భారత్

15:24 - November 13, 2018

ఢిల్లీ : భారత క్రికెట్ టీమ్ జోరును తట్టుకోవటం ప్రత్యర్థుల జట్టుకు సాధ్యం కావటంలేదు. ఈ హవాను ఇటీవల జరిగిన వన్డే సిరిస్ లో మరోసారి నిరూపించారు మన క్రికెట్ సేన. నేపథ్యంలో వెస్టిండీస్ తో స్వదేశంలో జరిగిన ఐదు వన్డేల సీరిస్ లో భారత్ 3-1 తేడాతో విండీస్ పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సీరిస్ లో బ్యాట్ మెన్స్, బౌలర్లు సమిష్టిగా రాణించి భారత్ కు అద్భుత విజయాలు అందించారు. మొదటి మూడు వన్డేల్లో విండీస్ భారత్ కాస్త పోటీ ఇచ్చినప్పటికి మిగతా రెండిట్లో టీంఇండియా ముందు అసలు నిలవలేకపోయింది. ఇలా రెట్టించిన ఉత్సాహంతో సీరిస్ ముగించిన ఆటగాళ్లు అదే ఊపును ఐసీసీ ర్యాకింగ్స్ లోనూ కొనసాగించారు. 

సంబంధిత చిత్రంభారత్-విండీస్... శ్రీలంక-ఇంగ్లాండ్... బంగ్లాదేశ్-జింబాబ్వేల మధ్య సిరీస్‌లు ముగియడంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో ఏకంగా ఐదుగురు భారత ఆటగాళ్లు టాప్ టెన్ లో స్థానం సంపాదించుకున్నారు.

bumrah and chahal and ravindra jadeja కోసం చిత్ర ఫలితం

 

ఈ వన్డే సీరిస్ కు ముందు కూడా బ్యాట్ మెన్స్ ర్యాకింగ్స్ లో విరాట్ కోహ్లీ మొదటిస్థానంలో కొనసాగాడు. అయితే ఈ సీరిస్ ద్వారా అతడు మరో 15 పాయింట్లు సాధించి తనకు ర్యాకింగ్స్ ను పదిలం చేసుకున్నాడు. ఇక టీంఇండియా వైస్ కెప్టెన్ గా  రోహిత్ శర్మ జట్టులో రెండో స్థానాన్ని ఆక్రమించినట్లే ఐసిసి ర్యాకింగ్స్ లో కూడా కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ సీరిస్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్న రోహిత్ ఏకంగా 29పాయింట్లు సాధించి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అతడి ఖాతాలో 871 పాయింట్లు ఉన్నాయి. 

సంబంధిత చిత్రంఇక బౌలింగ్ విషయానికి వస్తే భారత యువకెరటం జస్ప్రీత్ సింగ్ బుమ్రా 841 పాయింట్లతో అంతర్జాతీయ బౌలర్లలో అగ్రస్థానం సంపాదించాడు. ఇక విండీస్ తో జరిగిన సీరిస్ లో రాణించిన చాహల్ 683 పాయింట్లు సాధించి మొదటిసారి టాప్ టెన్ లో స్థానం సంపాదించాడు. బౌలర్ల జాబితాలో ఇతడు 8వ స్థానంలో ఉన్నాడు. ఇక ఆలౌ రౌండర్ల జాబితాలో రవింద్ర జడేజా 400 పాయింట్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.  ఈ సీరిస్ లో జడేజా బ్యాటింగ్ కంటే బౌలింగ్ లోనే ఎక్కువగా రాణించాడు. ఇక స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్  341 పాయింట్లతో ఆల్ రౌండర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఇలా మొత్తంగా అన్ని విభాగాల్లో కలిసి ఆరుగురు భారత ఆటగాళ్లు టాప్ టెన్ లో నిలిచారు. 

