భూమి

12:15 - November 4, 2018

పశ్చిమ గోదావరి : పోలవరం ప్రాజెక్టు దగ్గర భూమిపై పగుళ్లు ఆగడం లేదు. నిన్నటి నుంచి రోడ్డు పైకి లేస్తోంది. భూమిపై పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడుతున్నాయి. 25 అడుగులు పైగా భూమి పైకిలేసింది. దీంతో కరెంటు స్తంభాలు కూలిపోతున్నాయి. ప్రొక్లైన్లు మట్టిలో కూరుకుపోతున్నాయి. పగుళ్లు ఏర్పడటం, భూమి పైకి లేవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అసలేం జరుగుతుందో అర్థం కాక టెన్షన్ పడుతున్నారు. కాగా, పోలవరం ప్రాజెక్టులోని మట్టిని తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేయడంతోనే పగుళ్లు వస్తున్నాయని గ్రామస్తులు అంటున్నారు.

 

 

09:01 - June 24, 2018
21:29 - March 31, 2018

బీజింగ్ : చైనాకు చెందిన మానవ నిర్మిత అంతరీక్ష కేంద్రం తీయాంగాగ్‌-1.. ఇపుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇవాళో రేపో భూమిపై కూలిపోయే అవశాశం ఉండటంతో .. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం అమెరికా స్కైలాబ్‌ ప్రపంచాన్ని వణికించగా .. ఇపుడు చైనాకు చెందిన తియాంగాంగ్‌-1 అదేతరహాలో భయపెడుతోంది. 
భయపెడుతున్న తియాంగాంగ్‌-1
చైనాకు చెందిన తొలి అంతరిక్ష పరిశోధనా కేంద్రం టియాంగాంగ్‌-1 పేరు వింటేనే ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. నిర్దేశిత ప్రదేశం నుంచి గతితప్పిన చైనా స్పేస్‌ల్యాబ్‌.. భూమివైపు వేగంగా దూసుకు వస్తోంది.  ఇవాళో రేపో అది భూవాతావరణంలోకి ప్రవేశించనుంది. దీంతో అది ఎక్కడ కూలుతుందోనని చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఒకింత ఆందోళనకు గురువుతున్నారు. 
39ఏళ్ల క్రితం భయపెట్టిన స్కైలాబ్‌
దాదాపు 39ఏళ్ల క్రితం స్కైలాబ్‌ భయంతో జనం వణికిపోయారు. 1979 జూలైనెలలో పట్టణాలు, పల్లెలు అనే తేడాలేకుండా ఆకాశంవైపు చూస్తూ బిక్కుమంటూ గడిపారు.  అమెరికాకు చెందిన స్కైలాబ్‌.. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా భయంగొలిపి చివరికి 1979 జూలై11న హిందూమహాసముద్రంలో కూలిపోవడంతో ప్రపంచంఅంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈనేపథ్యంలో ఇపుడు మరోసారి ప్రపంచదేశాలను వణికిస్తోంది.. చైనాకు చెందిన స్పేస్‌ల్యాబ్‌ తీయాన్‌గాంగ్‌-1. 
