ప్లీనరీ

09:26 - April 29, 2018

హైదరాబాద్ : పదవులపై ఆశలేదు.. దేశంకోసమే జాతీయ రాజకీయాల్లోకి వెళతానంటూ పదే పదే ప్రకటిస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. అయితే గులాబీదళపతిలో ఉన్న ఉత్సాహం పార్టీ క్యాడర్‌లో మాత్రం కనిపించడంలేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నామన్న కేసీఆర్‌ ప్రసంగానికి ప్లీనరీలో పెద్దగా స్పందన కనిపించలేదు. దేశంలో గుణాత్మకంగా మార్పులు రావాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ కొంతకాలంగా పదే పదే చెబుతున్నారు. కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ వేదిక ఏర్పాటుచేసే ప్రయత్నాలు ముమ్మరం చేశామంటున్నారు. కాని.. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల ప్రస్థావన గులాబీ శ్రేణుల్లో మాత్రం ఉత్సహం నింపలేక పోతోంది.

ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఝార్ఘండ్ మాజీ సిఎం హేమంత్ సోరెన్, మాజీ ప్రధాని.. జెడి ఎస్ అధినేత దేవగౌడ, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి లాంటి నేతలతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. జాతీయ కూటమి ఆవశ్యకతపై వివరించారు. ఉద్యమ సమయంలో తెలంగాణాకు మద్దతునిచ్చిన అన్ని పార్టీల మద్దతు మరోసారి కూడగట్టే యోచనలో కేసిఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై పార్టీప్లీనరీలో ప్రతినిధులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా ప్రసంగించారు. జాతీయ అంశాలకు తన ప్రసంగంలో పెద్దపీఠ వేసి కాంగ్రెస్, బిజెపిలపై తన దైన స్టైల్లో దుయ్యబట్టారు. అయినా.....కార్యకర్తల నుంచి ఆశించిన స్థాయిలో స్పందిన కనింపించలేదు. జాతీయ రాజకీయాలపై టిఆర్ఎస్ నేతలు చూపిస్తున్న ఉత్సాహం కార్యకర్తల్లో కనిపించకపోవడం పార్టీ నేతల్లో చర్చనీయంశంగా మారింది. కేసిఆర్ ప్రసంగానికే స్పందన లేకపోవడం దేనికి సంకేతాలు అని గులాబీ నేతల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

08:07 - April 28, 2018

17వ టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు ఘనంగా ముగిశాయి. జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలన్నింటిని ఏకం చేసి ఫెడరల్‌ ఫ్రంట్‌ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌ నుంచే భూకంపం సృష్టిస్తానన్న కేసీఆర్‌.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలన్న తన ప్రకటనతో కాంగ్రెస్‌, బీజేపీ గుండెల్లో దడ పుట్టిందన్నారు. ఈ అంశంపై టెన్ టివి చర్చా వేదికలో పాల్గొని వినయ్ కుమార్ (విశ్లేషకులు), రాజ్ మోహన్ (టీఆర్ఎస్), పున్నా కైలాష్ (టి.కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

21:35 - April 27, 2018

మేడ్చల్ : దేశ రాజకీయాలపై పార్టీ వైఖరిని స్పష్టం చేశారు గులాబీ దళపతి. జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలన్నింటిని ఏకం చేసి ఫెడరల్‌ ఫ్రంట్‌ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌ నుంచే భూకంపం సృష్టిస్తానన్న కేసీఆర్‌.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలన్న తన ప్రకటనతో కాంగ్రెస్‌, బీజేపీ గుండెల్లో దడ పుట్టిందన్నారు.

ఘనంగా టీఆర్‌ఎస్‌ ప్లీనరీ
తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అద్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్‌ పూలమాల వేశారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ.. నివాళులు అర్పించారు.