21:41 - November 11, 2018

చెన్నై: భారత్‌తో చివరి టీ20లో వెస్టిండీస్‌ అదరగొట్టింది. చెపాక్‌ స్టేడియంలో విండీస్ బ్యాట్స్‌మెన్ వూరన్, బ్రావోలు చెలరేగారు. దీంతో భారత్‌ ముందు ఛాలెంజింగ్ టార్గెట్ నిర్దేశించగలిగారు. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి విండీస్ 181 పరుగులు చేసింది. విండీస్ జట్టులో నలుగురు బ్యాట్స్‌మెన్‌ రాణించారు. గత మ్యాచ్‌లకు భిన్నంగా షై హోప్‌ (24; 22 బంతుల్లో 3×4, 1×6), షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ (26; 21 బంతుల్లో 4×4, 1×6) ఓపెనర్లుగా దిగారు. విండీస్‌కు శుభారంభం అందించారు. హెట్‌మైయిర్‌, షై హోప్‌ తొలి వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం అందించారు. నిలకడగా ఆడుతూ అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలిస్తూ వీరిద్దరూ ప్రమాదకరంగా మారారు. అయితే పది పరుగుల వ్యవధిలో వీరిని భారత స్పిన్నర్ చాహల్‌ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన డారెన్‌ బ్రావో (43; 37 బంతుల్లో 2×4, 2×6), నికోలస్‌‌ పూరన్‌ (53; 25 బంతుల్లో 4×4, 4×6) రెచ్చిపోయారు. 43 బంతుల్లోనే 87 పరుగుల కీలకమైన పార్టనర్‌షిప్ నెలకొల్పారు. ఖలీల్‌ వేసిన చివరి ఓవర్‌లో ఏకంగా 23 పరుగులు సాధించారు. కాగా ఇప్పటికే ఈ సిరీస్‌ను భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

19:57 - November 5, 2018

ఢిల్లీ: భారత రక్షణ రంగ అమ్ముల పొదిలోకి  ఐఎన్ఎస్ అరిహాంత్ జలాంతర్గామి వచ్చి చేరింది. ప్రపంచంలో అణు జలాంతర్గాములను తయారు చేసి నడపగలిగిన రష్యా, చైనా, ఫ్రాన్స్, ఇంగ్లాడ్ దేశాల సరసన నేడు భారత్ చేరింది. మొదటిసారిగా గస్తీ పూర్తి చేసుకుని  విజయవంతంగా తిరిగి వచ్చిన సందర్భంగా ఐఎన్ఎస్ అరిహంత్ సిబ్బందితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం సమావేశమై వారిని అభినందించారు.  ఐఎన్ఎస్ అరిహాంత్ విజయం దేశ భద్రత పటిష్టతలో మరో పెద్ద ముందడుగని  ప్రధాన మంత్రి అన్నారు. 
6,000 టన్నుల బరువున్న ఐఎన్ఎస్ అరిహంత్ ను ప్రధాని మోడీ నేతృత్వంలోని న్యూక్లియర్ కమాండ్ అథారిటీ పర్యవేక్షణలో అభివృద్ధి చేశారు. ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ సాధించిన ఘనత దేశ చరిత్రలో ఎన్నటికీ గుర్తుండిపోతుందని ,. దేశభద్రత  విషయంలో  భారత్ మరో ముందడుగు వేసిందని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. ఇక నుంచి న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కు పాల్పడేవారికి  సరైన సమాధానం ఇవ్వగలిగిన స్ధాయికి మనం చేరాం అని మోడీ అన్నారు.  'ఐఎన్ఎస్ అరిహాంత్  సబ్‌మెరైన్ డిజైన్, నిర్మాణం, పరీక్షను సమర్ధవంతంగా నిర్వహించి ఇండియాను సొంత అణు జలాంతర్గాములున్న దేశాల స్థాయికి నిలిపిన యావన్మంది సిబ్బందికి ప్రధాని   ధన్యవాదాలు చెప్పారు.ఈ అణు జలాంతర్గామి అందుబాటులోకి రావడంతో ఉపరితల క్షిపణులు చేరుకోలేని లక్ష్యాలను సైతం ఇది చేధించగలదు.

