ఫడ్నవీస్

16:50 - November 3, 2018

మహారాష్ట్ర : కోరుకున్న పాపులర్ బ్రాండ్స్ సిగరేట్లు కావాలంటే దుకాణాలకు వెళ్లాల్సినవసరం లేదు. నేరుగా ఇంటికే పంపిణీ చేయనున్నారు. మహారాష్ట్రలో త్వరలో ఇది అమలు కానుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే మోడల్ మేఘా శర్మ చేసిన ఉదంతం తెలిసిందే. ముంబైలోని కీలక ప్రాంతాలు బాంద్రా, వర్లి, కొలబా ఇతర ప్రాంతాలను మొదట ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 2019 జనవరి 1వ తేద నుండి దీనిని ప్రారంభించేందుకు అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 
Image result for Maharashtra Govt Doorstep Delivery Of Cigarettesముంబైలోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో ఉంటున్న మోడల్ మేఘా శర్మ అక్టోబర్ 25 అర్థరాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డు అలోక్‌కు ఫోన్ చేసింది. కానీ అతను నిరాకరించడంతో మేఘా శర్మ తీవ్ర ఆగ్రహానికి గురైంది. అతనితో ఘర్షణకు దిగింది. అలోక్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి మగ పోలీసులు చేరుకున్నారు. స్టేషన్ కు రావాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. దీనికి మేఘా శర్మ నిరాకరించింది. అది కూడా మహిళా కానిస్టేబుల్ కూడా లేనందున పోలీస్ స్టేషన్‌కు తెల్లారగానే వస్తానని చెప్పింది. అయినా పోలీసులు వినకపోవడంతో వేసుకున్న దుస్తులను మేఘా శర్మ తొలగించింది. చివరకు పోలీసులు వెనక్కి వెళ్లిపోయారు. మరి మహా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఎలాటి వివాదం చెలరేగుతుందో చూడాలి. 

15:58 - September 9, 2018

ముంబై : చమురు ధరల పెరుగుదలపై మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. రాష్ట్ర ప్రజలపై భారం పడకుండా చూస్తామని సీఎం పేర్కొన్నారు. ఓ జాతీయ ఛానెల్ తో ఆయన మాట్లాడారు. జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్ తీసుకురావడం వల్ల ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. ధరల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తోందని..ధరలు తగ్గే మార్గాలను చూస్తున్నట్లు వెల్లడించారు. జీఎస్టీలోకి తీసుకొస్తే మహారాష్ట్ర ప్రభుత్వం మద్దతిస్తుందని, ఎన్డీయే ప్రభుత్వ హాయాంలో 13 సార్లు ధరలు పెరిగాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ధరల పెరుగుదల ఉంటుందన్నారు.

 

07:47 - March 30, 2018

ఢిల్లీ : ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే నిరాహార దీక్షను విరమించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ దీక్షా శిబిరానికి విచ్చేసి అన్నాతో చర్చలు జరిపారు. వారి మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో ఫడ్నవీస్‌ అన్నా హజారేకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. లోక్‌పాల్‌ చట్టం తీసుకురావాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో మార్చి 23 నుంచి అన్నాహజారే నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆరు రోజులపాటు దీక్ష చేసిన అన్నా ఐదు కిలోల బరువు తగ్గారని, రక్త పోటు పడిపోయిందని హజారే సన్నిహితుడు దత్త ఆవారి తెలిపారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకుంటే సెప్టెంబర్‌లో మళ్లీ నిరాహార దీక్ష చేస్తానని అన్నాహజారే హెచ్చరించారు.

20:48 - March 12, 2018

మహారాష్ట్ర దేశంలో కనీ వినీ ఎరుగని రీతిలో మహారాష్ట్ర రైతులు చేపట్టిన మహా పాదయాత్ర పాలకులను దిగొచ్చేలా చేసింది. రైతుల డిమాండ్లకు మహా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 6 నెలల్లో అన్ని డిమాండ్లను నెరవేర్చుతామని ఫడ్నవిస్‌ ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చింది. దీంతో రైతులు తమ ఆందోళన విరమించారు.