2011 సెప్టెంబర్‌లో తియాంగాంగ్‌-1ను ప్రయోగం 
2011 సెప్టెంబర్‌లో తియాంగాంగ్‌-1ను ప్రయోగించారు. దీని పొడవు10.4 మీటర్లు,  చుట్టుకొలత  3.35 మీటర్లు. మొత్తం బరువు 8,506 కిలోలు.. అంటే ఎనిమిదిన్నర టన్నులుగా ఉంది. 2018 మార్చి 26 వరకు దాదాపు 6సంవత్సరాల 178రోజులు తీయాంగాంగ్‌-1 కక్ష్యలోనే  ఉంది. తన జీవితికాలంలో ఆర్బిట్‌లో   37, 287 సార్లు పరిభ్రమించింది. రెండేళ్ల జీవిత కాలానికి రూపొందించిన తీయాంగాంగ్‌-1.. షెన్జో-8, షెన్జో-9, షెన్జో-10  ఇలా మూడు మిషన్లకు బేస్‌స్టేషన్‌గా సేవలందించింది. 2013లో షెన్జో-10 తిరిగి భూమికి చేరుకోవడంతో దీనికి అప్పగించిన ప్రధాన లక్ష్యం పూర్తయింది. 
భూమిచుట్టూ అంతరిక్షంలో చక్కర్లు
నిర్దేశిత లక్ష్యాన్ని నెవేర్చిన తియాన్‌గాంగ్‌-1 ఇపుడు గతితప్పి భూమిచుట్టూ అంతరిక్షంలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఇది భూమికి అతి సమీపానికి  వచ్చిందని,  భూవాతావరణంలోకి ప్రవేశించగానే పూర్తిగా మండిపోతుందని చైనా మ్యాన్‌డ్‌ స్పేస్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయం వెల్లడించింది. అయితే ఏ ప్రదేశంలో ఇది భూవాతావరణంలోకి ప్రవేశిస్తుందనే విషయాన్ని చివరి రెండు గంటల్లో మాత్రమే నిర్దారించడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. భూవాతావరణంలోకి రాగానే.. స్పేస్‌ల్యాబ్‌లో కొద్ది మొత్తంలో ఉన్న ఇంధనం మండిపోతుందని.. దీంతో అందులోని ఇతర భాగాలు కూడా కాలిపోతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని వల్ల భూమికి ఎలాంటి హానీ జరగదని.. ఎలాంటి ప్రమాదకరమైన విషవాయువులు కూడా వెలువడవని భరోసా ఇస్తున్నారు. 
మార్చి 16 నుంచి నో సిగ్నల్స్‌ 
మార్చి 16 నుంచి తియాంగాంగ్‌-1 నుంచి సమాచారం అందడం లేదని చైనా అంతరిక్ష ఇంజనీరింగ్‌ అధికారి సోమవారమే తెలిపారు. భూ వాతావరణంలోకి ఇవాళో రేపో ప్రవేశించనున్న తియాంగాంగ్‌-1.. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 4 తేదీల మధ్య కూలిపోయే అవకాశం ఉందని  చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లోనే తీయాంగాంగ్‌ భూమిపై కూలిపోయే అవకాశం ఉంది..దీంతో తియాంగాంగ్‌-1 ఎక్కడ కూలిపోనుంది..? శాస్త్రవేత్తలు చెబుతున్నట్టు ప్రమాదమేమి ఉండదా..? ఇపుడు ఇవే ప్రశ్నలు జనసామాన్యంలో ఉత్కంఠ రేపుతున్నాయి.  