 

 

11:54 - November 5, 2018

ఢిల్లీ : తొలి టీ-20లో వెస్టిండీస్‌పై భారత్‌ విజయం సాధించింది. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. భారత్‌కు ఆదిలో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ దినేశ్‌ కార్తీక్‌ నిలదొక్కుకోవడంతో.. 17.5 ఓవర్లలో విజయం సాధించి.. మూడు టీ-20ల సీరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 

ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా వెస్టిండీస్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత తడబడిన భారత్‌ విండీస్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. 

110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు రోహిత్‌శర్మ, ధావన్‌లు వెంటవెంటనే ఔట్‌ కావడంతో భారత్‌ కొద్దిగా కష్టాల్లో పడింది. ఓ దశలో విజయానికి భారత్‌ ఎదురీదింది. దినేశ్‌ కార్తీక్‌ నిలకడగా ఆడడం.. చివర్లో పాండ్యా విండీస్‌ బౌలర్లపై విరుచుకుపడడంతో భారత్‌ 17.5 ఓవర్లలో విజయం సాధించింది. 

విండీస్‌ బౌలర్లలో థామస్‌, బ్రాత్‌వైట్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. పియరీకి ఒక వికెట్‌ దక్కింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 3 వికెట్లు తీయగా, ఉమేశ్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌, బుమ్రా, కృనాల్‌ పాండ్యాలకు ఒక్కో వికెట్‌ దక్కింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ 1-0తో ముందంజలో ఉంది.

11:38 - October 28, 2018

మహారాష్ట్ర : పుణె వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ బోల్తా పడింది. 283 పరుగులు చేధించలేకపోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా మూడో సెంచరీ సాధించినా...భారత్‌కు ఓటమి తప్పలేదు. 240 పరుగులకే ఆలౌటయి...40 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన విండీస్ జట్టు...సిరీస్‌ను సమం చేసింది. 
Image result for west indies beat india by 40 runs virat kohliభారత్‌తో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అద్భుతంగా రాణించి విజయం సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసినా...ఫలితం లేకుండాపోయింది. ఈ మ్యాచ్‌లో గెలుపు ద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది విండీస్ జట్టు. తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది.
Image result for west indies india shai hopeవెస్టిండీస్ బ్యాట్స్‌మెన్లలో షై హోప్ మరోసారి అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. విశాఖలో సెంచరీతో మ్యాచ్‌ను టై చేసిన హోప్...పూణెలోనూ సెంచరీ చేసేలా కనిపించాడు. 113బంతుల్లో 6 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 95 పరుగులు చేసిన షై హోప్...5 పరుగుల తేడాతో సెంచరీ మిస్సయ్యాడు.చివర్లో టెయిలెండర్ నర్స్....సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. 250 పరుగులు చేయడమే కష్టమనుకున్న సమయంలో...22బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేసి విండీస్‌ను పటిష్ట స్థితిలో నిలబెట్టాడు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ యాదవ్ 2, ఖలీల్ అహ్మద్, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.
Image result for west indies india 4th one day mumbai brabourne stadium284 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్...మరో 14 బంతులు మిగిలి ఉండగానే 240 పరుగులకు ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి...వరుసగా మూడో వన్డేలోనూ సెంచరీ సాధించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.  119 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ... 10 ఫోర్లు, సిక్సర్‌తో 107 పరుగులు చేశాడు. అంతేకాకుండా కెరీర్‌లో 38 సెంచరీ కంప్లీట్ చేశాడు. ధవన్ 35, అంబటి రాయుడు 22, రిషబ్ పంత్ 24 పరుగులు చేసి...స్వల్ప స్కోర్ల ఔటయ్యారు. దీంతో భారత్ 43 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. ఈ వన్డేలో గెలుపుతో 1-1 సిరీస్‌ను సమం చేసింది విండీస్ జట్టు. ఈ నెల 29న ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియంలో నాలుగో వన్డే జరగనుంది. 

