మున్సిపల్

14:31 - August 9, 2018

పెద్దపల్లి : మా ఊరికి మున్సిపల్‌ అధికారులు వస్తే చెప్పులు, చీపుర్లతో తరిమికొడతామంటూ హెచ్చరిస్తున్నారు పెద్దపల్లి జిల్లా లింగాపూర్‌ గ్రామస్థులు. ఊరి పొలిమేరలో చెప్పులు, చీపుర్లను వేలాడదీసి మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అభివృద్ది పేరుతో మా జీవితాలతో ఆడుకోవేద్దంటూ అధికారులను హెచ్చరిస్తున్నారు. గ్రామస్తులు ఆందోళనకు గల కారణాలను తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:26 - July 26, 2018

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంల జర్గే ప్రతి ప్రతి అత్యాచారానికి.. ప్రతి మానభంగానికి.. ప్రతి మహిళా వేదనకు కారకుడు చంద్రబాబునాయుడుగారే అంటున్నది ఎమ్మెల్యే రోజా మేడం.. అసలు ఆయన అనెటోడు లేకపోతె మహిళలంత సుఖసంతోషాలతోని.. పిల్లాపాపలతోని సంతోషంగ బత్కేటోళ్లు అనుకొచ్చింది.. ఇంక చాల జెప్పింది మద్యం దుకాండ్లు బెల్టు షాపుల ముచ్చట్లు.. జర్రంత మనం గూడ అర్సుకునేదున్నది రోజమ్మను పాండ్రిగ..

సూశిండ్రా.. తెలంగాణ ఇప్పుడు వానకాలంగాదు నడుస్తున్నది.. అవిశ్వాసాల కాలం.. ఎంపీటీలకు మళ్లొక సారి పంటవండిందన్కోరాదుండ్రి.. అయితే బేరం ఎటు గట్టిగ గుదిర్తే అటే ఉర్కుతున్నరు ఎంపీటీసీలు.. వేములవాడ ఎంపీపీ అవిశ్వాసం కాడ ఎంత కథ అయ్యిందో సూడుండ్రి.. ఆఖరి దాక అవిశ్వాసం దిక్కున్న ఒక ఎంపీటీసీ.. ఆఖరి క్షణంల ఫ్లేటు ఫిరాయించిండు..

మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి గురించి మీకు ఎర్కేగదా..? ఆయన ఇంట్లకెళ్లి ఎల్కబైటికెల్తె గూడ.. అబ్బా ఎంత సుందరమైన ఎల్క అది..? బ్రహ్మండంగ బైటికెళ్లింది అంటడు.. ఆయన నోటికి పొగుడుడు తప్పితె తిట్టుడు రాదు అసొంటాయిన ఒకదిక్కు.. ఇగ అదే మల్కాజ్ గిరికి ఎమ్మెల్యే మొన్నతుపాకులతోని ఫామౌజుల దందాలు జేస్కుంట మీడియాకు దొర్కిన కనకారెడ్డి ఇంకోదిక్కు ఉండంగ.. మల్కాజ్ గిరి జనం దూపకు సస్తున్నరు..

ఇర్వై రెండు రోజుల సంది దీక్షలు జేస్తుంటె మమ్ములను ఎవ్వలు వట్టిచ్చుకుంటలేరు అంటున్నరు మెప్మా ఉద్యోగులు.. వీళ్ల కథగాకపోతె.. పట్టిచ్చుకునే ప్రభుత్వాన్నే గెలిపిచ్చిండ్రా మీరు..? దొంగోడు దోస్కపోయిండు అంటే.. దొంగోడు అంటెనే వాడు దోస్కపోయెటోడు అన్నట్టుగదా..? కేసీఆర్, కవిత న్యాయం జేస్తలేదంటే.. వాళ్లెట్ల జేస్తరు చెప్పుండ్రి పాపం..

