మహిళా విభాగం

21:11 - July 23, 2018

విశాఖపట్టణం : వైసీసీ చేపట్టిన బంద్‌కు ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని కోరుతూ వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళలు నల్ల చీరలతో ధర్నా నిర్వహించారు. సీఎం చంద్రబాబు చేసిన మోసం ప్రజలందరికీ తెలియజేసేందుకే రేపు బంద్‌ చేపట్టామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్‌లో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారని మహిళలు తెలిపారు. 

17:59 - February 5, 2018

నల్గొండ : ఇవాళ రెండో రోజూ.. సీపీఎం ద్వితీయ రాష్ట్ర మహాసభలు కొనసాగుతున్నాయి. అంశాల వారీగా పార్టీ నిర్వహిస్తున్న సమావేశాల్లో అన్ని రంగాల వారూ చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా మహిళావిభాగం.. రాష్ట్ర సమస్యలపై తమదైన అవగాహనను కనబరుస్తోంది. మహిళా సమస్యలకు పరిష్కారాలనూ మహిళా విభాగం నాయకులు ప్రతిపాదించారు. చర్చ సందర్భంగా.. మహిళా విభాగం ప్రతినిధులంతా.. వేదికపైకి వచ్చి.. సందడి చేశారు.

11:24 - December 3, 2016

చిత్తూరు : బంగారంపై పన్ను విధించడంపై మహిళలు మండిపడుతున్నారు. మోడీ సర్కార్ పై మహిళలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాళి బొట్టు కూడా తెంచేస్తారా... అని ఆవేశపూరితంగా మాట్లాడారు. తాళి బొట్టు తెంపి., పసుపు తాడు మిగిలిస్తారా..అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడలో తాళి బొట్టు కూడా ఉండనివ్వరా.. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. బంగారంపై పన్నుకు వ్యతిరేకంగా తిరుపతిలో వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. గంగమ్మ గుడి వద్ద ధర్నా చేపట్టారు. 'బంగారంపై దాడి.. పసుపుతాడే ఉరి' అంటూ కేంద్రప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆందోళనలో వైసీసీ నేత భూమన కరూణకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బంగారంపై పన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

17:16 - August 21, 2015

హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ చీప్‌ లిక్కర్‌ను ప్రవేశపెట్టొద్దంటూ.. కాంగ్రెస్‌ మహిళా విభాగం గర్జించింది. హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా.. ఆ పార్టీ మహిళానేతలు నినాదాలు చేశారు. మద్యం బాటిళ్లను ధ్వంసం చేసిన తమ నిరసన వ్యక్తం చేశారు. మద్యం వల్ల మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం డౌన్‌డౌన్‌ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో.. మహిళలను బలిపశువులను చెయొద్దని వేడుకున్నారు. తెలంగాణలో మద్యాన్ని అరికట్టేందుకు పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు.

Don't Miss

Subscribe to RSS - మహిళా విభాగం