దేశ రాజకీయాలపై స్పష్టతనిచ్చిన కేసీఆర్‌
దేశ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ పోషించే పాత్రపై ప్లీనరీలో స్పష్టతనిచ్చారు సీఎం కేసీఆర్‌. దేశాన్ని ఇప్పటివరకు పాలించిన కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయం అవసరమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు తాము చేయాల్సిన పనులు చేయకుండా.. రాష్ట్రాలను మున్సిపాలిటీల కంటే హీనంగా చూస్తున్నాయని విమర్శించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని కేసీఆర్ ఉద్ఘాటించారు. తాను ఫెడరల్ ఫ్రంట్ గురించి చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిందన్నారు. మోదీ ఏజెంట్ కేసీఆర్ అని రాహుల్ గాంధీ అంటుంటే.. ఫ్రంట్‌కు టెంటే లేదని బీజేపీ నేతలు అంటున్నారు.. మరీ టెంటే లేనప్పుడు బీజేపీ నేతలకు భయమెందుకు? అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

దేశం కోసం ఎంతకైనా పోరాడుతా : కేసీఆర్‌
దేశం బాగు కోసం తాను ఎంతకైనా పోరాడుతానని కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించానో.. దేశం మంచి కోసం ఆ విధంగా పని చేస్తానన్నారు. దేశానికి ఎంతో కొంత తెలంగాణ నుంచే మేలు జరగాలన్నారు. వచ్చే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి.. హైదరాబాద్‌ నుంచే భూకంపం సృష్టిస్తానన్నారు. జాతీయ స్థాయిలో 'హర్‌ ఎకర్‌ కో పానీ.. హర్‌ కిసాన్‌కో పానీ' నినాదంతో ముందుకెళ్తామని గులాబీ బాస్‌ స్పష్టం చేశారు.

ఉత్తమ్‌పై నిప్పులు చెరిగిన కేసీఆర్‌
70 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్‌లు దేశానికి చేసిందేమీ లేదన్నారు కేసీఆర్‌. దేశంలో ఎన్నో వనరులున్నా సద్వినియోగం చేసుకోలేదన్నారు. చైనాలాంటి దేశాలతో పోలిస్తే అన్ని రంగాల్లో దేశం వెనకబడే ఉందన్నారు.

టీఆర్ఎస్ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు కేసీఆర్‌...
టీఆర్ఎస్ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు కేసీఆర్‌. పార్టీ స్థాపించిన సమయంలో ఎన్నో హేళనలు, అవమానాలు ఎదుర్కొన్నామని.. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రధాని, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ కూడా అభినందించారన్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శమని నీతిఆయోగ్‌ చెప్పిందన్నారు.

సంక్షేమ ఫలాలను ప్రజలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారన్న కేసీఆర్..
తెలంగాణలో సంక్షేమ ఫలాలను ప్రజలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారన్నారు కేసీఆర్‌. కొన్ని పనులు చేయాలంటే సాహసం.. ధైర్యం కావాలి. తండాలను పంచాయతీలుగా మార్చాలని అనేక సంవత్సరాలుగా గిరిజనులు పోరాటం చేస్తే.. గత ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి కూడా నెరవేర్చలేదన్నారు. కానీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన 4 వేల పైచిలుకు గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశామన్నారు.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై కేసీఆర్‌ నిప్పులు
ఇక టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుంటే అడగడుగునా అడ్డుకునే పనులు చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులను వ్యక్తిగతంగా విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రగతి భవన్‌లో 150 గదులు ఉన్నాయన్న ఉత్తమ్‌ నిరూపిస్తే.. ముక్కుకు నేలకు రాస్తానని... సీఎం పదవికి కూడా రాజీనామా చేస్తానన్నారు. లేకపోతే ఉత్తమ్‌ ప్రగతి భవన్‌ ముందు ముక్కుకు నేలకు రాస్తాడా అని కేసీఆర్‌ సవాల్‌ విసిరాడు.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు : కేసీఆర్‌
వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు కేసీఆర్‌. అన్ని వర్గల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. ఎంబీసీ నాయకులకు ఎమ్మెల్సీలుగా, నామినేటెడ్‌ పదవులిస్తామన్నారు. ఇక త్వరలోనే మిషన్‌ భగీరథ పథకంతో ఇంటింటికి నల్లా ద్వారా నీళ్లు అందిస్తామన్నారు.ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. తాము తీసుకొస్తున్న సంక్షేమ పథకాలే తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 

