బోధన్

16:42 - July 25, 2018

నిజామాబాద్ : బోధన్ మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్యపై 30మంది కౌన్సిలర్లు ఈనెల 4వ తేదీని పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య అభివృద్ధి పనులు చేయకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారనీ..అవినీతికి పాల్పడుతు నిధులను దుర్వినియోగం చేస్తున్నాడనే ఆరోపణతో 30మంది కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారు. దీనిపై స్పందించిన కలెక్టర్ అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అవిశ్వాసం ఎదుర్కొనేక క్రమంలో కోరం లేకపోవటవంతో అవిశ్వాసం వీగిపోయిందని రిటర్నింగ్ అధికారి తెలిపారు. 16మంది కౌన్సిలర్లు ఓటింగ్ కు దూరంగా క్యాంప్ లోనే వుండిపోయారు. దీంతో బలం లేకపోవటంతో ఎల్లయ్యపై అవిశ్వాసం వీగిపోయిన తిరిగి అధికార పార్టీ అభ్యర్థికే చైర్మన్ పదవి దక్కింది. 

08:31 - July 25, 2018

నిజామాబాద్ : తెలంగాణలో అవిశ్వాస తీర్మానాలతో పురపాలక సంఘ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అవిశ్వాస తీర్మానాలకు జులై 3 తో నాలుగు సంవత్సరాల గడువు పూర్తి కావడంతో తెలంగాణలో పలు చోట్ల మున్సిపల్ ఛైర్మన్ లపై అవిశ్వాస తీర్మానాలు పెట్టేందుకు కౌన్సిలర్లు సిద్ధమవుతున్నారు.

బోధన్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా ఎల్లయ్య పనిచేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఆయన నాలుగేళ్ల పదవీకాలం జూలై 3తో పూర్తి చేసుకున్నారు. అభివృద్ధి పనులు పట్టించుకోవడం లేదంటూ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు 29 మంది కలెక్టరేట్‌కు వచ్చి అవిశ్వాస తీర్మానం కాపీని కలెక్టర్‌ ఎం.ఆర్‌.ఎం.రావుకు అందించిన సంగతి తెలిసిందే.

అవిశ్వాస తీర్మానంపై మున్సిపల్‌ చట్టం ప్రకారం కలెక్టర్‌ నిర్ణయం తీసుకున్నారు. రిటర్నింగ్ అధికారి హోదాలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. బుధవారం అవిశ్వాస బలపరీక్ష అమలు చేయనున్నారు. కాంగ్రెస్ మినహా మిగతా సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు బెంగళూరులో క్యాంప్ లో ఉన్నారు. ప్రతి సభ్యుడు..ఉద్యోగికి గుర్తింపు కార్డులను జారీ చేశారు. 

20:21 - July 24, 2018

ప్రత్యేక హోదాకోసం పోరాటం జేస్తె తెల్గుదేశమే జేయాలేగని.. ఇంకోడు జేయొద్దు అనేది చంద్రబాబు యవ్వారం.. లేదు మేమే జేయాలే.. చంద్రబాబును ప్రత్యేక హోదా సీన్మల విలన్ను జేయాలే అని జగనాలు ఆరాటం.. అటు ఢిల్లీల పాలన జేయవల్చిన అంతర్జాతీయ అత్యుత్తమ పర్యాటకుడు ఈళ్ల డ్రామాలు జూడకుంట విదేశీ యానాలు జేసుడు... దేశానికి రాష్ట్రాలకు సరిగ్గ సరిపోయిండ్రు ఈ నాయకులు..