ఎర్ర సముద్రాన్ని తలపించిన ముంబై
తలకు ఎర్రటోపీలు, చేతిలో ఎర్ర బ్యానర్లు పట్టుకుని రైతులు నిశ్శబ్ద విప్లవంలా తమ యాత్రను సాగించారు. 50 వేల మంది రైతులతో ముంబై నగరం ఎర్ర సముద్రాన్ని తలపించింది.నాసిక్‌లో మార్చి 6 న ప్రారంభమైన మహారైతు పాదయాత్ర.. ఆదివారం ముంబైకి చేరుకుంది. మండుటెండలను లెక్కచేయక, కాలినడకన దాదాపు 180కిలోమీటర్లు ప్రయాణించారు. అన్నదాతలకు ముంబయి వాసులు నైతికంగా అండగా నిలిచారు. ఓ స్వచ్ఛంద సంస్థ ఆహార పదార్థాలు, మంచినీటిని రైతులకు అందించింది.

విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా రైతుల ర్యాలీ
సోమవారం ఉదయం టెన్త్‌ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రైతుల ర్యాలీ ఆదివారం అర్థరాత్రే ఆజాద్‌ మైదానానికి చేరుకుంది. రుణమాఫీ, గిట్టుబాటు ధరల కల్పన, కరెంట్‌ బిల్లు మాఫీ, స్వామినాథన్‌ సిఫారసుల అమలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. రైతుల డిమాండ్లపై ఫడ్నవిస్‌ ప్రభుత్వం దిగొచ్చింది. సిఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో సహా ఆరుగురు మంత్రులతో కూడిన కమిటీ రైతులతో చర్చించి సానుకూలంగా స్పందించింది. ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం లిఖితపూర్వకమైన హామీ ఇచ్చింది.

రైతులనుద్దేశించి ఏచూరి ప్రసంగం
ఆజాద్‌ మైదానంలో రైతులనుద్దేశించి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రసంగించారు. 30 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. పంటలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం కారణంగా రుణాల ఊబిలో కూరుకు పోయి అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఏచూరి అన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఏచూరి పిలుపునిచ్చారు. ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు భగత్‌ సింగ్‌ బాంబు వేస్తే...ఈనాటి పాలకుల కళ్లు తెరిపించేందుకు రైతులు ఆందోళన ద్వారానే మహా విస్ఫోటనం సృష్టించగలరని ఏచూరి అన్నారు. అన్నదాత ఆందోళనకు దిగితే దేశమే ఆకలితో చస్తుందని హెచ్చరించారు. దేశంలో కనీ వినీ ఎరుగని రీతిలో మహారాష్ట్ర రైతులు చేపట్టిన ఆందోళన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశ రైతాంగంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.  