10:56 - October 27, 2018

ఢిల్లీ : జార్ఖండ్ డైనమేట్, టీమిండియా మాజీ కెప్టెన్‌కు సెలక్టర్లు షాకిచ్చారు. వెస్టిండీస్‌తో జరగబోయే మూడు టీ20లతో పాటు ఆస్ట్రేలియాతో పర్యటనకు...ధోనిని దూరంగా పెట్టారు. రెండు సిరీస్‌లు జట్లు ప్రకటించిన జాతీయ సెలెక్టర్లు....రెండింట్లోనూ ధోనికి అవకాశం ఇవ్వలేదు. కెప్టెన్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రిల మద్దతు ఉన్నప్పటికీ తన ను పక్కనబెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక పొట్టి ఫార్మాట్‌లో ధోనీ కెరీర్‌ ముగిసినట్టే అని కథనాలు వినిపిస్తుండగా చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ మాత్రం వీటిని ఖండించారు. ధోని ప్రస్తుతం ఆరు టీ20ల్లో ఆడడం లేదని....సమర్థుడైన రెండో వికెట్‌కీపర్‌ కోసం ఎదురు చూస్తున్నామని ప్రకటించారు. అయితే మాజీ కెప్టెన్‌కు ద్వారాలు మూసుకుపోలేదని స్పష్టం చేశారు. అందుకే రిషభ్‌ పంత్‌తో పాటు దినేశ్‌ కార్తీక్‌లను ఈ ఆరు మ్యాచ్‌ల కోసం ఎంపిక చేశారు.

 

08:53 - October 25, 2018

వైజాగ్: బంతి బంతికి టెన్షన్ టెన్షన్...అభిమానుల్లో నరాలు తెగే ఉత్కంఠ....ప్రత్యక్షంగా చూస్తున్న వారితో పాటు టీవీల్లో చూస్తున్న వారికి...గుండె లబ్ డబ్ మనేలా చేసింది వైజాగ్ వన్డే మ్యాచ్. సాగర తీరంలో జరిగిన రెండో వన్డే ఫ్యాన్స్‌కు ‌మంచి కిక్కిచ్చింది. భారత్-విండీస్ జట్లు నువ్వా ? నేనా ? అన్నట్లు చివరి బంతి వరకు పోరాటం చేశాయి. విండీస్ బ్యాట్స్‌మెన్ షైహోప్ ఇన్నింగ్స్ చివరి బంతిని ఫోర్‌గా మలిచి...మ్యాచ్‌ను టై చేశాడు. 

వైజాగ్ వేదికగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్-విండీస్ జట్లు అద్భుతంగా పోరాడాయి. క్రికెట్ ఫ్యాన్స్‌కు అసలు సిసలైన మజా ఎలా ఉంటుందో చూపించాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు....విండీస్ జట్టుకు 322 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి వన్డేలో సెంచరీతో వీరవిహారం చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ....ఈ మ్యాచ్‌లోనూ రెచ్చిపోయాడు. క్రీజులోకి దిగినప్పటి నుంచి ఇన్నింగ్స్ చివరి వరకు విండీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి...అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఒపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు త్వరగా ఔటయినప్పటికీ....మరో బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడుతో కలిసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

73 పరుగులు చేసిన అంబటి రాయుడు ఔటైనా తర్వాత కోహ్లీ తన జోరును ఏ మాత్రం తగ్గించలేదు. పట్టపగలే విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బౌలర్ ఎవరైనా సరే...బౌండరీల  మీద బౌండరీలు కొట్టాడు. విరాట్ విధ్వంసం ధాటికి విండీస్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 129 బంతుల్లో 13 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 157 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. నిర్ణీత ఓవర్లలో భారత్ ఆరు వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది.

భారీ విజయం లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ జట్టుకు...ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ధాటిగా ఆడుతున్న కీరన్ పావెల్‌ను షమీ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత విండీస్ బ్యాట్స్‌మెన్....చంద్రపాల్ హేమరాజ్, మార్లోన్ శ్యామూల్స్‌ను...స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బోల్తా కొట్టించాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హెట్‌మెయిర్....వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ షైహోప్‌కు జత కలిశాడు. ఇద్దరు కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఫోర్లు, సిక్సర్లతో భారత్ బౌలర్లను వణికిపోయేలా చేశారు. వీరిద్దర బ్యాటింగ్ దెబ్బకు విండీస్ సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. అయితే 32వ ఓవర్‌లో చాహల్....94 పరుగులు చేసిన హెట్‌మెయిర్‌ను పెవిలియన్‌కు పంపాడు. 

