ఫిర్యాదు

16:53 - September 12, 2018

హైదరాబాద్ : కొండగట్టు బస్సు ప్రమాదంపై మానవ హక్కుల కమిషన్(హెచ్ ఆర్ సీ)లో ఫిర్యాదు నమోదు అయింది. బస్సు ప్రమాదంపై హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ హెచ్ ఆర్ సీలో పిటిషన్ వేశారు. ప్రమాదంలో 57 మంది చనిపోవడానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగిత్యాల బస్ డిపో మేనేజర్, సూపర్ వైజర్, ఆర్టీవోపై కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. అధికారులపై చర్యలు తీసుకునేందుకు తెలంగాణ డీజీపికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల నష్టపరిహారం ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయాలని మానవ హక్కుల కమిషన్ ను అరుణ్ కుమార్ కోరారు.

జగిత్యాల జిల్లాలో కొండగట్టు వద్ద ఘాట్‌రోడ్డులో బ్రేక్ లు ఫెయిల్ కావడంతో బస్సు అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ప్రమాదంలో 57 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. మృతుల్లో 25 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

 

 

21:24 - August 25, 2018

హైదరాబాద్ : ఎన్నికల్లో ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధమన్న సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ. నాలుగురన్నరేళ్లలో మంచి పనులు చేస్తే సభ పెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ప్రగతి నివేదన సభ కోసం ఒక్కో ఎమ్మెల్యేకు కేసీఆర్‌ కోటి రూపాయలు ఇచ్చారని ఆరోపించారు. ఒక్క రోజే విచ్చల విడిగా 100 కోట్ల పంపిణీ జరిగితే నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 

 

21:53 - August 2, 2018

నిజామాబాద్‌ : జిల్లాలోని శాంకరీ నర్సింగ్‌ కళాశాల విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌ కుమారుడు ధర్మపురి సంజయ్‌.. నర్సింగ్‌ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నారని నాయినికి ఫిర్యాదు చేశారు. ఆయనపై, కళాశాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పీడబ్ల్యూడీ నాయకురాలు సంధ్య నేతృత్వంలో తల్లిదండ్రులు హోం మంత్రిని కలిశారు. ఈ మేరకు డీజీపీతో ఫోన్లో మాట్లాడిన నాయిని పోలీస్‌ కమిషనర్‌తో విచారణ జరిపించాలని ఆదేశించారు.

10:39 - June 1, 2018

ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్ కు కార్పొరేటర్లు కళంకంగా మారారు. ఖమ్మం కార్పొరేషన్ అధికార పార్టీ కార్పొరేట్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. 49 డివిజన్ కార్పొరేటర్ జంగం భాస్కర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళ ఫిర్యాదు చేసింది. రెండేళ్లుగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఖమ్మం కార్పొరేటర్ల తీరుపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

19:27 - May 11, 2018

చిత్తూరు : అమిత్‌షాపై దాడిని ఖండించిన బీజేపీ నేతలు.. చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు కావాలనే అమిత్‌షాపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. కాగా ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే టీడీపీ, బీజేపీ మధ్య మొదలైన మాటల యుద్ధం.. అమిత్‌షా కాన్వాయిపై దాడికితో మరింత ముదిరింది. టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే అమిత్‌షాపై దాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు అంటున్నారు.

18:11 - May 9, 2018

హైదరాబాద్ : ఏపీ ఎన్జీవో నేత అశోక్‌బాబుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఓ రాజకీయపార్టీ తరపున ఎన్నికల్లో ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయవద్దని ఇటీవల అశోక్‌బాబు అయన బృందం ప్రచారం చేసిందని.. దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. సర్వీస్‌రూల్స్‌కు విరుద్ధంగా అశోక్‌బాబు వ్యవహరిస్తున్నారని.. తగిన చర్యలు తీసుకోవాలని తాము గవర్నర్‌ను కోరామన్నారు. ఏపీ ఎన్జీవో నేతల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశామన్నారు. 

17:32 - April 4, 2018

హైదరాబాద్ : తెలుగు సినీ ప్రముఖులు, చిత్రపరిశ్రమపై అనుచిత వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలు చేస్తున్న నటి శ్రీరెడ్డిపై టాలీవుడ్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ... సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిత పరిశ్రమను కించపరిచే విధంగా మాట్లాడుతున్న శ్రీరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని టాలీవుడ్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. ఫిర్యాదులో డిమాండ్‌ చేశారు. 

13:03 - March 23, 2018

హైదరాబాద్ : విప్ ధిక్కరించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎన్నికల రిటర్నినింగ్ అధికారికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఓట్లను పరిగణలోకి తీసుకొవద్దని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించినందుకు అనర్హత వేటు వేయాలని సీఈసీకి విన్నవించారు. 

19:11 - March 21, 2018

ఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా ఎలాంటి కారణం లేకుండా తమ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్.. ఈసీకి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో వీరిరువురు కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను కలిశారు. ఈ నిర్ణయంపై హైకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చిందని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. రాజ్యసభ ఎన్నికల ఓటర్ల జాబితాలో తమ పేర్లను తొలగించారని... వాటిని చేర్చాలని ఈసీని కోరినట్లు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. 

22:11 - March 8, 2018

Pages

Don't Miss

Subscribe to RSS - ఫిర్యాదు