బివి.రాఘవులు

13:52 - May 5, 2018

హైదరాబాద్‌ : ఎంబీభవన్‌లో కార్ల్‌మార్క్స్‌ ద్విశత జయంతి వేడుకలను సీపీఎం నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్క్స్‌ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మార్క్స్‌ సిద్ధాంతాలను సీపీఎం నేతలు గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో కొనసాగుతోన్న అణచివేతకు వ్యతిరేకంగా సీపీఎం చేస్తున్న కృషిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతిజ్ఞ తీసుకున్నామన్నారు. 20వ శతబ్దాన్ని ఒక కుదుపు కుదిపి, మరో మార్గం పట్టించి ప్రపంచం స్వరూపాన్ని మార్చేసిన ఘనత మార్క్సిజందే అని సీపీఎం పోలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు కొనియాడారు. 

 

11:41 - May 5, 2018

హైదరాబాద్ : మానవ పరిణామ క్రమంలో శ్రమ పాత్ర కీలకమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. ఎంబీ భవన్ లో నిర్వహించిన కారల్ మార్క్స్ 200వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. భావాల్లో సంఘర్షణ జరుగుతుందని ఎగెల్ చెబితే.. భౌతిక పరిస్థితుల్లో సంఘర్షణ జరుగుతుందని కారల్ మార్క్స్ తెలిపారని చెప్పారు. శ్రమ వల్లే మానవులు అభివృద్ధి సాధించారని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో శ్రమ అంటే హేయభావం ఉందన్నారు.

 

14:20 - April 24, 2018

హైదరాబాద్ : తమ మహాసభల తీర్మానాలు బీజేపీని కలవర పెట్టాయని...అందుకే ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తాము బీజేపీపై రాజకీయ విమర్శలు చేశామని తెలిపారు. బూజు పట్టిన సీపీఎం గురించి బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు. మహాసభ కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుందని..20 మంది కొత్త కార్యకర్తలను తీసుకుందన్నారు. 95 మంది కేంద్రకమిటీ, 17 మందితో పొలిట్ బ్యూరో ఎన్నుకుందని తెలిపారు. మతోన్మాదాన్ని ఓడించేందుకు అందరూ కలిసిన రావాలని పిలుపునిచ్చారు.

 

12:32 - April 18, 2018

హైదరాబాద్ : మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు పిలుపు ఇచ్చారు. మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఆ పార్టీ 22వ జాతీయ మహాసభల్లో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం చాలా ఉందన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేసేవారందరికీ రెడ్ సెల్యూట్ తెలియజేస్తున్నట్లు తెలిపారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా అన్ని వర్గాలూ పోరాడాల్సిన తరుణమిదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నేటి తమకు స్ఫూర్తి అన్నారు. సామాజిక న్యాయం కోసం తెలంగాణ రాష్ట్ర శాఖ మహాజన పాదయాత్ర నిర్వహించిందన్నారు.

 

15:25 - April 15, 2018

హైదరాబాద్ : బీజేపీ పాలనలో మతోన్మాదం పెరిగిపోయిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మతోన్మాదం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అన్నారు. వ్యవస్థను నియంత్రించే స్థాయికి మతోన్మాదం చేరిందని పేర్కొన్నారు. 

13:49 - April 8, 2018

హైదరాబాద్ : మోదీ సర్కార్ ఉధృతంగా అమలు చేస్తున్న ఆర్థిక విధానాలతో దేశ ప్రగతి ప్రమాదంలో పడిందన్నారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీరాఘవులు. ఈనెల 18న హైదరాబాద్‌లో సీపీఎం ఆలిండియా మహాసభల నేపథ్యంలో... పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎడిటర్స్‌ మీట్‌ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాఘవులు.. పార్టీ రాజకీయ తీర్మానాన్ని విడుదల చేశామని... రాబోయే మూడేళ్లలో పార్టీ అనుసరించనున్న విధానాన్ని ప్రజల ముందు ఉంచామన్నారు.  ప్రజల మధ్య కుల, మత తేడాలు సృష్టించే కుట్రలను అడ్డుకోడానికి వ్యూహాలను కూడా పార్టీ రూపొందించిందన్నారు. దేశంలో రాజకీయ ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులేనని అన్నారు. ఈకార్యక్రమంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు పార్టీ నేతలు బి.వెంకట్‌, సాగర్‌, రఘు, డిజీ నర్సింగరావు.. వివిధ పత్రిక, టీవీఛానెళ్ల ఎడిటర్లు పాల్గొన్నారు.  