హెట్‌మెయిర్ ఔటయినప్పటికీ షైహోప్ తన జోరును ఏ మాత్రం తగ్గించలేదు. సమయం వచ్చినప్పుడల్లా బౌండరీలు కొడుతూ...విండీస్ జట్టును లక్ష్యంగా పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసిన షైహోప్....తన జట్టును గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో 14 పరుగులు అవసరమైతే....ఈ సమయంలో ఉమేశ్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి 5 బంతులకు 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరి బంతి వచ్చేసరికి అభిమానులతో పాటు ఇరు జట్ల ఆటగాళ్లలో ఒకటే ఉత్కంఠ. 5 పరుగులు చేస్తే విండీస్ విన్ అవుతుంది....ఫోర్ కొడితే మ్యాచ్ డ్రా అవుతుంది. అయితే ఫోర్ కొట్టి...మ్యాచ్‌ను టై చేశాడు షైహోప్. 

49వ ఓవర్‌లో షమీ 6 పరుగులివ్వడంతో గెలుపు సమీకరణం 6 బంతుల్లో 14 పరుగులుగా మారింది. భారత జట్టు విజయం దాదాపు ఖాయమే అనుకుంటున్న తరుణంలో విండీస్ బ్యాట్స్‌మెన్ స్ఫూర్తిదాయకంగా పోరాడారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసే అవకాశం ఉమేశ్ యాదవ్‌కు దక్కింది. తొలి మూడు బంతులకు ఉమేశ్ 7 పరుగులిచ్చాడు. నాలుగో బంతికి నర్స్ ఔట్. ఐదో బంతికి రెండు పరుగులు.. ఇక చివరి బంతికి 5 పరుగులు అవసరం కావడంతో మళ్లీ విజయం విరాట్‌సేన వైపే మొగ్గింది. కానీ ఉమేశ్ అవుట్‌సైడ్ ఆఫ్‌గా వేసిన చివరి బంతిని హోప్ లాగిపెట్టి కొట్టడంతో పాయింట్ దిశలో బౌండరీ వైపు రాకెట్ వేగంతో దూసుకుపోయింది. రాయుడు అడ్డుకునేందుకు జారినా బంతి రోప్‌ను ముద్దాడటం.. మ్యాచ్‌ టై కావడం క్షణాల్లో జరిగిపోయింది. అంతే ఒక్కసారిగా స్టేడియం మూగబోగా, విండీస్ వీరులు సంబరాలు చేసుకున్నారు.

స్కోర్లు.. 
భారత్‌ 321/6
విండీస్‌ 321/7
కోహ్లీ(157 నాటౌట్‌) వన్డేల్లో 37వ సెంచరీ
షైహోప్‌(123 నాటౌట్)
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ - కోహ్లీ