19:45 - April 27, 2018

మేడ్చల్ : టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. ఉత్తమ్‌ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. ప్రగతి భవన్‌లో 150 గదులు ఉన్నాయని చెప్పుకొచ్చిన ఉత్తమ్‌కు కేసీఆర్‌ సవాల్‌ విసిరారు. ప్రగతి భవన్‌లో 15 గదుల కంటే ఎక్కువ గదులు ఉంటే తాను ముక్కు నేలకు రాసి సీఎం పదవికి రాజీనామా చేస్తానన్నారు కేసీఆర్‌. 

19:43 - April 27, 2018

మేడ్చల్ : కొంపల్లిలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ ముగిసింది. ఈ ప్లీనరీలో ఆరు తీర్మానాలను ఆమోదించారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్యందరికీ టికెట్లు ఇస్తానని ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. ఎంబీసీలకు ఎమ్మెల్సీ స్థానాలు, నామినేటెడ్‌ పదవులిస్తామన్నారు కేసీఆర్‌. హైదరాబాద్‌ కేంద్రంగానే దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తానన్నారు సీఎం కేసీఆర్‌. గులాబీ పరిమలాలు భారతదేశ మారుమూల ప్రాంతాలలో వెదజల్లుతామన్నారు. దేశాన్ని కాంగ్రెస్‌ నేతల కబంద హస్తాల నుండి విముక్తి కలిపించి అద్భుతమైన దేశంగా దేశాన్ని తీర్చిదిద్దుతామన్నారు కేసీఆర్‌. 

09:37 - April 27, 2018
21:42 - April 26, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి భాగ్యనగరం ముస్తాబైంది. కొంపల్లిలో జరిగే ప్లీనరీకి దారితీసే రోడ్లన్నీ గులాబీ జెండాలతో రెపరెపలాడుతున్నాయి. ప్రభుత్వ పథకాలను ప్రతిబింబించేలా ప్లీనరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నగరం మొత్తం గులాబీవర్ణంతో శోభాయమానంగా మారింది.

టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తి..
టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు గులాబీ నేతలు సిద్ధమయ్యారు. ఈసారి ప్లీనరీకి గతంలో కంటే భిన్నంగా అలంకరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

ప్రత్యేక ఆకర్షణగా కేసీఆర్
కొంపల్లిలో జరిగే ప్లీనరీకి దారితీసే అన్ని రోడ్లను గులాబీ తోరణాలు, జెండాలతో అందంగా అలంకరించారు. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆద్వర్యంలో ఏర్పాటైన అలంకరణ కమిటీ ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షించింది. భార్లీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అన్నింటిలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

పథకాలు ప్రతిబింబించేలా భారీ హోర్డింగ్‌లు
నాలుగేళ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతిబింబించేలా భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. కల్యాణ లక్ష్మీ, సామాజిక పించన్లు, కేసీఆర్‌ కిట్‌, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, కుల వృత్తులకు ప్రభుత్వం చేస్తున్న మేళ్లను వివరిస్తూ అందర్నీ అకర్షించేలా హోర్డింగ్‌లు పెట్టారు. కొంపల్లిలో ప్లీనరీ నిర్వహిస్తున్న ప్రాంగణానికి ప్రగతి ప్రాంగణంగా పేరు పెట్టారు. ఎక్కడ చూసినా కేసీఆర్‌ భారీ కటౌట్లు, వేదిక చుట్టూ ఫెక్లీలను ఆకర్షణీయంగా అలంకరించారు. 

