బాల్క సుమన్

11:34 - October 30, 2018

హైదరాబాద్ : రాజకీయాలంటే రొచ్చు. రాజకీయాలంటే పార్టీల మధ్య కంటే మనుషులపై మనుషులు పోరాడే యుద్ధం. రాజకీయమంటే రణరంగం. రాజకీయమంటే రచ్చ. ఇప్పటి వరకూ యువతలో వుండే భావనలివి. కానీ వర్శిటీలలో పీహెచ్ డీలు చేసి పట్టా పుచ్చుకుని నేరుగా రాజకీయాలలోకి అడుగిడుతున్నారు నేటి తరం. దీనికి వేదిక ఇటీవలే 100ఏళ్ల వసంతాలు పూర్తి చేసుకున్న ప్రతిష్టాత్మక వర్శిటీ ఉస్మానియా. ఉద్యమాల పురిటిగడ్డగా పేరొందిన ఉస్మానియా వర్శిటీ రాష్ట్ర  విభజన నేపథ్యంలో వర్శిటీని ఉద్యమాలను వేరు చేసి చూడలేం. ఉద్యమం పుట్టిందే వర్శిటీలో అనే సంగతి మరువకూడదు. తెలంగాణ ఉద్యమంలోనే కాదు పోరు తెలంగాణలో కూడా తమదైన ముద్ర వేస్తున్నారు వర్శిటీ పీహెచ్ డీ పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థినీ, విద్యార్థులు..

Image result for balka sumanశాసనసభ ఎన్నికల్లో పీహెచ్‌డీ విద్యార్థులు,   ఇప్పటికే పీహెచ్‌డీ పూర్తిచేసి పట్టా పొందిన వారు.. తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీల తరఫున అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. ఒకవైపు పీహెచ్‌డీ పట్టా సాధనకు ప్రయత్నిస్తూనే మరోవైపు ఎన్నికల రణక్షేత్రంలో ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు తాము సైతం సై అంటున్నారు. గతంలో పెద్దగా చదువుకోనివారే రాజకీయాల్లోకి వచ్చేవారు. తరువాత డిగ్రీ, పీజీ చదివినవారు, వైద్యులు, న్యాయవాదులు, ఇంజినీర్లు పెరిగారు.  కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.   పీహెచ్‌డీ పట్టాతో ఎన్నికల గోదాలోకి  దిగుతున్న వారు క్రమేణా పెరుగుతున్నారు. 

Related imageరాజకీయాలు అనగానే తమకు సంబంధం లేని అంశంగా చాన్నాళ్లు ఉన్నత చదువులు చదువుకున్నవారు భావించేవారు. ఇక పీహెచ్‌డీలు చేసినవారైతే బోధన రంగంలో ఎక్కువగా స్థిరపడేవారు. లేదా ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి చూపేవారు. ఇప్పుడిప్పుడే ఈ ధోరణి మారి వారంతా రాజకీయాల బాట పడుతున్నారు. తమకున్న పరిశోధన పరిజ్ఞానంతో ప్రజా సమస్యలపై లోతైన అధ్యయనం చేసి పరిష్కారమార్గాలు కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పరిశోధక విద్యార్థులు, పీహెచ్‌డీ పూర్తిచేసిన వారంతా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన వారే కావడం విశేషం. 

తమకున్న పరిశోధన పరిజ్ఞానంతో ప్రజా సమస్యలపై లోతైన అధ్యయనం రాజకీయ అరంగ్రేటం చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పరిశోధక విద్యార్థులు, పీహెచ్‌డీ పూర్తిచేసిన వారంతా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన వారే కావడం విశేషం. వారెవరో చూద్దాం..
ఉస్మానియా వీరి ఊపిరి....

  • 2014లోనే ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన బాల్కసుమన్
  • 2014 లో ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల బాలరాజు
  • 2004లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఓడిన ఎంఏ విద్యార్థిని సీతక్క
  • 2014లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా  గెలిచిన  సంపత్ కుమార్
  • 2014లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిన పిడమర్తి రవి
  • 2018లో గాదరితో తలపడేందుకు సిద్ధంగా వున్న  అద్దంకి దయాకర్ 
  • 2014లో టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన గాదరి కిశోర్
  • 2018 బీఎల్ఎఫ్ నుండి బరిలోకి ఎంఏ విద్యార్థిని రమావత్ సౌజన్య
  • ఉస్మానియా విద్యార్థిని విద్యార్థులు పోరు తెలంగాణలో బరిలోకి దిగనున్నారు.  మరి వీరి అదృష్టం వీరిని రాజకీయాలలో నిలబెడుతుందో..లేదా అనుభవంగా మిగిలిపోతుందో వేచి చూడాలి.
  • -మైలవరపు నాగమణి
16:29 - September 29, 2018

హైదరాబాద్ : టి.కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ తీవ్రస్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డిపై ఐటీ దాడులు జరపడం తీవ్ర సంచలనం రేకేత్తించిన సంగతి తెలిసిందే. దీనిపై శనివారం రేవంత్ స్పందించి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అడ్డదిడ్డంగా మాట్లడితే నాలుక కోస్తాం..రేవంత్ ఓ విష పురుగు..రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు అంటూ పరుష పదజాలంతో విమర్శించారు.

