మంచితనం

14:58 - October 22, 2017

'రాముడు'లో మంచితనం లేదని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ తెలిపారు. రంగనాయకమ్మతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె రచించిన 'రామయణ విషవృక్షం' పై స్పందించారు. రాజు అనే పెద్ద దొర అని..అతనికి ఆస్తి..భూమి విపరీతంగా ఉంటుందన్నారు. రాముడు..రావణుడులు ఇద్దరు రాజులని, ఇందులో గొప్ప ఏముందన్నారు. రాజు అనే వాడు దోపిడి దారుడని..రాముడులో ఒక మంచితనం లేదని స్పష్టం చేశారు. ఇక్కడ రాముడిపై కవి ఎందుకు రాశాడు అంటే అతనికి అంతకంటే జ్ఞానం లేదన్నారు. రామాయణంలో ఏ చెడ్డ క్యారెక్టర్లు అన్నారో అవి మంచి క్యారెక్టర్లు అని..ఏవీ గొప్ప క్యారెక్టుర్లు అని పేర్కొన్నారో..అవి చెడ్డ క్యారెక్టర్లని విమర్శించారు. సీత..ఊర్మిళ..వీరి తప్పేమి లేదని..భర్తలు ఎలా చెబితే అలా విన్నారని పేర్కొనడం జరిగిందన్నారు. మతం అనేది ద్రోహం..రాజు పెద్ద ద్రోహి అని, మార్క్సిజం చదివిన అనంతరం ఈ పుస్తకం రాసి 'రామాయణ విషవృక్షం' అని పేరు పెట్టడం జరిగిందన్నారు. ఇలాంటి పేరు పెట్టవద్దని ముద్రణ చేసే వ్యక్తి కోరడం జరిగిందన్నారు. ముందు శ్రీశ్రీతో మాట్లాడాలని అతను సూచించడం జరిగిందని కానీ తాను శ్రీశ్రీని ఇష్టపడనని..అతని కవిత్వం బాగుండొచ్చన్నారు. ఎవరితోనూ మాట్లాడనని ఖరాఖండిగా చెప్పడం జరిగిందన్నారు. చివరకు ముద్రణ వేయడం..మంచి అమ్మకాలు జరిగాయన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

16:40 - October 16, 2015

హైదరాబాద్ ప్రముఖ రచయిత, కళాకారుడు భూపాల్ రెడ్డి సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. పలు విషయాల్లో ప్రస్తుత కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఆయనకు లభించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. పిల్లలకు సంబంధించిన కథాంశంతో 'ఉగ్గుపాలు' అనే పేరుతో ఆయన రాసిన పుస్తకానికిగానూ 2010లో భూపాల్ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. రచయితగానే కాక సినీనటుడుగానూ ఆయన ప్రసిద్ధి. మా భూమి, కొమరం భీం సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. కాగా, మోదీ సర్కార్ విధానాలను నిరసిస్తూ పలువురు రచయితలు సాహిత్య అకాడమీ అవార్డులను తిరిగిచ్చేస్తున్న సందర్భంలో ఆ నిర్ణయాన్ని ప్రకటించిన మొదటి తెలుగు రచయితగా భూపాల్‌ నిలబడ్డారు. అలాగే ఎన్‌ కౌంటర్లకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురస్కారాన్ని సైతం భూపాల్‌ తిరిగిచ్చేశారు.  

 

Don't Miss

Subscribe to RSS - మంచితనం