నెట్టెంపాడు నీళ్లను ఎవ్వలు తెచ్చిండ్రు..? మీ డీకే అరుణమ్మ నేను తెచ్చినా అంటున్నది.. కని అది కేసీఆర్ తెచ్చిండు అని నేను జెప్తున్న అంటున్నడు మంత్రి జూపల్లి కిష్టయ్య.. అవునయ్యా ఓ సారు.. మీ అయ్యాజాగీర్లు ఏమన్న అమ్మి నెట్టెంపాడు నీళ్లను జనాలతానికి దీస్కొచ్చిండ్రా లేకపోతె.. ఆ డీకే భరత సింహారెడ్డి సారదందల సంపాయించిన పైకం తెచ్చి మాకోసం ఖర్చువెట్టిండ్రా.?. మీరు తెచ్చినారు..?

 

ఉన్నదున్నట్లు మాట్లాడుట్ల.. తెలంగాణల ఎం సత్యనారాయణ ఒక్కడైతె.. ఆంధ్రల జేసీ దివాకర్ రెడ్డి ఇంకొక్కలు.. వీళ్లకు పట్టింపులు గిట్టింపులు ఏముండయ్.. ఏది మాట్లాడాలే అనుకుంటే దాసుకోరు కటక్కున అనిపారేస్తరు.. మొత్తానికి మీడియాకు దొర్కుతరు.. తర్వాత మీడియాను జూశి భయపడ్తరు ఇద్దరు ఇద్దరే.. జేసీ దివాకర్ రెడ్డి మీడియా జూశి వద్దురా నాయనా మీకో దండం అని పెడ్తున్నడు..

కేసీఆర్ ముచ్చట జెప్తె ఎట్లుంటది.. కడ్పుల అన్నంలేకున్నా కక్కొచ్చెతట్టు తిన్నట్టుంటది.. అట్ల ఫీలైనోళ్లే విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు.. ఏ ఎన్నిరోజులువా ఇంక వీళ్లను పర్మినెంట్ జేశిపడేయుండ్రి అని మంది ముంగటనే చెప్పుడు బాధితులు సప్పట్లు గొట్టుడు.. పాలాభిషేకాలు జేసుడు.. తర్వాత ఏందంటే.. పర్మినెంట్ లేదు లొట్టపీసు లేదు.. యాడేశ్న గొంగడి ఆడనే..

 

ఏం తయ్యారైండ్రు సూడుండ్రి రాజకీయ నాయకులు.. రాజకీయం అంటే తినుడు తాగుడు జల్సాలు జేసుడు.. పైసలు సంపాయించుడు అవినీతులు జేసుడు ఇదా..? అయినా వాళ్లదేం తప్పు.. ఓట్లు ఏశెటోళ్లది తప్పుగదా..? మీరు సక్కనైనోళ్లకు ఓట్లేస్తె వ్యవస్థ ఇంత ఎందుకు ఆగమైతదిగని.. ఈముచ్చట ఎందుకంటె.. గా బోధన్ పట్టనంల టీఆర్ఎస్ కౌన్సిలర్ల ఏశాలు జూడుండ్రి..

ఒక్కనాడు మంచినీళ్లు రాకపోతె ఈ మంత్రులు.. ఎమ్మెల్యేల భార్యలు ఊకుంటుండొచ్చునా..? తానాలు జపాలు జేయకుంట అట్లనే ఉంటరా..? ఉండరు మరి జనం ఎందుకు ఉండాలే..? సిద్దిపేటకాడ నీళ్లలొల్లె.. పాలమూరుల నీళ్ల లొల్లే.. సూర్యాపేటకాడ నీళ్లలొల్లె.. వస్తయ్ మిషన్ భగీరథ నీళ్లు ఏమన్న అంటే.. ఆ వచ్చేదాక జనం బత్కుండాలేగదా..?

తెలంగాణల సర్కారు విద్య సత్రోలు అయితున్నది అనెతందుకు మళ్లొక ముచ్చటొచ్చింది మనకు.. పేదోనికి సద్వు అందొద్దు వాని పిల్లలు మళ్ల గదే ఊర్లపొంటి బానిసలుగ.. ఉపాధి హామీ కూలీలుగ.. ఉప్పరిపనోళ్లుగ.. మోరీలు ఎత్తిపోశెటోళ్లుగ బత్కెతందుకు సర్కారు ఎంత కష్టపడి పనిజేస్తున్నదో ఈ పాల్ టెక్నిక్ కాలేజీ కథ జూస్తె మీకే అర్థమైతది..