 

12:36 - February 7, 2018

నల్లగొండ : నాల్గవరోజు సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభలు జరగనున్నాయి. ఈరోజు ప్రతినిధులను ఉద్దేశించి సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రసంగిస్తారు. ప్రతినిధుల నివేదికపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రసంగిస్తారు. మధ్యాహ్నం తరువాత నూతన రాష్ట్ర కమిటీ, కార్యదర్శి ఎన్నిక జరగనుంది. నేటితో జిల్లాలో సభలు ముగియనున్నాయి.  ఈమేరకు టెన్ టివితో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు మాట్లాడుతూ బూర్జువా 
పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీఎల్ ఎఫ్ ఏర్పాటు అయిందన్నారు. బీఎల్ ఎఫ్.. పార్టీల కయిక కాదని.. రాజకీయ ఎజెండాతో ముందుకు వచ్చిందని తెలిపారు. బీఎల్ ఎఫ్, టీమాస్ ను బలోపేతం చేయాలన్నారు. సామాజిక న్యాయాన్ని తమ పార్టీ అనేక కోణాల్లో చూస్తోందన్నారు. అభివృద్ధిలో న్యాయం చేయాలని చెప్పారు. దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. దళితులపై జరుగుతున్న దాడులను ముందుండి ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం కృషి చేస్తామని చెప్పారు. రాబోయే కాలంలో పోరాటాలను ఉధృతం చేస్తామని తెలిపారు.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 
 

13:39 - February 6, 2018

నల్గొండ : బీజేపీ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు విమర్శించారు. నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ లో బీజేపీ నేతలు ఎన్నికల ప్రసంగం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ నేతలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు పకోడీ రాజకీయాలను ముందుకు తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఉపాధి కల్పన, ఉద్యోగాలు సృష్టించడంలో బీజేపీ ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. రాష్ట్ర విజభన చట్టం హామీలు అమలు జరపడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఇచ్చిన వాగ్ధానాలను బీజేపీ వమ్ము చేసిందన్నారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్రం విఫలం చెందిందన్నారు. ఏపీకి కేంద్రం మూడేళ్లలో చేసిందేమీ లేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కూడా నిధులు ఇవ్వలేదన్నారు. గిరిజన యూనివర్సిటీ ఊసేలేదన్నారు. చంద్రబాబు, కేసీఆర్ లు కేంద్రంతో స్నేహం చేస్తూ.. నాలుగు సం.రాలు కాలక్షేపం చేశారని.. కేంద్రం హామీలను అమలు చేయించుకోవడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాటకం ఆడుతున్నారని చెప్పారు. కేసీఆర్ ఆ నాటకం కూడా చేయడం లేదన్నారు. కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ స్పందించాలన్నారు. కేంద్రం ఏ ఏ వాగ్ధానాలు ఇచ్చిందో... వాటిలో ఎన్ని అమలు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

 

14:05 - January 27, 2018

హైదరాబాద్ : రైతుకు గిట్టుబాటు ధర కోసం చట్టం తీసుకురావాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని తెలిపారు. పెట్టుబడికి రెండున్నరరెట్లు గిట్టుబాట ధర కల్పించాలన్నారు. ఫిబ్రవరి 1 న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోందని.. ప్రజలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ఉండాలన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర నష్టాలతో ఉన్నారని రైతుకు న్యాయం చేకూరే విధంగా బడ్జెట్ లో వ్యవసాయానికి నిధుల కేటాయింపులు ఉండాలన్నారు. బడ్జెట్ లో ప్రతిపాదనలకు వాస్తవ కేటాయింపులకు 15 శాతం కత్తిరింపులు చేశారని పేర్కొన్నారు. ప్రధాని మెడీ తీసుకున్న నిర్ణయాలు మాంధ్యంలోకి నెట్టాయన్నారు. వ్యవసాయరంగాన్ని విస్మరించారని, వ్యవసాయరంగానికి పెట్టే ఖర్చును కత్తిరించారని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నదని చెప్పారు. తెలంగాణకు సముద్ర తీరం లేదన్నారు. తెలంగాణలో డ్రైపోర్టులు నిర్మించాలని సూచించారు. రాష్ట్రంలో నాలుగు డ్రైపోర్టులు నిర్మించే అవకాశముందన్నారు. జహీరాబాద్, జడ్చర్ల, దామరచర్ల వద్ద డ్రైపోర్టులను నిర్మించవచ్చన్నారు.
   

 

13:41 - January 9, 2018

గుంటూరు : స్వేచ్ఛ ఉన్నప్పుడే పత్రిక మనుగడ సాధ్యమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. తాడేపల్లిలో ప్రజాశక్తి పత్రిక ఏపీ రాష్ట్ర కార్యాలయానికి ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బివి.రాఘవులుతోపాటు ప్రజాశక్తి సంపాదకులు పాటూరి రామయ్య, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ పత్రికలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని పేర్కొన్నారు. మాతృభాష అభివృద్ధి చెందితేనే ఏ జాతి అయినా అభివృద్ధి చెందుతుందన్నారు. పత్రికల్లో వచ్చే విజ్ఞానం అందిపుచ్చుకోవాలంటే మాతృ భాష వచ్చి ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. పత్రికలు ప్రజలకనుకూలంగా ఉండాలని.. ప్రజలకు ఉపయోగపడే వార్తలు రాయాలని సూచించారు. ఆంక్షలతో స్వేచ్ఛకు భంగం కలిగించాలనుకున్నప్పుడు...ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - బివి.రాఘవులు