 

11:47 - February 17, 2018

పెద్దపల్లి : జిల్లా కాల్వశ్రీ రాంపూర్‌ మండలం కునారం గ్రామంలో భూములు లేని నిరుపేదలు నిజాం కాలం నాటి భూముల కోసం పోరాటం చేస్తున్నారు. 2వేల ఎకరాల పైచిలుకు నిజాం భూములను పెత్తం దారులు, పలుకుబడి ఉన్నవారంతా ఆక్రమించుకోవడంతో భూములు కోల్పోయిన వారంతా పోరు బాట పట్టారు. ఏళ్ల తరబడి అక్రమార్కులు చేతుల్లో కబ్జాకు గురైన తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం ఆగదంటున్నారు.

17:47 - December 25, 2017

హైదరాబాద్ :మియాపూర్ భూవివాదం కేసు చివరిదశకు చేరుకుంది. మియాపూర్ భూవివాదం కేసులో కూకట్‌పల్లి సైబరాబాద్ పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. రిజిస్ట్రేషన్‌ స్టాంప్స్‌ శాఖ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కూకట్‌పల్లి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

భూమి తెలంగాణ ప్రభుత్వానిదే...
కూకట్‌పల్లి, మియాపూర్‌ భూములు తమ పూర్వీకులదంటూ.. నిజాం కుటుంబ సభ్యులు కోర్ట్‌లో పిటిషన్‌ వేశారు. ఇక కబ్జా చేసిన ట్రినిటి కంపెనీ, సువిశాల్‌ కంపెనీలు సైతం వ్యవసాయ భూములుగా నకిలీ డాక్యుమెంట్స్‌ను సృష్టించి తమదంటూ కోర్టులో వాదించారు. ఇరువురి వాదోపవాదనలు విన్న కోర్టు.. 814 ఎకరాల విలువైన భూమి తెలంగాణ ప్రభుత్వానిదేనని తీర్పు ఇచ్చింది. కూకట్‌ పల్లి, మియాపూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌లో కంపెనీలు సృష్టించిన నాలుగు పాస్‌ పుస్తకాలు, ట్రాన్స్‌ఫర్‌ డాక్యుమెంట్స్‌తో పాటు సేల్‌డీడ్‌, ఫేక్‌ రిజిస్ట్రేషన్‌ ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ వ్యవహరంలో పోలీసులు అనేక అంశాలను పరిశీలించారు. నిందితుల బెయిల్ పిటిషన్‌ను మియాపూర్ కోర్టు డిస్మిస్ చేసింది. నిందితులను కోర్టు అనుమతితో కస్టడిలోకి తీసుకొని పోలీసులు ఈ కేసును మరింత వేగంగా దర్యాప్తు జరిపారు.

వ్యవసాయ భూములుగా చూపిస్తూ
మియాపూర్‌ ప్రభుత్వ భూములను వ్యవసాయ భూములుగా చూపిస్తూ సువిశాల్‌, ట్రినిటీ కంపెనీలు అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. భూకబ్జాలకు పాల్పడిన నిందితులు పార్థసారధితో పాటు సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్ మరికొందరు గతంలో అరెస్ట్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈకేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. తాజాగా ఈ కేసులో అన్ని ఆధారాలు, వివరాలతో కూకట్‌పల్లి పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేయనుండడంతో ఈకేసు చివరి అంకానికి చేరుకుంది. ఈ కేసులో అన్ని ఆధారాలు పక్కాగా సేకరించిన పోలీసులు.. త్వరలో ఛార్జిషీట్‌తో పాటు సాక్షులను కోర్టు ముందు హజరుపరుచనున్నారు.

07:43 - December 7, 2017
11:55 - November 17, 2017

మూడెకరాల కోసం ఎదురుచూపులు - సంపత్..

హైదరాబాద్ : మూడెకరాల కోసం దళితులు ఎదురు చూపులు చూస్తున్నారని టి.కాంగ్రెస్ సభ్యుడు సంపత్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసలో ఆయన ఎంబీసీ అంశంపై పలు ప్రశ్నలు అడిగారు. మూడెకరాలు భూమి కేటాయిస్తామనే ప్రకటనతో ఎంతో మందిలో ఆత్మస్థైర్యం..నమ్మకం కలిగించిందన్నారు. 9, 966 ఎకరాలు ఇచ్చారని, ఈ మధ్య కాలంలో 8 నెలల్లో కేవలం 185 ఎకరాలు మాత్రమే ఇచ్చారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఎంత మంది దళితులకు భూమి లేదు ? అని ప్రశ్నించారు. 3,30,644 మంది మూడెకరాల పొలం కోసం చూస్తున్నారని అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోందన్నారు. వీరికి భూమి కేటాయించడం ఎంత సమయం పడుతుందని..దీనిపై తనకు అసంతృప్తి ఉందన్నారు. సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టాయి ? ప్రభుత్వం ఆదుకొంటేనే దళితులు అభివృద్ధి చెందరని సభకు తెలిపారు.

 

14:27 - November 6, 2017

హైదరాబాద్ : అసెంబ్లీలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదలు జరిగాయి. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనతో కొత్తగా చేసిందేమీ లేదని కాంగ్రెస్‌ సభ్యుడు మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ప్రకటనల పేరుతో ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని... గతంలో ఉన్న తమ ప్రభుత్వం కూడా రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసిందన్నారు. అయితే దీనిపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. మంచి పని చేస్తుంటే.. నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ప్రతిపక్ష సభ్యులు అనడం సరికాదన్నారు. రైతులకు మేలు చేసేందుకు ఈ ప్రక్రియను పూనుకున్నామన్నారు కేసీఆర్‌.