జోగిని.. అంటే తెల్సా..? అగ్రవర్ణ దొరలు పెత్తందారులకు అవసరాలకోసం బుట్టిన ఒక పేరు అది.. తరతరాలుగా దొరల శారీరక అవసరాలకు బలై.. సమాజంల చిన్నచూపుకు గురైతున్న సమాజమే ఈ జోగిని దేవదాసీ మాతాంగిలు.. కొందరు అంటరు తీన్మార్ మల్లన్నా దేవుడే లేడంటవ్ గదా..? గీ బోనాల పండుగేంది..? అని.. అసొంటి అజ్ఞాన మేధావులకు ఇగో ఇండ్ల సమాధానం ఉన్నది సూడుండ్రి..

 

07:15 - March 2, 2018

నిజామాబాద్ : హోలీ పండగ అంటే రంగులు చల్లుకుంటూ సందడి చేయడమే మనందరికీ తెలుసు... కానీ ఉత్కంఠ... ఉద్రిక్తత వాతావరణంలో జరుపుకునే హోలీ గురించి మీకు తెలుసా... ఆ ప్రత్యేకతేంటో తెలుసుకోవాలంటే నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామం వెళ్లాల్సిందే. హున్సా గ్రామంలో జరిగే హోలీ పండుగా పూర్తిగా డిఫరెంట్‌. ఇక్కడ హోలీ వేడుకల్లో ఉత్సాహానికి బదులు ఉద్రిక్తత ఉంటుంది. రంగులకు బదులు రక్తం కారుతుంది. ఒకరిపై ఒకరు రంగులు చట్టుకోవడానికి బదులు పిడిగుద్దులు కురిపించుకుంటారు. ప్రతీ సంవత్సరం ఇక్కడి ప్రజలు హోలీని ఇలానే జరుపుకుంటారు.

హోళీ పండుగ సాయంత్రం గ్రామ శివారులోని పంట పొలాల్లొ కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. అనంతరం గ్రామస్తులంతా హనుమాన్ మందిరం వద్దకు చేరుకుంటారు. వందల సంఖ్యలో జనం ఒక చోట గుమిగూడతారు.. రోడ్డుకు అడ్డంగా తాడు కట్టి ప్రజలు రెండు వైపులా రెండువర్గాలుగా చేరుతారు. సుమారుగా అరగంట పాటు ఈ వికృత క్రీడ కొనసాగుతుంది .పైగా ఈ ఆట ఆడకుంటే తమ గ్రామానికి అరిష్టమన్నది గ్రామస్థుల మూఢ నమ్మకం. హున్సాలో ఈ రక్తకేళీ 50ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది.

ఆధునికంగా అభివృద్ధి చెందిన డిజిటల్‌ యుగంలోనూ ఈ ఆటవిక క్రీడా ఆనవాయితీగా జరుపుకుంటూనే ఉన్నారు. ముఖంమీద, వీపు మీద పిడిగుద్దులు కురిపించుకునే సమయంలో ఆ ప్రాంతంమంతా రంణరంగాన్ని తలపిస్తుంది... పోలీసులు ఆంక్షలు విధించినా ఈ క్రీడ కొనసాగుతూనే ఉంది. ప్రజల్లో మూఢనమ్మకాన్ని తొలగించి...ప్రాణాంతంకమైన ఈ పిడిగుద్దులాటను అరికట్టేందుకు... అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

