మచ్చలు

11:18 - May 7, 2017

ఎండకాలం వచ్చిందంటే చర్మ సంబంధిత సమస్యలతో పాటు చెమట కాయల సమస్య కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ చెమట కాయల నుండి బయటపడటానికి వివిధ పౌడర్లు..క్రీములు వాడుతుంటారు. ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో చెమటకాయలకు చెక్ ఎలా పెట్టవచ్చో చూద్దాం...
టిష్యూ పేపర్ ను తీసుకుని వెనిగర్ లో ముంచి చెమటకాయలున్న చోట అద్దాలి. ఇలా చేయడం వల్ల చెమటకాయలు త్వరగా తగ్గుముఖం పడుతాయి.
బ్లాక్ టీని తీసుకుని చర్మంపై రాసి చూడండి. చర్మానికి సంరక్షణ కూడా అందుతుంది.
కాటన్ బాల్ ని తీసుకుని లవంగనూనెలో ముంచి చెమటకాయలున్న చోట రాయాలి. ఇలా రోజు చేయడం వల్ల చెమట కాయల సమస్య నుండి బయటపడవచ్చు.
చల్లటి పాలలో కాటన్ బాల్స్ ను తడపి చెమటకాయలపై మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఆ పొక్కుల వల్ల వచ్చే మంట తగ్గే అవకాశం ఉంది.
మజ్జిగ, సబ్జా నీళ్లు, బార్లీ వంటివి రోజూ తాగుతూ ఉంటే సమస్య తగ్గుముఖం పడుతుంది.
గంధం, రోజ్ వాటర్ కలిపి చెమటకాయలు ఉన్నచోట రాయాలి. అనంతరం పది నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

11:01 - March 27, 2017

శరీరంపై పలువురు మచ్చలు వస్తుండడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇందుకు పలు మందులు..ఆరోగ్య సాధనాలను వాడుతుంటూ సమస్యలను మరిన్ని ఎదుర్కొంటున్నారు. మరి మచ్చలు పోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. కరివెపాకులను తీసుకుని చిటికెడు పసుపు వేయాలి. వీటిని మిక్సీ పట్టి మచ్చల పై ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. ఓ పదిహేను నిమిషాల అనంతరం కడిగేసుక్కోవాలి. ఎండిన తులసి..వేప..పుదీన ఆకులను తీసుకోవాలి. ఇవి ఒక్కోటి వంద గ్రాములుండాలి. అందులో చిటికెడు పసుపు వేసుకుని పొడిగా మిక్సీ చేసుకోవాలి. వాడే సమయంలో రెండు స్పూన్ల పొడికి తగినంత పన్నీరు వేసుకుని కలుపుకుని ముఖానికి పట్టించుకోవాలి. అనంతరం కడిగేసుకోవాలి. కొబ్బరి నూనెకు గోరింటాకు పొడి కలిపి పేస్టు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. అర టీ స్పూన్‌ నిమ్మరసంలో నాలుగు చుక్కల గ్లిజరిన్‌ కలిపి మచ్చల మీద రాస్తుంటే మచ్చలు పోతాయి. తులసి ఆకు ఎంతో శ్రేయస్కరం అనే సంగతి తెలిసిందే. తులసీ ఆకుల్లో కొద్దిగా పసుపు వేసి మిక్సీ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించడం వల్ల మచ్చలు తొలగిపోయే అవకాశం ఉంది.

08:19 - June 16, 2016

ప్రస్తుతం..కళ్లజోడు అందరికీ వస్తోంది. వయస్సుతో నిమిత్తం లేకుండా కళ్లజోడు పెట్టుకొనే పరిస్థితి వస్తోంది. అయితే కొంతమంది రెగ్యులర్ గా పెట్టుకొనే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. దీనివల్ల ముక్కు మీద మచ్చలు ఏర్పడుతుంటాయి. మచ్చలు కనిపించకుండా ఉండాలని పలు ప్రయత్నాలు చేస్తుంటారు. మచ్చలు కనిపించకుండా చర్మాన్ని తాజాగా మార్చాలంటే కొన్ని చిట్కాలు...
తేనెలో కొద్దిగా పాలు, ఓట్స్ వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దీనిని మచ్చలు పడిన భాగంగా రాసుకోవాలి. దీనివల్ల సమస్య తగ్గడంతో పాటు చర్మం తాజాగా మారుతుంది.
రాత్రిళ్లు బాదం నూనెను ముక్కుకిరువైపులా రాసి నెమ్మదిగా మర్ధన చేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల కళ్లజోడు పెట్టుకున్న ప్రాంతంలో ఏర్పడిన మచ్చలు తగ్గుముఖం పడుతాయి.
కీరదోసను గుజ్జులా చేసి మచ్చపడిన ప్రాంతలో పూతలా వేయాలి. అంతేగాకుండా కీరదోస రసంలో టమాట..బంగాళాదుంపల రసం కలిపి కూడా ముక్కుకు పట్టించాలి. కాసేపటి తరువాత కడిగేసుకోవాలి.
నిమ్మరసంలో రెండు..మూడు చుక్కల కొబ్బరి నూనె వేసి ముక్కుకిరువైపులా రాయాలి. రెండు నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే ఫలితం కనిపిస్తుంది. 