ఇంతపెద్ద మియ్యా దేడ్ పైసా దియ్యా అన్నట్టు.. మన ముఖ్యమంత్రి ఏం జెప్తడు.. ఈ అభివృద్ధిని ఎవ్వడు ఆపుతడో సూస్తా అని గర్జిస్తుంటడు.. ఆడ ఆపెటోడు ఎవ్వడుండు.. ఈననే ఆపేస్తడు.. మన సాలార్ జంగ్ మ్యూజియంల గంటకోపారి గడియారంలకు ఒక పొట్టోడొచ్చి గంట గొట్టిపోతడు సూడు.. అగో సేమ్ ముఖ్యమంత్రిగారు గూడ.. ప్రగతి భవన్ల కెళ్లి గడ్కోపారి బైటికొచ్చి అభివృద్ధి ముచ్చట్లు జెప్పి అవుతల వడ్తడు.. కని నిజమేందంటే.. ఇగో ఇది..

బ్బా జంట అంటే సీతారామా చంద్రుల లెక్క ఉండాలే చిల్కా గోర్రెంకల లెక్కుండాలే అంటుంటరు పెద్దలు గని..? ఒక పెద్దమన్షి జేశిన పనితోని.. జంట అంటే వాళ్లు గాదు.. ఇగో వీళ్ల లెక్కుండాలే అని నిరూపించిండు.. నల్పై ఏండ్ల సంది నాతోని కల్చి బత్కిన భార్య క్యాన్సర్ తోని సచ్చిపోయిందని తన భార్య విగ్రహం బెట్టి పూజలు జేస్తున్నడంటే ఇంత గొప్ప ఆదర్శమన్షి ఏడుంటడు చెప్పుండ్రి..

తిరుమల తిరుపతి ఎంకన్నగుడిని ఓ వారం రోజులు మూశేద్దామనుకున్నరుగదా మొన్న.. ఇగ ఒక భక్తునికి భళే ఉపాయం దట్టింది.. మరి గుడి శుద్ది కింద పనులు జేస్తుంటే గర్భగుడిలున్న స్వామివారు అమ్మవారు ఖాళీగుండి ఏం జేస్తరనుకున్నడో ఏమో.. ఒక కొత్త కారుగొన్కపోయి ఇచ్చిండు.. స్వామీ ఇగ మీకిప్పుడు హాలీడే.. అమ్మవారితోని అట్లట్లవొయ్యిరాపోండ్రి అన్నట్టున్నది ఆ డొనేషన్..

16:20 - July 16, 2018

కరీంనగర్ : మున్సిపల్ అధికారుల నిర్వాకం బయటపడింది. బతికి ఉండగానే ఓ వ్యక్తి చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. తాను బతికి ఉన్నానంటూ..తాను బతికి ఉన్నట్లు సర్టిఫికేట్ ఇవ్వాలని బాధితులు కోరడంతో వ్యవహారం బట్టబయలైంది. ఇందుకు ఆస్తిని కాజేయాలనే సంబంధిత వారు ఈ అక్రమమార్గం ఎన్నుకోవడం..విచారణ జరిపారా ? జరపలేదా ? అనేది తెలియరావడం లేదు.

కరీంనగర్ మున్సిపల్ పరిధిలో అంధుడైన జుమలాద్దీన్ ఆయూష్ లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి సోదరుడికి మధ్య ఆస్తి తగదాలు నెలకొన్నాయి. ఆస్తిని కాజేయాలనే ఉద్దేశ్యంతో అన్న కుటుంబం పథకం రచించింది. జుమాలుద్దీన్ చనిపోయాడంటూ కరీంనగర్ మున్సిపల్ నుండి సర్టిఫికేట్ తీసుకుని కోర్టులో నమోదు చేశారు. 2017 సంవత్సరంలో మున్సిపల్ సర్టిఫికేట్ ను జారీ చేసింది.

