల ద్వారా ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. 26 ఏళ్ల తర్వాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్డీయే తరపున జెడియు ఎంపి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, విపక్షాల తరపున కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి బికె హరిప్రసాద్‌ పోటీ పడ్డారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగియడానికి ఒకరోజు ముందు ఈ ఎన్నిక జరిగింది. ప్రస్తుతం 244 మంది రాజ్యసభ సభ్యులకు గానూ 222 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - రాజ్యసభ