19:12 - December 24, 2017
20:21 - December 1, 2017

అరే ఈ తెలంగాణలున్న ప్రతిపక్షాలోళ్లకు ఏం పనిలేనట్టుందివా..? టీఆర్ఎస్ నాయకుడు బస్టాండ్ జాగను కబ్జావెట్టిండు అంటె.. పెట్టడా మరి..? ప్రభుత్వం చర్యలు దీస్కోవాలె ఆయన మీద అని బోధన్ కాడ అఖిలపక్షం నాయకులు డిమాండ్ జేస్తున్నరట.. అరే నాయన.. కబ్జావెట్టినోడే సర్కారు మన్షాయే ఇగ మీకు ఏం జెప్పాలే చెప్పుండ్రి..గీ ముచ్చట జూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

18:13 - November 14, 2017

నిజామాబాద్ : జిల్లాలో దళితులపై దాడి చేసిన బీజేపీ నేత భరత్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు కొనసాగుతున్నాయి. ఘటన జరిగిన 4రోజులవుతున్నా... ఇంతవరకు నిందితుడ్ని అరెస్ట్ చేయడంపై ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ..బోధన్‌లో భరత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ఇంతవరకు స్పందించకపోవడంపై వామపక్షాలు, ప్రజాసంఘాల నేతలు మండిపడ్డారు.

17:31 - October 23, 2017

నిజామాబాద్ : వివాహిత మహిళలతో ఫోన్ లో అసభ్యంగా మాట్లాడుతున్న సీఐపై ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు. టెన్ టివి వరుస కథనాలతో ఉన్నతాధికారులు స్పందించారు. సంబంధిత సీఐను సస్పెండ్ చేశారు. ఈసందర్భంగా టెన్ టివికి భాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

బోధన్ పట్టణ సీఐ సురేందర్ రెడ్డి వ్యవహార శైలి ఎలాంటిదో టెన్ టివి బాహ్య ప్రపంచానికి తెలియచేసింది. పోలీసు స్టేషన్‌కు వచ్చే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం...బాధితులు ఫిర్యాదు చేస్తే ఫోన్లలో వేధించడం చేస్తుండేవాడు...ఈ క్రమంలో ఓ బాధితురాలు సీఐ సురేందర్‌రెడ్డి వేధింపులను ఫోన్‌లో వాయిస్‌ రికార్డ్‌ చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది...దీంతో ఇంతకాలంగా అరాచకాలకు పాల్పడుతున్న ఆ సీఐ అసలు బాగోతం బట్టబయలైంది...కులాంతర వివాహం చేసుకున్న భార్యాభర్తలు కుటుంబ కలహాలతో పోలీసు స్టేషన్ చేరారు...దీన్ని ఆసరాగా చేసుకున్న సీఐ ఆ తర్వాత బాధితురాలితో ఫోన్‌లో ఏకాంత సంభాషణలు మొదలుపెట్టాడు. ఆమె భర్తపై నమోదు చేసిన కేసులో సహకారం అందించాలంటే తనతో గడపాలని కోరాడు...బాధితురాలి ఫిర్యాదుతో ఉన్నతాధికారులు విచారణ చేయగా నిజమేనని తేలడంతో వేటు వేస్తూ డీఐజీ కార్యాలయానికి వీఆర్‌కు పంపారు. అనంతరం ఆరోపణలు రుజువు కావడంతో సీఐ సురేందర్ రెడ్డిని అధికారులు సస్పెండ్ చేశారు. 

20:06 - October 20, 2017

నెల్లూరు : తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల నేరాలు పెరిగిపోతున్నాయి..డిపార్ట్‌మెంట్లో ఉంటూ...అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేస్తున్నవారు పెరిగిపోయారు..బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్నవారే కీచకులుగా మారుతున్నారు...బాధితురాళ్లు స్టేషన్‌ వచ్చి ఫిర్యాదు చేస్తే చాలు కోర్కెలు తీర్చాలంటూ వేధిస్తున్నారు..వెంటపడుతున్నారు...కామపిశాచాలుగా మారిన రెండు రాష్ట్రాల్లోని ఓ సీఐ,ఓ ఎస్సైలపై వేటుపడింది...