అసలు విషయం తెలుసుకున్న జుమాలుద్దీన్ సోమవారం కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నాడు. తాను బతికి ఉన్నట్లు సర్టిఫికేట్ జారీ చేయాలని..ఇందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాడు. దీనితో కమిషనర్ సిబ్బంది అవాక్కు తిన్నారు. అక్రమార్గంలో సర్టిఫికేట్ పొందారని...బతికి ఉండగానే ఎలా డెత్ సర్టిఫికేట్ జారీ చేస్తారని మున్సిపల్ పెద్దలు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు కారణమైన సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి జుమాలుద్దీన్ కు ఎలాంటి న్యాయం చేస్తారో చూడాలి. 

11:58 - July 13, 2018

నిజామాబాద్ : బోధన్ మున్సిపల్ రాజకీయం రసవత్తరంగా మారింది. సొంత పార్టీ కౌన్సిలర్లే ఛైర్మన్‌పై అవిశ్వాస నోటీసు ఇవ్వడం చర్చనీయాంశం అయింది. అవిశ్వాస పరీక్షలో నెగ్గేందుకు ఛైర్మన్ తన సామాజిక వర్గం మద్ధతు కూడగడుతుంటే.. మరోవైపు ఛైర్మన్ తీరుపై పార్టీ అధిష్ఠానం సైతం గుర్రుగా ఉంది.

ఈనెల 25 మున్సిపల్‌ ఛైర్మన్‌పై అవిశ్వాస సమావేశం
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ రాజకీయం వేడిపుట్టిస్తోంది. ఈనెల 25న మున్సిపల్‌ ఛైర్మన్‌పై అవిశ్వాసానికి ఏర్పాటుకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. మున్సిపల్‌ ఛైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య తన సామాజిక వర్గం మద్ధతు కూడగట్టేందుకు యత్నిస్తున్నారు. దీంతో ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మాణాన్ని వ్యతిరేకిస్తూ.. పలు దళిత సంఘాలు ఈనెల 14న బోధన్ బంద్ కు పిలుపునిచ్చాయి.

బోధన్ మున్సిపాలిటీలో మొత్తం 35 మంది కౌన్సిలర్లు
బోధన్ మున్సిపాలిటీలో మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉండగా.. వ్యక్తిగత కారణాలతో ఒకరు రాజీనామా చేశారు. కాగా.. మజ్లిస్, బీజేపీ, తెలుగుదేశం మద్దతుతో అధికార పార్టీ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. 6వ వార్డు కౌన్సిలర్‌గా విజయం సాధించిన ఎల్లయ్య ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. కాగా.. ఎల్లయ్యపై వ్యతిరేకత నాలుగేళ్లుగా తీవ్రస్థాయికి చేరింది. కానీ ఛైర్మన్‌ తన తీరును మార్చుకోకపోవడంతో.. తన మద్దతు దారులే ఛైర్మన్‌ పదవి నుంచి దించేసేందుకు సిద్ధపడ్డారు. పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత ఎమ్మెల్యే షకీల్‌కు అప్పగించారు. కానీ ఎమ్మెల్యే సైతం ఛైర్మన్‌పై అసంతృప్తితో ఉండటంతో పరిస్దితి చేయిదాటింది.బైట్-ఆనంపల్లి ఎల్లయ్య, బోధన్ మున్సిపల్ ఛైర్మన్

అధికార పార్టీ కౌన్సిలర్లే కీలకం
అందులో అధికార పార్టీ కౌన్సిలర్లే కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ అవిశ్వాస పరీక్షలో మాత్రం తానే గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్‌ ఛైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో.. మున్సిపల్ అవిశ్వాస రాజకీయాలు పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు. మొత్తానికి చైర్మన్‌ను గద్దె దింపుతారా లేక తన బలంతో ఛైర్మనే నెగ్గుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. 