10:46 - October 24, 2018

విశాఖపట్నం : బుధవారం భారత్-వెస్టిండీస్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డే భారీ స్కోరును చేజ్ చేసిన టీమిండియా....రెండో వన్డేలోనూ విజయం సాధించాలని తహతహలాడుతోంది. మరోవైపు విశాఖలో ఇప్పటి వరకు 8 వన్డే మ్యాచ్‌లు జరిగితే...ఇందులో ఒకే ఒక్క దాంట్లో మాత్రమే ఓడిపోయింది. టీమిండియాకు లక్కీ గ్రౌండ్‌గా పేరున్న విశాఖలో మ్యాచ్ జరగనుండటంతో....అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ ద్వారా భారత్ జట్టు అత్యధిక వన్డేలు ఆడిన జట్టుగా రికార్డు సృష్టించనుంది.
ఇండోర్‌లో జరగాల్సిన భారత్‌-వెస్టిండీస్‌ మధ్య రెండో వన్డే... ఊహించని విధంగా విశాఖపట్నానికి తరలి వచ్చింది. దీంతో విశాఖ సాగర తీరంలో క్రికెట్ సందడి మొదలైంది. బుధవారం మధ్యాహ్నం భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. భారత క్రికెట్‌ జట్టుకు బాగా కలిసొచ్చిన విశాఖ మైదానంలోనూ విజయం సాధించి...సిరీస్‌లో ముందంజ వేయాలని భావిస్తోంది. తొలి వన్డేలో విండీస్ జట్టు 322 పరుగులు చేసినప్పటికీ...టీమిండియా బ్యాట్స్‌మెన్లు సునాయాసంగా టార్గెట్‌ను చేజ్ చేశారు. తొలి వన్డేలో సెంచరీలతో అద్భుతంగా ఆడిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు...ఈ మ్యాచ్‌లోనూ విజృంభించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో ఇప్పటి వరకు టీమిండియా 8 వన్డేలాడితే...ఇందులో ఒకే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓటమి పాలయింది. అదే విధంగా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ లాంటి స్టార్‌ ఆటగాళ్లకు ఈ మైదానంలో మంచి రికార్డులున్నాయి. 2005లో ఇక్కడే పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ధోని.. 148 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ స్థాయిలో తన పేరు మారుమ్రోగేలా చేశాడు. ఇప్పుడు ఇక్కడే వన్డే జరగనుండటంతో అందరి కళ్లు ధోనిపైనే ఉన్నాయి.
ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా మరో రికార్డును సృష్టించనుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియాకిది 950వ వన్డే మ్యాచ్‌. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లాడిన జట్టుగా భారత్‌ అరుదైన రికార్డును తన పేరుతో లిఖించుకోనుంది. ఇప్పటివరకూ వన్డే ఫార్మాట్‌లో 949మ్యాచ్‌లాడిన భారత్‌.. 490మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే...మరో 411మ్యాచ్‌ల్లో ఓటమి పాలయింది. విశాఖ పిచ్‌ ఎప్పట్లాగే బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండొచ్చని. నగరంలో నిన్నటి నుంచి మంచు పడటంతో టాస్‌ కూడా కీలకం కానుంది. వర్షం కురిసినా మ్యాచ్‌కు ఇబ్బందులు తలెత్తకుండా రెండు సూపర్‌ సాఫర్‌ యంత్రాలను మైదాన సిబ్బంది సిద్ధం చేశారు.
వన్డే మ్యాచ్‌కు 2వేల మంది పోలీసులతో అధికారులు  పటిష్ట భద్రత ఎర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మ్యాచ్ ముగింపు వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అభిమానులు తాకిడి ఎక్కువగా ఉండటంతో... స్టేడియం చుట్టు భారీకేడ్లు ఏర్పాటు చేశారు. టిక్కెట్ పాస్‌పై ఉన్న గేట్లలో మాత్రమే అభిమానులు వెళ్లాలని పోలీసులు సూచించారు. పార్కింగ్ సమస్య తలెత్తకుండా మూడు ప్లేసుల్లో పార్కింగ్ ఎర్పాటు చేశారు.

11:24 - October 21, 2018

ఢిల్లీ : వెస్టిండీస్‌తో టెస్ట్‌ సిరీస్‌ను అలవోకగా కైవసం  చేసుకున్న భారత్‌.. నేటినుంచి వన్డే పోరుకు సిద్దమైంది.  ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈరోజు తొలి వన్డే గౌహతిలో  మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది.  మిడిలార్డర్‌పై భారత్‌ ప్రధానంగా దృష్టి  పెట్టింది. ఇప్పటికే  టెస్టుల్లో తనదైన ముద్ర వేసిన యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌  పంత్‌ వన్డే ఆరంగేట్రానికి సిద్దమయ్యాడు. తుది జట్టులో చోటు  సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు భారత్‌-వెస్టిండీస్‌లు  121 సార్లు తలపడగా.. 56 మ్యాచ్‌ల్లో భారత్‌, 61 మ్యాచ్‌లు  విండీస్‌ సొంతమయ్యాయి. ఒక వన్డే టై కాగా.. మూడు  మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. 