తెలంగాణ రాష్ట్ర స‌మితి 17వ వార్షికోత్సవానికి స‌ర్వం సిద్ధం
తెలంగాణ రాష్ట్ర స‌మితి 17వ వార్షికోత్సవానికి స‌ర్వం సిద్ధం చేసింది. నగ‌ర శివారుల్లోని కొంప‌ల్లిలో ప్రతినిధుల స‌భ‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నిక‌ల ఏడాది కావ‌డంతో అధికార పార్టీ ఈ ప్లీన‌రీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌తో పాటు రాష్ట్రంలో పార్టీ నేత‌లు అనుస‌రించాల్సిన విధానంపై ప్లీన‌రీ ద్వారా కార్యకర్తల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నారు.

ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభం కానున్న స‌భ‌
గులాబి పార్టీ పండుగ‌కు సర్వం సిద్ధమైంది. 17 వ‌సంతాలు పూర్తి చేసుకుంటున్న టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘ‌నంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నినియోజ‌క‌వ‌ర్గాల నుంచి పార్టీ ప్రతినిధుల‌ను స‌మావేశానికి ఆహ్వానించారు . నియోజ‌క‌వ‌ర్గం నుంచి హాజ‌ర‌య్యే ప్రతినిధుల‌ను ఆయా ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్‌లే ఆహ్వానించేలా బాధ్యత‌ల‌ను పార్టీ అప్పగించింది. సుమారు 15 వేల మంది వ‌ర‌కు పార్టీ ప్రతినిధులు హాజ‌రుకానున్నారు. పార్టీ అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు జ‌రుపుతున్న ప్లీన‌రీ కావ‌డంతో గులాబి బాస్ ఈ ప్లీన‌రీపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

రాబోయే ఏడాదిలో పార్టీ వ్యూహంపై కేసీఆర్‌ దీశానిర్దేశం
గ‌త నాలుగేళ్లుగా ప్రభుత్వ ప‌రంగా అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌తో పాటు....రాబోయే ఏడాది కాలంలో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ నేత‌ల‌కు దిశా నిర్దేశం చేయ‌నున్నారు. అదే విధంగా జాతీయ స్థాయిలో కూడా చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న కేసీఆర్.....జాతీయ రాజ‌కీయాల‌పై ప్లీన‌రీ వేదిక‌గానే మ‌రింత స్పష్టత ఇచ్చే అవ‌కాశం ఉంది. రాష్ట్రంలో ప‌ట్టు నిలుపుకుంటూనే జాతీయ స్థాయిలో పార్టీ వ్యూహంపై నేత‌ల‌కు ప్లీన‌రీలో వివ‌రించనున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ ప‌రంగా మాత్రం రాబోయే ఏడాది కాలం కీల‌కం కావ‌డంతో..... ఏడాదిలో పార్టీ ప‌రంగా కార్యక‌ర్తల‌కు మ‌రిన్ని బాధ్యత‌లను అప్పగించే అవ‌కాశం క‌నిపిస్తోంది. పార్టీ ప్రధాన కార్యద‌ర్శులు, కార్యద‌ర్శులు ఎమ్మెల్యేలతో స‌మ‌న్వయం చేసుకుంటూ అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్లాల‌న్న యోచ‌న‌లో గులాబి నేత‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్లీన‌రీలో ఆరు తీర్మానాల‌ను ఆమోదించ‌నుంది. ప్రభుత్వ ప‌రంగా చేపడుతున్న కార్యక్రమాల‌తో పాటు మైనార్టీ పాల‌సీ, జాతీయ రాజ‌కీయాలపై తీర్మానాలు ఆస‌క్తి రేపుతున్నాయి. గ‌తంలో జ‌రిగిన ప్రతినిధుల స‌భ‌కు, ఇప్పుడు నిర్వహిస్తున్న ప్రతినిధుల స‌భ‌కు తేడా స్పష్టంగా ఉంటుంద‌ని అధికార పార్టీ నేత‌లు అంటున్నారు. ప్లీన‌రీకి హాజ‌ర‌య్యే ప్రతినిధుల‌కు ఇబ్బందులు ఎదురు కాకుండా పార్టీ అన్నిముందు జాగ్రత్త చ‌ర్యల‌ను చేప‌ట్టింది. దాదాపు 2 వేల మంది వాలంటీర్లు ప్రతినిధుల‌కు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు.టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధుల కోసం ఆ పార్టీ ప్రత్యేక వంటకాలు వడ్డించాలని డిసైడ్‌ అయ్యింది. తెలంగాణ వంటకాలను రుచి చూపించాలని నిర్ణయించింది. తెలంగాణలో ఫేమస్‌ అయిన వెజ్‌, నాన్‌వెజ్‌ వంటకాలను ప్రతినిధులకు వడ్డించనున్నారు.

