మహిళలు

13:00 - September 19, 2018

సాధారణంగా అమ్మాయిలు గర్భం రావడం కోసం చాల ప్రయత్నాలు చేస్తారు. కాని ఆ గర్భం అనేది కొంతమందికి పెళ్లి అయిన తరువాత వెంటనే అందుతుంది కొంత మందికి మాత్రం కొన్ని సంవత్సరాలు ఎదురు చూసినా గర్భం అందదు. దీనికి ఎన్నో కారణాలుంటాయి. ఎన్ని మందులు వాడినా సమస్య పరిష్కారం కాకపోవడంతో చాలా మంది నిరాశకు లోనవుతుంటారు. త్వరగా గర్భం దాల్చాలంటే ? 

 

  • ఒత్తిడిని తగ్గించుకోవాలి. ప్రశాంతంగా ఉండాలి. ఒత్తిడికి గల కారణాలు తెలుసుకుని అందుకు పరిష్కారం వెతకాలి. యోగా, వ్యాయమాలు, ధ్యానం లాంటి పనులు చేయాలి. 
  • ప్రధానంగా నిత్యం వ్యాయామం చేయాలి. వ్యాయామాలు చేయడం వల్ల మంచి ఆరోగ్యం వస్తుంది. శక్తిని అందించడమే కాకుండా రాత్రి వేళల్లో సుఖమైన నిద్ర వస్తుంది. 
  • ముఖ్యంగా డ్రగ్్స, మద్యం, ఇతరత్రా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. అనారోగ్యకర అలవాట్లకు దూరంగా ఉంటే గర్భానికి శరీరం అనుకూలంగా మారుతుంది. 
  • ఇక ఆహార విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం బెటర్. అధిక బరువు లేదా బరువు తక్కువగా ఉండటం వంటి వాటి వలన గర్భధారణ, గుండెపై భారం పెరగటం, శిశువుకు పోషకాలు అందటంపై లోపాల వంటి సమస్యలు కలగవచ్చు.
19:51 - August 25, 2018

హైదరాబాద్‌ : నగర షీ టీమ్స్‌ భరోసా కేంద్రంలో రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. షీ టీమ్స్‌ కాపాడిన మహిళలు, విద్యార్థులకు నగరవాసులు రాఖీలు కట్టారు. మహిళలు, విద్యార్థినుల భద్రతకు నగర పోలీసులు భరోసా ఇస్తున్నారంటున్న షీ టీమ్స్‌ అదనపు కమిషనర్‌ షికా గోయల్‌తో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మహిళలు, బాలికలు స్వేచ్ఛగా తిరిగేలా ధైర్యం కల్పిస్తున్నామని చెప్పారు. మహిళలను ఎవరైనా వేధిస్తుంటే షీ టీమ్స్‌కు ఫోన్‌ చేయొచ్చని తెలిపారు. 

16:50 - August 15, 2018

మహిళలకు సంబంధించి ఎన్ని చట్టాలున్నాయి ? మహిళలకు సంబంధించి అనేక చట్టాలున్నాయి. మహిళలకు ఉన్న చట్టాలను పలు రకాలుగా వర్గీకరించారు. ఇదే అంశంపై నిర్వహించిన మానవి మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. ఆ వివరాలను ఆమె మాటల్లోనే..
నాటి కాలం నుంచి మన సమాజంలో అనేక సాంఘీక దురాచారాలు ఉన్నాయి. సతీసహాగమనం, కన్యాశుల్కం, వరకట్నం వంటి సాంఘీక దురాచారాలు ఉన్నాయి. మహిళలకు అనేక చట్టాలు ఉన్నాయి. సాంఘీక దురాచారాల నుంచి మహిళలను కాపాడేందుకు, మహిళ రక్షణ... భద్రత కోసం చట్టాలు ఉన్నాయి. మొదటగా 1929 లో బాల్య వివాహ నిరోధక చట్టం వచ్చింది. 1937 లో హిందూ మహిళలకు ఆస్తి హక్కు చట్టం వచ్చింది. 1956 లో సవరణలతో కూడిన మహిళలకు ఆస్తి హక్కు చట్టం వచ్చింది. 1961లో వరకట్నం నిషేధ చట్టం వచ్చింది. 2006 లో సవరణలతో కూడిన బాల్య వివాహాల చట్టం వచ్చింది. మహిళలపై అత్యాచారాలు...లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు, లైంగిక వేధింపుల నిరోధానికి నిర్భయ చట్టం వచ్చింది. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