’పిల్లనిచ్చిన మామ...అంటూ ఏవో ఏవో మాట్లాడానివు...ఎలా ఆస్తులు సమకూర్చారనేది ప్రశ్న..దానికి సమాధానం చెప్పకుండా..కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించుడు. రేవంత్ నిజస్వరూపం బయటపడింది. జర్నలిస్టులను..మీడియా సంస్థలను..మీడియా సంస్థల అధిపతులను కూడా తిట్టిండు. కానీ ప్రశ్నించాల్సిన మీడియా కూడా రేవంత్ ప్రెస్ మీట్ లో ఏమీ మాట్లడలేదు. పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్నా. హైదరాబాద్ నుండి ఆలంపూర్ వరకు తిరిగినా. నా కొడుకా చంద్రబాబు పక్కన ఉన్న నువ్వు కేసీఆర్..కేటీఆర్ లపై మాట్లడుతావా ? ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు బిడ్డా...లేకపోతే తోళు తీస్తా...పెద్ద పీకుడు గాడివా ? లఫూట్ గా...మూడు అడుగుల పొట్టొనివి...నీకు అంతా సినిమా లేదు..నన్ను పార్టీ ఆపుతోంది..లేకపోతే బిడ్డా...బొచ్చుగాడివి నువ్వు ఏం మాట్లడుతావు. కేసీఆర్ ఫాం హౌస్ లో వెయి ఎకరాలున్నాయని అన్నవు కదా..చూపించు. లేకపోతే గజ్వేల్ లో బొంద పెడుతా’ అంటూ బాల్క సుమన్ పరుషపదజాలం వాడారు. రానున్న రోజుల్లో ఇంకెన్ని విమర్శలు గుప్పిస్తారో చూడాలి.  

08:17 - September 14, 2018

మంచిర్యాల : ముందస్తుకు ముందువరుసలో ఉన్న టీఆర్‌ఎస్‌.. అసమ్మతిలోనూ మొదటి స్థానంలో ఉంది. రాష్ర్టవ్యాప్తంగా ఆ పార్టీలో అసమ్మతి జ్వాలలు రేగుతున్నాయి. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే ఓదెలు అనుచరుడి ఆత్మహత్యాయత్నం ఇందుకు పరాకాష్ట. చెన్నూరులో ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న వివాదానికి కేసీఆర్‌ చెక్‌ పెట్టారు. అసంతృప్త నేతలనూ ఆయన బుజ్జగించే పనిలో పడ్డారు. టీఆర్ఎస్‌ ముందస్తు ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడంతో.. రాష్ర్టవ్యాప్తంగా ఆ పార్టీలో అసమ్మతి భగ్గుమంటోంది. టికెట్‌ ఆశించి భంగపడ్డ టీఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారు. కొంతమందైతే బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. అక్కడక్కడా నిరసనలకు దిగుతున్నారు. సమస్య అంతటితో అంతమవ్వలేదు...  ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు.. అనుచరుడైతే.. ఏకంగా ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. దీంతో నల్లాల ఓదెలు, బాల్క సుమన్‌ మధ్య వివాదం తలెత్తింది. నేతలు బహిరంగ విమర్శలకు దిగారు. దీంతో పార్టీలో ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తలు ఆందోళనలో పడ్డారు. 

ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశించి బంగపడ్డవారంతా నిరసన తెలుపుతుండడంతో గులాబీ బాస్‌ అలర్ట్‌ అయ్యారు. వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. కేసీఆర్‌ ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫోన్‌ చేసి మాట్లాడుతున్నారు. అసంతృప్తులను బుజ్జగించే బాధ్యత తనదేనని.. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ పార్టీ నేతలకు చెప్పినట్లు సమాచారం. పార్టీలో అసమ్మతి గురించి పట్టించుకోకుండా... ఎన్నికలకు సన్నద్ధం కావాలని సీఎం కేసీఆర్‌ అభ్యర్థులకు సూచించినట్లు తెలుస్తోంది. 