అందంగా ముస్తాబవుతోన్న జీబీఆర్‌ గార్డెన్‌
ఈనెల 27న టీఆర్‌ఎస్‌ ప్లీనరీ జరుగనుంది. హైదరాబాద్‌ శివారు కొంపల్లిలోని జీబీఆర్‌ గార్డెన్‌ ఇందుకు ముస్తాబవుతోంది. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులందరికీ పసందైన వంటకాలు వడ్డించేందుకు మెనూ రెడీ అయ్యింది. అందరికీ నచ్చేలా తెలంగాణ రుచులతో భోజనాలు వడ్డించనున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని మజ్జిగ, అంబలిని ప్రత్యేకంగా ప్రతినిధులకు అందించనున్నారు. పార్టీ ప్లీనరీ సమావేశాలకు 15వేల మంది వరకు హాజరుకానుండడంతో.... అందుకు తగ్గట్టుగా టీఆర్‌ఎస్‌ నాయకత్వం భోజన ఏర్పాట్లు చేస్తోంది.

ప్లీనరీలో వడ్డించే వంటకాల మెనూపై టీఆర్‌ఎస్‌ ప్రత్యక దృష్టి
ప్లీనరీలో వడ్డించే మెనూపై గులాబీ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. అచ్చంగా తెలంగాణ వంటకాలను వడ్డించాలని డిసైడ్‌ అయ్యింది. మటన్‌ బిర్యానీ, ధమ్‌ చికెన్‌ ప్రై, మటన్‌ షారువా, ఫిష్‌ ప్రై, రొయ్యల ప్రై, ఎగ్‌ పులుసు వడ్డించనున్నారు. అంతేకాదు.. తెలంగాణ స్పెషల్‌ నాటుకోడి పులుసు, మటన్‌ దాల్చాను ప్రత్యేకంగా ప్రతినిధులకు వడ్డించనున్నారు.

శాఖాహారుల కోసం ప్రత్యేక వంటకాలు
శాఖాహారుల కోసం వెజ్‌ బగారా రైస్‌, మిర్చి కా సలాన్‌, ఆలు టమాట కర్రీ, గంగవాయిలి పప్పు, గ్రీన్‌ సలాడ్‌, ఆనియన్‌ సలాడ్‌, పప్పుచారు, పచ్చిపులుసుతోపాటు పలు వెజ్‌ ఐటెమ్స్‌ను సర్వ్‌ చేయనున్నారు. పలు స్వీట్‌ను ప్రతినిధులకు అందించనున్నారు.

భారీగా నాన్ వెజ్ వంటకాలు..
ప్లీనరీ కోసం 2500 కిలోల మటన్‌, 3వేల కిలోల చికెన్‌, 5వందల కిలోల నాటుకోళ్లు తెప్పిస్తున్నారు. అంతేకాదు.. 500 కిలోల ఫిష్‌, మరో 500 కిలోల ప్రాన్స్‌, 25వేల గుడ్లు భోజనం కోసం సిద్దం చేస్తున్నారు. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు, మీడియాకు, సెక్యూరిటీ సిబ్బందికి వేర్వేరుగా డైనింగ్‌ హాల్స్‌ ఏర్పాటు చేశారు. వేదిక ప్రాంగణంలో 8 భోజన శాలలు ఏర్పాటు చేసినట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మొత్తానికి ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు పసందైన వంటకాల రుచి చూపించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.