18:10 - July 12, 2018

పశ్చిమగోదావరి : కొవ్వూరు మున్సిపాల్టీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటి వరకు తామంతా ఒక్కటేనని భావించిన టిడిపి తమ్ముళ్లు ఒక్కసారిగా విడిపోయారు. దీనికంతటికి కారణం 'అవిశ్వాస తీర్మానం'. మంత్రి జవహార్ నియోజకవర్గం కావడంతో టిడిపి నాయకులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

టిడిపి కౌన్సిలర్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. 10 మంది కౌన్సిలర్లు వైస్ ఛైర్మన్ రమేశ్ కుమార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. కానీ ఈ తీర్మానం విషయం తమకు తెలియదని...అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీలు లేదంటూ 10 మంది కౌన్సిలర్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆయన నిజాయితీపరుడని, ఆయన్ను తొలగించద్దని తాము కోరడం జరిగిందన్నారు. 

08:17 - July 6, 2018
15:34 - April 26, 2018

నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాల మున్సిపల్ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు నిరవదిక సమ్మె చేపట్టారు. జి.వో నంబర్ 14 ప్రకారం వేతనాలు చెల్లించి, కాంట్రక్ట్ అవుట్ సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రెండవ రోజుకు చేరుకున్న సమ్మెలో సుమారు ఎనిమిది వందల మంది కార్మికులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

08:53 - April 10, 2018

మిర్యాలగూడ : అక్కడ అధికార పార్టీ నేతలదే హవా. వారి అండదండలతో చోటా నాయకులు రెచ్చిపోతున్నారు. మున్సిపాలిటీలు, పంచాయితీలలో ఇష్టారీతిన వ్యవహరిస్తూ అందినకాడికి దోచుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. దీంతో స్వయం ఉపాధిని పొందాలనుకున్న యువతకు నిరాశే మిగులుతోంది.

ప్రహసనంగా మారిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ టెండర్ల వ్యవహారం
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ టెండర్ల వ్యవహారం ప్రహసనంగా మారింది. అధికార పార్టీకి చెందిన నేతలే ఇందుకు కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ప్రముఖ వాణిజ్య ప్రాంతంగా గుర్తింపు పొందింది మిర్యాలగూడ. పదేళ్ల క్రితం ఇక్కడ మున్సిపాలిటీకి అనుబంధంగా ప్రధాన రహదారి వద్ద బస్టాండ్‌కు సమీపంలో వ్యాపార సముదాయాన్ని నిర్మించారు. మొత్తం 66 దుకాణాలు ఏర్పాటు చేశారు. ఒక్కో దుకాణానికి 3వేలు కిరాయిగా నిర్ణయించారు. అంటే 66 దుకాణాలకు కలిపి మొత్తం లక్షా 98 వేల ఆదాయం మున్సిపాలిటీకి వస్తుంది.

పెరిగిన ధరల ప్రకారం ఒక్కో దుకాణానికి రూ. 8వేలు కిరాయి
అయితే ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం తాజాగా టెండర్లను ఆహ్వానిస్తే నెలకు ఒక దుకాణానికి 8వేల చొప్పున మొత్తం 5 లక్షల 28వేల ఆదాయం మున్సిపాలిటీకి చేరుతుంది. అంటే సుమారు 12 శాతం ఆదాయం పెరుగుతుంది. ఈ లెక్క ప్రకారం ఏడాదికి 63 లక్షల 36 వేల ఆదాయం మున్సిపాలిటీకి వచ్చే అవకాశం ఉండగా... కేవలం 23 లక్షల 76 వేల ఆదాయం మాత్రమే వస్తోంది. దుకాణాలను లీజుకు తీసుకున్న చాలా మంది నిబంధనలకు విరుద్ధంగా సబ్‌లీజుకి ఇచ్చి భారీగా ఆదాయం పొందుతున్నారు. మున్సిపాలిటీకి ఒక షాపుకు ఏడాదికి 36వేలు మాత్రమే కడుతూ... సబ్‌ లీజు కింద 2 లక్షల వరకు సంపాదిస్తున్నారు. పైగా ఒపెన్ టెండర్లను పిలవకుండా లీజుదారులు అడ్డుపడుతున్నారు. దళారుల నిర్వాకం ప్రభుత్వ ఆదాయానికి గండి పడటమే కాకుండా స్వయం ఉపాధి పొందుతున్న ఎందరో నిరుద్యోగులకు భారంగా మారింది.