13:27 - January 12, 2016

ముఖంపై పేరుకుపోయిన బ్లాక్‌హెడ్స్‌ని తరచూ తొలగించుకోవడం వల్ల ముఖం ఆరోగ్యంగా, అందంగా మారుతుంది. ఇందుకు ముల్తానీ మట్టి బాగా ఉపయోగపడుతుంది. చెంచా ముల్తానీ మట్టికి సరిపడా నీళ్లు కలిపి మెత్తగా చేయాలి. దీన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట పూతలా వేసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరి. అలాగే చెంచా చొప్పున తేనె, పాలు కలిపి సన్నని మంటపై ఐదు సెకన్లు ఉంచాలి. దీన్ని సమస్య ఉన్న చోట రాయాలి. దానిపై శుభ్రమైన దూదిని ఉంచి కాసేపయ్యాక తీసేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గుముఖం పడతాయి.
ఒక చెంచా దాల్చినచెక్క పొడి, తేనె కలిపి బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట రాసి, ఆ ప్రాంతంపై దూది ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత ఆ దూదిని తొలగించి గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ఫలితం ఉంటుంది. చెంచా వంటసోడా, అరచెంచా నీళ్లూ కలిపి, ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్నచోట రాసి వలయాకారంగా రుద్దాలి. పది నిమిషాల తర్వాత చన్నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే మంచిది.
ఓట్స్ మృతకణాలను తొలగించడంలో సాయపడతాయి. చెంచా ఓట్స్ ను రెండు చెంచా నీళ్లలో ఉడికించాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట రాయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే బ్లాక్‌హెడ్స్ తొలగిపోయి ముఖం శుభ్రపడుతుంది. చిటికెడు పసుపుని కాసిని నీళ్లలో లేదా కొబ్బరి నూనెలో వేసి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్ పై రాసి పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్‌హెడ్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది.
గ్రీన్‌టీలో ఉండే విటమిన్లూ, యాంటీ ఆక్సిడెంట్లూ చర్మంలో ఎక్కువగా ఉన్న జిడ్డును తొలగిస్తాయి. ఐదు చెంచాల నీళ్లలో రెండు చెంచాల గ్రీన్‌టీ పొడిని కలిపి పావుగంట వేడిచేయాలి. ఈ నీళ్లు గోరువెచ్చగా మారాక ముఖాన్ని శుభ్రం చేసుకుని వలయాకారంగా రుద్దాలి. పది నిమిషాల తర్వాత శుభ్రమైన నీళ్లతో కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది.

17:38 - November 19, 2015

ముఖంపై మచ్చలు తొలగించుకోవడానికి ఏవోవే క్రీమ్స్ వాడుతూ ముఖాన్ని కొంతమంది పాడు చేసుకుంటుంటారు. వీటిని తొలగించడానికి కొన్ని టిప్స్...
అరకప్పు పాలు తీసుకుని అందులో రెండు చెంచాల ఓట్స్ వేసి బాగా మరిగించాలి, చల్లారాక మెత్తని ముద్దగా చేసి, కొంచెం పెరుగు కలిపి ఒక అరగంట ఫ్రిజ్ లో పెట్టాలి. తరువాత ముఖానికి పూతలా వేసుకుని, కొంచెంసేపయ్యాక చన్నీళ్ళ తో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం పై మచ్చల సమస్య తగ్గుతుంది. పుదీనా ఆకుల్ని మెత్తగా చేసి దానిలో అర టీ స్పూను నిమ్మరసం, టీ స్పూను ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించి మర్దన చేసుకుని, తరువాత నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే నల్ల మచ్చలు దూరమవుతాయి. దాల్చిన చెక్క పొడిలో కొంచెం తేనె కలిపి రాత్రి పడుకునే ముందు ముఖం పై మొటిమలు, మచ్చలూ ఉన్న చోట రాసి, మర్నాడు ఉదయం గోరు వెచ్చటి నీటితో కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది. పచ్చి పాలలో కాస్త నిమ్మరసం కలిపి రాత్రి పడుకునే ముందు ముఖం తుడుచుకోవాలి. తరువాత ఐదు నిమిషాలు ఆగి, ఎర్ర చందనం పొడిలో నాలుగు చుక్కల రోజ్ వాటర్ కలిపి ముఖానికి పూతలా వేసుకుని ఉదయాన్నే చల్లటి నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మ సమస్యలు తగ్గుతాయి.

Don't Miss

Subscribe to RSS - మచ్చలు