18:26 - April 26, 2018
16:49 - April 26, 2018
15:42 - April 26, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి ఆరు తీర్మానాలను రంగం సిద్ధం చేసింది. కేసీఆర్‌ సూచనలతో కమిటీ తీర్మానాలను ఖరారు చేసింది. ప్లీనరీలో ఆరు తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలపాలని నిర్ణయించింది. గత నాలుగేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు... ఓ రాజకీయ తీర్మానాన్ని సభ ఆమోదించనుంది.

రాష్ట్రంలో అనేక పథకాలు
రాష్ట్రంలోని అన్ని వర్గాలు, పేద ప్రజల అభ్యున్నతి కోసం టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అనేక సంక్షేమ పథకాలను చేపట్టింది. గర్భంతో ఉన్న మహిళలకు, వృద్ధులకు పలు పథకాలను అమలు చేసింది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, చేనేత, గీత కార్మికులు, బీసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయనే సందేశాన్ని ప్రతినిధుల సభ ఇవ్వనుంది. సంక్షేమ కార్యక్రమాల తీర్మానంపై చర్చ నిర్వహించనున్నారు.

అన్ని వర్గాలు, పేద ప్రజల అభ్యున్నతి కోసం సంక్షేమ పధకాలు
రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తీర్మానాన్ని పార్టీ సిద్ధం చేసింది. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో పాటు.. రైతులకు వ్యవసాయ పెట్టుబడి పథకం, భూరికార్డు ప్రక్షాళన, రైతు సమన్వయ సమితిలతో పాటు.. పశు సంవర్ధకశాఖపై కూడా చర్చ జరగనుంది. ప్రధానంగా ఎన్నికల ఏడాదిలో రైతుబంధు పథకం అమలు చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడంతో ఈ అంశాన్ని కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.

రైతుల అభివృద్ధి కోసం పలు తీర్మానాలు

మౌలిక సదుపాయాల కల్పన విషయంలో మిషన్ భగీరథతో పాటు ఐటీ, పెట్టుబడులు, పరిశ్రమలు, రోడ్డు నిర్మాణం, హైదరాబాద్ నగర అభివృద్ధి, మూసి రివర్ ప్రంట్, కొత్త రైల్వే టర్మినల్ ఏర్పాటు లాంటి ఆంశాలపై చర్చ జరగనుంది. మంత్రి కేటీఆర్‌ నిర్వహిస్తున్న శాఖలు కావడంతో... అన్ని అంశాలపై చర్చించి తీర్మానాన్ని ఆమోదిస్తారు. ఇక రాష్ట్ర పాలనలో తెచ్చిన సంస్కరణలపై మరో తీర్మానాన్ని సభ ఆమోదించనుంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు, కొత్త మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటు వంటి నిర్ణయాలతో ప్రజలకు మరింత చేరువయ్యామన్న సంకేతాలను ప్లీనరీ ఇవ్వనుంది. మరోవైపు కీలకంగా భావిస్తున్న ముస్లిం, మైనార్టీల పాలసీలపై కూడా ప్రతినిధుల సభ చర్చించనుంది. మిషన్ భగీరథ, ఐటీ, పెట్టుబడులు, పరిశ్రమలు, రోడ్డు నిర్మాణం, నగర అభివృద్ధి, మూసి రివర్ ప్రంట్, కొత్త రైల్వే టర్మినల్ ఏర్పాటు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, పోలీస్‌ కమిషనరేట్ల, కొత్త మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటు. ఇక రాజకీయ తీర్మానం విషయానికి వస్తే.. కేసీఆర్ జాతీయస్థాయిలో చక్రం తిప్పాలని భావిస్తుండడంతో... ఫెడరల్ ఫ్రంట్‌పై సుదీర్ఘంగా చర్చ జరగనుంది. కేంద్రంలో మోదీ హవా తగ్గిందన్న అంచనాతో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్నామ్నాయంగా మూడో కూటమి ఏర్పాటుపై కేసీఆర్‌ ఎక్కువ దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా కూడా జాతీయస్థాయిలో అనుసరించాల్సిన విధానంపై సభలో తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - ప్లీనరీ