ప్రతి ఏటా 10-20 శాతం కిరాయి పెంచుతున్న దళారులు
దళారులు ప్రతి సంవత్సరం 10 నుండి 20 శాతం కిరాయి పెంచుతూ ఇష్టానుసారం కిరాయి వసూలు చేస్తున్నారు. టెండర్లు ఆహ్వానించి మార్కెట్‌ రేట్‌ ప్రకారం దుకాణాలు కేటాయించినా ఏడాదికి లక్ష రూపాయల లోపే అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా తెలిసినప్పటికీ అధికారులు దళారులకు సహకరిస్తూ అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగా వింటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పెరిగిన ధరల ప్రకారం మున్సిపాలిటీకి అందని ఆదాయం
ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం మున్సిపాలిటీకి ఆదాయం అందడంలేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా తాజాగా టెండర్లు నిర్వహిస్తే కిరాయి పెరిగి మున్సిపాలిటీకి భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. కాని అధికారులు పాలకవర్గం తమ స్వార్థ ప్రయోజనాల కోసం టెండర్ల అంశాన్ని ఏదో సాకుతో దాటవేస్తూ వస్తున్నారు. వీటితో పాటు నాలుగేళ్లక్రితం ఇదే సముదాయంలో మొదటి అంతస్తులో దుకాణాలు నిర్మించారు. మొత్తం 90 దుకాణాలకు ఇప్పటికీ టెండర్లు లేక ఏళ్ల తరబడి ఖాళీగానే ఉంటున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బహిరంగ వేలానికి టెండర్లు ఆహ్వానించినా కిరాయి ఎక్కువగా ప్రకటించడంతో ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో ఈ టెండర్లను రద్దు చేశారు. అదే సమయంలో డిమాండ్‌ ఉన్న గ్రౌండ్‌ ఫ్లోర్‌ లోని దుకాణాలకు మాత్రం టెండర్లను వాయిదా వేస్తూ కాలం గడుపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నిబంధనల ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి టెండర్లు
నిబంధనల ప్రకారం ప్రతి రెండేళ్లకు ఒక సారి దుకాణాలకు టెండర్లు పిలవాల్సి ఉంటుంది. మొదట టెండర్లు దక్కించుకున్న వారు పాలకవర్గం సహకారంతో కోర్టులను ఆశ్రయించి ప్రక్రియను పొడగించుకుంటూ వెళ్తున్నారు. కనీసం కోర్టుల్లో కూడా కౌంటర్‌ దాఖలు చేయకుండా ఐదేళ్లుగా మున్సిపల్‌ అధికారులు జాప్యం వహించడంతో స్థానికులు మండిపడుతున్నారు. తాజాగా జారీ చేసిన టెండర్ల ప్రకటనపైనా కొందరు వ్యాపారులు కోర్టును ఆశ్రయించారు. అయితే లీజుదారులను వెంటనే ఖాళీ చేయించకుండా కొంత సమయం ఇవ్వాలని కోర్టు అనుమతిచ్చింది. అంతే కాని టెండర్లను రద్దు చేయాలని కాని నిలిపివేయాలని కాని కోర్టు ఆదేశాలివ్వలేదు. కాని దీనినే సాకుగా చూపి మొత్తం టెండర్లనే రద్దు చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. టెండర్ల గడువు ముగిసినా ఇంతవరకు వాటిని ఒపెన్‌ చేయలేదని.... ఈ పేరుతో భారీగా డిపాజిట్లు చెల్లించిన ఆశావహులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారులపై చర్యలు తీసుకొని టెండర్ల ప్రక్రియ కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