కేసీఆర్‌ అన్నంత పనిచేస్తున్నారు. అసంతృప్త నేత మాజీ ఎమ్మెల్యే ఓదెలుతో మాట్లాడి దారికి తెచ్చారు. ప్రగతి భవన్‌లో  కేసీఆర్‌ను కలుసుకున్నాక ఓదెలు కాస్త మెత్తబడ్డారు. మాటతీరులోనూ మార్పు వచ్చింది. కేసీఆర్‌ మాటే తనకు శిరోధార్యమన్న ఓదెలు. బాల్కసుమన్‌ విజయానికి కృషి చేస్తానన్నారు. తొందరపాటు చర్యలు తీసుకోకుండా.. పార్టీ వెంటే నడవాలని కార్యకర్తలను కోరారు ఓదేలు. 

బుజ్జగింపుల పర్వానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్‌..  టికెట్లు కేటాయించిన అభ్యర్థులకు గురువారం ఫోన్‌ చేసి మాట్లాడినట్లు సమాచారం. ముఖ్యంగా ఓటర్ల నమోదుపై సీరియస్‌గా దృష్టి సారించాలని సూచించినట్లు తెలుస్తోంది. బూత్ కమిటీల నియామకాలు, పార్టీ నేతల సమన్వయంతోపాటు.. ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ చెప్పినట్లు తలాడించిన ఓదెలుకు కార్యకర్తలనుంచి వ్యతిరేకత ఎదురైంది. ఆయనకు మద్ధతుగా ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్ళిన ఓదెలును అడ్డుకున్నారు.  గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. 

19:12 - September 12, 2018

మంచిర్యాల : తనపై నల్లాల ఓదేలు వర్గం హత్యాయత్నానికి పాల్పడిందని ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చిన తనపై హత్యాయత్నం చేశారని పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గ టిక్కెట్ ను కేసీఆర్ తనకు కేటాయించారని ఎవరూ అడ్డుపడినా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని తెలిపారు. ఓదేలు వర్గం ఎన్నికుట్రలు పన్నినా తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదని స్పష్టం చేశారు. చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థిగా బాల్క సుమన్ టీఆర్ ఎస్ ఇటీవలే ప్రకటించిన విషయం విధితమే. దీన్నితాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తీవ్రంగా ఖండించారు. తనకు చెన్నూరు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిన్న ఓదేలు స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. దీంతో ఓదేలు వర్గ బాల్క సుమన్ పై ఆగ్రహంతో ఉన్నారు.

ఇవాళ నియోజకవర్గంలోని ఇందారం గ్రామంలో పర్యటించేందుకు వెళ్లిన బాల్క సుమన్‌ను ఓదేలు వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఓదేలు అనుచరుడు రేగుంట గట్టయ్య కిరోసిన్‌ పోసుకుని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనను బాల్క సుమన్‌ తీవ్రంగా ఖండించారు. 

 

12:56 - September 12, 2018

తమ నేతకు ఎందుకు టికెట్ కేటాయించలేదంటూ తెలంగాణ రాష్ట్రంలో పలువురు అనుచరులు ఆందోళనలు..నిరసనలు చేపడుతున్నారు. ఇది కాస్తా తారాస్థాయికి చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం...105 మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో టికెట్ ఆశించిన పలువురు ఆశావాహులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పలువురు ఇతర పార్టీల్లోకి వెళ్లడానికి మార్గాలు వెతుకుతుండగా మరికొందరు టికెట్ ఇవ్వాలంటూ టీఆర్ఎస్ అధిష్టానంపై వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 

మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు టికెట్ ను ఎంపీ బాల్క సుమన్ కు కేసీఆర్ ఖరారు చేశారు. దీనితో తాజా, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఆగ్రహానికి గురయ్యారు. తనకు టికెట్ కేటాయించాలంటూ అభ్యర్థించారు. ఆయన అనుచరులు కూడా ఆందోళనలు..నిరసనలు కొనసాగించారు. బాల్క సుమన్ కు మద్దతిచ్చేది లేదని..తనకు టికెట్ కేటాయించే వరకు ఇంట్లోనే ఉంటానంటూ గృహనిర్భందం చేసుకున్నారు. 