20:34 - March 12, 2018

దేశంలో ఎక్కడా లేని విధంగా మహారాష్ట్ర రైతన్నలు తమ సమస్య పరిష్కారం కోసం మహా లాంగ్ మార్చ్ కార్యక్రమాన్ని చేపట్టారు. పదులు కాదు.. వందలు కాదు.. ఏకంగా 35 వేల మంది రైతులు...! అకుంఠిత దీక్షతో.. ఏకంగా 180 కిలోమీటర్ల దూరం పాదయాత్రగా కదిలారు. రోజూ పాతిక కిలోమీటర్లు చొప్పున నడుస్తూ.. తమ సమస్యల పరిష్కారం కోసం కదలివస్తున్నారు. మహారాష్ట్ర నాసిక్‌లో మొదలైన రైతుల ప్రస్థానం.. రాజధాని ముంబై చేరుకుంది. ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ నేతృత్వంలో.. వేలకొద్దీ రైతులు.. నేడు అసెంబ్లీని ముట్టడించేందుకు కదం తొక్కారు. వేలకొద్దీ రైతాంగం..ఎర్రటి తలపాగా.. తెల్లటి వస్త్రాలతో కూడిన ఆహార్యం.. వందల కిలోమీటర్ల దూరం...ఘాట్‌రోడ్లను దాటుకుంటూ సాగే దృశ్యం..అపూర్వం.. అద్భుతం.. రైతుల అకుంఠితత్వం.. మహారాష్ట్ర రైతాంగం.. తమ ప్రభుత్వ వైఖరికి నిరసనగా గోదావరి నదీ జన్మస్థానమైన నాసిక్‌ నుంచి మొదలై కొండలు, గుంటలను దాటుకుని కొనసాగిన అన్నదాతల మహాపాదయాత్ర ముంబైకి చేరుకుంది. అంతేకాదు ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని కదిలించింది. అంతేకాదు వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. దీంతో కదలివచ్చిన ప్రభుత్వం వారి సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. దీంతో తమ ఆందోళనను రైతన్నలు విరమించారు. దేశ వ్యాప్తంగా వున్న రైతుల సమస్యలు పరిష్కరించాలంటే పాదయాత్రలు చేయాల్సిందేనా? అంతే తప్ప రైతుల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? అనే అంశాలపై చర్చను చేపట్టింది 10టీవీ. ఈ చర్చలో ఆలిండియా రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి ఇందిరా శోభన (కాంగ్రెస్ అధికార ప్రతినిథి), ప్రకాశ్ రెడ్డి, బీజేపీ, నర్శింహారెడ్డి పాల్గొన్నారు. ఈ చర్చపై మరింత సమాచారం కోసం వీడియోను క్లిక్ చేయండి..

18:08 - March 12, 2018

మహారాష్ట్ర : ఎట్టకేలకు రైతన్నలతో చర్చించేందుకు మహారాష్ట్ర సర్కార్ దిగివచ్చింది. రైతు నాయకులతో చర్చలు జరిపేందుకు ఓ కమిటీని వేసిన ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని సీఎం ఫడ్నవీస్ రైతు సంఘం నాయకులకు హామీ ఇచ్చారు. డిమాండ్ ల సాధన కోసం మహా లాంగ్ మార్చ్ నాసిక్ నుండి ముంబైలోని ఆజాద్ మైదానానికి మహాలాంగ్ మార్చ్ గా రైతన్నలు తరలివచ్చింది. 50 వేల మంది రైతులతో ముంబై ఎర్ర సముద్రాన్ని తలపించిన రైతుల లాంగ్‌ మార్చ్‌ ముంబైలోని ఆజాద్‌ మైదానానికి చేరుకుంది. రైతులతో చర్చలు జరిపేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ఆరుగురు మంత్రులతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు చంద్రకాంత్‌ పాటిల్‌, పాండురంగ్‌ ఫుడ్‌కర్, గిరీష్‌ మహాజన్, విష్ణు సవారా, సుభాష్‌ దేశ్‌ముఖ్, ఏక్‌నాథ్‌ షిండే సభ్యులుగా ఉన్నారు. రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు ప్రారంభమయ్యాయి. రైతుల లాంగ్‌ మార్చ్‌కు శివసేన ఇప్పటికే సమర్థించింది. రుణమాఫీ, గిట్టుబాటు ధరల కల్పన, కరెంట్‌ బిల్లు మాఫీ, స్వామినాథన్‌ సిఫారసుల అమలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అఖిల భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో రైతులు గత మంగళవారం నాసిన్‌ నుంచి లాంగ్‌ ప్రారంభించి ముంబైకి చేరుకున్నారు. ముంబై విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రైతుల పాదయాత్ర శాంతియుతంగా సాగింది.