17:22 - August 13, 2018

హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రశ్నించారు. శంషాబాద్ లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ లో డ్వాక్రా సంఘాలతో నిర్వహించిన సమావేశంలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు.మహిళా సంఘాల గ్రూపులకు బ్యాంకులు లోన్లు మంజూరు చేస్తుందని...సరిగ్గా రుణాలు అందిస్తే వ్యాపారం..ఉద్యోగాలు చేసే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం, ఎన్డీయే సర్కార్...బ్యాంకుల్లో ఉన్న డబ్బులు పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు మాత్రమే లోన్లు మాత్రమే ఇవ్వడానికి అనుమతినిస్తోందన్నారు.

చిన్న వ్యాపారులు, రైతులు, మహిళా సంఘాలు రుణాలు కావాలని కోరితే వీరికి రుణాలు ఇవ్వద్దని చెబుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బ్యాంకు రుణాలు అందించేందుకు కృషి చేస్తామని, నేరుగా అకౌంట్ లో డబ్బులు జమ చేస్తామన్నారు. రైతులకు మద్దతు ధర ఎక్కువ చేస్తామని ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారని, దేశం మొత్తంలో రూ. 10వేల కోట్ల రూపాయలు పెంచబోతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయా పర్యటనల్లో మోడీ వెల్లడించారన్నారు. కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రూ. 30వేల కోట్ల రూపాయల రుణం మాఫీ చేసిందని, మోడీ చెప్పిన దానికంటే మూడొంతుల అధికంగా ఒక్క రాష్ట్రంలోనే కాంగ్రెస్ చేసిందని తెలిపారు.

నవంబర్ 8వ తేదీన నోట్ల రద్దు చేసిందని..ఈ విషయం అందరికీ తెలిసిందేన్నారు. బ్యాంకుల్లో ఎంతో మంది క్యూ లైన్ లో వేచి ఉన్నారని..ఈ క్యూ లైన్ లో ఒక్క ధనవంతుడు నిలబడ్డాడా ? అని నిలదీశారు. వారి దగ్గర డబ్బులు లేవా ? వారు ఎందుకు క్యూ లైన్ లో ఎందుకు నిలబడలేదు ?..క్యూ లైన్ లో పేద వారు మాత్రమే ఎందుకు నిలబడ్డారని ప్రశ్నించారు. దేశం మొత్తం మీద ఉన్న అవినీతి వ్యక్తులు బ్యాంకుల వెనుక ద్వారం నుండి వెళ్లి మొత్తం డబ్బులు వేశారని తెలిపారు. బ్యాంకుల్లో 12 లక్షల కోట్ల రూపాయలు నాన్ ఫెర్మామింగ్ ఉన్నాయన్నారు. నల్లధనం మీద పోరాటం చేస్తామన్న మోడీ..ప్రజల జేబుల్లో ఉన్న డబ్బులు తీసుకుని బ్యాంకుల్లో వేయించారరని..ఈ డబ్బులను అధిక ధనవంతులు..పారిశ్రామిక వేత్తలకు అందిస్తున్నారని పేర్కొన్నారు. రుణాలు మాఫీ చేయాలని మహిళా సంఘాలు కోరుతుంటే...ప్రధాన మంత్రి మోడీ..కేసీఆర్ లు సాధ్యం కాదని చెబుతున్నారని పేర్కొన్నారు. 

09:25 - August 5, 2018
12:26 - August 2, 2018

విజయవాడ : తాను చినప్పటి నుండి తన కుటుంబసభ్యులతో మెలగడం జరిగిందని, అందువల్ల మహిళల బాధల తెలుసని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భూ సేకరణ చట్ట పరిరక్షణ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. మహిళలకు కనీస భద్రత ఇవ్వాలని...బయటకు వెళితే భద్రత ఉందా అని ప్రశ్నించారు. చిన్న తనంలో తల్లులు ఇంటిని ఎలా నడిపారో తెలిసేదని..మహిళల్లో నిగూఢమైన శక్తి ఉందని..మహిళలను ఇబ్బంది పెట్టకుండా ఉంటే అన్నీ సవ్యంగా జరుగుతాయన్నారు. 