బుధవారం ఎంపీ బాల్క సుమన్ ఇందారంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ విషయం నల్లాల ఓదేలు అనుచరుడు గట్టయ్యకు తెలిసింది. అక్కడకు వెళ్లిన అతను ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకున్నాడు. ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. మంటలు ఇతరులకు కూడా అంటుకున్నాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

18:34 - March 22, 2018

ఢిల్లీ : రిజర్వేషన్ల అంశంపై కేంద్రం స్పష్టత ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని టీఆర్‌ఎస్‌ ఎంపీలు స్పష్టం చేశారు. 13 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలపై బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని మండిపడ్డారు. తమ పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదని తెలిపారు. ఈ సందర్భంగా టెన్ టివి టీఆర్‌ఎస్‌ ఎంపీలు సీతారాంనాయక్‌, బాల్క సుమన్‌ లతో ముచ్చటించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

21:07 - January 13, 2018

హైదరాబాద్ : తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చిన ఘనత తమదే అంటూ టీఆర్‌ఎస్‌ చెబుతుంటే.. జేబులు నింపుకునేందుకే ప్రైవేటు సంస్థల దగ్గర విద్యుత్‌ కొనుగోళ్లు చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తోంది. మరోసారి కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి టీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనలు ఉల్లంగించి తప్పుడు అగ్రిమెంట్లు చేయడంతో 23 మంది అధికారులపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ విషయంలో బాల్కసుమన్‌ ఇద్దరిపైనే కేసులు అయ్యాయంటున్నారని.. దీన్ని బట్టే టీఆర్‌ఎస్‌ అవినీతి అర్థమవుతుందని రేవంత్‌రెడ్డి అన్నారు.

విద్యుత్‌ కొనుగోళ్లలో తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని రేవంత్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తన ఆరోపణలు తప్పని తేలితే అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టాలన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పారదర్శకంగా పనిచేస్తే ... సెంట్రల్‌ విజిలెన్స్‌తో గానీ సీబీఐతో గానీ విచారణ జరపాలన్నారు. తన ఆరోపణలు తప్పని తేలితే అబిడ్స్‌లో ముక్కు నేలకు రాస్తానని రేపంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

మరోవైపు 24 గంటల విద్యుత్ పంపిణీని కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని మీడియా చిట్‌చాట్‌లో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ప్రజలను, రైతులను కాల్చుకుతింటే తాము కరెంట్ ఇచ్చి అదుకుంటున్నామని చెప్పారు. విద్యుత్‌ కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఆరోపించే వాళ్లు ఆధారాలుంటే భయటపెట్టాలన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళు అడిగితే సమాధానం చెప్పాలా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ప్రతిపక్షాల విమర్శలతో ఇమేజ్‌ డ్యామేజ్‌ అవుతుందని గ్రహించిన టీఆర్‌ఎస్‌.. కిందిస్థాయి నేతలతో సవాళ్లకు ప్రతిసవాళ్లు చేయిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాలను బయటపెట్టాలన్న విపక్షాల డిమాండ్‌కు మంత్రుల నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడం విమర్శలకు మరింత బలం చేకూర్చుతోంది. 

21:34 - June 3, 2017

సంగారెడ్డి : టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌పై కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. గుండు కొట్టిచ్చి హైదరాబాద్‌లో తిప్పుతానన్న సుమన్ సవాల్ స్వీకరిస్తున్నానని.. ఇదే సమయంలో సుమన్‌ను హైదరాబాద్‌లో తిరగకుండా చేయగలనని అన్నారు. సుమన్‌కు ధైర్యముంటే కేసీఆర్‌, హరీష్‌రావుతో ఓయూలో మీటింగ్‌ పెట్టించగలవా అని ప్రశ్నించారు. సంగారెడ్డికి రావాలంటే.. కేసీఆర్, హరీష్‌లే భయపడుతారని.. అలాంటిది సుమన్‌ ఎంత అని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ మెప్పు కోసం బాల్క సుమన్‌ ఇద్దరు విద్యార్థులను బలి తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బాల్క సుమన్‌ సంగతి తేల్చుతామంటూ జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

22:15 - February 23, 2017
19:01 - October 8, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాకు తాము వ్యతిరేకం కాదని.. అలాని అశాస్త్రీయంగా జిల్లాలను, రెవిన్యూ డివిజన్లను, మండలాలను విడదీయవద్దని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్‌రెడ్డి అన్నారు. కొన్ని జిల్లాల్లో 5 లక్షల జనాభా ఉంటే.. మరికొన్ని జిల్లాల్లో 40 లక్షల జనాభా ఉందని ఆయన అన్నారు. దసరాకు కాకుంటే దీపావళికి జిల్లాలను ఫైనల్‌ చేయవచ్చని అన్నారు. జిల్లాల విభజనపై మరోసారి అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా కొత్తజిల్లాల ఏర్పాటు ప్రక్రియ శాస్త్రీయంగా జరుగుతుందని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్కసుమన్‌ అన్నారు. గ్రామాల్లో ప్రజలంతా ఆనందంగా ఉంటే.. ప్రతిపక్షాలకు మింగుడుపడటం లేదని ఆయన విమర్శించారు.  

Pages

Don't Miss

Subscribe to RSS - బాల్క సుమన్