టెండర్ల వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తోన్న మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నాగలక్ష్మి భర్త
ఈ టెండర్ల వ్యవహారంలో స్థానిక మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నాగలక్ష్మి భర్త భార్గవ్‌ టెండర్ల రద్దులో కీలక పాత్ర పోషిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ నుండి గెలిచిన చైర్‌ పర్సన్‌ పీఠాన్ని కాపాడుకోవడం కోసం కొంత కాలం క్రితం అధికార పార్టీలో చేరారు. ఇప్పుడు అధికారులను సైతం బెదిరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. లీజుదారులకు గడువు పొడగింపులో అధికారులు కోర్టును ఆశ్రయించకపోవడం...అదే విధంగా కోర్టు ఇచ్చిన ఆదేశాలను అడ్డంపెట్టుకొని మొత్తం టెండర్ల ప్రక్రియను దారి మళ్లించడంలో ఆయన పాత్రే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సబ్‌ లీజుకి ఇచ్చిన చాలా మంది నుండి భారీ మొత్తంలో ముడుపులు తీసుకొని టెండర్లను నిలుపు చేసినట్లు వ్యాపారులే బహిరంగంగా చెప్పుకుంటున్నారు.

కోర్టు ఆదేశాలతోనే వాయిదా వేశామంటున్న మున్సిపల్‌ కమిషనర్‌..
అసలు లీజుదారులను వెంటనే ఖాళీ చేయించవద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పాటు టెండర్లకు పెద్దగా స్పందన లేకపోవడం వల్లనే టెండర్లను వాయిదా వేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ సత్యంబాబు చెబుతున్నారు. కోర్టు కేసు ముగిసిన వెంటనే టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందంటున్నారు. మొదటి ఫ్లోర్‌లో నూతనంగా నిర్మించిన వాటిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం మార్కెట్ ధర నిర్ణయించామని.. వాటికి మరోసారి టెండర్లు పిలుస్తామన్నారు.

విధులు బహిష్కరించి ఆందోళన బాట పడుతోన్న కార్మికులు..
ఇదంతా ఒక ఎత్తయితే మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో ప్రతిఏటా రెండు సార్లు కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన బాట పడుతున్నారు. కనీస వేతనాలు చెల్లించకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం మున్సిపాలిటీ ఆదాయం నుండే కార్మికుల వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఆదాయంలేకే వేతనాలు ఆలస్యమవుతున్నాయిని అధికారులు చెబుతున్నారు. అయితే పాలకవర్గం కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే షాపింగ్‌ కాంప్లెక్స్‌ టెండర్లను వాయిదా వేస్తూ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఇప్పటికైనా అధికారులు.... రాజకీయ నాయకుల చెప్పుచేతల్లో కాకుండా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వ్యాపారులు కోరుతున్నారు. దీనివలన మున్సిపాలిటీ ఆదాయం పెరగడంతో పాటు అసలు దుకాణాదారులకు అండగా ఉంటుందని స్థానికులు అంటున్నారు. 

07:42 - March 28, 2018

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని... మున్సిపాలిటీలను కార్పొరేట్‌ కంపెనీలకు ఇచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. మరి వారికి ఎలాంటి హామీలను అమలు చేయాల్సి ఉంది, వారి ఆందోళనకు కారణం ఏమిటి..? అనే అంశం పై మనతో మాట్లాడేందుకు ఏపీ మున్సిపాల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎమ్‌ప్లాయిస్‌ ఫెడరేషన్‌ నాయకులు ఉమామహేశ్వర రావు గారు పొల్గొన్నారు. 

22:11 - March 8, 2018

Pages

Don't Miss

Subscribe to RSS - మున్సిపల్