15:21 - July 20, 2018

ఢిల్లీ : దేశంలో మోడీ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ విమర్శించారు. హిందూస్తాన్ మహిళలకు రక్షణ లేదని ఎకనామిక్ టైమ్స్ లో ఆర్టికల్ వచ్చిందన్నారు. వాయిదా అనంతరం లోక్ సభ ప్రారంభం అయింది. రాహెల్ ఆరోపణలతో సభలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ యుద్ధ విమానాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. మోడీ ఒత్తిడితో మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ప్రపంచమంతా పెట్రోల్ ధరలు తగ్గుతుంటే.. మన దగ్గర పైపైకి పోతున్నాయన్నారు. 
మోడీ హృదయంలో రైతులు, పేదలకు స్థానం లేదు.. 
మోడీ హృదయంలో రైతులు, పేదలకు స్థానం లేదని చెప్పారు. పారిశ్రామిక వేత్తలకు మోడీ రెండున్నర లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని చెప్పారు. రూ.2.5 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేయించారని తెలిపారు. కానీ రైతుల రుణమాఫీని మాత్రం ప్రధాని పట్టించుకోరని విమర్శించారు. మోదీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ల కోసమే పని చేస్తోందని విమర్శించారు. ఏ ఎజెండా లేకుండా చైనాలో మోడీ రహస్యంగా పర్యటించడం వెనుక మతలబు ఏంటీ ? ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడితో పచార్లు చేస్తుంటే..1000 మంది చైనా సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చారని తెలిపారు. చైనా అధ్యక్షుడు వెళ్లిపోగానే డోక్లాంలో చైనా సైనికులు తిష్ట వేస్తారని చెప్పారు. నిజాలను విని భయపడకండి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జీఎస్టీ తెస్తే బీజేపీ వ్యతిరేకించిందని గుర్తు తెచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్నారు. 

 

21:49 - July 18, 2018

ఢిల్లీ : కేరళలోని శబరిమలై అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధంపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఆలయం ప్రయివేట్‌ ఆస్తి కాదు...అందరికి సంబంధించినదని కోర్టు స్పష్టం చేసింది.  స్త్రీ, పురుష భేదం దేవుడికే లేనపుడు భూమిపై ఈ భేదాలు ఎందుకని  కోర్టు ప్రశ్నించింది. ఏ ఆధారంతో ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తున్నారని చీఫ్‌ జస్టిస్ దీపక్‌ మిశ్రా ఆలయ అధికారులను ప్రశ్నించారు. ఇది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగకరమని పేర్కొన్నారు. ఒకసారి ఆలయాన్ని భక్తుల కోసం తెరిచాక ఆ ఆలయానికి ఎవరైనా వెళ్లవచ్చని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఓ పురుషుడికి ఆలయంలో పూజించే హక్కు ఎంత ఉందో మహిళకు కూడా అంతే ఉంటుందని...మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం సరికాదని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు ఆలయ ప్రవేశాన్ని నిరాకరించడంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

 

18:28 - July 18, 2018

ఢిల్లీ : శబరిమల ఆలయంలోకి మహిళలకు అనుమతిస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. గతంలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు స్త్రీలను ఆలయంలోకి అనుమతి నిరాకరించేవారు. అయితే దీనిపై వాదనలు విన్న సుప్రీం కోర్టు .. ఆలయంలోకి ఎవరైనా వెళ్లవచ్చని తీర్పు నిచ్చింది. 

 

19:32 - July 16, 2018

ఉత్తర్ ప్రదేశ్ : ముస్లింలలో పురుషుల పార్టీ కాంగ్రెస్ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ముస్లిం పార్టీగా చెప్పుకొనే కాంగ్రెస్ ముస్లిం మహిళల పట్ల వివక్షత చూపుతోందని ఆరోపించారు. ట్రిపుల్ తలాక్ పేరిట మోడీని అడ్డుకుంటున్న విపక్షాలు ముస్లిం మహిళలతో మాట్లాడి పార్లమెంట్ లో తమ వైఖరిని తెలియచేయాలన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఆజంగఢ్ లో పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వేకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ. 23వేల కోట్లతో ఎక్స్ ప్రెస్ నిర్మితం కానుంది.

 

Pages

Don't Miss

Subscribe to RSS - మహిళలు