యండమూరి

15:55 - October 22, 2017

మార్క్సిజం అవసరమని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ పేర్కొన్నారు. రంగనాయకమ్మ..తెలుగు సాహిత్యానికి...తెలుగు సమాజానికి పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో కథలు..నపలలు..వ్యాసాలు..సామాజిక..రాజకీయ అంశాలతో తెలుగు సాహిత్యంలో అంతులేని చర్చను రేకేత్తించారు. సుప్రసిద్ధ మార్కిస్టు, స్త్రీ వాద రచయిత్రి. ఈమె రచనల్లో రామాయణాన్ని మార్క్సిస్టు దృక్పధంతో విమర్శిస్తూ రాసిన 'రామాయణ విషవృక్షం' ఒకటి. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. రచయిత్రిగా ఎదిగిన క్రమం..మార్క్సిజంపై ఆకర్షితులు కావడం..ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలపై రంగనాయకమ్మతో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె తన అభిప్రాయాలను తెలియచేశారు. ఆమె నిర్మోహమాటంగా..స్పష్టంగా చెప్పిన అభిప్రాయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

15:05 - October 22, 2017

ప్రముఖ నవలా రచయిత యండమూరి రచించిన 'తులసిదళం’ లో ఏమీ లేదని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ తెలిపారు. రంగనాయకమ్మతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా యండమూరి రచించిన ‘తులసిదళం’ నవలపై స్పందించారు. సీరియల్ గా వస్తున్న సమయంలో తనకు కొంతమంది చెప్పారని..గొప్ప నవల అని చెప్పడం జరిగిందన్నారు. తనకు ఇష్టం లేకపోవడంతో అంతగా దృష్టి సారించలేదన్నారు. కానీ జ్యోతి అనే అమ్మాయి ఎందుకు చనిపోయింది..ఎందుకిలా జరిగిందనే ఆసక్తి తనలో నెలకొందన్నారు. పెళ్లి సాధ్యం కాదు..ఎంజాయ్ చేద్దాం అనే ఉత్తరంలో ఉందని..అమ్మాయి షాక్ అయి ఆత్మహత్య చేసుకుందన్నారు. అనంతరం పుస్తకం చదివానని..కానీ అందులో ఏమీ లేదన్నారు. ఎంత తుక్కు కథ..అంటే అంత తుక్కు కథ అని విమర్శించారు. ఓ డాక్టర్ ముందుమాటలో నవలను మెచ్చుకోవడం జరిగిందన్నారు. దీనిపై తాను ‘గంజాయి దమ్ము’ అని పుస్తకం రాసి..డాక్టర్ పై కూడా తాను విమర్శ చేయడం జరిగిందన్నారు. యండమూరి వీరేంద్ర నాథ్ తనపై కేసు పెట్టలేదని..ముందుమాట రాసిన వ్యక్తి కేసు పెట్టడం జరిగిందని..క్షమాపణ చెప్పాలని ఉత్తరంలో ఆ వ్యక్తి డిమాండ్ చేశారని పేర్కొన్నారు. జైల్లో పెట్టాలి..లేదా రూ. వెయ్యి జరిమాన కట్టాలని జడ్జి పేర్కొనడంతో జరిమాన కట్టేసి వచ్చామన్నారు. కానీ ఈ కేసు ఇంకా హైకోర్టులో ఉందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

06:29 - January 8, 2017

గుంటూరు : ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ వేడుకలో మెగా బ్రదర్ నాగబాబు ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌, దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై విరుచుకుపడ్డాడు. వెంటనే నాగబాబు వ్యాఖ్యలపై వర్మ, యండమూరి తీవ్రంగా స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్‌ 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ హాట్‌ కామెంట్లతో వేడెక్కింది. నాగేంద్రబాబు యండమూరి, వర్మపై చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రీమేక్ సినిమాలు తీస్తే తప్పేంటని, రీమేక్‌లు చేయడంలో తప్పులేదని వర్మపై కామెంట్‌ చేశాడు. అతనో అక్కుపక్షి...పిచ్చికూతలు కూస్తాడు అంటూ రామ్‌గోపాల్ వర్మపై నాగబాబు ఫైరయ్యాడు. సరిగా సినిమా తీయడం కూడా రాదు...ముందు ఆయన మంచి సినిమాలు తీయడంపై దృష్టి పెడితే బాగుంటుందన్నారు. సినిమాలు తీయడం చేతకానప్పుడు ఏదో ఒకటి వాగి ఫేమ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడన్నారు. యండమూరిని తప్పుపడుతూ.. 'ఆయన ఒక రచనా వ్యాసంగ నిపుణుడు... కనిపిస్తే కాళ్లకు దండం పెడతాను. అయితే అతనొక మూర్ఖుడు. పైగా వ్యక్తిత్వ వికాసం కోర్సు చెబుతున్నాడు..సొంత వ్యక్తిత్వం లేనివారు ఇతరులకు చెబుతారు' అంటూ విరుచుకుపడ్డారు.

ఘాటుగా స్పందించిన వర్మ..
నాగబాబు కామెంట్లపై వర్మ ఘాటుగా స్పందించారు. అంతకు ముందు సారీ చెప్పినట్లుగా ఉన్న ట్వీట్లు తాను చేయలేదని స్పష్టం చేశారు. తన ట్విట్టర్‌ అకౌంట్‌ను ఎవడో ఇడియట్‌ హ్యాక్‌ చేశాడని వర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. నేను ఎప్పుడూ తెలుగులో ట్వీట్‌ చేయలేదన్న వర్మ ఇంతకు ముందు చేసిన ట్వీట్లు తనవి కావన్నారు. ఇంగ్లీషులో తాను చేసే ట్వీట్లు అర్ధం చేసుకోలేకపోతే తెలుగులోకి అనువాదం చేసుకునేందుకు ఒక అనువాదకుడిని పెట్టుకోవాలని వర్మ నాగబాబుకు సూచించారు. తనకు సలహా ఇచ్చేముందు ఆలోచించుకోవాలని వర్మ నాగబాబుకు చురక అంటించారు.

స్పందించిన యండమూరి..
నాగబాబు వ్యాఖ్యలపై ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ స్పందించారు. తాను ఆరేడేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు నాగబాబు సరైన వేదికను ఎంచుకోలేదన్నారు. చరణ్ గురించి తాను తప్పుగా మాట్లాడలేదన్నారు. చరణ్ తండ్రి చిరంజీవి, దేవీశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి ఇద్దరూ తనకు మంచి స్నేహితులని యండమూరి గుర్తు చేశారు. మొత్తమ్మీద వర్మ, యండమూరిపై నాగబాబు చేసిన వ్యాఖ్యలపై జనాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. 'ఖైదీ నంబర్' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ వేదికగా మొదలైన ఈ వివాదం ఎంత వరకు దారి తీస్తుందో వేచి చూడాలి.

Don't Miss

Subscribe to RSS - యండమూరి