 

 

11:01 - October 21, 2018

హైదరాబాద్: ఉదయం, రాత్రి తేడా ఉండదు. పనిగంటలు అస్సలు తెలియదు. వారికి తెలిసిందల్లా ఒక్కటే. డ్యూటీ చేయడం. తాము కుటుంబానికి దూరమైనా.. ప్రజలంతా హాయిగా ఉండేలా కాపలా కాయడం. అల్లరిమూకల రాళ్ల  దెబ్బలు, విద్రోహుల తుపాకీ తూటాలకు తమ ప్రాణాలను సైతం ఎదురొడ్డుతారు. వీరోచితంగా పోరాడి ప్రజల ప్రాణాలు కాపాడతారు. వారే పోలీసులు. విధి నిర్వహణలో రక్తాన్ని చిందించి.. ప్రాణాలు అర్పించిన పోలీసుల  త్యాగం మరువలేనిది. శాంతిభద్రతలే ధ్యేయంగా విధులు నిర్వహిస్తారు. నిరంతరం సేవలందిస్తూ.. ప్రజారక్షణలో నిమగ్నమవుతారు పోలీసులు. ఇవాళ(అక్టోబర్ 21) పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా 10టీవీ ప్రత్యేక కథనం..

భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్‌చిన్ ప్రాంతం.. 16వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న హాట్ స్ప్రింగ్స్ అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఇక్కడి నుంచే ఆరంభమైంది.

మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడక్, సియాచిన్ ప్రాంతాలు కీలకం. సరిహద్దు భద్రతాదళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతాదళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే మహత్తర బాధ్యతను CRPF బలగాలు నిర్వర్తించేవి. 1959 అక్టోబరు 21న పంజాబ్‌కు చెందిన 21మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా, చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించాయి. సీఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో పదిమంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గగా మారి పోలీసుల పవిత్రస్థలంగా రూపు దిద్దుకుంది. ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. 

పోలీసులకు తెలిసిందల్లా ఒక్కటే.. శాంతిభద్రతలను కాపాడటం. బంధుత్వాలు అనే వాటికి వారివద్ద తావుండదు. తప్పు చేసిన వాడు తన వాడైనా శిక్ష ఒక్కటే అనేది వారి పాలసీ. పగలు రాత్రి తేడా లేకుండా అలుపెరగని విధులు నిర్వహిస్తారు. బందులైనా, బందోబస్తులైనా వారు లేనిదే ఏమీ జరగదు. న్యాయాన్ని ధర్మాన్ని కాపాడేందుకు అవసరమైతే తమ ప్రాణాలను పణంగా పెడతారు. అందుకే తల్లిదండ్రుల్లా దండించే స్థానంలో వారికి మనం స్థానం కల్పించాం. భార్యబిడ్డలకు, తల్లిదండ్రులకు సైతం దూరంగా ఉండి నిరంతరం సొసైటీని రక్షించడంలో పోలీసులది కీలక పాత్ర. నేరస్తుల గుండెల్లో నిద్రపోతూ, సంఘ విద్రోహశక్తులను అణిచివేడయంలో ప్రాణాలర్పించిన పోలీసు సిబ్బంది అనేక మంది ఉన్నారు. వారి త్యాగం మరువలేనిది. అలా డ్యూటీలో ప్రాణాలర్పించిన అమరవీరుల స్మారకార్థం మన పోలీసులు ప్రతి ఏడాది అక్టోబర్ 21న సంస్మరణ దినోత్సవాలను నిర్వహిస్తారు. 

పోలీసులు దేశం కోసం, ప్రజల కోసం వారి ప్రాణాలు అర్పించినప్పటికీ ఆ త్యాగాలు గుర్తింపునకు నోచుకోవడం లేదు. ఈ త్యాగాలను గుర్తించి, ఆ త్యాగమూర్తులను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. దేశ సరిహద్దుల్లో సైనికులు, అంతర్గత శత్రువులతో పోరులో పోలీసు అసువులు బాస్తున్నారు. ఎంతో కష్టతరమైన.. పోలీసు బాధ్యతలను నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్నవారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే.. పోలీసు అమర వీరుల సంస్మరణ దినం జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం.

Pages

Don't Miss

Subscribe to RSS - భారత్