16:21 - March 12, 2018

మహారాష్ట్ర : 50 వేల మంది రైతులతో ముంబై ఎర్ర సముద్రాన్ని తలపిస్తోంది. రైతుల లాంగ్‌ మార్చ్‌ ముంబైలోని ఆజాద్‌ మైదానానికి చేరుకుంది. రైతులతో చర్చలు జరిపేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ఆరుగురు మంత్రులతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు చంద్రకాంత్‌ పాటిల్‌, పాండురంగ్‌ ఫుడ్‌కర్, గిరీష్‌ మహాజన్, విష్ణు సవారా, సుభాష్‌ దేశ్‌ముఖ్, ఏక్‌నాథ్‌ షిండే సభ్యులుగా ఉన్నారు. రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు ప్రారంభమయ్యాయి. రైతుల లాంగ్‌ మార్చ్‌కు శివసేన ఇప్పటికే సమర్థించింది. రుణమాఫీ, గిట్టుబాటు ధరల కల్పన, కరెంట్‌ బిల్లు మాఫీ, స్వామినాథన్‌ సిఫారసుల అమలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అఖిల భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో రైతులు గత మంగళవారం నాసిన్‌ నుంచి లాంగ్‌ ప్రారంభించి ముంబైకి చేరుకున్నారు. ముంబై విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రైతుల పాదయాత్ర శాంతియుతంగా సాగింది.

15:11 - March 12, 2018

మహారాష్ట్ర : 50 వేల మంది రైతులతో ముంబై ఎర్ర సముద్రాన్ని తలపిస్తోంది. రైతుల లాంగ్‌ మార్చ్‌ ముంబైలోని ఆజాద్‌ మైదానానికి చేరుకుంది. రైతులతో చర్చలు జరిపేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ఆరుగురు మంత్రులతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు చంద్రకాంత్‌ పాటిల్‌, పాండురంగ్‌ ఫుడ్‌కర్, గిరీష్‌ మహాజన్, విష్ణు సవారా, సుభాష్‌ దేశ్‌ముఖ్, ఏక్‌నాథ్‌ షిండే సభ్యులుగా ఉన్నారు. రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు ప్రారంభమయ్యాయి. రైతుల లాంగ్‌ మార్చ్‌కు శివసేన ఇప్పటికే సమర్థించింది. రుణమాఫీ, గిట్టుబాటు ధరల కల్పన, కరెంట్‌ బిల్లు మాఫీ, స్వామినాథన్‌ సిఫారసుల అమలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అఖిల భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో రైతులు గత మంగళవారం నాసిన్‌ నుంచి లాంగ్‌ ప్రారంభించి ముంబైకి చేరుకున్నారు. ముంబై విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రైతుల పాదయాత్ర శాంతియుతంగా సాగింది.

16:00 - November 30, 2016

మహారాష్ట్ర ముఖ్యమంత్రి భార్య అమృత ఫడ్నవీస్. భర్త సీఎం అయినా ఈమె మాత్రం బ్యాంక్ ఎంప్లాయిగా కొనసాగుతున్నారు. ఈమెకు పాటలు పాడడం చాలా ఇష్టమంట. దీనితో పలు చిత్రాల్లో గానం అందించారు. కునాల్ కోహ్లీ తీసిన 'ఫిర్ సే', ప్రకాస్ ఝూ సినిమా 'జై గంగాజల్' కోసం ఆమె పాటలు పాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఫొటో హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బితో ఈమె స్టెప్పులు వేస్తున్న ఓ ఫొటో వైరల్ అవుతోంది. సౌత్ ముంబాయిలోని ఓపెరా హౌస్ దగ్గర అహ్మద్ ఖాన్ ఓ మ్యూజిక్ వీడియో తీస్తున్నాడు. ఇందులో 'బిగ్ బి' కూడా నటిస్తున్నారు. రెడ్ కలర్ మినీ స్కర్ట్ వేసుకున్న 'అమృత'..'అమితాబ్'తో స్టెప్పులేసింది. ఆర్ట్స్ ఇనిస్టిట్యూట్ హెడ్ గా అమితాబ్ కనిపిస్తాడంట. ఈ ఇనిస్టిట్యూట్ లో జాయిన్ అయేందుకు అమృత రావడం..సంభాషణలో భాగంగా ఈ పాట వస్తుందంట. 'ఫిర్ సే' అంటూ సాగే ఓ మ్యూజిక్ వీడియో కోసం ఇదంతా షూటింగ్ చేశారని టాక్. 