రైతుల హక్కుల వారి ఆత్మాభిమానంపై కాంగ్రెస్ ఎప్పుడూ వెనుకంజ వేయలేదని టి.కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి పేర్కొన్నారు. దున్నే వాడిదే భూమి స్పూర్తితో అనేక చట్టాలు తీసుకొచ్చడం జరిగిందన్నారు. సూర్యాపేట తిరుమలగిరి మండలంలో భూ ప్రక్షాళణ కోసం వెళితే..ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి కి చెందిన ఎకరం 30 గంటల భూమి 15 సంవత్సరాల క్రితం సాదా బైనామీ కింద అమ్మితే ఇప్పటి వరకు అప్ డేట్ చేయలేదన్నారు. దీనిపై జానారెడ్డి స్పందించారు. దరఖాస్తు చేసుకుంటే కొన్ని మిగిలిపోయిన మాటలు వాస్తవమేనన్నారు. 

19:14 - October 18, 2017

కడప : జిల్లా చింత కొమ్మదిన్నె మండలంలో మళ్లీ భూమి కుంగడం మొదలైంది. రెండేళ్ల క్రితం కూడా ఇలానే పంట పొలాల్లో భూమి కుంగిపోయింది. అప్పట్లో గ్రామ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న కేంద్ర, రాష్ట్ర భూగర్భశాఖ అధికారులు.. గ్రామంలో పర్యటించారు. కొందరు శాస్త్ర వేత్తలు ప్రత్యేక బృందాలుగా పర్యటించి సర్వేలు నిర్వహించారు. అయినా భూమి ఎందుకు కుంగిపోయిందో సరైన కారణాలను కనుగొనలేకపోయారు. మొదట్లో భూమి పొరల కింద సున్నపురాయి ఉందని.. వర్షాలు భాగా కురిసినప్పుడు భూమిలో ఉన్న సున్నపురాయి పేలిపోయి ఇలా కుంగిపోయి ఉంటుందని తేల్చారు. మరి కొందరు భూమి కింద సొరంగ మార్గాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

రెండేళ్ల తర్వాత తిరిగి ఇదే ప్రాంతంలో
రెండేళ్ల తర్వాత తిరిగి ఇదే ప్రాంతంలో మళ్లీ భూమి కుంగిపోయి పెద్ద గుంతలు పడ్డాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. చింతకొమ్మదిన్నె మండలం గూడవాండ్ల పల్లె పొలాల్లోని మామిడి తోటలో దాదాపు 20 అడుగుల వెడల్పు, 30 అడుగుల లోతుతో రెండు పెద్ద గొయ్యిలు ఏర్పడ్డాయి. దీంతో అక్కడ ఉన్న మామిడి చెట్లు భూమిలోకి కుంగిపోయాయి. భూమి కుంగిపోతుండటంతో ఈ గ్రామ ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు . గతంలో అధికారులు పర్యటించారు కానీ సరైన కారణాలను కనిపెట్టలేక పోయారని అంటున్నారు. చింతకొమ్మదిన్నె మండలంలోని బుగ్గమల్లేశ్వర స్వామి ఆలయం, గూడవాండ్ల పల్లెతో పాటుగా చుట్టూ ఉన్న గ్రామాల్లో ప్రతిసారి ఇలా పెద్దపెద్ద గుంతలు పడుతుంటే అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదనటూ స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పర్యటించి గుంతలు ఎందుకు పడుతున్నాయో కనుగొనాలని ప్రజలు వేడుకుంటున్నారు.

 

 

15:32 - October 17, 2017

కడప : జిల్లాలో భూమి కుంగిపోవడంతో రైతులు..గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇలాంటి ఘటనే మళ్లీ పునరావృతం కావడంతో అక్కడ ఆందోళన నెలకొంది. చింతకొమ్మదిన మండలం గూడవాండ్ల పల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. పంట పొల్లాలో భూమి ఒక్కసారిగా కుండిపోయింది. మామిడి చెట్లు భూమిలోకి కుంగిపోయాయి. తమకు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నామని, గతంలో ఇలాంటిదే జరిగితే అధికారులు వచ్చి వెళ్లారని ఓ రైతు పేర్కొన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - భూమి