మానవ హక్కుల సంఘం

14:36 - September 12, 2018

న్యూఢిల్లీ: వరవరరావు సహా ఇతర నలుగురు మానవ హక్కుల నేతలకు గృహనిర్బంధాన్ని వచ్చే సోమవారం (సెప్టెంబరు 17) వరకు కొనసాగించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.  ఐదుగురు మానవ హక్కుల నేతల విడుదల కోసం దాఖలైన పిటీషన్ ను విచారించిన కోర్టు వారి గృహనిర్బంధాన్ని పొడిగించాలని ఆదేశాలు జారీచేసింది.

చరిత్రకారుడు రోమిల థాపర్ హక్కుల నేతలు ఐదుగురిని విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తెలుగ రచయిత వరవరరావు, హక్కుల నేతలు వెర్నాన్, అరుణ్ ఫెర్రీరా, లాయర్ సుధా భరధ్వాజ్, పౌరహక్కుల కార్యకర్త గౌతం నవలఖాలను మహారాష్ట్ర పోలీసులు గత నెలలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.   

19:49 - November 2, 2016

హైదరాబాద్ : తెలంగాణలో డెంగీ విజృంభిస్తోన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టిటీడీపీ నేతలు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. సర్కార్‌ దేవుడి మీద భారం వేసి పరిపాలన సాగిస్తోందని ఫిటిషన్‌ లో పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్‌లో డెంగీ ఫివర్‌తో 23 మంది గిరిజనుల ప్రాణాలు పోయినా.. కేసీఆర్‌ సర్కార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టిటీడీపీ నేతలు ఆరోపించారు.
 

 

Don't Miss

Subscribe to RSS - మానవ హక్కుల సంఘం