21:22 - August 23, 2016

మహారాష్ట్ర : తెలగాణ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం చేసుకుంది. దశాబ్దాల తరబడి అంతర్రాష్ట్ర వివాదంగా నలిగిన గోదావరి, పెన్ గంగ, ప్రాణహిత ప్రాజెక్టుల నిర్మాణానికి మార్గం సుగమమైంది. మంగళవారం ఉదయం హైదరాబాద్‌ నుండి ప్రత్యేక విమానంలో ముంబై వెళ్లిన సీఎం కేసీఆర్‌ బృందం.. మధ్యాహ్నం 3 గంటలకు మహారాష్ట్ర సర్కారుతో మూడు ప్రాజెక్టుల నిర్మాణంపై ఒప్పందం కుదుర్చుకుంది. ఆ వెంటనే.. తెలంగాణలోని టీఆర్ఎస్‌ శ్రేణులు బాణాసంచా కాల్చి హర్షాన్ని ప్రకటించాయి.

39 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కీలక ఒప్పందం
తెలంగాణలో 39 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కీలక ముందడుగు పడింది. గోదావరి నదిపై మూడు బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ చారిత్రక ఒప్పందంతో నీటి పారుదల రంగంలో నూతన అధ్యాయానికి నాంది పలికారు. సహ్యాద్రి గెస్ట్ హౌజ్‌లో జరిగిన అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంలో ఇరు రాష్ర్టాల అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఆ తర్వాత ఒప్పంద పత్రాలను ఇరువురు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల మంత్రి హరీశ్‌ సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పరిణామం : కేసీఆర్
మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పరిణామమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం జోక్యం లేకుండానే ఇరు రాష్ర్టాల మధ్య ఒప్పందం జరగడం శుభపరిణామమన్నారు. మహారాష్ర్టతో భవిష్యత్‌లోనూ స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

తుమ్మిడిహట్టితో మహారాష్ర్టకు నష్టాన్ని నివారించేందుకు మేడిగడ్డ : కేసీఆర్
అంతరాష్ర్ట ప్రాజెక్టులపై రెండు రాష్ర్టాల మధ్య ఎన్నో సార్లు చర్చలు జరిగాయన్న ముఖ్యమంత్రి.. కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలో ఉన్నా వివాదాలను పరిష్కరించలేదని విమర్శించారు. తుమ్మిడిహట్టితో మహారాష్ర్టకు జరిగే నష్టాన్ని నివారించేందుకు మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని ప్రతిపాదించామన్నారు.

తెలంగాణతో ఒప్పందం వల్ల మహారాష్ట్రకు నష్టం లేదు : ఫడ్నవీస్
తెలంగాణతో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల మహారాష్ట్రకు ఎలాంటి అన్యాయం జరగబోదని ఆరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ప్రాజెక్టుల విషయంలో ఇరు రాష్ర్టాలు పరస్పరం సహకరించుకుంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆచరణాత్మకంగా వ్యవహరించారని ప్రశంసించారు. ఈ ఒప్పందంలో తెలంగాణ మంత్రి హరీష్‌రావు కీలకపాత్ర పోషించారనీ ప్రశంసించారు.

అంబరాన్నంటిన సంబురాలు
మహారాష్ట్రతో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందం కుదరగానే..తెలంగాణలో సంబురాలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్‌ భవన్‌ వద్ద, సచివాలయంలోనూ టీఆర్ఎస్‌ ప్రముఖులు, మంత్రులు బాణాసంచా పేల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - ఫడ్నవీస్