కామపిశాచిలా మారిన నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ టౌన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌రెడ్డిపై వేటు పడింది...పోలీసు స్టేషన్‌కు వచ్చే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం...బాధితులు ఫిర్యాదు చేస్తే ఫోన్లలో వేధించడం చేస్తుండేవాడు...ఈ క్రమంలో ఓ బాధితురాలు సీఐ సురేందర్‌రెడ్డి వేధింపులను ఫోన్‌లో వాయిస్‌ రికార్డ్‌ చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది...దీంతో ఇంతకాలంగా అరాచకాలకు పాల్పడుతున్న ఆ సీఐ అసలు బాగోతం బట్టబయలైంది...కులాంతర వివాహం చేసుకున్న భార్యాభర్తలు కుటుంబ కలహాలతో పోలీసు స్టేషన్ చేరారు...దీన్ని ఆసరాగా చేసుకున్న సీఐ ఆ తర్వాత బాధితురాలితో ఫోన్‌లో ఏకాంత సంభాషణలు మొదలుపెట్టాడు. ఆమె భర్తపై నమోదు చేసిన కేసులో సహకారం అందించాలంటే తనతో గడపాలని కోరాడు...బాధితురాలి ఫిర్యాదుతో ఉన్నతాధికారులు విచారణ చేయగా నిజమేనని తేలడంతో వేటు వేస్తూ డీఐజీ కార్యాలయానికి వీఆర్‌కు పంపారు...

నెల్లూరులో సైకో సబ్‌ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్...
జిల్లాలోని ఊటుకూరు మహిళా సర్పంచ్‌ను లైంగిక వేధింపులకు గురిచేశాడు...తన దారికి రాలేదని ఏకంగా ఆమెపై అత్యాచారయత్నం చేశాడని బాధితురాలు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించింది...తనతో ఎస్సై ఫోన్‌లో రోజూ అసభ్యంగా మాట్లాడుతున్నాడని..ఇంటికొచ్చి అత్యాచారం చేయబోయడని బాధితురాలు ఫిర్యాదు చేసింది...కోరిక తీర్చకపోతే కుటుంబ సభ్యులపై కేసులు బనాయిస్తానని బెదిరిస్తున్నట్లు తెలిపింది. వేధింపులు ఎక్కువవడంతో...ఎస్సై బండారాన్ని బయటపెట్టేందుకు అతని ఫోన్‌కాల్‌ రికార్డ్‌ చేసింది. ఆ తర్వాత పోలీస్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది...దీనిపై నిర్ధారించుకున్న అధికారులు ఏడుకొండలును సస్పెన్షన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు... 

15:23 - October 20, 2017

నిజామాబాద్ : బోధన్ సీఐ సురేంద్ రెడ్డి వ్యవహార శైలిపై టెన్ టివి ప్రసారం చేసిన వరుస కథనాలపై పోలీసులు ఉన్నతాధికారులు స్పందించారు. ఐజీ ఆఫీసుకు బదిలీ చేశారు. మహిళలతో సీఐ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. ఇటీవలే వ్యక్తిగత కారణాల వల్ల ఓ వివాహిత రావడం జరిగింది. కానీ ఆమెతో సీఐ సురేందర్ అసభ్యకరంగా..అసభ్యపదజాలాన్ని వాడారనే ఆరోపణలున్నాయి. సీఐ మాట్లాడిన మాటలను ఆమె రికార్డు చేయడంతో కలకలం రేగింది. ఈ ఆడియోను టెన్ టివి ప్రసారం చేసింది. కౌన్సిలింగ్ కు వచ్చే మహిళలతో అసభ్యకరంగా ప్రవరిస్తాడని తెలుస్తోంది. మొత్తానికి సీఐపై చర్యలు తీసుకోవడంతో వివాదం సద్దుమణిగినట్లైంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - బోధన్